మీ జీవితాన్ని మార్చగల శక్తి ఉన్న 10 అలవాట్లు

అలవాట్లు
Share

మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా చేసే పనిని అలవాటు అంటారు. అవి అలా అప్రయత్నంగా జరిగిపోతూ ఉంటాయ్. దానికి మోటివేషన్ గానీ, గుర్తు చేసుకోవడం గానీ అవసరం లేదు. మన ఆలోచనలు, ఎమోషన్స్, మనం మాట్లాడే మాటలు మన అలవాట్ల మీద ఆధారపడి ఉంటాయి. మనకున్న అలవాట్లని కలిపితే మన జీవితంలో కొంత భాగం. గొప్ప వ్యక్తులకి గొప్ప అలవాట్లు, సాధారణ వ్యక్తులకి సాధారణ అలవాట్లు ఉంటాయి. మనం విజయం సాధించాలన్నా, ఫెయిల్ అవ్వాలన్న అందులో మన అలవాట్ల పాత్ర చాలా ఉంటుంది.

ఈరోజు చాలా తేలికైన మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే 10 అలవాట్లు తెలుసుకుందాం.

1. మీ రోజుని కృతజ్ఞతతో ప్రారంభించండి: కృతజ్ఞత అనేది జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడడానికి సహాయపడే సానుకూల దృక్పధం. శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా మనం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. ప్రతీరోజూ కృతజ్ఞతతో మొదలు పెట్టడం నేర్చుకుంటే, కొన్ని రోజులకి అది మీ subconscious mind లోకి వెళ్ళిపోతుంది. కృతజ్ఞత బలమైన శక్తిగా మారుతుంది. మీరు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన మూడు విషయాలు రాసుకుని థాంక్యూ చెప్పండి.

2. నవ్వు: నవ్వుతూ ఉండండి ఎందుకంటే నవ్వడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నవ్వడం ఒత్తిడిని తగ్గిస్తుంది, సంబంధాలను పెంచుతుంది, మీ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు మిమ్మల్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది . ఒక కృత్రిమ చిరునవ్వు కూడా మీ శరీరానికి మేలు చేస్తుంది. కాబట్టి, నవ్వడానికి ఒక కారణం కారణం వెతుక్కోకకండి.ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.

3. మీ సంపాదనలో కనీసం 10% ఆదా చెయ్యండి: మంచి బ్యాంక్ బ్యాలన్స్ ఉండడం అనేది ఒక వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలా దాచిన డబ్బు అవసరానికి ఉపయోగపడుతుంది. లేదా ఇల్లు కొనడానికో, విహార యాత్రకో పనికి వస్తుంది. ప్రతీ నెలా మీ సంపాదనలో కనీసం 10% save చెయ్యడం అలవాటు చేసుకోండి. కొంత కాలం తర్వాత మీరు దాచిన ఆ చిన్న డబ్బు మీకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.

4. ప్రతీరోజూ 5 నిముషాలు సమయం తీసుకుని మీరోజుని ప్లాన్ చేసుకోండి:  బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత హడావిడిగా రోజు మొదలు పెట్టకుండా ఒక ఐదు నిముషాలు సమయం తీసుకుని మీ రోజూ మొత్తాన్ని ప్లాన్ చేసుకోండి. ఏరోజు మీరు పూర్తి చెయ్యవలసిన ముఖ్యమైన పనులు ఏంటో ఆలోచించండి. ఈ చిన్న అలవాటు మీరు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చెయ్యడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఐదు నిముషాలు ప్లాన్ చేసుకున్న తర్వాత ఆరోజు గురించి కృతజ్ఞత కలిగి ఉండండి. మీరు ఆలోచన పాజిటివ్ గా ఉంటే ఆ రోజంతా పాసిటివ్ గా ఉంటుంది.

5. ఆహారాన్ని బాగా నమలండి: ఈ చిన్న అలవాటు మీరు తినే ఆహారం నుండి ఎక్కువ పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. మీరు ఆహారాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. మీరు మీ ఆహారాన్ని బాగా నమిలినప్పుడు, ఆహారం జీర్ణం అవ్వడానికి అవసరమైన చాలా ఎంజైమ్స్ లాలాజలం విడుదల చేస్తుంది. మరియు ఈ ఎంజైమ్‌లు మంచి జీర్ణక్రియకు మరియు మంచి పోషకాలు గ్రహించడానికి సహాయపడతాయి. ఈ అలవాటు వల్ల మీకు అవసరమైనంత మాత్రమే తింటారు అందువల్ల ఎప్పుడూ సరైన బరువులో ఉంటారు.

6. అద్దంలో చూస్తూ మిమ్మల్ని మీరు అభినందించుకోండి: అద్దం ముందు నిలబడినప్పుడు మీ గురించి మీరు పాసిటివ్ విషయాలు చెప్పుకోండి. మనలో చాలా మంది వాళ్ళ గురించి వాళ్ళు నెగెటివ్ గా ఆలోచిస్తారు. నేను లావుగా ఉన్నాను, నాకు బద్దకం, ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచనలు మన ఆత్మ విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. మనకి మనం ఎప్పుడూ పాసిటివ్ విషయాలు చెప్పుకుంటే మన ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మీరు అద్దం ముందు నిలబడి మీతో మీరు చెప్పుకోవాల్సిన విషయాలు ఇప్పుడు చూద్దాం.

