మీరు కెరీర్ లో ఎదగడానికి మెడిటేషన్ చేసే 10 ప్రయోజనాలు

కెరీర్
Share

కెరీర్ అనేది జీవితంలో చాలా ముఖ్యమైన విషయం.  ఇదే మనకి విలువని, మన జీవితానికి అర్థాన్ని, డబ్బులు ఇస్తుంది. మనందరం కెరీర్లో ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఆశిస్తూ, ఎన్నో కలలు కంటూ కష్టపడి పని చేస్తాము. మీ ఆఫీస్ లో జరిగే విషయాలు ఒత్తిడిని వచ్చేలా చేస్తాయి.  ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి చాలామంది నీరసంగా, విసుగ్గా, ఒత్తిడితో ఉంటారు.  ఇది ఇంట్లో మన రిలేషన్ షిప్స్ ను నెగటివ్ గా ప్రభావితం చేస్తుంది.  అదే పనిచేసే తల్లికి అయితే ఇంటి దగ్గర మరియు కెరీర్ ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అవుతుంది.

మనం పని చేసే చోట ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏదైనా సాధనం ఉందా ? మన కెరీర్ మరింత గొప్పగా ఉండడానికి ఏదైనా సాధనం ఉందా ? ఖచ్చితంగా ఉంది. అదే మెడిటేషన్. మెడిటేషన్ వల్ల కెరీర్ కి ఎలాంటి ఉపయోగం లేదు అని చాలా మంది అనుకుంటారు.  కానీ అది అబద్ధం.  మనం కెరీర్ లో ఎదగడానికి మెడిటేషన్ ఎంతో సహాయపడుతుంది.

గొప్ప గొప్ప కంపెనీల CEO లు వాళ్ళు తమ రోజున మొదలు పెట్టేముందు మెడిటేషన్ చేస్తారు.  ఎందుకంటే వాళ్ళకి మెడిటేషన్ వల్ల కలిగే లాభాలు తెలుసుకాబట్టి.

మనం కెరీర్లో ఎదగడానికి మెడిటేషన్ వల్ల ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

1. మనం పని చేసే సామర్ధ్యాన్ని పెంచుతుంది : మనం కెరీర్లో ఎదగాలంటే మన సామర్థ్యం చాలా ముఖ్యం. మీరు ఎంత వేగంగా లక్ష్యాలను సాధిస్తారు అనేది చాలా ముఖ్యం.  మీరు సమస్యల్ని ఎంత వేగంగా సరిచేయగలరు?  పనులను తక్కువ సమయంలో పూర్తి చేయగలరా ?  ఈ ప్రశ్నలకి మీరు చెప్పే సమాధానం మీ కెరీర్ ని నిర్ణయిస్తుంది.  మీరు తరచూ మెడిటేషన్ చేస్తే మీ ఏకాగ్రత స్థాయి పెరుగుతుంది.  మీ మెదడు పదునుగా పనిచేస్తుంది.  దీనివల్ల మీరు వేగంగా సమస్యలను పరిష్కరించగలరు. దీనివలన మీ సామర్థ్యం మెరుగుపడుతుంది. మీరు చేసే ఏ పనైనా తక్కువ సమయంలో ఎక్కువ చేసేవిధంగా మెడిటేషన్ మిమ్మల్ని మారుస్తుంది.

2. నాయకత్వ లక్షణాలు: మనం పని చేసే చోట నైపుణ్యం కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ అందులో కొంతమంది మాత్రమే గొప్ప నాయకులుగా ఎదుగుతారు.  గొప్ప నాయకులు అంటే తమ ఎమోషన్స్ మీద, తమ ఒత్తిడి మీద అదుపు సాధించి, ఓపికతో నైపుణ్యాన్ని పెంచుకునే వారు నాయకులు అవుతారు. కొన్నిసార్లు ఆఖరి నిమిషంలో మార్చవలసిన పనులు ఉంటాయి.  కొన్నిసార్లు ఊహించని సమస్యలు ఎదురవుతాయి.  ఇలాంటి పరిస్థితులలో  ఒత్తిడికి గురి కాకుండా ఓపికతో ఎదుర్కొన్న వారే గొప్ప నాయకులుగా నిలబడగలరు.  మెడిటేషన్ చేస్తే ఈ లక్షణాలు సహజంగానే పెరిగి మనల్ని నాయకుడిగా మారుస్తాయి.

3. పనినుండి వచ్చిన ఒత్తిడిని ఎదుర్కోవడం: మనం పని చేసే చోట ఒత్తిడి సర్వసాధారణం. ఎన్నో సందర్భాలు మనకి ఒత్తిడిని తీసుకు వస్తాయి.  ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలిసిన వారు మాత్రమే కెరీర్లో ఉన్నత శిఖరాలకు ఎదగగలరు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఒత్తిడిని అధిగమిస్తారు. మీరు మెడిటేషన్ రోజు చేస్తే ఒత్తిడిని అధిగమించడం తేలిక అవుతుంది.  దానివలన మీ టీం లో, మీరు పనిచేసే చోట మీ విలువ పెరుగుతుంది.  మెడిటేషన్ వల్ల మీరు ఏ పనైనా ఒత్తిడి లేకుండా వేగంగా చేయగలుగుతారు.  మీరు పనిచేసే చోట ఒత్తిడిని అధిగమిస్తే అది మీరు ఇంటికి తీసుకు రాకుండా ఉండడంవల్ల మీ రిలేషన్ షిప్స్,  మీ కుటుంబ సభ్యులతో సంబంధబాంధవ్యాలు మరింత పెరుగుతాయి.

