స్టూడెంట్స్ మంచి మార్కులు సాధించడానికి 10 సూచనలు

స్టూడెంట్స్
Share

విద్యార్థి దశ జీవితంలో చాలా ముఖ్యమైన దశ. మనకు తెలియని ఎన్నో విషయాలు, జీవితంలో ఉపయోగపడే పాటలు నేర్చుకునేది విద్యార్థి దశలోనే. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని ప్రతి స్టూడెంట్స్ ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో పరీక్షలకి సిద్ధపడే సమయంలో ఎంతో ఒత్తిడికి లోనవుతారు.  స్కూల్ అయినా, కాలేజ్ అయినా విద్యార్థి దశలో చాలా సవాళ్లు ఎదురవుతాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఒక ప్రణాళిక ఉండాలి.

ఒత్తిడి లేకుండా చదివి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడం ఎలా ? విద్యార్థులకు ఉపయోగపడే కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం.

స్టూడెంట్స్ మార్కులు సాధించడానికి 10 సూచనలు

1. చదవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి : మీరు అనుకున్న సబ్జెక్ట్స్ చదవడానికి ఒక సమయాన్ని కేటాయించండి . మీకు వీలయ్యే సమయాన్ని, మీరు ఖచ్చితంగా పాటించే కలిగినదాన్ని ఎంచుకోండి. కఠినమైన ప్రణాళిక వేసుకోకండి. ఏ కారణం చేతైనా మానకండి.

2. ప్రతిరోజూ చదవండి : ప్రతి స్టూడెంట్స్ చదవటాన్ని వాయిదా వేస్తూ పరీక్షకు ముందురోజు హడావిడిగా చదవడం చేస్తారు. దానివల్ల మైండ్ చాలా ఒత్తిడికి లోనవుతుంది. చదివింది ఎంత మాత్రం గుర్తు ఉండదు. దీనివల్ల పరీక్షల ముందు ఎన్నో నిద్రలేని రాత్రులు గడపవలసి వస్తుంది. కాబట్టి ప్రతి రోజూ చదవండి. ఇలా చేస్తే మీరు చదివే సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేస్తూ పరీక్ష కి వెళ్లేముందు ఆత్మవిశ్వాసంతో వెళ్తారు.  చదివిన దాన్ని అర్థం చేసుకుని గుర్తుంచుకోవడానికి మీకు సమయం ఉంటుంది.  అంతేకాకుండా ఇది చాలా తేలిక.  రోజూ కొన్ని నిమిషాలు చదవడానికి కేటాయిస్తే పరీక్షకు ముందు గంటలు గంటలు పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన అవసరం ఉండదు.

3. మీ వ్యాపకాలని పక్కన పెట్టండి : సోషల్ మీడియా, మొబైల్స్, వీడియో గేమ్స్, ఇంటర్నెట్ ఇవన్నీ ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని పక్కదోవ పట్టిస్తున్నాయి. అవన్నీ వాడడం బాగుంటుంది, కానీ వాటికి బానిసవడం వల్ల స్టూడెంట్స్ సరిగా చదవలేరు. వాటితో గడపడానికి ఒక సమయాన్ని కేటాయించుకోండి.  చదివే సమయంలో వీటికి పూర్తిగా దూరంగా ఉండండి.  మీరు చదువుతుండగా మీ శ్రద్ధ చదివే విషయం మీద మాత్రమే ఉండాలి. ఫేస్బుక్,  వాట్సాప్ ఇలాంటివి చెక్ చేసుకోకండి.  చదువుతుండగా వీటిని ఓపెన్ చేస్తే మీకు తెలియకుండానే చాలా సమయం వాటిమీద గడిపేస్తారు.  దానివల్ల మీ ఎనర్జీ తగ్గిపోతుంది.  కాబట్టి చదువుతున్నప్పుడు కేవలం చదువు మీద శ్రద్ధ పెట్టండి.  మీరు కేవలం 30 నిమిషాలు చదివినా సరే పూర్తిగా చదువు మీద శ్రద్ధ పెట్టి చదవండి.

4. చిన్న చిన్న విరామాలు తీసుకోండి: మీకు అవసరం అయినప్పుడు విరామాలు తీసుకోండి. మీరు చదువుతుండగా మీ మైండ్ అలసిపోతుంది . కాబట్టి దానికి కాస్త విరామం అవసరం. విరామం లేకుండా చదువుతూనే ఉండడం అంత మంచిది కాదు. మీరు తీసుకునే విరామం వల్ల మీ మైండ్ మళ్ళీ ఫ్రెష్ గా మొదలు పెట్టడానికి సిద్ధపడుతుంది.  అప్పుడు మీరు చదివింది వెంటనే గ్రహించగలుగుతుంది.

5. వ్యాయామం చేయండి లేదా ఆరుబయట ఆటలు ఆడుకోండి : మీరు రోజు వ్యాయామం చేసినా లేదా ఆటలు ఆడినా మీ ఏకాగ్రత పెరుగుతుంది. మీ సృజనాత్మకత మరియు జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.  వీటి మీద గడిపిన సమయం వృధా కాదు.  అది మీ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది.  కాబట్టి ప్రతిరోజు దీనికి సమయం కేటాయించండి.  దీనివలన మీరు ఫిట్ గా ఉండి ఆత్మవిశ్వాసంతో ఉంటారు.

