కరోనా వైరస్ ఈ ప్రపంచాన్ని సమూలంగా మార్చేసింది. కరోనా కి ముందు వర్క్ ఫ్రొం హోమ్ అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మరి అందరికీ అవసరం అయిపోయింది.ఇంటి నుండి పని చేయడంలో కొన్ని ఉపయోగాలు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ లేకపోవడం, ప్రయాణ ఖర్చులు లేకపోవడం, పని-వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యంగా ఉంచడం ఇలాంటి లాభాలు ఉన్నాయి. చాలామంది ఆఫీస్ కి వెళ్ళే దారిలో ట్రాఫిక్ జామ్ లోనే ఎక్కువ గడుపుతుంటారు. అలాంటివారికి ఇంటి నుండి పని చేయడం నిజంగా ఒక వరం. కాకపోతే కమ్యూనికేషన్ గ్యాప్, ఇంటి వాతావరణం వల్ల పనిలో ఇబ్బంది, పనికి- వ్యక్తిగత జీవితానికి మధ్య తేడా లేకపోవడం వల్ల మానసిక సమస్యలు లాంటి కష్టాలు ఉన్నాయి.
ఆఫీసు పని చేయడం మీదే మనం ఎక్కువ సమయం గడుపుతాం. కాబట్టి ఇంటి నుండి పని చేసేటప్పుడు శ్రద్ధ పెట్టే విధంగా ఉండాలి. కాబట్టి ఇంటి నుండి పని చేయడాన్ని సమర్థవంతంగా చేసి మీ లక్ష్యాన్ని సాధించడం ఎలా ? మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ ఇంటి నుండి పని చేయడం ఎలా. ?
10 సూచనలు ఇప్పుడు చూద్దాం.
1. ఆఫీసు పని చేయడానికి ఒక ప్రత్యేకమైన స్థలం పెట్టుకోండి : బెడ్ రూమ్ లో గాని, హాల్లో గాని మీరు పని చేస్తూ ఉంటే అంత సమర్థవంతంగా పని చేయలేరు. ఎందుకంటే పనికి వ్యక్తిగత జీవితానికి ఒక ఒక గీత ఉండాలి. కాబట్టి మీరు సమర్థవంతంగా పని చేయడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకోండి. ఒక ప్రత్యేకమైన గది అయినా పర్లేదు. ఆ ప్రదేశాన్ని కేవలం మీరు పని చేసుకోవడానికి మాత్రమే వాడండి. ఇలా అలవాటు చేసుకుంటే మీరు పనిచేసే సామర్థ్యం చాలా పెరుగుతుంది. ఇలా ఒక ప్రత్యేక స్థలాన్ని పెట్టుకోవడం వల్ల మీ పనికి వ్యక్తిగత జీవితానికి తేడా ఉంటుంది. ఆ ప్రదేశానికి వెళ్లగానే మీరు సహజంగానే పనిచేసే మూడ్ లోకి వెళ్ళిపోతారు. దీనివల్ల మీ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి పని చేయడానికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోండి.
2. ఒక సమయం పెట్టుకోండి : ఇంటి దగ్గర నుంచి పనిచేస్తున్న సమయంలో సమయపాలన లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివలన దీర్ఘకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది . కాబట్టి రోజు మొత్తానికి ఒక షెడ్యూల్ పెట్టుకోండి. మీరు ఎప్పుడు పని మొదలు పెడుతున్నారు, ఎప్పుడు ఆపేస్తున్నారు అనేదానికి ఒక షెడ్యూల్ పెట్టుకోండి. దీని వలన మీరు ఆఫీసులో ఉన్నట్టే ఉంటుంది. మీరు పూర్తి చేయవలసిన పనులు సకాలంలో పూర్తి చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. షెడ్యూల్ లేకపోవడం వల్ల పనులు జరగక ఒత్తిడి పెరుగుతుంది.
3. సోషల్ మీడియాలో ఎంత సమయం గడుపుతున్నారో చెక్ చేసుకోండి : సోషల్ మీడియాలో తెలియకుండా మన సమయాన్ని వృధా చెయ్యడం, మనం పని చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇంటి నుండి పని చేయడం వల్ల సోషల్ మీడియాలో ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది. ఆస్తమాను సోషల్ మీడియా చూడడం వల్ల మీ శక్తి అంతా వృధా అవుతుంది. అది మీ పని చేసే సామర్థ్యం మీద నెగిటివ్ గా ప్రభావం చూపుతుంది. కాబట్టి సోషల్ మీడియా వాడడానికి ఒక ప్రత్యేకమైన సమయం పెట్టుకోండి.
