మన ఆచార వ్యవహారాలలో తెలియకుండా వాడే 10 హానికర ప్రొడక్ట్స్

హానికర ప్రొడక్ట్స్
Share

మన బిజీ లైఫ్ లో కూడా కాస్త సమయం తీసుకుని రకరకాల మార్గాల ద్వారా ఆ దైవం తో అనుసంధానం అవుతాం. పూజ చేస్తాం. మెడిటేషన్ చేస్తాం. మన జీవితాన్ని మరింత మెరుగు పరచుకోవడానికి మన సంస్కృతి సాంప్రదాయాలలో చెప్పబడినవి మరియు మన పెద్దవాళ్ళు చెప్పినవి ఎన్నో చేస్తాం. ఈ క్రమంలో మనకి తెలియకుండానే చాలా ప్రొడక్ట్స్ వాడతాం. విపరీతంగా పెరిగిపోయిన పారిశ్రామీకరణ వల్ల మనం తెలియకుండా చాలా హానికర ప్రొడక్ట్స్ వాడేస్తున్నాము.

మనం హానికర ప్రొడక్ట్స్ వాడినప్పుడు ఆ పని వల్ల కలగవలసిన ఉపయోగం ఉండదు. సగం ఉపయోగాలు మాత్రమే ఉండవచ్చు. కాబట్టి ఆ ప్రొడక్ట్స్ కి బదులు మనం మంచి ప్రొడక్ట్స్ వాడాలి. అలాంటి ప్రొడక్ట్స్ ఏంటి ?

హానికర ప్రొడక్ట్స్ బదులు మనం ఏం వాడాలి ? అనేది ఇప్పుడు చూద్దాం.

1. అగరొత్తులు : ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని, ఒత్తిడిని తగ్గించడానికి వీటిని వెలిగిస్తారు. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న చాలా అగరొత్తులు హానికరమైన రసాయనాలతో, వివిధ రకాల సువాసనల పదార్థాలతో నిండి ఉన్నాయి. అలాంటివి వెలిగించినప్పుడు అవి వాతావరణ కాలుష్యం చేయడమే కాకుండా అది ఏ ఉద్దేశంతో అయితే వెలిగిస్తామో ఆ ఉద్దేశం నెరవేరదు. వీటికి బదులు సహజ పద్ధతిలో తయారు చేసినటువంటివి వాడటం చాలా మంచిది.

2. నెయ్యి : మనం చాలా సందర్భాల్లో నెయ్యి వాడతాం. మనలో చాలామంది తెలియక గేదె నెయ్యి వాడతారు. గేదె నెయ్యికి, ఆవు నెయ్యికి చాలా ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. గేదె నెయ్యి రజోగుణం కలిగి ఉంటుంది. ఆవు నెయ్యి సాత్విక గుణం కలిగి ఉంటుంది. ఆవునెయ్యిలో గోల్డెన్ ఎనర్జీ ఉంటాయి. అవి చాలా పవిత్రమైనవి. గేదె నెయ్యికి ఈ లక్షణం ఉండదు. కాబట్టి ఎప్పుడైనా నెయ్యిని వాడినప్పుడు ఆవు నెయ్యి వాడితే ఎక్కువ లాభాలు ఉంటాయి. గేదె నెయ్యి వాడడం వల్ల మన ఉద్దేశం నెరవేరదు.

3. నూనెలు : దీపం వెలిగించడానికి నూనెను వాడతారు. దీపం వెలిగించగానే ఇంటి నిండా ఆధ్యాత్మికమైన వాతావరణం ఏర్పడుతుంది. నూనెలు అవి తీయబడిన గింజలనుండి వల్ల కొన్ని వైద్య పరమైన లక్షణాలు కలిగి ఉంటాయి. ఉదాహరణకి నువ్వుల నూనె కి నువ్వుల గింజల లక్షణాలు ఉంటాయి. మార్కెట్లో దొరికే చాలా రిఫైండ్ నూనెల నిండా రసాయనాలు నిండి ఉంటాయి. అలాంటి నూనెతో దీపం వెలిగించినప్పుడు మన ఇంటి నిండా రసాయనాలు నిండిన ఉన్నట్టే. ఇది దీపం పెట్టడం వెనక ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చదు  కాబట్టి వీటికి బదులు గానుగలో ఆడిన నూనెలతో దీపాన్ని వెలిగించడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి.

4. చందనం : పూజలో భాగంగా దేవునికి చందనం సమర్పించి నుదుటిమీద రాసుకుంటారు. మనసుని ప్రశాంతంగా ఉంచి, ఆధ్యాత్మిక పరమైన మరియు మానసిక శక్తిని పెంచే గుణం దీనికి ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న చందనానికి, అసలైన చందనానికి పోలికే లేదు.  ఇలాంటిది పూజలలో  వాడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. దీని నుండి మీరు ఎక్కువ లాభాలు పొందాలంటే అసలైన చందనం వాడండి. చందనపు చెక్కని గరుకు నేలపై రుద్దితే  అసలైన చందనం వస్తుంది.  దాన్ని వాడటం వల్ల గొప్ప లాభాలు ఉంటాయి. చందనం తీయడానికి కాస్త సమయం పట్టొచ్చు కానీ దాని వల్ల వచ్చే లాభాలు కూడా అలానే ఉంటాయి.

