కమ్యూనికేషన్ అనేది మన జీవితంలో ఒక భాగం. కమ్యూనికేషన్ మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోజు మన కుటుంబ సభ్యులతో, మనతో పాటు పనిచేసే వాళ్ళతో, స్నేహితులతో కొత్తవాళ్లతో మాట్లాడుతూ ఉంటాము. కొన్ని పనులు జరగడానికి, మన ప్రేమను వ్యక్తపరచడానికి, దేని గురించైనా అడగడానికి, ఎదుటి వాళ్లను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి కమ్యూనికేషన్ చాలా అవసరం. ఎవరైతే మంచి కమ్యూనికేషన్ కలిగి ఉంటారో వారు జీవితంలో విజయం సాధిస్తారు.
ఈ ప్రపంచంతో మనం అనుసంధానం అవ్వడానికి కమ్యూనికేషన్ సహాయపడుతుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి సమాచారం తెలుసుకోవడానికి ఇదే సరైన మార్గం. మాట్లాడడం, చదవడం, వినడం, బాడీ లాంగ్వేజ్, మన ముఖకవళికలు, ఇలా కమ్యూనికేషన్ చాలా రకాలుగా ఉంటుంది.
మీరు ఏ విధంగా కమ్యూనికేషన్ జరిపినా అది ప్రభావవంతంగా ఉండడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి యొక్క విజయంలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సరైన కమ్యూనికేషన్ లేకపోవడం మనస్పర్థలకు దారితీస్తుంది. సమయాన్ని వృధా చేస్తుంది. అవకాశాలు చేజారిపోయేలా చేస్తుంది. ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అయిన వాళ్ళు, తద్వారా అవకాశాలు కోల్పోయే వాళ్ళు, ఎంత టాలెంట్ ఉన్నా కమ్యూనికేషన్ లేకపోవడం వల్లనే ఓడిపోతారు.
మనకి ఇష్టమైన ఉద్యోగాన్ని సంపాదించడానికి, మన వివాహ జీవితం బాగుండటానికి, పిల్లల్ని బాగా పెంచడానికి చాలా మంచి కమ్యూనికేషన్ అవసరం. కానీ మనలో చాలా మంది కమ్యూనికేషన్ లో అంత గొప్ప గా ఉండరు. కమ్యూనికేషన్ లో మనం విఫలం అవ్వడానికి కారణం ఏంటి ?
సరైన కమ్యూనికేషన్ కి పదకొండు కారణాలు ఇప్పుడు చూద్దాం.
1. సూటిగా చూడకపోవడం : ఒక వ్యక్తిని సూటిగా చూస్తూ మాట్లాడటం కమ్యూనికేషన్ లో చాలా ముఖ్యం. అది కోల్పోయినప్పుడు మనం మాట్లాడేది అంత ప్రభావశీలంగా ఉండదు. వినే వారికి ఆసక్తి లేకుండా ఉంటుంది. మనం సూటిగా చూసి మాట్లాడకపోవడం వల్ల వినే వ్యక్తి మన మీద గౌరవం కోల్పోతాడు. నమ్మకాన్ని కోల్పోతాడు.
2. కష్టతరమైన పదాలు వాడడం : కష్టంగా ఉండి, గంభీరంగా ఉండే పదాలు వాడటం బానే ఉంటుంది. కానీ ఒక సాధారణ వ్యక్తికి వాటిని అర్థం చేసుకునే శక్తి లేక అవి వాటి అందాన్ని కోల్పోతాయి. మీరు మాట్లాడింది అర్థం చేసుకోవడానికి డిక్షనరీ వెతికే సమయం ఎవరికీ లేదు. కాబట్టి అలాంటి కష్టతరమైన పదాలు వాడడం మానేయండి.
3. నమ్మకం లేకపోవడం : వినే వ్యక్తి మీద మాట్లాడే వ్యక్తికి లేదా మాట్లాడే వ్యక్తి మీద వేరే వ్యక్తికి నమ్మకం లేకపోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య సంభాషణ సరిగా జరగదు. అలాంటి సంభాషణ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
4. సరిగా వినకపోవడం : సరిగ్గా వినడం అనేది మంచి కమ్యూనికేషన్ లో చాలా ముఖ్యమైన విషయం. మనలో చాలా మంది మాట్లాడడానికి ఉత్సాహంగా ఉంటారు. కానీ ఎదుటి వాళ్లు చెబుతుంది వినడానికి సిద్ధంగా ఉండరు. వాళ్లు మాట్లాడుతుండగానే మధ్యలో మాట్లాడడం మొదలు పెడతారు. ఇది సరైన కమ్యూనికేషన్ కాదు. ఎదుటి వాళ్లు మీకు ఎంత సమాచారం ఇస్తారు అనేది మీరు వినే దాని మీద ఆధారపడి ఉంటుంది. వినే వ్యక్తికి ఓపిక ఆసక్తి లేకపోతే చెప్పే వ్యక్తి కూడా ఆసక్తి కోల్పోయి సరైన సమాచారం ఇవ్వలేదు.
5. ఎక్కువగా మాట్లాడడం: కమ్యూనికేషన్ లో మాట్లాడటం చాలా ముఖ్యమైన విషయం కానీ ఒకే వ్యక్తి ఎక్కువగా మాట్లాడితే అవతలి వ్యక్తి ఆసక్తిని కోల్పోతాడు. చాలాసార్లు మనం తెలియకుండానే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము. అలాంటి సంభాషణలు చాలా బోరింగ్ గా ఉంటాయి. అలాంటివారిని అందరూ దూరంగా పెట్టడం మొదలు పెడతారు. మనం మాట్లాడేటప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడటం చాలా ముఖ్యం.
