విమర్శ చాలా సున్నితంగా ఉండాలి. ఒక వ్యక్తి యొక్క ఉన్నతికి తోడ్పడాలి తప్ప మూలాలని నాశనం చేయకూడదు. -Frank a Clark
ఏదైనా ఒక పని చేసేటప్పుడు కొన్నిసార్లు అది సరిగా జరగక పోవచ్చు. ఇంకా గొప్పగా చేయడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ద్వారా ఎక్కడ ఇంకా మెరుగుపరుచుకోవాలో మనకు అర్థం అవుతుంది. మనం చేసే తప్పులు చూసుకుని మళ్లీ ఆ తప్పులు చేయకుండా ఉండడానికి ఫీడ్ బ్యాక్ చాలా ఉపయోగపడుతుంది. ఫీడ్ బ్యాక్ ఇవ్వడం లేదా తీసుకోవడం జీవితంలో ఒక భాగం. ఇది మన అభివృద్ధికి సహాయపడుతుంది. మనల్ని మనం సరి చేసుకునే అవకాశం ఇస్తుంది.
యజమాని అయిన లేదా అతని దగ్గర పని చేసే వ్యక్తి అయినా తోటి పని వాళ్లకి ఫీడ్ బ్యాక్ ఇవ్వటం వృత్తిలో భాగం. సరైన ఫీడ్బ్యాక్ ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. కేవలం పనిచేసే చోట మాత్రమే కాదు ఇంట్లో కూడా మనం ఫీడ్బ్యాక్ ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడు అభివృద్ధి చెందుతూ ఉండాలంటే ఫీడ్బ్యాక్ చాలా అవసరం.
కానీ ఫీడ్ బ్యాక్ ఇవ్వటం చాలా కష్టతరం అయ్యింది ఎందుకంటే చాలా తక్కువ మందికి మాత్రమే ఫీడ్ బ్యాక్ పాజిటివ్ గా ఇవ్వడం తెలుసు. చాలామంది ఫీడ్బ్యాక్ ని తప్పుగా అర్థం చేసుకుని బాధపడతారు. మన ఇచ్చే ఫీడ్బ్యాక్ నిర్మాణాత్మకంగా లేకపోతే అది ఒక వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని నాశనం చేయవచ్చు. ఫీడ్ బాక్ యొక్క ఉద్దేశం ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడం కాదు. తన తప్పుల్ని సరి చేసుకుని ఇంకా గొప్పగా మారే విధంగా చేయడం.
కాబట్టి నిర్మాణాత్మకంగా ఫీడ్ బ్యాక్ ఇవ్వడం ఎలా ? ఇప్పుడు 10 సూచనలు చూద్దాం.
1. పాజిటివ్ విషయం ముందు చెప్పండి : ఏ వ్యక్తి పూర్తిగా మంచివాడు కాదు, అలాగని పూర్తిగా చెడ్డవాడు కూడా కాదు కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి ఎదుటి వ్యక్తిలో ఎంతోకొంత మంచి ఉండే అవకాశం ఉంది. ఫీడ్బ్యాక్ ఇచ్చేముందు నా మంచి గురించి మాట్లాడండి. వాళ్లు ఈ మధ్య చేసిన పనిలో బాగా చేసిన వాటిని ఉంటే చెప్పండి. మనస్ఫూర్తిగా వారిని అభినందించండి. వారు చేసిన పనిలో కనీసం మూడు పాజిటివ్ విషయాలు చెప్పండి. నెగిటివ్ విషయాలు చెప్పడానికి అన్నా ముందు పాజిటివ్ విషయాలు చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తికి మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. దానివలన మీరు ఇచ్చే ఫీడ్ బ్యాక్ అతను అంగీకరించడానికి తేలికగా ఉంటుంది.
2. నిర్దిష్టంగా ఉండండి : ఫీడ్బ్యాక్ ఇచ్చేముందు అతను చేసిన పని గురించి మాత్రమే మాట్లాడండి. గతంలో జరిగిన వాటిని నమ్మకండి. అనేక పనుల గురించి ఒకేసారి మాట్లాడకండి దానివలన వాదనలు,గొడవలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వీటి కోసం ఎలాంటి ఉపయోగం లేకుండా చాలా సమయం వృధా అవుతుంది. కాబట్టి ఒక పని మీద మాత్రమే దృష్టి పెట్టి దాని గురించి మాత్రమే మాట్లాడండి. ఇలా నిర్దిష్టంగా ఒక దాని గురించే మాట్లాడడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.
3. ఏకాంతంగా మాట్లాడండి : ఫీడ్బ్యాక్ ఎప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు చెప్పకండి. అందరిలో ఉన్నప్పుడు చెబితే ఎదుటి వ్యక్తికి అది అవమానకరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇ అలా ఎప్పుడూ చేయకండి. వారు వ్యక్తిగతంగా కలసి ఏకాంతంగా మీ ఫీడ్ బ్యాక్ చెప్పండి.
4. ఉదాహరణలు ఇవ్వండి : ఫీడ్ బ్యాక్ వచ్చే సమయంలో ఖచ్చితమైన ఉదాహరణలు ఇవ్వడం చాలా ముఖ్యం. దీని ఉన్న మీ ఉద్దేశాన్ని ఎదుటి వ్యక్తి అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక సందర్భాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఎక్కడ మెరుగుపరుచుకుంటే బాగుంటుందో చెప్పండి. నువ్వు చేసిన పని బాలేదు అని కాకుం డా, ఎందుకు బాలేదు ఎక్కడ బాలేదు అనేది చెప్పండి.