1. నేనంటే నాకు చాలా ఇష్టం.

2. నేను ప్రత్యేకం

3. నేను అందంగా ఉన్నాను

4. నాలో అనంతమైన శక్తి ఉంది

5. నేను నా లక్ష్యాలను సాధించగలను

7. మీ స్నేహితునిగా ఒక మంత్రాన్ని ఎంచుకోండి: పదాలలో అద్భుత శక్తులు దాగి ఉన్నవే మంత్రాలు. ప్రపంచంలో చాలా మంత్రాలు ఉన్నాయి. మీకు నచ్చిన మంత్రాన్ని ఎంచుకోండి, ఆ మంత్రాన్ని మీ స్నేహితునిగా చేసుకోండి. మీరు విసుగు చెందినప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు లేదా అలసిపోయినప్పుడు లేదా కలత చెందినప్పుడు, ఈ మంత్రాన్ని జపించండి. ఇది మీకు ఉపశమనం ఇస్తుంది మరియు ప్రతికూల మానసిక స్థితి నుండి బయటకు రావడానికి మీకు సహాయపడుతుంది. మీరు ఎంచుకోవడానికి కొన్ని మంత్రాలు – ఓం, ఓం మణి పద్మే హమ్, రామా, ఓం నమ శివయ మొదలైనవి. నడుస్తున్నప్పుడు లేదా వంట చేసేటప్పుడు లేదా ఏమీ చేయకుండా పనిలేకుండా కూర్చొని ఈ మంత్రాన్ని జపించండి. ఇలా మంత్రం జపిస్తూ దానితో ఒక సంబంధం ఏర్పరచుకోవడం వల్ల కొన్నాళ్ళకి అది మీకు అద్బుతంగా పనిచేస్తుంది.

8. ప్రతీ 30 నిముషాలకు కాసేపు నడవండి: ఎక్కువసేపు కూర్చుని ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలా రోజులు గడిచేకొద్దీ చాలా సమస్యలు వస్తాయి. అలారం పెట్టుకుని ప్రతీ 30 నిముషాలకి కాసేపు నడవండి. కాస్త దూరం నడక, చిన్నగా stretching చెయ్యండి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఎక్కువ పనిచేసేలా చేస్తుంది.

9. ఉదయం లేవగానే 15 నిముషాల లోపు నీళ్ళు త్రాగండి: ఉదయం లేవగానే ఎక్కువ నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ చేసి ఆ రోజు మీరు చెయ్యవలసిన పనులకి మిమ్మల్ని సిద్దం చేస్తుంది. ఈ సాధారణ అలవాటు శరీరం నుండి విష పదార్థాలని  వదిలించుకోవడానికి సహాయపడుతుంది. మీరు ముందు రోజు రాత్రి రాగి బాటిల్ లేదా రాగి చెంబులో కొంచెం నీరు ఉంచి ఉదయం లేవగానే తాగవచ్చు. సాధారణ నీళ్ళు మాత్రమే తాగాలి  ఫ్రిడ్జ్ లో నీళ్ళు కాదు.

10. ప్రశంసించండి : ప్రతి ఒక్కరికీ వారి వయస్సు, లింగం, దేశం, వృత్తితో సంబంధం లేకుండా ప్రశంసలు అవసరం. మనం ఏదైనా మంచి చేసినప్పుడు ప్రశంసలు పొందడం మనమందరం ఇష్టపడతాం. ఎవరైనా మంచి పని చేశారని లేదా ఒక పనిని పూర్తి చేయడానికి కష్టపడ్డారని మీరు భావిస్తున్నప్పుడల్లా హృదయపూర్వకంగా మరియు నిజాయితీగా అభినందించండి. ఈ సాధారణ అలవాటు మిమ్మల్ని మరింత ప్రేమగా చేస్తుంది. మీ జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు, పనిమనిషి, బాస్, సహోద్యోగులను అభినందించండి. మెచ్చుకున్నప్పుడు ఆనందపడతారు. ఇంకా ఇష్టంగా పనిచేస్తారు. ఇది ప్రశంస యొక్క శక్తి. మీరు ప్రశంసించే విషయంలో ప్రత్యేకంగా ఉండండి. ఉదాహరణకి మీ అబ్బాయి ఒక పెయింటింగ్ వేస్తే మీకు ఆ పెయింటింగ్ లో ఏం నచ్చిందో చెప్పండి. అది మీ ప్రశంసకి ఒక ప్రత్యేకతను జోడిస్తుంది.

ఇవి జీవితంలో పాటించగల,  ప్రయోజనాలను పొందగల పది చిన్న అలవాట్లు. ఒక విజయం ఇంకొక విజయాన్ని ఇస్తుంది. మీరు ఒక అలవాటుని ఎంత ఎక్కువగా పాటిస్తారో దానినుండి వచ్చే ప్రయోజనాలను అంత ఎక్కువ పొందుతారు.  ఈ 10 చిన్న అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోండి.

Wishing you and your family peace and love

Registration

Forgotten Password?

Loading