ఉద్యోగం పోవడం అనే పరిస్థితిని ఎదుర్కోవడానికి 10 మార్గాలు

ఉద్యోగం పోవడం
Share

మనం ఉద్యోగ భద్రత లేని రోజుల్లో జీవిస్తున్నాం. ఎప్పుడు మన ఉద్యోగం పోతుందో మనకు తెలియదు. ఆర్థిక మాంద్యం వల్ల లేదా కంపెనీ యొక్క ఖర్చులను తగ్గించుకోవడం కోసం లేదా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఉద్యోగం పోయే అవకాశం ఉంది. ఏ కారణం చేతనైనా ఉద్యోగం పోవచ్చు. మీ ఇష్టాన్ని, మీ ఎమోషన్స్ ని, మీ కష్టాన్ని ఉద్యోగంలో పెట్టుబడిగా పడతారు. కొంతమందికి ఉద్యోగమే జీవితానికి ఒక అర్థం ఇస్తుంది. ఉద్యోగం పోవడం అనేది జీవితంలో అత్యంత పెద్ద కష్టం.

ఉద్యోగం పోవడం అనేది ఒక షాక్ లా ఉంటుంది. అంగీకరించడానికి సమయం పడుతుంది. వచ్చేనెల వాయిదా ఎలా కట్టాలి.  పిల్లల స్కూల్ ఫీజు ఎలా కట్టాలి, ఇలాంటివి గుర్తొస్తాయి. భవిష్యత్తు గురించి ఒక అనిశ్చితి ఏర్పడుతుంది. ఉద్యోగం పోవడం అనేది కేవలం ఆర్థిక సంబంధమైనది కాదు.  అది ఒక వ్యక్తి యొక్క ఆత్మ విశ్వాసాన్ని చాలా దెబ్బతీస్తుంది. దాని వల్ల మానసిక ఆరోగ్యం మీద చాలా ప్రభావం ఉంటుంది.

కాబట్టి ఉద్యోగం పోయినపుడు ఆ మానసిక స్థితి నుండి బయట పడటం ఎలా ? ఇప్పుడు కొన్ని సూచనలు చూద్దాం.

1. వ్యక్తిగతంగా తీసుకోకండి : ఉద్యోగం పోవడం అనేది వ్యక్తిగత విషయమే. కానీ వ్యక్తిగతంగా తీసుకోకండి. మీరు సమర్ధుడు కాదు కాబట్టే మీ కంపెనీ నీ మిమ్మల్ని తీసేసింది అని నిందించుకోకండి. వాళ్లకు చాలా కారణాలు ఉండవచ్చు. ఒకవేళ కంపెనీ ఖర్చులు తగ్గించుకోవడానికి చూసి ఉండొచ్చు. లేదా ఆర్థిక మాంద్యం కావచ్చు మరేదైనా విపత్తు కావచ్చు. దీనివెనుక అసలైన కారణం ఏంటో మనకు తెలియదు. కాబట్టి మిమ్మల్ని మీరు నిందించకండి.

2. సిగ్గు పడకండి : ఉద్యోగం పోవడం అనేది సిగ్గు పడాల్సిన విషయం కాదు. జీవితంలో ఎంతో సాధించిన చాలామంది వారి ఉద్యోగం నుంచి తీసివేయబడిన వారే. జీవితంలో ఉద్యోగం పోవడం అనేది కేవలం ఒక భాగం, అది చాలామందికి జరుగుతుంది. స్టీవ్ జాబ్స్ ని తన సొంత కంపెనీ నుండే తొలగించారు. కాబట్టి సిగ్గు పడకండి. ఈ ప్రయాణం మీరు ఒక్కరే చేస్తుంది కాదు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఉద్యోగం కోల్పోతున్నారు.

3. మీ ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ నిర్మించుకోండి : ఉద్యోగం పోయినప్పుడు మనపై మనం విశ్వాసం కోల్పోవడం సహజమే. కానీ అదే ఆలోచనలో ఉండకండి. మీ కంపెనీ మిమ్మల్ని ఎలా చూస్తుంది అనేదాన్ని బట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని ఆధారపడనీయకండి. మీ జీవితంలో ఉద్యోగం అనేది కేవలం ఒక భాగం మాత్రమే అని గుర్తుంచుకోండి. జీవితంలో ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ నిర్మించుకుని ముందుకు వెళ్ళండి.

4. నిష్పక్షపాతంగా మీ గురించి ఆలోచించండి : మీలో ఉన్న బలాలు, బలహీనతలు ఏంటో నిస్పక్షపాతంగా ఆలోచించండి. బయటి వ్యక్తుల్లా మిమ్మల్ని మీరు చూడండి. నిజాయితీగా ఉండండి. దీనివలన మీరు ఎక్కడ ఇంకా మెరుగుపడాలని అర్థమవుతుంది. ఒకసారి మీకు అర్థమైన తర్వాత వాటి మీద పనిచేయడం మొదలు పెట్టండి.

