మనం స్నానం చెయ్యకుండా ఒకరోజుని ఊహించలేము. స్నానం రోజువారీ దినచర్యలో భాగం. మనం రోజుకు కొన్ని నిమిషాలు స్నానం చేస్తాం. స్నానం చేయడం అనేది వ్యక్తిగత పరిశుభ్రత కోసమే. కానీ కేవలం వ్యక్తిగత శుభ్రతకు మించి ఇంకా స్నానానికి ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది.
చాలా పూజలు ఆచారాలు స్నానం తో మొదలవుతాయి. ఎందుకంటే సరిగా స్నానం చేస్తే అది ఒక వ్యక్తిని మానసికంగా, ఎమోషనల్ గా కూడా శుభ్రం చేస్తుంది. స్నానం చేయడానికి, అన్ని పవిత్ర ప్రార్థనా స్థలాలలో పురాతన కాలం నుండి చెరువులు లేదా బావులు ఏర్పాటు చేయబడ్డాయి మరియు వాటిని మంత్రాల ద్వారా పవిత్రం చేస్తారు. భారతీయ సంప్రదాయంలో, ఒక వ్యక్తి తినడం లేదా వంట చేయడం లాంటి ముఖ్యమైన పనులు స్నానం చేయకుండా చేయకూడదు. నిద్రలో మన శరీరం కొన్ని మరమత్తులు చేసుకుని నూతన ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. ఈ సమయంలో ఎన్నో రకాల విష పదార్థాలను విడుదల చేస్తుంది. మనం లేవగానే స్నానం చెయ్యడం ఈ విషపదార్థాలన్నీ పోయి మన శరీరం, మనసు ఆరోజు కోసం సిద్దంగా ఉంటుంది.
భారతదేశం మరియు గ్రీస్ యొక్క పురాతన సంస్కృతులలో, స్నానం చేయడం పవిత్రమైన పనిగా పరిగణించబడుతుంది. స్నానం చెయ్యడాన్ని ధ్యానం భావించే ఆయుర్వేదం స్నానం చెయ్యడానికి అనేక మార్గదర్శకాలను ఇచ్చింది. స్నానం ద్వారా వ్యాధులను నయం చేసే బాల్నియోథెరపీ అనే పూర్తి వైద్య శాఖ ఉంది. స్నానం యొక్క ప్రాముఖ్యత అలాంటిది.
ప్రతిరోజూ ఇంట్లో చేసే సాధారణ స్నానం శరీరంపై సబ్బును రాయడం మరియు నీటితో కడగడం ద్వారా జరుగుతుంది. ఈ సాధారణ స్నానానికి మరికొన్ని దశలను చేర్చడంతో, స్నానం చేయడం వల్ల మన శరీరం, మనస్సు మరియు ఆత్మను నయం చేయవచ్చు. మరియు ఇది గొప్ప అనుభవంగా మారుతుంది.
స్నానాన్ని ఒక వైద్యంలా మరింత మెరుగుపరచడానికి కొన్ని సూచనలు క్రింద ఉన్నాయి.
1. హడావిడిగా స్నానం చేయవద్దు. కాస్త సమయం తీసుకుని స్నానాన్ని ఆస్వాదించండి.
2. స్నానాన్ని చేసేటప్పుడు మీ పూర్తి ధ్యాస అక్కడే పెడితే అది ఒక ధ్యానంలా మారుతుంది. మీ ఆలోచనలను అదుపు చేస్తుంది.
3. ఉదయం స్నానం చేయడానికి చల్లటి నీటిని వాడండి. చల్లటి నీటితో స్నానాన్ని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు క్రింద ఉన్నాయి
1. ఒత్తిడి తగ్గిస్తుంది
2. దృఢ సంకల్పం పెరుగుతుంది
3. రోజంతా చురుకుగా ఉండటానికి మీకు సహాయపడుతుంది.
4. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది
5. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
6. శరీరం మరియు మనస్సును ఉత్సాహంతో నింపుతుంది
7. చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
8. జీర్ణ శక్తిని పెంచుతుంది
గమనిక: తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా జ్వరాలు ఉన్నప్పుడు చన్నీళ్లతో స్నానం చెయ్యకూడదు.
4. మొదట్లో చన్నీళ్లతో స్నానం చెయ్యడం చాలా కష్టంగా అనిపిస్తుంది. దానిని ఎలా అధిగమించాలి. చన్నీళ్లతో స్నానాన్ని చెయ్యడానికి కొన్ని సూచనలు.
1. మొదట నీటిని బొడ్డు దగ్గర పోసుకుని అలా కాళ్ళని తడవనివ్వండి
2. తర్వాత వీపు మీద నీరు పోసుకుని అలా కిందకి కాళ్ళని తడవనివ్వండి
3. ఆ తర్వాత తల మీద పోసుకోండి
దీని తరువాత స్నానం చెయ్యండి. పై 3 దశలను చేయడం వల్ల శరీరం క్రమంగా ఉష్ణోగ్రతకు అలవాటు పడటానికి సహాయపడుతుంది.
5. సాయంత్రం స్నానానికి వేడి నీళ్ళు వాడండి. వేడి నీళ్ళతో స్నానం చెయ్యడం వల్ల ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం
1. రోజంతటి ఒత్తిడి తగ్గిస్తుంది
2. శరీరం మరియు మైండ్ ని రిలాక్స్ చేస్తుంది
3. చర్మం మీద ఉన్న విష పదార్థాలను తీసేస్తుంది
4. మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది
5. మంచిగా నిద్ర పట్టేలా చేస్తుంది
6. త్వరగా నిద్ర పట్టడానికి సహాయపడుతుంది.
6. స్నానం చేసే ముందు ఆయిల్ మసాజ్ చేయాలని ఆయుర్వేదం సిఫారసు చేస్తుంది. ఆయిల్ మసాజ్‌ను అభ్యంగన అంటారు. మీరు మీ శరీరాన్ని నువ్వుల నూనె లేదా ఆవాలు నూనెతో మసాజ్ చేయవచ్చు. Refined oils కాకుండా cold pressed oils మాత్రమే వాడండి.. మీ శరీరానికి మసాజ్ చేయడానికి కొద్దిగా వెచ్చని నూనెను వాడండి. 15 నిముషాలు మసాజ్ చేసిన తర్వాత స్నానం చెయ్యవచ్చు.
కుదిరితే ప్రతీరో కూడరాకపోతే కనీసం వారానికి ఒకసారి ఇలా చెయ్యండి. కాస్త సమయం తక్కువ ఉంటే మీ నుదురును, తలమీద, కాళ్ళకి చేతులకి నూనె రాసి ఐదు నిముషాలు ఆగి స్నానం చెయ్యండి. అభ్యంగనం వల్ల ఉపయోగాల ఇప్పుడు చూద్దాం.
1. రక్త ప్రసరణ పెంచుతుంది
2. శరీరం నుండి విషాన్ని మరియు మలినాలను తొలగించడం
3. నరాలను శాంతింపజేయడం
4. చర్మాన్ని మృదువుగా, సున్నితంగా చేస్తుంది
5. రోజు మొత్తం శక్తి ఉంటుంది
6. Quality of sleep పెరుగుతుంది
ఆయుర్వేద గ్రంథాలు అభ్యంగనం యొక్క ప్రయోజనాలను ఇలా సంక్షిప్తీకరిస్తాయి – “రోజూ నూనెతో మీ శరీరాన్ని మర్థన చెయ్యండి. ఇది దోషాలను శాంతింపజేస్తుంది; అలసట నుండి ఉపశమనం ఇస్తుంది, దృఢత్వం, ఆనందం మరియు పరిపూర్ణ నిద్రను అందిస్తుంది; చర్మం యొక్క రంగు మరియు మెరుపును పెంచుతుంది, దీర్ఘాయువును ఇస్తుంది.
