మనలో చాలా మందికి లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలను సాధించడం అనేది చాలా సుదీర్ఘ ప్రయాణం. మనం అకస్మాత్తుగా ఒక వారంలో బరువు తగ్గడం, కొన్ని రోజుల్లో మనం కలగన్న కాలేజీలో సీటు సాధించడం కష్టం. లక్ష్యానికి సమయం, ప్రయత్నం, ఓపిక కావాలి. లక్ష్యాలను సాధించడం అనేది దీర్ఘకాలిక పని. కొన్నింటికి నెలలు. కొన్నింటికి సంవత్సరాలు కూడా పడుతుంది. మన లక్ష్యాలు సాధించడం అనే ఈ ప్రయాణంలో కష్టపడి పనిచేయడం, కొన్నిసార్లు నిరాశ పొందడం, కొన్నిసార్లు బాధపడడం మొదలగునవి సాధారణం. కానీ మనం గుర్తించు కోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, లక్ష్యాలు సాధించడం ఎంత ముఖ్యమో ఆ ప్రయాణాన్ని ఆస్వాదించడం కూడా అంతే ముఖ్యం.
మన లక్ష్యాలను సాధించే ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయకపోతే మనం ఒత్తిడికి లోనయి సాధించడంలో ఉన్న ఆనందాన్ని కోల్పోతాము. ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయకుండా కూడా మన లక్ష్యాలను సాధించవచ్చు. కానీ ఒత్తిడితో మొత్తం ప్రయాణమంతా బాధపడుతూ లక్ష్యం సాధించడం వల్ల ఉపయోగం ఏంటి ? బాధపడుతూ లక్ష్యాలను సాధించడం అనేది ఎలాంటి ఉపయోగం లేని పని.
మనం ఏ లక్ష్యాన్ని అయినా ఆనందంగా ఉండడానికే సాధిస్తాం. బరువు తగ్గడం లేదా ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం ఇలా జీవితంలో లక్ష్యాన్నైనా మన ఆనందం కోసమే సాధిస్తాం. కాబట్టి మనం చేసే ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడం చాలా ముఖ్యం. మన లక్ష్యం కన్నా ఆ లక్ష్యం సాధించడానికి మనం చేసే ప్రయాణం చాలా పెద్దది. కాబట్టి ఆ ప్రయాణాన్ని ఆస్వాదించాలి.
కాబట్టి ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడం ఎలా ?
మన లక్ష్యాలు సాధించే ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడానికి కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం.
1. ప్రేమలో పడండి : మీ లక్ష్యాలతో ప్రేమలో పడండి. మీరు ప్రేమలో పడినప్పుడు మీరు ఎంత కష్టపడినా అది మీకు ఒక పెద్ద సమస్య అనిపించదు. లక్ష్యం మిమ్మల్ని ఒక సానుకూల దృక్పథంతో ప్రయాణం చేసేలా స్ఫూర్తి నింపుతుంది. మీకు వచ్చిన అడ్డంకుల కన్నా మీ లక్ష్యం పెద్దిది లాగా అనిపిస్తుంది. మీరు మీ లక్ష్యాలను ప్రేమించినప్పుడు వాటిని సాధించడం చాలా ఆనందంగా ఉంటుంది.
2. రిలాక్స్ గా ఉండండి : మీ లక్ష్యాలను సాధించే ప్రయాణంలో రిలాక్స్ గా ఉండండి. మీ లక్ష్యాలను సరైన మార్గంలో, సరైన పద్ధతిలో సాధించండి. మీరు సరైన పద్ధతిలో ప్రయత్నించినప్పుడు వాటి నుంచి సరైన ఫలితాలు వస్తాయి. కాబట్టి మీ లక్ష్యాలను సాధించడానికి రిలాక్స్ గా సరైన ప్రణాళిక రూపొందించుకోండి. అప్పుడు మీరు మీ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ సాధించవచ్చు. మిమ్మల్ని రిలాక్స్ చేసుకోవడానికి మెడిటేషన్ సాధన చేయండి. అప్పుడే మీరు ఎక్కువ ఏకాగ్రతతో మీ లక్ష్యాన్ని సాధించగలరు.
3. నిలకడతో ఉండండి : ప్రతిరోజు మీ లక్ష్యం వైపు కొన్ని అడుగులు అయినా వెయ్యండి. నిలకడ అన్నిటికన్నా ముఖ్యమైనది. మీరు ప్రతిరోజూ మీ లక్ష్యం వైపు నడిస్తే అది మీ లక్ష్యాలను సాధించడం తేలిక చేస్తుంది. ఎగ్జామ్ ముందురోజు పుస్తకాలు ముందేసుకుని కష్టపడటం కంటే, ప్రతిరోజు మీ సిలబస్ లో కొంత భాగాన్ని చదవడం తేలిక. కాబట్టి మీ లక్ష్యాలను సాధించడానికి నిలకడ ముఖ్యం అని గుర్తుంచుకోండి.
4. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి : మనం అందరం ఒక ప్లాన్ తోనే మన లక్ష్యాలు సాధించాలి అనుకుంటాం. కానీ ఆ ప్రయాణంలో ఊహించని అవరోధాలు రావచ్చు. అలాంటి సమయంలో ఆగిపోవడం కన్నా అప్పటి పరిస్థితులకు తగ్గట్టు మిమ్మల్ని మార్చుకుని మీ లక్ష్యం వైపు ముందుకు వెళ్లాలి. కొత్తవి నేర్చుకోవడం అనేది మీ లక్ష్యాలు సాధించడానికి చాలా సహాయపడుతుంది. ఎలాంటి సందర్భంలోనైనా ఒక దారి దొరుకుతుంది. మనసుంటే మార్గం ఉంటుంది.