5. గౌరవం ఇవ్వండి : మీ బాడీ లాంగ్వేజ్, మీరు మాట్లాడే విధానం, మీ గొంతు గౌరవ ప్రదంగా ఉండేలా చూసుకోండి. మీరు గొంతు పెంచి మాట్లాడినా లేదా బూతులు మాట్లాడినా వ్యక్తి బాధ పడే అవకాశం ఉంది. ఎప్పుడూ, ఎప్పటికీ, అస్తమాను ఇలాంటి పదాలు వాడకండి. వీటివలన అనవసరంగా ఎక్కువగా అనుకుని బాధపడే అవకాశం ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఏదైనా పని చేస్తే నువ్వు ఈ పని చేయడంలో ఎప్పుడూ ఫెయిల్ అవుతావు, అనడం నిర్మాణాత్మకమైన ఫీడ్బ్యాక్ కాదు. దీన్నే నువ్వు ఈ పనిని ఇంకా బాగా చేయగలవు తను చెప్పండి.
6. నిజాయితీగా ఉండండి : ఫీడ్బ్యాక్ ఇచ్చే సమయంలో ఎలాంటి నెగెటివ్ ఉద్దేశాలు మనసులో పెట్టుకోకండి. మీ ఉద్దేశ్యం విషయంలో నిజాయితీగా ఉంటుంది. మీ ఉద్దేశ్యం కేవలం ఎదుటి వ్యక్తిని మెరుగుపరుచుకునే విధంగా ఉండాలి తప్ప అతను చేసిన తప్పులను ఎత్తి చూపడం అవ్వకూడదు. కాబట్టి మీ ఫీడ్బ్యాక్ ఇచ్చే సమయంలో నిజాయితీగా ఉండండి.
7. వ్యక్తిగతంగా తీసుకోకండి : అతను చేసిన పని మీద మాత్రమే దృష్టి పెట్టండి తప్ప ఆ వ్యక్తి మీద కాదు. ఆ వ్యక్తి మరియు అతను చేసిన పని రెండు వేరు వేరు. కాబట్టి వ్యక్తిగత దూషణలు లేకుండా జాగ్రత్త పడండి. నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు లేదా నువ్వు ఎప్పుడూ ఆఫీస్ కి లేట్ గా వస్తావు లాంటి మాటలు వాడకండి. దీనికి బదులు నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా మెరుగు పరుచుకోవాలి అని చెప్పండి.
8. కరుణ కలిగి ఉండండి : మనం చేసే పనుల్లో తప్పులు జరగడం కూడా భాగమని అర్థం చేసుకోండి. ఎదుటి వ్యక్తి స్థానంలో ఉండి వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఆ స్థానంలో ఉంటే ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారో ఆలోచించండి. అలాంటి ఫీడ్బ్యాక్ ఎదుటి వ్యక్తికి ఇవ్వండి.
9. ఓపిక గా వినండి : మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత ఎదుటివ్యక్తి మాట్లాడి తను అనుకున్నది చెప్పే అవకాశం ఇవ్వండి. వారు చెప్తుంది ఓపికగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. వారు మాట్లాడుతుండగా మధ్యలో అడ్డు పడకండి. దీని వలన ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితులు మనం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
10. సలహాలు ఇవ్వండి : మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని వారు ఏ విధంగా ఆచరణలో పెట్టొచ్చు సలహాలు ఇవ్వండి. కుదిరితే మీరు చేసిన పని లేదా మీకు తెలిసిన వ్యక్తి చేసిన పనిని చెప్పి మీరు ఏ విధంగా మెరుగుపరుచుకున్నారో చెప్పండి. మన వ్యక్తి గత అనుభవాన్ని చెప్పడం వల్ల మనం ఇచ్చే ఫీడ్ బ్యాక్ నమ్మకంగా, మరింత ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. ఉదాహరణకి, ఎదుటి వ్యక్తి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మీరు ఫీడ్ బ్యాక్ ఇస్తుంటే, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి సహాయ పడిన వాటి గురించి చెప్పండి. ఒక జడ్జి అలాకాకుండా స్నేహితుడిగా సలహాలు ఇవ్వండి.
నిర్మాణాత్మకమైన ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఇవి కొన్ని సూచనలు.
నిర్మాణాత్మకంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎదుటి వ్యక్తి యొక్క అభివృద్ధికి చాలా సహాయపడుతుంది . మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్ సరైన విధంగా లేకపోతే అది ఎదుటి వ్యక్తిని నెగిటివ్గా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ సరిగా ఉండేలా చూసుకోండి. నిర్మాణాత్మకమైన ఫీడ్బ్యాక్ ఎదుటి వ్యక్తిని అద్భుతంగా మారుస్తుంది.
ఎప్పుడు నిర్మాణాత్మకమైన ఫీడ్బ్యాక్ ఇవ్వడమే కాదు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు చేసిన పని గురించి ఎదుటి వాళ్ళ ఫీడ్బ్యాక్ అడగండి. మీరు ఇంకా మెరుగైన విధంగా చేయగల విషయాలు తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. అది మీ అభివృద్ధికి చాలా సహాయపడుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి మాత్రమే ఫీడ్బ్యాక్ కోసం అడగడం.
నిర్మాణాత్మకమైన ఫీడ్బ్యాక్ ఇవ్వండి మరియు తీసుకోండి.