5. మీ నైపుణ్యం పెంచుకోండి : మీ నైపుణ్యాన్ని పెంచుకోవడం మీద పని చేయండి. ప్రస్తుత మార్కెట్ యొక్క ట్రెండ్ మరియు డిమాండ్ ని అర్థం చేసుకోండి. మీరు పనిచేస్తున్న ఫీల్డ్ లో ఎలాంటి నైపుణ్యం ఇప్పుడు అవసరమో ఆలోచించి అది పెంచుకోవడానికి ప్రయత్నించండి. మీకు వచ్చిన పని మరింత మెరుగ్గా చేయడానికి సమయం వెచ్చించండి. నేర్చుకోవడం మీద పెట్టండి. నైపుణ్యం ఉన్న వ్యక్తికి ఉద్యోగం రావడం చాలా సులభం. కాబట్టి మీ చేతిలో ఉన్న ఖాళీ సమయాన్ని నేర్చుకోవడానికి, మీ నైపుణ్యం పెంచుకోవడానికి ఉపయోగించండి. దీనివలన మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మరొక ఉద్యోగం సంపాదించగలరు.

6. డైలీ రొటీన్ పెట్టుకోండి : మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు మీకు డైలీ రొటీన్ ఉంటుంది. మరియు మీరు బిజీగా ఉంటారు. ఉద్యోగం లేనప్పుడు చాలా ఖాళీ సమయం దొరుకుతుంది. సోషల్ మీడియాలో సమయం గడుపుతూ, ఉపయోగం లేని పనులు చేస్తూ సమయాన్ని వృధా చేసే అవకాశం ఉంది. డైలీ రొటీన్ పాడైతే లేటుగా లేవడం, లేటుగా పడుకోవడం లాంటివి అలవాటు అవుతాయి. కాబట్టి ఒక డైలీ రొటీన్ పెట్టుకోండి. మీరు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడూ పడుకుంటారు, కొత్త విషయాలు ఎప్పుడు నేర్చుకుంటారు ఇలా ఒక షెడ్యూల్ వేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్న సమయాన్ని సరిగా వాడుకునే అవకాశం ఉంటుంది.

7. కొత్త ఉద్యోగం కోసం ఉత్సాహంగా వెతకండి : మీ resume ను update చేసుకుని ఉత్సాహంగా కొత్త ఉద్యోగం కోసం వెతకండి. మీ స్నేహితులకి, ఇంతకుముందు మీతో పని చేసిన వారికి పంపించండి.

8. మీ గురించి మీరు శ్రద్ధ వహించండి : ఉద్యోగం పోయినప్పుడు శారీరకంగా, మానసికంగా మరియు ఎమోషనల్ గా మీ ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ సమయంలో ఎక్కువగా నిరాశకు లోనయ్యే  అవకాశం ఉంది. ఎక్కడికీ కదలకుండా ఉండటం వల్ల బరువు పెరిగి ఆరోగ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రోజు మీ గురించి మీరు శ్రద్ధ వహించండి. యోగా లేదా మెడిటేషన్ చేయండి.  మీ ఒత్తిడిని తగ్గించుకోండి. నడవడం, జాగింగ్ చేయడం, వ్యాయామం చేయడం మొదలైనవి చేయండి.

9. ఒక ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోండి : ఉద్యోగం పోవడం అనేది ఆర్థికపరమైన ఇబ్బందులు తీసుకొస్తుంది. కాబట్టి అప్పటికే ఉన్న లోన్స్ మరియు EMI కోసం ఒక ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మీ PF డబ్బులు అన్నీ వాడవచ్చా ? మీ ఖర్చులని తగ్గించుకోవచ్చా ? అని ఆలోచించండి. మీ కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వారితో చర్చించి దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించండి. ఈ కష్ట సమయాలను దాటడానికి ఒక ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోండి.

10. ఇది ఎక్కువ కాలం ఉండదు : ఉద్యోగం పోవడం అనే ఈ పరిస్థితి తాత్కాలికమే. ఇది జీవితాంతం ఉండదు. మీ మీద మీరు నమ్మకంతో తర్వాత ఉద్యోగం సంపాదించండి. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. మీరు ఎన్నో కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. సమస్యల శాశ్వతం కాదు. ఈ పరిస్థితి ఎక్కువకాలం ఉండదు. త్వరలోనే మీరు ఈ పరిస్థితి నుంచి బయట పడతారు. మీకు కావాల్సింది నమ్మకం ఓపిక.

ఉద్యోగం పోవడం నుండి బయటపడడానికి అవసరం అయ్యే సూచనలు ఇవే.

మీ మీద మరియు దైవం మీద నమ్మకం కలిగి ఉండండి. నిజాయితీగా కష్టపడే వ్యక్తులకి జీవితంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మధ్యలో వదిలేయకండి. ఏదేమైనా ఉద్యోగం పోవడం అనేది మీ  జీవితాన్ని నిర్ణయించకుండా చూడండి. దృఢంగా ఉండండి.  మీ కలలను నిజం చేసుకోండి.  మీరు త్వరలోనే విజయం సాధిస్తారు.

Registration

Forgotten Password?

Loading