6. ఆసక్తి లేకపోవడం : మాట్లాడే వ్యక్తికి తను మాట్లాడే విషయం మీద నిజమైన ఆసక్తి లేనప్పుడు ఆ కమ్యూనికేషన్ అసలు బాగోదు. మాట్లాడే వ్యక్తి ఎంత గొప్ప భాష వాడిననా ఆ విషయం మీద అతనికి ఆసక్తి లేనప్పుడు వినే వ్యక్తికి అసలు ఉండదు. అలాంటి సంభాషణలు వినే వ్యక్తిని ఆకట్టుకోలేదు. అదేవిధంగా వినే వ్యక్తికి ఆసక్తి లేకపోవడం కూడా చెప్పే వ్యక్తికి ఆసక్తిని పోగొడుతుంది.
7. దృష్టి పెట్టకపోవడం : వినే వ్యక్తి చెప్పే వ్యక్తి మీద దృష్టి నిలిపకపోతే ఆ సంభాషణ వృధాగా పోతుంది. వినే వ్యక్తి ఏమి గ్రహించలేడు. మాట్లాడే వ్యక్తి కూడా తన ఆసక్తిని కోల్పోతాడు. ప్రస్తుతం మొబైల్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వీటన్నిటి వల్ల వినే వాళ్ళు చెప్పే వ్యక్తి మీద దృష్టి నిలువకుండా ఉంటున్నారు. దీనివలన కమ్యూనికేషన్ పాడవుతుంది.
8. స్పష్టత లేకపోవడం : మాట్లాడే వ్యక్తి కి తాను ఏం మాట్లాడుతున్నాడో స్పష్టంగా తెలియక పోవడం వల్ల వినే వ్యక్తి అయోమయంలో పడి ఆసక్తిని కోల్పోతాడు. అద్భుతమైన కమ్యూనికేషన్ కి స్పష్టత అనేది చాలా ముఖ్యమైనది.
9. జ్ఞానం లేకపోవడం : మాట్లాడే వ్యక్తికి తాను మాట్లాడే విషయం మీద సరైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఆ సంభాషణ ప్రభావం అంతగా ఉండదు. వేరే వ్యక్తి దాని మీద ఎలాంటి శ్రద్ధ పెట్టడు.
10. ముందే అభిప్రాయాలు ఏర్పరచుకోవడం : కొన్నిసార్లు మనం పూర్తిగా వినకుండానే అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. దానివలన సరిగ్గా వినకుండా అపార్థం చేసుకుంటాము. మనకి గతంలో ఎదురైన అనుభవాల కారణంగా అలా చేస్తాం. దానివలన ఆ సంభాషణలో ఉన్న నిజం పక్షపాతంగా మారుతుంది. ఇది ఎక్కువగా రిలేషన్ షిప్స్ లో జరుగుతుంది. మనం ఒక వ్యక్తి తో సంవత్సరాలు గడిపినప్పుడు మనకి ఆ వ్యక్తి గురించి బాగా తెలుసు అని అనుకుంటాం. కాబట్టి పూర్తిగా వినకుండా లేదా ఎదుటి వ్యక్తి పూర్తిగా మాట్లాడకుండా మీరు అభిప్రాయాలు ఏర్పరుచుకోండి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి వ్యక్తి ప్రతిరోజు మారుతూనే ఉంటాడు. జీవితంలో ప్రతిరోజు కొత్తది ఏదో ఒకటి ఉంటుంది. మార్పు సహజం. కాబట్టి సంభాషణకి విలువ ఇవ్వండి.
11. భావోద్వేగాల మీద అదుపు లేకపోవడం : మన భావోద్వేగాలు అదుపులో లేనప్పుడు మన సంభాషణలో సమతుల్యత ఉండదు. భయం, కోపం, ద్వేషం, ఇలాంటి భావోద్వేగాలు మనం సరిగా మాట్లాడకుండా చేస్తాయి. ఇంటర్వ్యూల్లో చాలామంది విఫలం అవ్వడానికి భయం కారణం.
ప్రభావంతమైన కమ్యూనికేషన్ కి సూచనలు.
మనకి సరైన కమ్యూనికేషన్ లేకపోవడానికి ప్రధాన కారణాలు ఇవే. అడ్డంకులు ఉండడం సహజమే. మనం మనస్ఫూర్తిగా మాట్లాడాలి అనుకుంటే వీటినుంచి బయటపడొచ్చు. ఈ అడ్డంకులను తగ్గించుకున్న లేదా పూర్తిగా పోయేలా చేసినా మనం మాట్లాడే సంభాషణ చాలా గొప్పగా ఉంటుంది. ఒక ప్రభావవంతమైన కమ్యూనికేషన్ జీవితాన్ని మార్చగలదు. ఒక పాజిటివ్ దృక్పథాన్ని ఏర్పడగలదు. ఒక వ్యక్తిని గొప్ప నాయకుడిగా చేయగలదు .
మీరు శ్రద్ద పెట్టి ప్రభావంతంగా వాడడం సాధన చేస్తే విజయానికి సాధనం కమ్యూనికేషన్ -Theo gold