మీ జీవితాన్ని మార్చుకోవడానికి 11 బ్యూటీ టిప్స్

బ్యూటీ టిప్స్
Share

అమ్మాయిలు మరియు ఆడవాళ్ళ విషయంలో ఆశ్చర్య పరచేది ఏంటంటే, చాలామంది తాము అందంగా లేమని ఫీల్ అవుతూ ఉంటారు. నిజానికి వాళ్ళు పుట్టుకతోనే సహజంగా అందంగా ఉంటారు. కానీ తాము ఆకర్షణీయంగా లేమని అనుకుంటారు. లావుగా ఉన్నామని, అందంగా లేమని చాలా ఫీల్అవుతూ ఉంటారు. వాళ్ళమీద వాళ్ళకున్న ఈ తప్పుడు అభిప్రాయం వలన ఎక్కువ మేకప్ వేసుకోవడం, రకరకాల వ్యాయామాలతో శారీరాన్ని హింసించడం, ఏవేవో డైట్ లు ఫాలో అవ్వడం, చెడ్డ రిలేషన్ షిప్స్ లోకి వెళ్ళడం చేస్తారు. 

కేవలం “నువ్వు అందంగా ఉన్నావ్” అనే మాట వినడానికి. క్రమంగా వాళ్ళ ఆరోగ్యాన్ని, ఆత్మ గౌరవాన్ని , శరీరాన్ని, రిలేషన్ షిప్స్ ని పాడుచేసుకుంటారు. ఇది అవసరమా ? అవసరం లేదు. అవును, అందంగా ఉండడం బావుంటుంది కానీ దానికి బదులుగా ఆరోగ్యం,రిలేషన్ షిప్స్, ఆనందాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అందం ఎప్పుడు అందంగా ఉంటుందో తెలుసా ?  ఆరోగ్యంతో, ఆనందం తో వచ్చిన అందమే అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని బ్యూటీ టిప్స్ చూద్దాం.

మిమ్మల్ని అందంగా ఆరోగ్యంగా , ఆకర్షణీయంగా ఉంచడానికి కొన్ని బ్యూటీ టిప్స్ సూచనలు.

1. అనారోగ్యకరమైన డైట్ తో మీ శరీరాన్నిఇబ్బంది పెట్టకండి: మీరు నిజంగా అందంగా,  ఆకర్షణీయంగా ఉండాలి అనుకుంటే ఒక మంచి nutritionist ను సంప్రదించి  మీ శరీరంకి సరిపోయే డైట్ ప్లాన్ తీసుకోండి. ప్రతీ ఒక్కరి శరీరం ప్రత్యేకమైనది. అందరి సెట్  అయ్యే ఒకే డైట్ ప్లాన్  లేదు. మనల్ని ఆకర్షణీయంగా చూపించేది ఆరోగ్యం. దాన్ని బాగా కాపాడుకోండి.

2. రోజుకు ఒక్క అరగంట అయినా Physical activity చెయ్యండి: డాన్స్, స్విమ్మింగ్, యోగా, జిమ్ , రన్నింగ్ , వాకింగ్ ఇలా మీరు enjoy చేసేది ఏదైనా. ఈ physical activity మీ body కి energy ఇచ్చి happy గా ఉంచుతుంది. Active గా ఉండేవాళ్లే ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్లతోనే ఎక్కువ సమయం గడపాలనిపిస్తుంది. ట్రెక్కింగ్ కి  వెళ్ళి ఆ ఫోటోస్ Facebook లో పెట్టడం మీకు ఇష్టమా? అయితే రోజుకి 30 నిముషాలు physical activity కి కేటాయించండి.

3. ఆనందంగా ఉండండి :  మీకు అందాన్ని తెచ్చేది Lipstick, mascara కాదు. మీ నవ్వు. అదే మిమ్మల్ని ఆకర్షణీయంగా చేస్తుంది. బోరింగ్ గా,కోపంగా ,సీరియస్ గా ఉండేవాళ్ళతో ఎవరూ స్నేహం చెయ్యాలి అనుకోరు.

