ప్రేమ పూర్వక రిలేషన్ షిప్స్ కలిగి ఉండడానికి 10 సూచనలు

ప్రేమ పూర్వక రిలేషన్ షిప్స్
Share

ప్రేమ అనేది చాలా గొప్ప ఫీలింగ్. చాలా పవర్ ఫుల్ ఎమోషన్. ప్రేమలో ఉన్న వ్యక్తికి తన చుట్టూ ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది. ప్రేమకు ఎన్నో రూపాలు ఉన్నప్పటికీ ప్రేమ అనగానే మన అందరికీ గుర్తొచ్చేది మాత్రం రొమాంటిక్ ప్రేమ. ఎన్నో పాటలు, కథలు, సినిమాలు, ప్రేమ చుట్టూ ఉంటాయి. ప్రేమ అనే పదం వినగానే మనకు రొమాంటిక్ ప్రేమ గుర్తొస్తుంది. కానీ ప్రేమ అంటే అది ఒక్కటే కాదు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ,మనమీద మనకున్న ప్రేమ, ఈ ప్రపంచం మీద మనకున్న ప్రేమ లేదా దేవుడి మీద ఉన్న ప్రేమ ఇలా ప్రేమ చాలా రకాలుగా ఉంటుంది. ప్రేమ ఏ రూపంలో ఉన్నా అది ఇచ్చే వారి జీవితాన్ని,  తీసుకునే వారి జీవితాన్ని చాలా గొప్పగా మారుస్తుంది. ప్రేమించడం, ప్రేమించబడడం జీవితానికి ఒక అర్థం తీసుకొస్తుంది.

ప్రేమ యొక్క లోతు ని అర్థం చేసుకోవడానికి కొన్ని అందమైన కొటేషన్స్ ఇప్పుడు చూద్దాం.

1. ప్రేమ లేని జీవితం పువ్వులు, పళ్ళు లేని చెట్టు లాంటిది. – ఖలీల్ జిబ్రాన్

2. మీరు చేసే ప్రతిదీ ప్రేమతో చేయండి. -ఏసుక్రీస్తు

3. మీ ప్రేమను పొందడానికి అర్హత ఉన్న వ్యక్తి కోసం మీరు ప్రపంచం అంతా వెతకొచ్చు కానీ అలాంటి వ్యక్తి మీకు ఎక్కడా దొరకరు. మీ ప్రేమను పొందడానికి అన్ని అర్హతలూ ఉన్న వ్యక్తి మీరు మాత్రమే. – గౌతమ్ బుద్ధ

4. ప్రేమించలేని వ్యక్తి దేవుణ్ణి తెలుసుకోలేడు ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. – ఏసుక్రీస్తు

5. మనం గాఢంగా ప్రేమించే ప్రతిదీ మనలో భాగం అయిపోతుంది. – హెలెన్ కిల్లర్

6. ప్రేమ ఉన్నచోట జీవితం ఉంటుంది. – మహాత్మా గాంధీ

7. ప్రేమ నుండి మంచివాళ్ళు ఆనందం పొందుతారు. ప్రేమ దేవుళ్ళ యొక్క ఆటవిడుపు. – ప్లేటో

8. మనం ప్రేమ వలనే పుట్టాం. మన అమ్మ ప్రేమ. – రూమీ

9. ప్రేమ, కరుణ అనేవి అవసరాలు. విలాసాల కాదు. అవి లేకుండా మానవజాతి మన లేదు. – దలైలామా

10. ప్రేమ అనేదే అసలైన నిజం. అత్యున్నత భావం. హృదయంలో ఉన్న ఏకైక నిజం ప్రేమ. – రవీంద్రనాథ్ ఠాగూర్.

ఈ కొటేషన్స్ మనకి ప్రేమ యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తాయి. ప్రేమ కేవలం ఆనందాన్ని మాత్రమే ఇచ్చేది కాదు. ఒక మనిషి జీవితాన్ని పాసిటివ్ గా  మార్చగల శక్తి ప్రేమ. ఏదో లాభం పొందాలని ఇతరులను ప్రేమించము. వాళ్ళని ప్రేమించడం మనకి ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ప్రేమిస్తాము. పిల్లల మీద ప్రేమ గాని, భార్య లేదా భర్త మీద ప్రేమ గాని,  దేవుడి మీద లేదా ఈ ప్రపంచం మీద ఉన్న ప్రేమ గాని, దానివల్ల ప్రేమించే వారికి లాభము.

