అభినందన ప్రాముఖ్యతను తెలియజేసే 10 కారణాలు

అభినందన
Share

మిమ్మల్ని ఎవరైనా నిజాయితీగా అభినందించిన సందర్భం గుర్తుందా ? అప్పుడు మీకు ఎలాఅనిపించింది ? అద్భుతం కదా ? మనందరికీ అభినందన అంటే చాలా ఇష్టం. అభినందన మనం సాధించిన విజయాలకు ఒక పరిపూర్ణత తీసుకొస్తుంది. కానీ ఎదుటివాళ్ళని అభినందించే విషయానికి వస్తే మనలో చాలా తక్కువ మంది మనస్ఫూర్తిగా అభినందిస్తారు. ఎదుటివాళ్ళు అభినందన పొందడానికి అర్హత కలిగి ఉన్నప్పటికీ ఎందుకు కొంతమంది అభినందించరు ? ఎదుటి వాళ్ళని పట్టించుకోక పోవడం వలనా ? కాదు. వాళ్ల గురించి మనం పట్టించుకుంటాము. కానీ కొన్నిసార్లు అది అంత ముఖ్యమైనది కాదు అనుకుంటాము.

ఎదుటివాళ్ళకి అభినందన తెలియజేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి ? ఇప్పుడు చూద్దాం.

1. ఎదుటి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది : అభినందన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వాళ్ల పడిన కష్టానికి గుర్తింపు దొరికింది అనే ఆనందం ఇస్తుంది. చిన్న అభినందన చాలా ఉపయోగపడుతుంది. ఎదుటి వాళ్ళు చేసిన కష్టాన్ని గుర్తించడానికి ఉన్న ఒక సాధనమే డబ్బు. కానీ అన్ని సార్లు మనం డబ్బులు ఇవ్వలేము. ముఖ్యంగా మనం ప్రేమించిన వారికి. అలాంటి బంధాలలో ఒక్క చిన్న అభినందన వాళ్లకి మీరు ఎంత విలువ ఇస్తున్నారో అర్థం అయ్యేలా చేస్తుంది.

2. మీ రిలేషన్ షిప్స్ మెరుగు పడేలా చేస్తుంది : మనం నిజాయితీగా మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళని అభినందించినప్పుడు వాళ్లతో మన అనుబంధం మరింత మెరుగు పడుతుంది. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని తన శ్రేయోభిలాషిగా భావించి మిమ్మల్ని గౌరవిస్తారు. కాబట్టి మీ అనుబంధం మరింత మెరుగు పడుతుంది.

3. గుర్తింపు తీసుకు వస్తుంది : ఈ ప్రపంచంలో కేవలం కొంతమంది మాత్రమే ఎదుటి వారిని అభినందిస్తారు. కాబట్టి మీరు ఎవరినైనా అభినందించినప్పుడు మీకు ఒక గుర్తింపు వస్తుంది. మీరు ఒక మంచి వ్యక్తిగా ఈ ఒక్క చిన్న పని వల్ల గుర్తించబడతారు.

4. కొత్తగా ఆలోచించే లక్షణం వస్తుంది : ఎదుటి వాళ్ళని అభినందించడం వల్ల వచ్చే అద్భుతమైన లాభం ఇదే. మీరు కొత్తగా ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది. ఎదుటి వాళ్ళని అభినందించే వారి సామర్థ్యం 33 శాతం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

5. నైపుణ్యం పెరుగుతుంది : ఎదుటి వాళ్ళు ఏదైనా మంచి పని చేసినప్పుడు మీరు అభినందిస్తే తెలియకుండానే వారిలో ఆ లక్షణాన్ని మరియు మంచి చేసే గుణాన్ని మీరు బలపరిచినట్టు అవుతుంది. ఎవరైనా మంచి వంట చేసినప్పుడు మెచ్చుకుంటే ఇంకా బాగా చేయాలని వారు ప్రయత్నించి ఇంకా గొప్పగా వండుతారు. మీరు దేన్ని అబినందిస్తారు అది మరింత పెరుగుతుంది.

6. సామర్థ్యం పెరుగుతుంది : అభినందించే వారి సామర్థ్యం 22 శాతం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎదుటి వాళ్ళని అభినందించడం వల్ల కలిగే గొప్ప ఉపయోగం ఇది. మీ సామర్థ్యం పెరిగినప్పుడు మీరు పనిచేసే చోట మీకు మరింత గుర్తింపు లభిస్తుంది.

7. నమ్మకాన్ని పెంచుతుంది : మనం ఎదుటి వాళ్ళని అభినందించిన అప్పుడు మనం నమ్మదగిన వ్యక్తులుగా కనిపిస్తాం. అది మన అనుబంధాలు మరింత పెరిగేలా చేస్తుంది. ఏదైనా ఒక బంధం మరింత మెరుగు పడాలంటే నమ్మకం చాలా ముఖ్యం.

8. వ్యక్తిత్వం మారుతుంది : మనం ఎదుటి వాళ్ళని అభినందించడం మొదలుపెడితే మన చుట్టూ ఉన్న మంచిని చూసే గుణం పెరుగుతుంది. గొప్ప గొప్ప విషయాలు అని మనం చూడగలుగుతాం. మన చుట్టూ ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు అని తెలుసుకుంటారు. మనం ఆనందంగా, జీవితం గురించి గొప్పగా ఫీల్ అవుతాము.

9. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి : ఎదుటి వాళ్ళని మీరు అభినందించినప్పుడు వాళ్లలో మీ మీద ఒక నమ్మకం కలుగుతుంది. ఇంకా మరింత మంచిగా పని చేయాలని అనుకుంటారు. మిమ్మల్ని ఒక మంచి నాయకుడిగా చూస్తారు. మీతో కలిసి పనిచేయడం వాళ్ళకి గౌరవంగా ఒక భరోసా లాగా ఫీల్ అవుతారు.

