మనందరికీ రోజుకి 24 గంటలు ఉంటాయి. దేశ ప్రధాని కైనా, ఒక మామూలు గృహిణి కైనా, స్టూడెంట్ కైనా, ఎవరికైనా రోజుకి ఇరవై నాలుగు గంటలే ఉంటాయి. ఈ ఇరవై నాలుగు గంటలు మనం ఎలా వాడుకుంటాం అనేదాని మీద మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మరియు మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన సమయాన్ని ఎలా గడుపుదాం అనే దానిమీదే మన విజయం ఆధారపడి ఉంటుంది. సమయం యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకోవడానికి కొన్ని కొటేషన్స్ ఇప్పుడు చూద్దాం.
1. మనుషులకి ఉన్న అసలైన సంపద సమయం. దాన్ని అస్సలు కోల్పోకూడదు. – థామస్ ఆల్వా ఎడిసన్.
2. సమయమే జీవితం. సమయాన్ని వృధా చేస్తే జీవితాన్ని వృధా చేసినట్టే. – Alan lekin
3. సమయాన్ని గడపడం కాదు సమయాన్ని పెట్టుబడిగా పెట్టడం విజయానికి సూత్రం. – Stephen Covey
4. సమయం డబ్బు కన్నా విలువైనది. మీరు ఇంకా డబ్బుని సంప్రదించగలరు కానీ సమయాన్ని సంపాదించ లేరు. – Jim rohn
5. మీకు మీ జీవితం మీద ప్రేమ ఉంటే సమయాన్ని వృధా చేయకండి. సమయాన్ని సరిగా ఉపయోగించడం వల్లనే జీవితం అద్భుతంగా అవుతుంది. – బ్రూస్ లీ
6. మీరు రోజుని నడుపుతారు లేదా రోజు మిమ్మల్ని నడుపుతుంది – Jim rohn
7. ప్రతి క్షణానికి అనంతమైన విలువ ఉంది. – John Wolfgang goethe
8. మీకు మీరు విలువని ఇచ్చుకునే వరకూ, సమయానికి విలువ ఇవ్వలేరు. సమయానికి విలువ ఇవ్వకపోతే మీరు ఏమీ సాధించలేరు. – M. Scott peck
9. మీరు మీ జీవితాన్ని ప్రేమిస్తున్నారా ? అయితే సమయాన్ని విచ్చలవిడిగా వృధా చేయకండి. ఆ సమయంలోనే మీ జీవితం తయారవుతుంది. – బెంజిమన్ ఫ్రాంక్లిన్
10. ప్రకృతి ప్రతిదానికీ తొందరపడదు. – lao Tzu
ఈ భూమి మీద మనకున్న గొప్ప బహుమతి సమయం. మనం చాలాసార్లు సమయం లేదని ఫిర్యాదు చేస్తుంటాం, బాధపడుతుంటాం. మన ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి అనుకుంటాం, మన కుటుంబం తో ఎక్కువ సమయం గడపాలి అనుకుంటాం, మెడిటేషన్ చేయాలనుకుంటారు కానీ ఇవేమీ చేయలేకపోవడానికి కారణం సమయం లేకపోవడం అని అంటూ ఉంటారు.
గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారు ఈ సమస్య నుంచి బయట పడ్డ వారే. వాళ్ళ క్యాలెండర్ అంతా రకరకాల ఈవెంట్స్ తో నిండిపోయి ఉంటుంది. కానీ వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ కుటుంబంతో సమయం గడపడానికి, మెడిటేషన్ చేయడానికి వాళ్లకి సమయం ఉంటుంది. వాళ్లు చేయాలనుకున్న ప్రతి పని చేయగలుగుతారు. మామూలు వాళ్ళకి గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారికి తేడా ఏంటి ? గొప్ప గొప్పవిజయాలు సాధించిన వాళ్ళు అన్ని పనులు సకాలంలో పూర్తి చేయడానికి కారణం ఏంటి ? అదే సమయపాలన.