4. మీ వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి: మీరు తరచూ మెడిటేషన్ చేస్తే మీ రిలేషన్ షిప్స్ మెరుగుపడతాయి. మీరు పనిచేసే చోట మీ బాస్ తో, మరియు మీతో పనిచేసే వారితో మీ రిలేషన్ షిప్ గొప్ప గా ఉండడం వల్ల మీరు ప్రశాంతంగా పనిచేసి కెరీర్లో మంచి స్థాయికి వెళ్తారు.

5. సృజనాత్మకత ను పెంచుతుంది : మీరు తరచూ మెడిటేషన్ చేస్తే మీరు కొత్తగా,. సృజనాత్మకతతో ఆలోచించడం మొదలు పెడతారు. మీరు మరింత గొప్పగా పని చేసి సమస్యలకు పరిష్కారం కనుగొనగలరు. ఈ లక్షణాలు మీకు గొప్ప విలువను తీసుకువస్తాయి.  ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు గొప్ప ఆలోచనతో ముందుకు వస్తారు.  ఒక సంస్థ ఎప్పుడూ ఇలాంటి కొత్తగా సృజనాత్మకతతో ఆలోచించే వ్యక్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.  మీరు సృజనాత్మకతతో ఉండడం మీకు గొప్ప విలువను తీసుకువస్తుంది.

6. కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది : మనం పనిచేసే చోట కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం పనిచేసే చోట వచ్చే ఎన్నో సమస్యలు సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వలన మాత్రమే వస్తాయి.  మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మిమ్మల్ని కెరీర్ లో  గొప్పగా మార్చగలవు.  అదే సమయంలో నాశనం చేయగలవు.  మీరు రోజు మెడిటేషన్ చేస్తే మీ కమ్యూనికేషన్ చాలా మెరుగుపడుతుంది.  మీరు స్పష్టంగా, ఒక దృఢనిశ్చయంతో కమ్యూనికేషన్ జరుపగలరు.  ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడంవల్ల మీ కెరీర్ గొప్పగా ఉంటుంది.

7. గుర్తింపు పెరుగుతుంది : మనం పనిచేసే చోట చాలామంది గుర్తింపు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే గుర్తింపు తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది.  మీకు పైన తెలిపిన ఆరు లక్షణాలు ఉంటే మీకు ఎక్కువ గుర్తింపు వస్తుంది.  పనిచేసేచోట మిమ్మల్ని అందరూ గుర్తించి మీకు విలువ ఇస్తారు.

8. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది : ఆఖరికి మనం అందరం డబ్బు కోసం పని చేస్తాం. డబ్బు అనేది జీవితంలో చాలా ముఖ్యమైన విషయం.  పైన తెలిపిన ఏడు లక్షణాలు ఉన్న వ్యక్తికి ఆర్ధిక స్థితి గొప్పగా ఉంటుంది. ఆర్థికంగా మీరు ఎక్కువ సంపాదించగలుగుతారు.  మీ కెరీర్ అనే నిచ్చెన వేగంగా ఎక్కుతారు.

9. కెరీర్ విషయంలో సంతృప్తి : మీరు చేసే పని వెనక మీకు ఒక లక్ష్యం లేకపోతే అది బోరింగ్ గా, విసురుగా మారుతుంది. అందుకే సోమవారాలు చాలా చిరాకుగా ఉంటాయి.  మీరు తరచూ మెడిటేషన్ చేస్తే మీరు చేసే పని వెనుక ఒక లక్ష్యం ఏర్పడుతుంది.  మీ పని దైవం అనే అనుభూతి మీకు కలుగుతుంది.  అప్పుడు మీ పని బోరింగ్ గా ఉండకుండా ఆనందాన్నిస్తుంది. మీ జీవితానికి ఒక లక్ష్యం ఉండి సంతృప్తి వస్తుంది.

10. కెరీర్ మరియు వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత : కెరీర్ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. మీరు మీ కెరీర్ కన్నా గొప్పవారు.  మీకంటూ ఒక వ్యక్తిగత జీవితం, హాబీలు, రిలేషన్ షిప్స్, ఆధ్యాత్మికత ఇలా జీవితంలో ఎన్నో ఉన్నాయి.  కాబట్టి మీ కెరీర్ ని  మరియు వ్యక్తిగత జీవితాన్ని సమానంగా చూడటం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీరు మెడిటేషన్ ద్వారా మీ అంతర్గత శక్తిని మెరుగుపరుచుకుంటే  అప్పుడు ఈ పనిని మీరు గొప్పగా చేయగలరు. జీవితంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుని మీరు వృత్తి మరియు వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత సాధిస్తారు. ఎంతోమంది తరచూ మెడిటేషన్ చేసి తమ కెరీర్ విషయంలో ఎన్నో గొప్ప ప్రయోజనాలు పొందారు.  మెడిటేషన్ మీ జీవితంలో ప్రతి విభాగాన్ని గొప్పగా మారుస్తుంది.  కెరీర్ లేదా ఆరోగ్యం లేదా రిలేషన్ షిప్స్ ఇలా ఏదైనా మీరు మెడిటేషన్ ద్వారా గొప్పగా మార్చుకోవచ్చు.  కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ మెడిటేషన్ ప్రయాణాన్ని మొదలు పెట్టండి. ఈరోజే మెడిటేషన్ చేయడం ప్రారంభించి ఎన్నో గొప్ప ప్రయోజనాలను పొందండి

మెడిటేషన్ గురించి మరింత తెలుగుకోవడానికి ఈ పుస్తకం చదవండి.

Registration

Forgotten Password?

Loading