ప్రేమించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవి ఇప్పుడు చూద్దాం.

1. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

2. ఒత్తిడిని తగ్గించి మనకి ఒత్తిడిని ఎదుర్కొనే సామర్ధ్యాన్ని ఇస్తుంది.

3. మన శరీరానికి నయం చేసుకునే శక్తిని పెంచుతుంది.

4. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

5. ఆందోళన తగ్గిస్తుంది.

6. Quality of sleep పెంచుతుంది

7. నిరాశని తగ్గిస్తుంది.

8. రిలేషన్ షిప్స్ ను మెరుగుపరుస్తుంది.

9. ఆనందాన్నిస్తుంది.

10. Quality of life ను పెంచుతుంది.

ప్రేమ వల్ల కలిగే లాభాలు ఇవి. ప్రధానంగా ప్రేమని రెండు రకాల ప్రేమలు గా విభజించవచ్చు.

1. మన తల్లిదండ్రుల మీద, పిల్లల మీద, తోబుట్టువుల మీద, స్నేహితుల మీద ఉండే వ్యక్తిగత ప్రేమ.

2. ప్రకృతి మీద,జంతువుల మీద, పక్షుల మీద, ప్రపంచం మీద, దైవం మీద ఉండే వ్యక్తిగతం కాని ప్రేమ.

మన జీవితంలో ఈ రెండు రకాల ప్రేమలని ఎలా అభివృద్ధి పరుచుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదటి రకం ప్రేమ వ్యక్తిగత ప్రేమ. ఇది అద్భుతమైన ఆనందంతోపాటు కొన్ని సమస్యలను కూడా ఇస్తుంది. బాగా వ్యక్తిగత సంబంధాలు కొన్ని సార్లు మన సహనాన్ని పరీక్షిస్తాయి. కుటుంబ సభ్యులతో, మన స్నేహితులతో, మన రిలేషన్ షిప్స్  బాగుండాలంటే కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం

1. రిలేషన్ షిప్స్ లో తప్పులు జరుగుతాయి. క్షమించండి  మరియు క్షమాపణలు అడగండి.

2. అంచనాలు ఒత్తిడిని కలిగిస్తాయి. అంచనాల వల్ల ఎదుటి వ్యక్తి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎదుటివారి మీద తక్కువ అంచనాలు పెట్టుకోండి.

3. మనలాగే ఎదుటివారిని కూడా అంగీకరించండి. వాళ్లు పర్ఫెక్ట్  కాకపోవచ్చు అయినా సరే. ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్  కాదని గుర్తుంచుకోండి. మీరు ఎదుటివారిని ప్రేరేపించే గలరు తప్ప పూర్తిగా మార్చలేరు. కాబట్టి వారిని మార్చడానికి ప్రయత్నించండి. మీ ప్రవర్తన ద్వారా వారిని ప్రేరేపించండి.

4. మీరు పాసిటివ్ ఆలోచనలను చేయండి. ఇవి ఎదుటివారిని సానుకూలంగా ప్రేరేపిస్తాయి.

5. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల మంచి కోసం ప్రార్థన చేయండి.

6. మీ చుట్టూ ఉన్న వారితో ప్రేమగా మాట్లాడండి.

7. ఎవరైనా ఒక పని సరిగా చేస్తే వారిని మనస్ఫూర్తిగా ప్రేమతో అభినందించండి.

8. మన కుటుంబ సభ్యులు ఏదైనా చిన్న తప్పు చేస్తే మనం వెంటనే విమర్శిస్తాము. కాసేపు ఆలోచించి ఆ విమర్శని ప్రేమగా,వినయంగా తెలపండి.

9. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి.

10. చాలాసార్లు మనల్ని ప్రేమించిన వారిని పట్టించుకోము. వారి మీద మీకున్న గౌరవాన్ని, ప్రేమని, కృతజ్ఞతని ప్రతిరోజు చెప్పండి.

