మీ లక్ష్యాలు సాధించడానికి 10 మార్గాలు

లక్ష్యాలు
Share

విజయం సాధించాలంటే ముందు మీ లక్ష్యాలు ఏంటో తెలుసుకోవాలి. అవి ఎందుకు సాధించాలి అనుకుంటున్నారు అనేది తర్వాతి ప్రశ్న. ఈ రెండు స్టెప్స్ మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అనే దాన్లో స్పష్టత వస్తుంది. ఈ రెండు స్టెప్స్ సరిపోతాయా?? కాదు. మీరు అనుకున్నది సాధించడానికి ఇవి మాత్రమే సరిపోవు. ఎంత గొప్ప కలలైనా వాటిని సాధించడానికి మనం కష్టపడకపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు. అనుకున్నది సాధించడానికి తర్వాత కావాల్సింది ప్రణాళిక. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీ ప్రణాళిక ఏంటి? మీ ప్రణాళిక ఏంటి? సరైన ప్రణాళిక ఉండడం చాలా ముఖ్యమైన విషయం. మీ లక్ష్యం మర్చిపోకుండా ఉండి కష్టపడ్డానికి ఈ ప్రణాళిక ఉపయోగపడుతుంది.

ఉదాహరణకు, ఒక సంవత్సరంలో 10 కేజీలు తగ్గాలన్నది మీ లక్ష్యం అయితే, మీరు అందంగా కనపడాలన్నది, ఆరోగ్యంగా ఉండాలన్నది మీ కారణం అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు మీరు నిజంగా సాధిస్తారా లేదా అనేది మీరు ఈ ఒక సంవత్సరం లో చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. లక్ష్యం ఉండి సరైన ప్రణాళిక లేకుండా ఏదిబడితే చేసుకుంటూ పోతే పదేళ్ల తర్వాత కూడా అది సాధించలేరు. గొప్ప ప్రణాళిక ఉండడమే మనం అనుకున్నది సాధించే రహస్యం.

లక్ష్యాలు సాధించడానికి, గొప్ప ప్రణాళిక అంటే అర్థం ఏంటి??

మీరు అనుకున్నది సాధించడానికి ఏం చెయ్యాలి అనేది ఒకదాని తర్వాత ఒకటి రాసుకోవడమే గొప్ప ప్రణాళిక. మీకు మీరే తయారు చేసుకున్న యాక్షన్ ప్లాన్ . మీరు గొప్ప ప్రణాళిక తయారు చేసుకోవడానికి కొన్ని సూచనలు.

1. మీరు సంవత్సరానికి పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడానికి దాన్ని మూడు నెలల లక్ష్యం గా విడగొట్టండి. మీ లక్ష్యం సంవత్సరo లో పది కేజీలు తగ్గడం అయితే మీరు మూడు నెలల్లో 2.5 కేజీలు తగ్గాలి.

2. అలా 2.5 kgs  తగ్గడానికి మీరు ఏం చెయ్యాలో అన్ని లిస్ట్ రాసుకోండి.

3. మీ ప్లాన్ పక్కాగా ఉండాల్సిన అవసరం లేదు. జరుగుతున్న కొన్ని అది పక్కా ప్రణాళిక లా మారుతుంది. మీకు తెలిసిన దానితో మొదలు పెట్టండి.

4. ఒకసారి మీ ప్రణాళికను సిద్ధం చేసుకున్న తర్వాత వాటిని మూడు నుండి ఐదు కేటగిరీలుగా విడగొట్టండి. ఉదాహరణకు మీ లక్ష్యం మీ లక్ష్యం బరువు తగ్గడం అయితే మీ ప్రణాళిక ఈ కింది విధంగా ఉంటుంది.

1. జంక్ ఫుడ్ కి బదులు ఇంట్లో వాటిని తినండి.

2. తినే సమయాన్ని ముందే ప్లాన్ చేసుకోండి ఆకలి ఎక్కువ ఉన్నప్పుడు తింటే ఎక్కువ తినే
అవకాశం ఉంటుంది.

3. ఒకరోజు లో దాదాపు 30% పళ్ళు, కాయగూరలు లాంటి సలాడ్స్ తీసుకోండి

4. వారానికి మూడు సార్లు యోగా చెయ్యండి

5. వారానికి మూడుసార్లు ఒక గంటసేపు వేగంగా నడవండి

6. ప్రతీరోజు కనీసం 8 గంటలు నిద్రపోండి.

7. ఆరోగ్యకరమైన డైట్ ని ప్లాన్ చేసుకోండి.

8. పంచదార తీసుకోవడం 50% తగ్గించండి.

