డబ్బు ని మేనేజ్ చెయ్యడానికి 10 సులువైన సూచనలు

డబ్బు
Share

మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జీవితానికి డబ్బు చాలా అవసరం. చేతిలో డబ్బు లేకుండా సౌకర్యవంతమైన జీవితం గడపడం చాలా కష్టం. డబ్బులు జీవితంలో గొప్ప గొప్ప అనుభవం వస్తాయి. నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. మనం ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ భూమి మీద పేదరికంతో మగ్గిపోతున్న మనుషులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ జీవితంలో మార్పు తీసుకురావడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది.

మనలో చాలా మంది ఉద్యోగాల ద్వారా బిజినెస్ ద్వారా డబ్బు సంపాదిస్తారు. కానీ ఆ డబ్బులు సరైన విధంగా ఉపయోగించలేరు. లోన్స్ కడుపుతో కేవలం అతి తక్కువ సేవింగ్స్ తో మిగిలిపోతారు. మన మొత్తం జీవితం డబ్బు సంపాదించడం మీదే అయిపోతుంది. మనకి ఆర్ధిక స్వేచ్ఛ ఉండదు. కాబట్టి డబ్బుని సరిగ్గా మేనేజ్ చేయడం చాలా ముఖ్యం.

డబ్బులు సరిగ్గా మేనేజ్ చేయడం వల్ల వచ్చే కొన్ని లాభాలు ఇప్పుడు చూద్దాం.

1. మంచి సేవింగ్స్ ఉండడానికి సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ సేవింగ్స్ చాలా అవసరం. హఠాత్తుగా ఉద్యోగం పోయిన సేవింగ్స్ తప్పనిసరిగా అవసరం. ఒక మంచి ఇల్లు కొనుక్కోవడానికి మన కలలు నెరవేర్చుకోవడానికి సేవింగ్ చాలా అవసరం.

2. దీని వలన ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. మనం కావాలనుకున్నప్పుడు ఉద్యోగం మానేసి అవకాశం ఇస్తుంది.

3. మనం చేసే సేవా కార్యక్రమాల ద్వారా ఈ ప్రపంచం మీద ఒక పాజిటివ్ ప్రభావం చేసే శక్తిని ఇస్తుంది.

4. అప్పులు వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గిస్తుంది. అప్పు లేకపోవడమనేది గొప్ప ఉపశమనం.

5. ఆత్మవిశ్వాసాన్ని ఆర్థిక భద్రత ఇస్తుంది.

డబ్బున్నవాళ్ళు ఎక్కువ జీతం సంపాదిస్తారు అని చాలా మంది అనుకుంటారు కానీ నిజానికి వాళ్ళు డబ్బు ని సరిగ్గా మేనేజ్ చేస్తారు. ఎక్కువ జీతం సంపాదించే ప్రతి నెల వృధా ఖర్చులు చేస్తూ సరైన సేవింగ్స్ లేకుండా ఉంటే దానివలన ఆర్ధిక భద్రత వస్తుందా ? ఎక్కువ జీతం సంపాదించడం మంచిదే కానీ డబ్బుని ఎలా మేనేజ్ చేస్తున్నాము అన్నది కూడా చాలా ముఖ్యం.

డబ్బు ని సరిగ్గా మేనేజ్ చేయడానికి అవసరమయ్యే కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం.

1. మీ స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాల విషయంలో స్పష్టంగా ఉండండి : మీరు మీ జీవితంలో ఏం సాధించాలని ఉంటున్నారో స్పష్టంగా ఉండండి. రాబోయే ఆరు నెలల్లో ఏం కొనాలనుకుంటున్నారు ? ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారు ? రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎంత సేవింగ్స్ చేయాలనుకుంటున్నారు ? వీటికి ఎంత డబ్బు అవసరం అవుతుందో తెలుసుకోవడానికి ఈ ప్రశ్నను మిమ్మల్ని మీరు అడగండి. మీ లక్ష్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా దానికి కావాల్సిన డబ్బులు సమకూర్చడం సులభం అవుతుంది.

2. ఒక బడ్జెట్ ప్రణాళిక వేసుకోండి : మీ స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాల ప్రకారం ఒక బడ్జెట్ వేసుకోండి. మీ బడ్జెట్ లో ఈ కింది విషయాలు ఉండేలా చూసుకోండి.

1. జీతం

2. సేవింగ్స్

3. లోన్స్ మరియు EMI లు

4. ఇంటి ఖర్చులు

5. సేవా కార్యక్రమాలు

6. పెట్టుబడులు

7. ఇన్సూరెన్స్

ఇలా బడ్జెట్ వేసుకోవడం వల్ల మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మీ డబ్బు పై మీకు అదుపు ఉంటుంది.