5. అర్థాన్ని వెతకండి : మీ లక్ష్యాల వెనుక ఉన్న నిజమైన అర్థాన్ని వెతకండి. మీ లక్ష్యాలు అర్థం చేసుకుని అవి మీరు ఎందుకు సాధించాలి అనుకుంటున్నారో కారణాలు రాసుకోండి. మీ లక్ష్యాలను మీరు అర్థం చేసుకున్నప్పుడు వాటిని సాధించడం మీకు ఆనందం ఇస్తుంది. ఆ ప్రయాణంలో అవరోధాలు ఎదురైనప్పటికీ మీరు దృఢంగా ఉండగలుగుతారు.
6. కృతజ్ఞత కలిగి ఉండండి: కృతజ్ఞత ఆ ప్రయాణాన్ని ఆనందమయంగా మారుస్తుంది. మీ జీవితంలో ఉన్న ఆశీర్వాదాల గురించి మీకు కృతజ్ఞతలు ఉంటే అది జీవితంలోకి మరిన్ని ఆశీర్వాదాలు వచ్చే విధంగా ఆకర్షిస్తుంది. ఇదే లా ఆఫ్ నేచర్. కాబట్టి మీ కృతజ్ఞత రాసుకోండి. మీ జీవితంలో మీరు గొప్పగా ఫీల్ అవుతున్న మూడు విషయాలు గురించి రాసుకోండి. ప్రతిరోజు కృతజ్ఞత కలిగి ఉండడం మరచిపోకండి. కృతజ్ఞత మీకు ఆనందాన్ని ఇస్తుంది.
7. చిన్న చిన్న విషయాలు సెలబ్రేట్ చేసుకోండి : మీ లక్ష్యాలుసాధించే ప్రయాణంలో చిన్న చిన్న విజయాలని సెలబ్రేట్ చేసుకోండి. ఈ చిన్న చిన్న విషయాల్లో మీకు గొప్ప గొప్ప విజయాలు సాధించడానికి స్ఫూర్తినిస్తాయి. ఈ సెలబ్రేషన్ మీకు ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలను సెలబ్రేట్ చేసుకుని విజయం యొక్క రుచి చూడండి.
8. మంచి భాగస్వామ్యాలు ఏర్పరుచుకోండి : మీ వ్యక్తిత్వానికి తగ్గ వ్యక్తులతో కలిసి పని చేయండి. ఇలా చేయడం వల్ల ఆ ప్రయాణం ఆనందమయంగా మారుతుంది. దీని వలన కొత్త ఆలోచనలు వస్తాయి. మీ వ్యక్తిత్వానికి సరిపడే వ్యక్తులు మీలో స్ఫూర్తి నింపుతారు. కాబట్టి మంచి భాగస్వామ్యం ఏర్పరుచుకోండి.
9. మధ్య మధ్యలో విరామం తీసుకోండి : మీ లక్ష్యాలను నుండి, మీ పనుల నుండి మధ్య మధ్యలో విరామాలు తీసుకుంటూ ఉండండి. మీరు విరామం తీసుకున్నప్పుడు మీ శరీరం మరియు మైండ్ రిలాక్స్ అయ్యి నూతన ఉత్సాహంతో పని చేస్తాయి. మీ మైండ్ కి కొత్త కోణంలో ఆలోచించే సమయం కూడా ఇచ్చినట్టు అవుతుంది. మీలో సృజనాత్మకత పెరుగుతుంది. కాబట్టి మధ్య మధ్యలో విరామాలు తీసుకుంటే ఆ ప్రయాణం మరింత ఆనందకరం గా ఉంటుంది.
10. మీ సమయం అంటూ ఒకటి పెట్టండి : ప్రతిరోజు మీకంటూ కొంత సమయాన్ని కేటాయించండి. మీ మనసుకు నచ్చిన హాబీలు కొనసాగించండి. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు మీకంటూ ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోవడం మీరు రోజు మొత్తాన్ని గొప్పగా మారుస్తుంది. మీ మైండ్ ని, మీ శరీరాన్ని నూతన ఉత్సాహంతో నింపుతుంది. ఇది మీలో సృజనాత్మకత పెరిగేలా చేసి ఆనందాన్నిస్తుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ మీకు నచ్చిన హాబీలు మీకు బాగా ఇష్టమైన పనులు చేయడానికి ఒక సమయం కేటాయించుకోండి.
మీ లక్ష్యాలను సాధించే ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడానికి కొన్ని సూచనలు ఇవి. మీ లక్ష్యం ఎంత అందంగా ఉంటుందో దాని కోసం మీరు చేసే ప్రయాణం కూడా అంతే ఆనందంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో రకరకాల లక్ష్యాలు ఉండడానికి కారణం ఆనందమే. కాబట్టి ఆనందంగా మీ లక్ష్యాలను సాధించండి. ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి. కొన్నిసార్లు సమస్యలు ఎదురవుతాయి. మీ దారిలో వచ్చే ప్రతి దాన్ని ఎంజాయ్ చేయండి. మీ జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించండి.
విజయం అనేది ప్రయాణం. గమ్యం కాదు. ఫలితం కన్నా ప్రయాణం ముఖ్యం – Arthur Ashe