9. బయట తినడం 50% తగ్గించండి

10. రోజుకి 8 గ్లాసుల నీళ్ళు తాగండి

ఈ యాక్షన్ స్టెప్స్ ను మూడు విభాగాలుగా విడగొట్టొచ్చు

1. ఆహారం:

1. జంక్ ఫుడ్ కి బదులు ఇంట్లో వాటిని తినండి

2. తినే సమయాన్ని ముందే ప్లాన్ చేసుకోండి.  ఆకలి ఎక్కువ ఉన్నప్పుడు తింటే
ఎక్కువ తినే అవకాశం ఉంటుంది.

3. ఒకరోజు లో దాదాపు 30% పళ్ళు, కాయగూరలు లాంటి సలాడ్స్ తీసుకోండి.

4. ఆరోగ్యకరమైన డైట్ ని ప్లాన్ చేసుకోండి.

5. పంచదార తీసుకోవడం 50% తగ్గించండి.

ప్రోసెస్ చేసిన మరియు పాకెట్స్ లో ఆహారం 50% తగ్గించండి

2. వ్యాయామం:

1. వారానికి మూడుసార్లు యోగా చెయ్యండి

2. వారానికి మూడుసార్లు గంట సేపు వేగంగా నడవండి

3. Lifestyle:

1. బయట తినడం 50% తగ్గించండి

 2. రోజుకి 8 గంటలు నిద్రపోండి

మూడు నెలలకి ప్లాన్ సిద్ధం చేసుకున్న తర్వాత, వారానికి ప్లాన్ సిద్దం చేసుకోండి. ఆ వారం ప్లాన్ కి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోండి.

1. ఈ వారం మీరు చెయ్యాలనుకున్న పనికి ఎంత సమయం పడుతుందో ఒక అంచనా వేసుకోండి.

2. ఎంత సమయం పడుతుందో అంచనా వేశాక రోజులో ఏ సమయంలో మీకు వీలవుతుందో ఆ సమయాన్ని నిర్ణయించండి.

3. ఉదాహరణకి యోగాకి ఒక గంట సమయం పడుతుంది అనుకుంటే మీకు కుదిరే సమయంలో ప్లాన్ చేసుకోండి. అప్పుడే మీరు మీ యాక్షన్ స్టెప్స్ ని పాటించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అనుకున్నది సాధించడానికి ఇది చాలా ముఖ్యం.

4. మీరు చెయ్యాలనుకున్న యాక్షన్ స్టెప్స్ కి సమయం నిర్ణయించిన తర్వాత ప్రతీరోజు ఆ సమయానికి తప్పకుండా చెయ్యండి.

5. మీరు పాటించాల్సిన యాక్షన్ స్టెప్స్ రాసుకున్న తర్వాత మీరు విజయం సాధించడానికి మీరు ఖచ్చితంగా చెయ్యాల్సినవి ప్రాధాన్యంగా రాసుకోండి. జీవితంలో 80% ఫలితాలు మనం చేసే 20% పనుల వల్ల వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా చెయ్యాల్సిన పనులకి ఎంత సమయం పడుతుందో రాసుకోండి.

6. మీరు బిజీగా ఉన్న రోజుల్లో మీరు అనుకున్న పనికి పూర్తి సమయం ఇవ్వలేకపోతే తప్పకుండా చెయ్యాల్సిన పనికి సమయం ఉండేలా చూసుకోండి. మీరు చాలా పనులున్న రోజుల్లో కూడా ఒక సమయాన్ని కేటాయించండి అప్పుడే మీరు అనుకున్నది సాధించగలరు.

మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి విధానం ఇది. మీరు అంతిమంగా పొందే ఫలితాలు మీ ప్రణాళిక మీద ఆధారపడి ఉంటాయి. ఈ ప్రణాళిక మీరు చెయ్యాలనుకున్న యాక్షన్ ప్లాన్ పాటించేలా చేస్తుంది. మన చాలామంది ఒక లక్ష్యం పెట్టుకున్న తర్వాత ఎలాటి ప్లానింగ్ లేకుండా ఏదొకటి అలా చేసుకుంటూ వెళ్లిపోతారు. అందుకే వాళ్ళ లక్ష్యం ఎక్కువ రోజులు నిలబడదు. కొన్ని రోజుల తర్వాత వదిలేసి అది సాధించడానికి సరిపడా సామర్థ్యం మనకి లేదు అనుకుంటూ ఉంటాం.  కానీ సామర్థ్యం కన్నా సరైన ప్రణాళిక ఉండడం చాలా ముఖ్యం. మీ షెడ్యూల్  కి సరిపడాప్రణాళిక, మీ లక్ష్యం తో మీరు అనుసంధానమై ఉండేలా చేసే ప్రణాళిక . మీ లక్ష్యాలు సాధించడానికి సహాయపడే ప్రణాళిక ఇదే.

సరైన ప్రణాళికఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. గొప్పగా ఆలోచించండి, గొప్పవి సాధించండి. ఆకాశమే మీ హద్దు.

Registration

Forgotten Password?

Loading