ఈరోజుల్లో ఒకే ప్రొడక్ట్ కి చాలా ఎంపికలు ఉన్నాయి. ఒకే ప్రొడక్ట్ కి చాలా కంపెనీలు, చాలా బ్రాండ్లు ఉన్నాయి. ఇది చాలా ఎంపికలు ఉన్న కాలం. ఈ ఉత్పత్తులపై సహజ, సేంద్రీయ, ఆరోగ్యకరమైన, బలవర్థకమైన, మూలికా, 100% కొవ్వు రహిత, ఫైబర్ అధికంగా ఉండే అని వివిధ లేబుళ్ళను మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు, ఇవేమీ తెలియని కష్టమర్ కి ఏ ప్రొడక్ట్ ఎన్నుకోవాలో తెలియదు. ఎందుకంటే అన్నీ ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఈ ప్రొడక్ట్స్ మరియు లేబుళ్ల యొక్క అన్ని ప్రకటనలు ఆరోగ్యానికి హామీ ఇస్తాయి. కాబట్టి, నిజం ఏమిటి? ఏ ప్రొడక్ట్ నిజంగా ఆరోగ్యకరమైనది. మరియు నమ్మదగినది?
ఒక ప్రొడక్ట్ కి “ఆర్గానిక్” లేబుల్ ఉన్నప్పుడు, అది ప్రభుత్వ సంస్థలచే ధృవీకరించబడిందని అర్థం. “ఆర్గానిక్ ” లేబుల్ ఒక ప్రొడక్ట్ కి ప్రభుత్వం సూచించిన కొన్ని మార్గదర్శకాలను అనుసరించినప్పుడే ఇవ్వబడుతుంది. సేంద్రీయ (organic) వ్యవసాయం చాలా సవాలుగా ఉన్నందున ఈ లేబుల్ పొందడం అంత సులభం కాదు.
సేంద్రీయ ఉత్పత్తి అని పిలవబడే ప్రొడక్ట్స్ ను పండించే సమయంలో , నిర్వహణలో, నిల్వ మరియు ప్రాసెసింగ్‌లో క్రింద పదార్థాలు ఉపయోగించకూడదు.
1. సింథటిక్ లేదా రసాయన పురుగుమందులు మరియు ఎరువులు – ఈ ఎరువులు నేల, రైతుల మరియు ఆ ప్రొడక్ట్ తినే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అవి నదులు, సరస్సులు మరియు అవి ఉపయోగించిన ప్రదేశం యొక్క మొత్తం పర్యావరణ వ్యవస్థకు నష్టం కలిగిస్తాయి.
2. Irradiation – ఈ ప్రక్రియ ఆహార నాణ్యతను దెబ్బతీస్తుంది. ముఖ్యమైన విటమిన్లు మరియు ఆహారంలో ముఖ్యమైన పోషకాలు పోతాయి.
3. మురుగునీటి బురద – ఈ అత్యంత విషపూరిత పదార్థాన్ని సాంప్రదాయకంగా పండించే ఆహారాలలో ఎరువుగా ఉపయోగిస్తారు. దీని విష స్వభావం కారణంగా, ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ నుండి నిషేధించబడింది.
4. జన్యుపరంగా ఇంజనీరింగ్ చేసిన జీవులు లేదా జన్యుపరంగా మార్పు చెందిన జీవులు (GMO లు)
5. సింథటిక్ గ్రోత్ హార్మోన్లు
6. క్లోనింగ్
7. పెట్రోలియం ఆధారిత ఎరువులు
8. కృత్రిమ రుచులు
9. రంగులు జోడించడం
10. నిల్వ ఉంచే రసాయనాలు
పైన పేర్కొన్న అన్ని పదార్థాలు సాంప్రదాయకంగా పెంచే ప్రొడక్ట్స్ లో ఎక్కువగా వాడతారు.