4. మీరు పనిచేసే టేబుల్ మరియు కుర్చీ సరైనది ఎంచుకోండి : మనకి అనువుగా లేని కుర్చి లేదా టేబుల్ మీద పనిచేయడం వల్ల నొప్పి వచ్చి దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సరైన కుర్చీ మరియు టేబుల్ ఉండేలా చూసుకోండి. అందువల్ల మీకు సౌకర్యంగా ఉండి మరింత బాగా పని చేయగలుగుతారు. మంచి కుర్చీ మరియు టేబుల్స్ మీరు ఇక్కడ కొనవచ్చు.
5. రోజులో పూర్తి చేయవలసిన లక్ష్యాలు పెట్టుకోండి : ఉదయం మీరు పనిచేయడం మొదలు పెట్టడానికి ముందు ఆ రోజు మీరు ఏమి సాధించాలి అనుకుంటున్నారో ఒక పేపర్ మీద రాసి ఇవ్వండి. దీనివలన మీరు చేసే పని మీద మరింత ఏకాగ్రత పెట్టగలరు. ఇది మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసేలా చేస్తుంది.
6. కాసేపు సన్ లైట్ లో గడపండి : పనిచేస్తున్నప్పుడు మధ్య మధ్యలో విరామం తీసుకుని కాస్త సన్ లైట్ లో గడిపి ఫ్రెష్ గాలిని పీల్చుకోండి. రోజంతా లోపలే ఉండి పని చేయడం వల్ల నిద్రమత్తు, నీరసం వచ్చే అవకాశం ఉంది. మీ కిటికీలు తెరిచి బయట గాలిని, సన్ లైట్ ని లోపలికి వచ్చేలా చేయండి. ప్రకృతిలో కాసేపు నడవండి. సన్ షైన్ బ్రేక్ తీసుకోండి. ఇది మీ మైండ్ ని రీఛార్జ్ చేసి మరింత ఉత్సాహంగా పనిచేసేలా చేస్తుంది.
7. స్పష్టమైన అంచనాలు పెట్టుకోండి : మీ ఫ్యామిలీ పనులు చేయడానికి ఒక ప్రత్యేకమైన సమయం పెట్టుకోండి. మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారో మీ కుటుంబ సభ్యులకు చెప్పండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పనులు చేయడానికి చాలా అనువుగా ఉంటుంది. మనం ఇంటి నుండి పని చేస్తున్నప్పుడు ఇలా చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల మీరు పనిచేసే సమయంలో కేవలం పని మీద మాత్రమే దృష్టి సాధించగలరు.
8. వీడియో చాట్ చేస్తూ ఉండండి : ఇంటి నుండి పని చేస్తున్న సమయంలో ప్రపంచంతో బంధం తెగిపోయినట్టు అనిపించడం సహజం. కాబట్టి మీ టీం తో వీలు చూసుకుని వీడియో చాట్ చేయండి.
9. ఆఫీస్ కి వెళ్తున్నట్టు రెడీ అవ్వండి : మీరు ఆఫీసుకు వెళుతున్నప్పుడు ఏవిధంగా వెళ్తారో అదే విధంగా రెడీ అవ్వండి. దీనివలన మీకు పని చేసే ఉత్సాహం మరింత పెరుగుతుంది. మీరు ఆఫీసులో ఉన్నట్టే అనిపించి మీరు మరింత బాగా పని చేయగలరు.
10. మీ గురించి మరింత శ్రద్ధ వహించండి : ఆఫీస్ కి వెళ్లి పని చేసే సమయంలో ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ సరదాగా ఉంటుంది. స్నేహితులతో మాట్లాడుతూ ఉండడం వల్ల మీకు పని ఒత్తిడి తెలియదు. కానీ ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఇది మిస్ అయ్యి మీ మీద ఎక్కువ ఒత్తిడి పడే అవకాశం ఉంది. కాబట్టి మీ మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. అంతేకాకుండా ఇంట్లో ఉండటం వల్ల ఎక్కువగా తినే అవకాశం ఉంది. ఒబిసిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ గురించి మరింత శ్రద్ధ వహించండి. ప్రతిరోజు నేచర్ లో కాసేపు గడపండి. జిమ్ చేయడం, వాకింగ్ కి, స్విమ్మింగ్ కి వెళ్లడం లాంటివి చేయండి. యోగా, మెడిటేషన్ చేయండి. దీనివలన మీరు మానసికంగా దృఢంగా ఉంటారు.
ఇంటి నుండి పని చేసే సమయంలో మీరు మరింత సమర్థవంతంగా పని చేయడానికి ఉపయోగపడే సూచనలు ఇవి. మీరు ఇంటి నుండి పని చేసినా లేదా ఆఫీసులో పని చేసినా మీరు చేస్తున్న పనిని మాత్రం ఎంజాయ్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి. మన ఎక్కువ శాతం మన సమయాన్ని పనిచేయడానికి వచ్చేస్తాం కాబట్టి మనం చేసే పని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి. కాబట్టి మీరు చేసే పని ఎంజాయ్ చేస్తూ ఆనందంగా పనిచేయండి.
Work is love made visible – kahlil Gibran