10. ఆనందాన్నిస్తుంది : అభినందన అనేది ఇచ్చేవారికి మరియు అది పొందే వారికి కూడా ఆనందాన్నిస్తుంది. మీరు ఎదుటి వాళ్ళని అభినందించినప్పుడు వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు. అది మిమ్మల్ని కూడా ఆనందంగా ఉండేలా చేస్తుంది.

అభినందించడం వల్ల కలిగే కొన్ని లాభాలు ఇవి. కాబట్టి ఎవర్ని అభినందించాలి ?

1. మిమ్మల్ని మీరు అభినందించు కోవడం : మీ ప్రయాణాన్ని మిమ్మల్ని మీరు అభినందించడం ద్వారా ప్రారంభించండి. ఎదుటి వాళ్ళని మనం అరుదుగా అభినందిస్తాం. ప్రతిరోజు పడుకునేముందు ఆ రోజు మీరు చేసిన మంచి పనుల విషయంలో మిమ్మల్ని మీరు అభినందించు కోండి. మీరు ఎక్కడ మంచి పని చేశారో ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని అభినందించు కోండి. మిమ్మల్ని మీరు అభినందించుకున్నప్పుడు మీలో ఉన్న సానుకూల దృక్పథం మరింత బలపడుతుంది.

2. కుటుంబ సభ్యులని అభినందించండి : మీ కుటుంబ సభ్యులని అభినందించండి. మనకోసం మన కుటుంబ సభ్యులు ఎన్నో చేస్తారు. వారు చేసిన మంచి పనులను గుర్తించి మనస్ఫూర్తిగా వారిని అభినందించండి.

3. మీ సహోద్యోగులని అభినందించండి : మీ టీం లో ఎవరైనా మంచి పని చేసినప్పుడు వారిని అభినందించండి. అది మిగతా వారి మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అలా చేయడానికి మీరు మేనేజర్ కానవసరం లేదు. మీరు పనిచేసే చోట ఎవరు మంచి పని చేసినా మనస్ఫూర్తిగా అభినందించండి.

4. పని వాళ్ళని అభినందించండి : మీ ఇంటి దగ్గర పని చేసే వాళ్ళని అభినందించండి. అలా చేస్తే వాళ్ళు ఎక్కువ జీతం అడుగుతారు అనే అభిప్రాయం చాలా తప్పు. అభినందించడం వల్ల వారికి ఆత్మ సంతృప్తి కలుగుతుంది. వారు మరింత బాగా పని చేస్తారు.

5. ఎవరినైనా అభినందించండి : మంచి పని చేసిన ఎవరినైనా అభినందించండి. మీ స్నేహితులు గాని, బంధువులు గాని, మీతో కలిసి పని చేసేవారు గానీ, ఆఖరికి తెలియనివాళ్లు అయినా గాని. ఒక చిన్న అభినందన చాలా గొప్ప మార్పును తీసుకొస్తుంది.

ఎలా అభినందించాలి ? ఇప్పుడు చూద్దాం.

1. నిజాయితీ : ఒక వ్యక్తి నిజంగా మంచి పని చేశాడు అని అనుకున్నప్పుడు నిజాయితీగా మీ అభినందనలు తెలియజేయండి. మీ అభినందనలు నిజాయితీ లేనప్పుడు ఎదుటి వ్యక్తి మీకు విలువ ఇవ్వడం మానేస్తాడు.

2. వాళ్లు చేసిన పనిని గుర్తిస్తూ అభినందించండి : మీరు ఎవరినైనా అభినందించినప్పుడు వారు చేసిన పనిలో మీకు ఏది నచ్చిందో దాన్ని చెబుతూ అభినందించండి. ఉదాహరణకి ఒక పిల్లవాడు క్రికెట్ బాగా ఆడితే నువ్వు బ్యాటింగ్ చేసిన విధానం చాలా బాగుంది. నువ్వు కొట్టినా ఆ సిక్స్ అద్భుతం అని అభినందించండి.

3. అందరి ముందు చెప్పండి : మీరు ఎవరినైనా అభినందించినప్పుడు అందరి ముందు అభినందించండి. దాని గురించి అందరికీ తెలియనివ్వండి. ఇది మీ అభినందన కి మరింత విలువను తీసుకువస్తుంది.

4. వెంటనే అభినందించండి : ఎవరైనా ఒకరు మంచి పని చేశారని మీరు గుర్తించినప్పుడు వీలైనంత త్వరగా వారిని అభినందించండి. మీరు ఆలస్యంగా అభినందిస్తే అభినందన దాని అందాన్ని కోల్పోతుంది.

5. వారు చేసిన మంచి పనుల వల్ల కలిగిన ఉపయోగాన్ని చెప్పండి : ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు అది ఎలా ఉపయోగపడిందో వారికి చెప్పి మీ అభినందనలు తెలియజేయండి.

అభినందించడానికి కొన్ని సూచనలు ఇవి. అభినందన యొక్క శక్తిని తక్కువ అంచనా వేయకండి. మీ చిన్న అభినందన వారికి చాలా బలాన్నిస్తుంది. కాబట్టి ఎవరైనా అభినందించడానికి సిగ్గు పడకండి. ఎదుటి వాళ్ళని అభినందిస్తూ ఈ ప్రపంచం అంత గొప్పగా మారడానికి మీ వంతు సాయం చేయండి.

Stay happy.

Registration

Forgotten Password?

Loading