6. సూపర్ బ్రెయిన్ యోగ చేయండి : మీ ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి సృజనాత్మకతను పెంచడానికి ఈ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. రోజూ సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వల్ల మీ బ్రెయిన్ చాలా చురుకుగా తెలివిగా వ్యవహరిస్తుంది.  కాబట్టి రోజూ 7 నుండి 14 నిమిషాలు సూపర్ బ్రెయిన్ యోగ చేయండి.  ఈ చిన్న పని వల్ల మీరు ఎన్నో లాభాలు పొందుతారు.  దీని గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి.

7. ఒత్తిడిని తగ్గించుకోండి : ఈ ఆధునిక జీవితంలో ఒత్తిడి చాలా మామూలు విషయం. మన ఎనర్జీని తగ్గించి మన సామర్థ్యానికి తగ్గట్టు పని చేయలేకపోతున్నాము.  కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొంత సమయం కేటాయించండి.  గట్టిగా ఊపిరి తీసుకోవడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.  కనీసం వారానికి ఒకసారి ప్రకృతిలో గడపండి.  ఇలా మీరు ఒత్తిడిని తగ్గించుకుంటూ ఫ్రెష్ మైండ్ తో ఉంటే  మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు.

8. మీరు చదివే వాటిని ఆసక్తికరంగా ఉండేలా చేసుకోండి : మనం చదివేది విసుగ్గా ఉన్నప్పుడు ఎక్కువసేపు చదవలేము. మానేయడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంటాము.  కాబట్టి చదివేది ఆసక్తికరంగా ఉండేలా చేసుకోండి.  కొన్ని కొత్త పాత్రల ద్వారా లేదా సరదా కథల ద్వారా మీరు చదివేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.  చందమామ కథల పుస్తకం చదువుతున్నట్టు మీ సబ్జెక్ట్స్ చదవండి.  ఆసక్తిగా చదవండి. మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఒత్తిడితో చదవకండి మీరు ఎంజాయ్ చేస్తూ చదివితే మీరు చదివింది గుర్తు ఉంటుంది,  పైగా మీరు ఎక్కువ సేపు చదవగలరు.  దానివల్ల మంచి మార్కులు కూడా వస్తాయి కాబట్టి మీరు చదివేదాన్ని ఎంజాయ్ చేయాలని గుర్తుపెట్టుకోండి.

9. భాగాలుగా విడగొట్టుకోండి : మీ మొత్తం పాఠాన్ని కొన్ని భాగాలుగా విడగొట్టి చదవండి. ఇలా చేయడం వల్ల ఆ పాఠం పూర్తిచేయడం చాలా తేలిక అవుతుంది.  మీరు కేటాయించిన సమయంలో దాని మీద శ్రద్ధ పెట్టి సరిగా అర్థం చేసుకోండి.  దీనివలన మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  ఎక్కువసేపు చదువుతారు.

10. మీరు చదివిన దాన్ని ఒకసారి పరీక్షించి మిమ్మల్ని మీరు అభినందించుకోండి : వారానికి ఒకసారి మీరు చదివిన దాంట్లో ఎంత మీకు గుర్తుంది అని నిజాయితీగా ఒక పరీక్ష పెట్టుకోండి. మీరు నిజంగా చాలా బాగా గుర్తు పెట్టుకున్నారు అనిపిస్తే మీకు మీరే ఒక చిన్న పార్టీ ఇచ్చి సెలబ్రేట్ చేసుకోండి.  మీరు చిన్న చిన్న విషయాల్ని సెలబ్రేట్ చేసుకుంటే మీరు మరింత సాధించడానికి కావాల్సిన ఆత్మ విశ్వాసం వస్తుంది.

మీరు బాగా చదవడానికి పాటించవలసిన కొన్ని నియమాలు ఇవే.  పరీక్షల విషయంలో ఒత్తిడి పడకండి. ఎందుకంటే జీవితం పరీక్షల కన్నా గొప్పది.  మార్కులు, గ్రేడ్ ల కంటే  జీవితంలో ఎన్నో ఉన్నాయి.  మీ తల్లిదండ్రులు, టీచర్స్, స్నేహితులు ఇలా ఎంతోమంది మీ ప్రయాణం లో సహాయపడటానికి ఉన్నారు.  మీ స్నేహితులు మీ కన్నా పై తరగతులకు వెళ్లిపోయారని బాధపడకండి. మన సామర్థ్యానికి తగ్గట్టు బతక పోవడం కొంచెం కష్టం గానే ఉంటుంది.  కాబట్టి నీ అసలైన సామర్ధ్యాన్ని బయటపెట్టి ప్రయాణాన్ని ఆస్వాదించండి. విద్యార్థి దశ అనేది ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి దొరికిన గొప్ప అవకాశం.  కాబట్టి ఆ దశని ఎంజాయ్ చేసి మీ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోండి.

 Have fun..

Registration

Forgotten Password?

Loading