5. పాలు : పాలు మనం ఎన్నో పనుల్లో వాడతాం. చాలామంది తెలియక గేదెపాలు వాడతారు. గేదె పాలు కి ఆవుపాలు కి చాలా ముఖ్యమైన వ్యత్యాసం ఉంది.  గేదె పాలలో సాత్విక లక్షణం ఉండదు.  ఆవు పాలలో సాత్విక లక్షణం మరియు గోల్డెన్ ఎనర్జీలు  ఉంటాయి.  కాబట్టి గేదె పాలకు బదులు ఆవు పాలు వాడడం వల్ల అద్భుతమైన లాభాలను పొందవచ్చు.

6. కర్పూరం : మన ఆచార వ్యవహారాల్లో కర్పూరం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మార్కెట్లో దొరికే కర్పూరం హానికరమైన రసాయనాలతో నిండి ఉంది.  ఇలాంటి కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఆ ప్రదేశం మొత్తం కాలుష్యం అవుతుంది.  మంచి కర్పూరం వాడినప్పుడు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి,  మానసిక ప్రశాంతత వచ్చేలా చేస్తుంది.

7. బెల్లం : మన రోజువారీ జీవితంలో బెల్లాన్ని విరివిగా వాడతారు. బయట మార్కెట్లో దొరికే  బెల్లం అనేక రసాయనాలతో నిండి ఉంది.  దానికి బదులు సేంద్రీయ పద్ధతిలో తయారు చేసినటువంటి బెల్లాన్ని వాడండి.  వీటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు.

8. తేనె : పంచామృతాలు గా చెప్పబడే వాటిలో తేనె కూడా ఒకటి. దేవునికి సమర్పించి భక్తులు కూడా తీసుకునే దాన్ని పంచామృతం అంటారు. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న చాలా తేనెలు ఎక్కువగా వేడి చెయ్యడం వల్ల వాటిలో ఉన్న పోషకాలను కోల్పోతున్నాయి. అలాంటి తేనె వాడడం వల్ల ఎలాంటి లాభం ఉండదు.  ఎక్కువ లాభాలు పొందడానికి సేంద్రీయ పద్ధతిలో తీసినటువంటి తేనె వాడండి.  ఎన్నో రకాల పోషకాలు మరియు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి.  మన పురాణాల్లో చెప్పిన విధంగా తేనె మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.

9. ప్లాస్టిక్ డబ్బాలు : ప్లాస్టిక్ డబ్బా ల తయారీలో చాలా హానికరమైన రసాయనాలను వాడుతారు. కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు పూజలో మనం రోజువారీ జీవితంలోనూ వాడకూడదు.  వీటికి బదులు స్టీలు లేదా రాగి లేదా వెండి పాత్రలు వాడాలి.

10. సాంబ్రాణి : ఎలాంటి రసాయనాలు లేని సాంబ్రాణి వాడినప్పుడు అది ఆ ప్రదేశాన్ని పూర్తిగా శుభ్రం చేసి, శరీరానికి,  మైండ్ కి,  ఆత్మకి నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది.  ఇది ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీ తో నింపుతుంది. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న చాలా రకాల సాంబ్రాణీలు రసాయనాలతో నిండి ఉండి ఆ ప్రదేశాన్ని పాడుచేస్తాయి.  వీటికి బదులు పర్యావరణానికి మేలు చేసే వాడిని వాడండి.

మన ఆచార వ్యవహారాల్లో మనకి తెలియకుండా  హానికరమైన ప్రొడక్ట్స్ వాడే వాటిలో ఇవి కొన్ని.  వీలైనంత వరకూ మంచి ప్రొడక్ట్స్ వాడండి.  చెడ్డ ప్రొడక్ట్స్ కన్నా మంచి ప్రొడక్ట్స్ కాస్త ఎక్కువ రేటు ఉన్నమాట వాస్తవమే. కానీ అవి వాడడం వల్ల మనకి అద్భుతమైన లాభాలు ఉంటాయి.  మనకి ఎక్కువ లాభాలు కావాలి అన్నప్పుడు రసాయనాలు లేని మంచి ప్రోడక్ట్ వాడాలి.  అప్పుడే పెద్దలు చెప్పిన లాభాలు,  పురాణాలలో చెప్పబడిన ఉపయోగాలు మనం పొందగలం.  కాబట్టి మంచి ప్రొడక్ట్స్ ని ఎంచుకోండి.

Wishing you and your family peace and joy

Registration

Forgotten Password?

Loading