ఈ పదార్థాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మరియు దీర్ఘకాలంలో వివిధ ప్రాణాంతక వ్యాధులకు దారితీయవచ్చు. ఈ హానికరమైన పదార్ధాల లేకుండా ఒక ప్రొడక్ట్ ఉన్నప్పుడు దాన్నే ఆర్గానిక్ అని పిలుస్తారు. కాబట్టి, మీరు “ఆర్గానిక్” లేబుల్‌తో ఒక ప్రొడక్ట్ చూసినప్పుడు, ఈ విష రసాయనాలు లేవు అని మీరు నిర్ధారించుకోవచ్చు.
ఆరోగ్యకరమైన, సహజమైన, ఫైబర్ అధికంగా ఉండే ఇతర లేబుళ్ళ విషయంలో ఇది ఉండదు. ఈ లేబుళ్ళను ఏ ప్రొడక్ట్ మీద అయినా ఉపయోగించవచ్చు. ఒక ప్రొడక్ట్ రసాయనాలతో ఉన్నప్పటికీ, అది ఆరోగ్యకరమైనది అని చెప్పుకోవచ్చు. మరియు ఈ లేబుళ్ళను ఉపయోగించటానికి ఎలాంటి సర్టిఫికెట్ అవసరం లేదు. కాబట్టి, మీరు రసాయన రహిత మరియు ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ఉపయోగించాలి అంటే ఖచ్చితంగా “ఆర్గానిక్” అనే లేబుల్ గురించి చూడండి.
రసాయనాలు మరియు పురుగుమందులు లేకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని మనమందరం కోరుకుంటున్నాము. మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని మరియు మన కుటుంబ సభ్యులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని కోరుకుంటున్నాము. సేంద్రీయ ఉత్పత్తులు ఎంత ఆరోగ్యకరమైనవో ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం. మన ప్రాధాన్యత ఆర్గానికి అవ్వాలి. మనం సేంద్రీయ ఉత్పత్తులను ఆన్లైన్లో లేదా సూపర్మార్కెట్లో వెతికినపుడు మరియు వాటిని సాంప్రదాయకంగా పెరిగిన ప్రొడక్ట్స్ తో పోల్చినప్పుడు, మొదట మనం గమనించేది సేంద్రీయ ఉత్పత్తుల యొక్క అధిక ధర. సేంద్రీయ ఉత్పత్తుల వాడకం అధిక ఖర్చుతో కూడుకున్న పని.
అవును, ఆర్గానిక్ప్రొడక్ట్స్ ను, మామూలు ప్రొడక్ట్స్ తో పోల్చితే అధిక ధర ఉంటుంది. ఎందుకంటే సేంద్రీయ వ్యవసాయం కష్టం మరియు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ అధిక ధరల వల్ల మనలో కొంతమంది సేంద్రీయ ఉత్పత్తులను కొనరు. ప్రొడక్ట్స్ మీద డబ్బు ఖర్చు చెయ్యడం మంచిదా ? కాదా? ఇప్పుడు చూద్దాం.
రోజువారీ జీవితంలో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి.
1. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లో ఎలాంటి రసాయనాలు, విషపదార్థాలు ఉండవు.
2. మిగతా వాటితో పోల్చుకుంటే ఇవి చాలా ఆరోగ్యకరం
3. ఆర్గానిక్ వ్యవసాయం వల్ల ఆ నేలకి, పండించే రైతుకి, తినే వ్యక్తికి మొత్తం పర్యావరణానికే మంచి జరుగుతుంది. ఎందుకంటే ఎలాంటి పురుగుల మందులు వాడకపోవడం వల్ల.
4. మిగతా ప్రొడక్ట్స్ తో పోలిస్తే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లో ఎక్కువ పోషకాలు ఉంటాయి
5. రసాయనాలు వాడి పండించిన పంటల కంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ రుచిగా ఉంటాయి
6. సేంద్రీయ వ్యవసాయం పర్యావరణ సమతుల్యతకు భంగం కలిగించకుండా ప్రకృతికి అనుగుణంగా చేసే వ్యవసాయం.
7. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లో GMO లు ఉండవు .
8. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పండించడం, నిర్వహణ, నిల్వ మరియు ప్రాసెసింగ్‌లో రసాయన ఎరువులు, పురుగుమందులు లేదా ఇతర విష పదార్థాలు ఉపయోగించబడవు. సాంప్రదాయ వ్యవసాయం విషయానికి వస్తే, భారతీయ వ్యవసాయంలో ఉపయోగించే అనేక రసాయనాలు ప్రపంచవ్యాప్తంగా నిషేధించబడ్డాయి. సురక్షితమైన లేదా చట్టపరమైన పరిమితుల కంటే ఎక్కువ స్థాయిలో పంటలకు వాడుతున్నారు. వ్యవసాయంలో నిషేధిత రసాయనాల అధిక వినియోగం చివరికి దీర్ఘకాలంలో రైతులను మరియు అవి వాడే వినియోగదారులను వ్యాధులకు గురిచేస్తాయి.
9. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వినియోగం మంచి రోగనిరోధక శక్తిని నిర్మించడంలో సహాయపడుతుంది.
10. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వల్ల చాలా తక్కువ గాలి, నేల, నీటి కాలుష్యం ఉంటుంది.
ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం ఉపయోగాలు ఇవి. మనం ఈ ప్రొడక్ట్స్ వాడినపుడు మన జీవితం ప్రకృతికి అనుగుణంగా మన ఆరోగ్యానికి అనుగుణంగా ఉంటుంది. అప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు. దానితో పాటూ మన పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారము అవుతాము.
కాబట్టి క్రమేణా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి ఎలా మారాలి ? మీకు సహాయపడే కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం.
1. ఆహారానికి మీ నెలవారీ బడ్జెట్ ని పెంచండి. ఆరోగ్యమే నిజమైన సంపద. మనం ఆరోగ్యంగా ఉండడంలో ఆహారం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని పాడుచేసుకుని తర్వాత హాస్పటల్ కి లక్షల్లో ఖర్చు పెట్టే కంటే ఇప్పడు ముఖ్యమైన ఆరోగ్యం మీద ఖర్చు పెట్టడం చాలా మంచి పని.
2. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తో మీ ప్రయాణాన్ని రైస్, గోధుమ పిండి, పప్పులు మొదలయిన వాటితో ప్రారంభించండి. ఎందుకంటే మనం రోజులో ఎక్కువ తీసుకునేవి ఇవే. ఇది మన జీవితంలో చాలా గణనీయమైన మార్పు తీసుకువస్తుంది.
3. ఆర్గానిక్ కూరగాయలు, పళ్ళు వారానికి రెండుసార్లయినా వాడండి
4. హార్మోన్స్ నిండిన పాలు, పెరుగుకి బదులు ఆర్గానిక్ వి వాడండి
5. ఏదైనా ప్రొడక్ట్స్ కొనేముందు దాని లేబుల్ జాగ్రత్తగా పరిశీలించండి. ఆ ప్రొడక్ట్ లో ఏం ఉన్నాయో పూర్తిగా చదవండి
6. మీకు స్థలం ఉంటే మీ కూరగాయలు మీరే ఆర్గానిక్ విధానంలో పండించుకోండి. పళ్ళు, ఆకుకూరలు కూడా పండించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో తక్కువ స్థలం కూడా పండించడానికి అనువైన పద్దతులు వచ్చాయి. వాటి గురించి తెలుసుకోండి.
మీరు క్రమేణా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి మారడానికి ఉపయోగపడే సూచనలు ఇవి.
अन्नमयं हि सोम्य मनः అని ఛందోగ్య ఉపనిషత్తు చెప్తుంది. దీని అర్థం “ బుద్దిని పెంచేది ఆహారం” . మనం ఎలాంటి ఆహారం తింటామో మన ఆలోచనలు, మన ఎమోషన్స్ అలా ఉంటాయి. మన జీవితంలో ఆహారం ఇంత ముఖ్యమైనది కనుక ఆ ఆహారం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి.
Stay healthy! Stay strong!