3. మీ ఆదాయంలో కనీసం 10 శాతం సేవ్ చేయండి : మీ ఆదాయంలో కనీసం పది శాతం సేవ్ చేయడం అలవాటు చేసుకోండి. అవసరమైతే మీ ఖర్చులు తగ్గించుకుని సేవ్ చేయండి. ఇలా చేయగలిగితే కొంతకాలానికి మీరు చాలా మంచి మొత్తాన్ని సేవ్ చేయగలరు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని ఆర్థిక భద్రతను పెంచుతుంది. మీరు అనుకున్నది సాధించడానికి సేవింగ్స్ చాలా ఉపయోగపడతాయి.

4. పెట్టుబడులు : మీ డబ్బు మరింత పెరగడానికి పెట్టుబడులు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఇ నీ డబ్బులో కొంత మొత్తాన్ని నెలవారీ పద్ధతిలో మ్యూచువల్ ఫండ్స్ లేదా బంగారం లేదా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెట్టండి. పెట్టుబడి పెట్టే ముందు రీసెర్చ్ చేసి ఇ మీ రిస్కు తక్కువగా ఉండేలా చూసుకోండి. నష్టం వచ్చినా తట్టుకునేలా ఉంటేనే ఎక్కువ రిస్కు చేయండి.

5. త్వరగా ధనవంతులు అయ్యే స్కీం లు నమ్మకండి: తక్కువ సకాలంలో ఎక్కువ లాభాలు ఇచ్చే స్కీం లలో ప్రతి సంవత్సరం ఎంతోమంది తాము కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారు. కొన్ని నెలల్లోనే మనం పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుంది అనడం చాలా ఆశగా ఉంటుంది. కానీ అది సాధ్యం కాదు కాబట్టి అలాంటి వాటిని నమ్మకండి. డబ్బు ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టేముందు తగినంత రీసెర్చ్ చేయండి. ఆ కంపెనీ ఎక్కడ బ్యాగ్రౌండ్ స్టడీ చేయండి.

6. మీ డబ్బులు అర్థం చేసుకోండి : తమ డబ్బు ని అర్థం చేసుకోవడానికి చాలా మంది సమయం వెచ్చించరు. మీ టాక్స్ లు, పెట్టుబడులు సేవింగ్స్ సంపాదన లోన్స్ EMI లు అర్థం చేసుకోవడానికి కొంత సమయం గడపండి. డబ్బు గురించి నేర్చుకోండి. మీ డబ్బు మీరు అర్థం చేసుకుంటే మీరు ఏం చేస్తున్నారు మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీ డబ్బు ని మరింత బాగా మెసేజ్ చేయగలరు.

7. సేవా కార్యక్రమాలు చేయండి : చాలామంది సేవా కార్యక్రమాలు అనవసరం అనుకుంటారు. కానీ ఎన్నో గ్రంథాలు చాలామంది గురువులు అవసరం ఉన్నవారికి సహాయం చేయండి అని చెప్తారు. మనం ఏదైతే ఇస్తా మో అదే తీసుకుంటాం అన్నది ప్రకృతి ధర్మం. మనకి ఆనందకరమైన జీవితం కావాలంటే ఈ నియమాన్ని పాటించాలి. ప్రతినెల మన సంపాదించిన దాంట్లో కొంత మొత్తం సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలి.

8. అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి : మీ ఖర్చులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. అలా చేయడం వల్ల ఎక్కడ అనవసరపు ఖర్చులు అవుతున్నాయి తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాటిని తగ్గించుకోండి.

9. మీ ఆరోగ్యం గురించి సరైన శ్రద్ధ వహించండి : డబ్బు విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆరోగ్యం గురించి వినడం మీకు కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ డబ్బులు సరిగ్గా మేనేజ్ చేయాలంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉండటంతో అది కేవలం శారీరకంగా మాత్రమే కాదు అది తన సేవింగ్స్ ని కూడా ఖర్చు అయ్యేలా చేస్తుంది. కాబట్టి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యము.

10. తప్పకుండా ఇన్సూరెన్స్ తీసుకోండి : జీవితం ఏం చేస్తుందో మనకు తెలియదు. అనుకోనిది జరిగితే ఇన్సూరెన్స్ ఉండేలా జాగ్రత్తపడండి. జరుగుతుంది అని కాదు కానీ నీ ముందే అప్రమత్తంగా ఉండండి. దీనివల్ల కష్టమైన పరిస్థితుల్లో మన ఫ్యామిలీ కె ఆర్థిక భద్రత ఉంటుంది.

మన డబ్బుని సరిగా మేనేజ్ చేయడానికి కొన్ని సూచనలు ఇవి. డబ్బుకి జీవితాన్ని మార్చగల శక్తి ఉందని గుర్తుంచుకోండి. దాన్ని గౌరవించండి. ఆర్థిక స్వాతంత్రం సంపాదించడానికి దాన్ని వాడుకోండి. నీ లక్ష్యాలను మీ ఇష్టాలను నెరవేర్చుకుంటారు అద్భుతమైన జీవితం గడపండి. మీ డబ్బులు సరైన విధంగా వాడుకుంటూ ఆనందంగా ఉండండి.

Registration

Forgotten Password?

Loading