మన కుటుంబ సభ్యులతో,స్నేహితులతో, మన రిలేషన్ షిప్ ని మెరుగు పరుచుకోవడానికి కొన్ని సూచనలు ఇవి. మనలో చాలామంది జీవితాలు ఎక్కువగా వ్యక్తిగత ప్రేమతో ముడిపడివుంటాయి. మనకి దగ్గరైన వారిని ఎక్కువగా ప్రేమిస్తాం.  వారి కోసం వారి ఆనందం కోసం ఎంతైనా చేస్తాము. వ్యక్తిగత ప్రేమ చాలా అందమైనది కానీ నీ ఇది ప్రేమలో ఒకరకం మాత్రమే. దీనికి కొన్ని పరిమితులున్నాయి.

ప్రేమించడానికి ఇంకా ఎన్నో ఉన్నాయి. మన చుట్టూ ఉన్న వారిని, ఈ ప్రపంచాన్ని,  దైవాన్ని ప్రేమించినప్పుడు దీన్ని మనం అనుభూతి చెందగలం. మన వ్యక్తిగత సంబంధాలను మించి మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించగలినప్పుడు జీవితంలోని అసలైన మాధుర్యాన్ని మనం చూడగలం. మన జీవితం యొక్క ఉద్దేశం అదే. ఈ విశ్వాన్ని ప్రేమించాలి. ప్రతి జంతువుని ప్రేమించాలి. ప్రతి పక్షిని, ప్రతి చెట్టుని, మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమించాలి.

ఇలాంటి ప్రేమని అలవాటు చేసుకోవడం ఎలా ? కొన్ని సూచనలు ఈ కింద ఇవ్వబడ్డాయి

1. ప్రపంచం యొక్క మంచి కోసం ప్రార్థించండి.

2. ఈ భూమిని ఒక చిన్న బంతిలాగా ఊహించుకోండి. మీ రెండు చేతులు పైకెత్తి ఆశీర్వదిస్తున్నట్టు పెట్టి ఈ భూమికి ప్రేమని, ప్రశాంతతని పంపించండి. ప్రతి దేశానికి,ప్రతి మనిషికి, ప్రతి పక్షికి, ప్రతి జంతువు కి మీ ప్రేమను పంపించండి.

3. మీ చుట్టూ ఉన్న జంతువులతో మొక్కలతో ప్రేమగా మాట్లాడండి.

4. మీకు పరిచయం లేని వారితో కూడా ప్రేమగా కరుణతో మాట్లాడండి.

5. అవసరం అయినప్పుడు మీకు తెలియని వాళ్లకు కూడా డబ్బుని దానం చేయండి.

6. మీరు ఏది చేయగలిగితే అది, ఎంత చేయగలిగితే అంత ఇతరులకి సాయం చేయండి.

7. దైవంతో అనుసంధానమై ఉండండి. ప్రార్థన చేయండి.

8. దైవం మీద మనసు లగ్నం చేసి ధ్యానం చేయండి.

మీ వ్యక్తిగతం కానీ ప్రేమను పెంచుకోవడానికి కొన్ని సూచనలు ఇవి. వ్యక్తిగత ప్రేమ, వ్యక్తిగతం కానీ ప్రేమ సమతూకంగా ఉన్నప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ రెండు రకాల ప్రేమలూ  చాలా ముఖ్యం. ప్రతి రోజూ ఒక పండగలా ఉంటుంది. ప్రేమించడం ప్రేమించబడడమే మనిషి జీవితం యొక్క ఉద్దేశం. మనలో ప్రతి ఒక్కరూ ఇలా ఉంటే ఈ భూమి స్వర్గం గా మారుతుంది. మీరు మీ జీవితాన్ని ప్రేమతో గడిపినప్పుడు మీకు జీవితం కొత్తగా కనబడుతుంది ప్రతిరోజూ ఒక అద్భుతం గా ఉంటుంది. మీ జీవితం మ్యాజికల్ గా మారుతుంది.

మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రేమను పంచండి. మిమ్మల్ని కలిసిన వ్యక్తి ఆనందంగా వెళ్లేలా చేయండి. – మదర్ తెరిసా.

Registration

Forgotten Password?

Loading