7. ఇప్పుడు మనకి మార్కెట్ లో దొరుకుతున్న సబ్బులు parabens, fragrances, SLS, SLES, triclosan లాంటి రసాయనాలను కలిగి ఉంటాయి. ఇలాంటివి వాడడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఎలాంటి రసాయనాలు లేని సబ్బులు వాడండి. ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయని సబ్బులు ఇక్కడ దొరుకుతాయి..
8. సబ్బుకి బదులుగా బాతింగ్ పౌడర్ వాడండి. దీనినే సున్నిపిండి అని పిలుస్తారు. దీనిని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. లేదా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది
ఉప్పునీటి స్నానం చెయ్యండి. ఉప్పునీటి స్నానం మీ ఒత్తిడిని మీ చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీలను తీసేస్తుంది. ఇది మీరు రోజూ చేయదగిన అభ్యాసం. ఇది శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా మనల్ని బలంగా చేస్తుంది. శరీరాన్ని సబ్బుతో కడిగిన తర్వాత మెత్తని ఉప్పుతో శరీరాన్ని మెల్లగా రుద్దండి. ఒక రెండు మూడు నిముషాలు ఆగి నీటితో కడగండి.
ఉప్పునీటి స్నానం తో మరింత మేలు పొందడానికి ఉప్పుతో పాటు అరోమాఆయిల్స్ కూడా వాడవచ్చు. ఇవి మిమ్మల్ని నూతన ఉత్సాహంతో, తాజాగా ఉండేలా చేస్తాయి. ఆ bathing salts ఇక్కడ దొరుకుతాయి. ఉప్పు నీటి స్నానం వల్ల ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం.
1. ఒత్తిడి తగ్గిస్తుంది
2. శరీరం యొక్క తనని తాను నయం చేసుకునే శక్తి పెంచుతుంది
3. మెరుగైన రోగనిరోధక శక్తి
4. మానసిక స్పష్టత
5. భావోద్వేగాల పై అదుపు
6. చక్రాల శుద్దీకరణ. అనేక యోగ గ్రంథాలలో చక్రాలు ప్రస్తావించబడ్డాయి మరియు ఒక వ్యక్తిలో 7 చక్రాలు ఉన్నాయని చెబుతారు. ఈ చక్రాలు ఒక వ్యక్తి యొక్క శ్రేయస్సులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
9. స్నానం చేసేటప్పుడు ఒక మంత్రాన్ని జపించండి. మీరు స్నానం చేయడానికి ముందు, మీకు నచ్చిన ఏ మంత్రాన్ని ఉపయోగించి మీ స్నానపు నీటిని దైవిక శక్తితో పవిత్రం చేయవచ్చు. మీ రెండు చేతులను నీటి వద్ద పెట్టి మరియు మీకు ఇష్టమైన మంత్రం లేదా ఓం నమ శివయ లేదా హర్ హర్ గంగే లేదా ఆమేన్ లేదా ఓం వంటి మంత్రాన్ని జపించండి. హిందూ మతంలో, స్నానపు నీటిని పవిత్రం చేయడానికి ఒక నిర్దిష్ట మంత్రం పఠనం జరుగుతుంది. ఇది క్రింద ఉంది
“గంగే చా యమునే చైవా గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిమ్ కురు ”
ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే – “ నదులు గంగా, యమునా, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు మరియు కావేరి, దయచేసి నేను స్నానం చేస్తున్న నీటిని మీ ఉనికితో సుసంపన్నం చేయండి”
10. స్నానం చేసేటప్పుడు మీ శరీరమంతా కృతజ్ఞత పాటించవచ్చు. మీ ఆరోగ్యానికి దేవునికి లేదా విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేయండి.
మీ స్నానం పవిత్రమైన మరియు గొప్ప అనుభవంగా మార్చడానికి ఇవి కొన్ని గమనికలు. స్నానం చేసే ఈ సాధారణ దినచర్య, సరిగ్గా చేసినప్పుడు, మీకు చాలా ప్రయోజనాలను తెస్తుంది మరియు అన్ని స్థాయిలలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.