మనం మన సమయాన్ని సక్రమంగా వాడడం నేర్చుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక రోజులో మనం చేయాలి అనుకున్న పనులన్నీ పూర్తి చేయవచ్చు. మంచి జీవితానికి సమయపాలన చాలా ముఖ్యం సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటాం అనేది మన లక్ష్యాలను సాధించడానికి మనల్ని ప్రభావితం చేస్తుంది.
సరైన సమయపాలన అలవాటు చేసుకోవడానికి కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం.
1. రాబోయే వారాలని, రోజులని ముందే ప్లాన్ చేసుకోండి : రాబోయే రోజులలో మీరు చేయాలనుకుంటున్న పనులన్నీ ఒక చోట రాసుకుని మీకు కనపడే విధంగా ఉంచుకోండి. రాబోయే వారం లేదా రోజులు ముందే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మధ్యలో మరేదైనా పని వస్తే అది ముఖ్యమైనది కాకపోతే చేయకండి. అది ఎప్పుడు చేయాలో ప్లాన్ చేసుకోండి. గొప్ప విజయాలు సాధించే వారు రాబోయే నెలని, సంవత్సరాలని కూడా ప్లాన్ చేసుకుంటారు. రోజుని ప్లాన్ చేసుకోవడానికి 10 నుంచి 12 నిమిషాలు సమయం గడిపితే ఆరోజు కనీసం రెండు గంటలు వృధా కాకుండా చూసుకోవచ్చు – from “eat the frog” by Brian Tracy
2. ముఖ్యమైనవి ఏమిటో తెలుసుకోండి : మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనకు ఎదురైన ప్రతిదీ చేసుకుంటూ పోతే ఏమీ సాధించలేము. మీ జీవితంలో మీకు ఏం కావాలో తెలుసుకోండి. దాని ప్రకారం మీకు ముఖ్యమైన పనులు ఏంటో తెలుసుకోండి. ఉదయం మీరు చేయాల్సిన పనులన్నీ రాసుకుని వాటిలో ముఖ్యమైనవి ఏంటో తెలుసుకుని అవి ముందు ప్లాన్ చేసుకోండి. మనం చేసే పని 3 విభాగాలుగా విభజించవచ్చు.
1. ముఖ్యమైనవి మరియు వెంటనే చేయవలసినవి
2. వెంటనే చేయవలసినవి కానీ ముఖ్యమైనవి కాదు.
3. ముఖ్యమైనవి కానీ వెంటనే చేయవలసిన అవసరం లేదు
4. ముఖ్యమైనవి కాదు వెంటనే చేయవలసినవి కాదు.
మీరు మీ రోజుని ప్లాన్ చేసుకునే ముందు మీరు చేయవలసిన పని ఈ విభాగాలుగా విభజించండి.
3. ప్రతినిధిగా వ్యవహరించండి : మనం చేయాలని అని ప్లాన్ చేసుకున్న ప్రతి పని మనమే చేయవలసిన అవసరం లేదు. పనిమనిషిని పెట్టుకోవచ్చా ? మీ భాగస్వామిని కొంత పని పంచుకోమని అడగొచ్చా ? మీరు ఒక ప్రతినిధిలా ఉండి ఆ పనులు జరిగేలా ఎలా చూడాలో ఆలోచించండి. అప్పుడు మీకు కొంత సమయం మిగులుతుంది.
4. ఎంత సమయం పడుతుందో ఊహించండి : ఏదైనా పని ఎంత సమయంలో పూర్తవుతుందో ఊహించే దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటే మనం చాలా సులువుగా సమయపాలన చేయవచ్చు. మీరు ఏ సమయంలో చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటే హడావిడి లేకుండా సక్రమంగా ఆ పనిని పూర్తి చేయవచ్చు.
5. సోషల్ మీడియా లో గడిపే సమయం మీద జాగ్రత్త వహించండి : మీ శక్తిని సమయాన్ని వృధా చేసే రెండు విషయాలు సోషల్ మీడియా మరియు బ్రౌజింగ్. మొదట్లో కేవలం ఐదు నిమిషాలే కదా అని మొదలు పెడతాం ఆ తర్వాత గంటలు గంటలు గడుపుతాం. ఈ రెండిటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మీరు అనుకున్న విధంగా మీ పనులు సకాలంలో పూర్తి చేయడానికి మీరు సోషల్ మీడియాలో గడుపుతున్న సమయం మీద జాగ్రత్తగా ఉండాలి.
6. No చెప్పడం నేర్చుకోండి : మీ లక్ష్యానికి ఏవిధంగానూ ఉపయోగపడని పనులు మీరు చేయవలసి వచ్చినప్పుడు NO చెప్పడం నేర్చుకోండి. అప్పుడే మీకు సమయం మిగిలి మీ లక్ష్యం కోసం మరింత పని చేయగలుగుతారు.
7. ఒకే రకమైన పనులను ఒక గ్రూపుగా చేయండి. : ఒకే రకమైన పనులు మీరు చేయవలసిన లిస్టు లో ఉన్నప్పుడు వాటిని ఒకేసారి చేయండి. ఉదాహరణకి మీరు ఒక రోజులో పది ఫోన్ కాల్స్ చేయాల్సి వస్తే అవన్నీ ఒకేసారి చేయండి. అప్పుడు మీకు ఎంతో శ్రమ మరియు సమయం ఆదా అవుతుంది. మీరు ఏమైనా సరుకులు కొనాల్సి వచ్చినప్పుడు అన్నీ ఒకేసారి తీసుకోండి అప్పుడు మీకు చాలా సమయం కలిసి వస్తుంది.
8. కాస్త ఖాళీ సమయం ఉంచుకోండి : కాస్త ఖాళీ నుంచి మధ్యలో ఏదైనా వెంటనే చేయవలసిన ముఖ్యమైన పని వచ్చినపుడు మీరు సులువుగా చేయడానికి వీలవుతుంది.
9. మీరు పడుకునే మరియు లేచే సమయం ముందే ప్లాన్ చేసుకోండి : లేచే సమయం పడుకునే సమయం మీ ఆధీనంలో ఉంటే ఆ రోజు అంతా మీ ఆధీనంలో ఉంటుంది. ఇంటి విషయాల్లో సరైన ప్లాన్ లేకపోతే ఈ రోజంతా చాలా సమయం వృధా గా గడిచిపోతుంది.
10. విరామం మరియు రిలాక్స్ అయ్యే టైం కూడా ప్లాన్ చేసుకోండి : మనం జీవితంలో ఎక్కువ సాధించాలి అంటే తగిన విధంగా కాస్త విరామం కూడా ఉండాలి. మన శరీరం మరియు మైండ్ కి విశ్రాంతి కావాలి. ఇలా తీసుకునే విశ్రాంతి మనల్ని నూతన ఉత్సాహంతో ఉండేలా చేస్తుంది. కాబట్టి మీరు ఒక రోజు ప్లాన్ చేసుకునే ముందు విశ్రాంతి కూడా ప్లాన్ చేసుకోండి.
మన జీవితంలో సరైన సమయపాలన అలవాటు చేసుకోవడానికి ఉపయోగపడే సూచనలు ఇవి. ఇది తమ సమయాన్ని సక్రమంగా ఉపయోగించేవారు ఆనందంగా, ఆరోగ్యంగా మరింత సామర్థ్యంతో ఉంటారు. మిగతా వారికన్నా ఎక్కువ సాధిస్తారు. సరైన సమయపాలనతో సామర్థ్యం పెరిగి, ఒత్తిడి తగ్గుతుంది . ఒక రోజులో 20 శాతం సమయం ముఖ్యమైన విషయాల మీద 80% మామూలు విషయాలు లేదా పనికి రాని విషయాల మీద ఖర్చు చేస్తారని ఒక సర్వే చెబుతోంది. కాబట్టి మనం వృధాగా గడిపే సమయాన్ని తగ్గించుకుని మన సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి.
Master your time, Master your life !