4. మీ స్కిన్ ని ఆరోగ్యంగా ఉంచుకోండి: ఎక్కువ నీళ్ళు తాగండి. పళ్ళు, కూరగాయలు తినండి. సహజంగా తయారు చేసిన రసాయనాలు లేని కాస్మోటిక్స్ వాడండి.

5. సరిగా పడుకోండి : ఆటంకం లేని మంచి నిద్ర మన శరీరానికి అవసరం. అందంగా, ఉత్సాహంగా కనపడాలంటే సరిగా నిద్రపోండి.

6. ఆత్మ విశ్వాసంతో ఉండండి: మీరేంటో తెలుసుకోడానికి మీ బలాలు, బలహీనతలు రాసుకోండి. ఆత్మ విశ్వాసంగా ఉన్నవాళ్లే అందంగా ఉంటారు.

7. మంచి బట్టలు వేసుకోండి:  మీకంటూ ఒక ఒక స్టైల్ ఏర్పాటు చేసుకోండి. మీకు ఏది అందంగా ఉంటుందో చెప్పడానికి మోడల్ గానీ, ఫాషన్ ఎక్స్పర్ట్ గానీ అవసరం లేదు.

8. మీరు అందంగా ఉన్నారని ఎవ్వరూ చెప్పనవసరం లేదని అర్థం చేసుకోండి : మీకు మీరే అభిమానిగా ఉండండి. మీకున్న గొప్ప లక్షణాలు అన్నీ రాసుకోండి. మీలో మీకు నచ్చే విషయాలు తెలుసుకోండి. వాటి విషయంలో గర్వపడండి. మిమ్మల్ని మీరే తెలుసుకోకపోతే బయటి వాళ్ళు తెలుసుకోవాలని ఎలా అనుకుంటారు.

9. మీరు perfect కాని  వాటిని ఒప్పుకోండి: అన్ని విషయాల్లో మీరు perfect అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రపంచంలో ఎవ్వరూ perfect కాదు. ఆ Magazine లో మోడల్ అలా కనపడటానికి ఎన్ని photoshop ఎడిట్స్  అవసరమయ్యాయో మీకు తెలీదు.

10. మీరు inner beauty ను ఇంప్రూవ్ చేసుకోండి:  ఆనందం, ప్రశాంతత , ధైర్యం, క్రమశిక్షణ, కరుణ , నిజాయితి ఇలాంటి లక్షణాలు అలవాటు చేసుకోండి. మీరు బయటకి కనపడే దానికన్నా మీ inner beauty చాలా పవర్ ఫుల్ మరియు ఆకర్షణీయంగా ఉంటుంది.

11. వారానికి ఒక్కసారైనా ప్రకృతిలో గడపండి:  మంచి గాలిని  ప్రకృతి నుండి తీసుకోండి. ఈ ప్రకృతిలో ప్రతీ అణువూ అందమైనది. పచ్చని చెట్లు, పసుపు రంగు పువ్వులు, నీలపు ఆకాశం, ఎర్రని సూర్యాస్తమయం. ప్రకృతి
లాగా మీలా మీరుండండి. సహజంగా ఉండండి, అందంగా ఉండండి . మీ అందం మీరు తెలుసుకుని మీ విషయంలో గర్వపడండి. బయటవాళ్లు మీ గురించి చాలా అనుకుంటారు. అవన్నీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. బయటివాళ్ళకి మీ మీదున్న అభిప్రాయంలో మీరు ఇరుక్కొవాల్సిన అవసరం లేదు. మీ గురించి మీరు తెలుసుకుని ఆ నిజంలో బతకండి.

మీ గురించి మీరు తెలుసుకున్న తర్వాత మీలో వచ్చే ఆత్మ విశ్వాసం మిమ్మల్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించడానికి ఈరోజే కాస్త సమయం తీసుకోండి. మీకు మీరు అబినందనలు తెలుపుకుంటూ మీరు ఎంత అందంగా ఉన్నారో చూసుకోండి. బయటవాళ్ళకి మీ మీద ఉన్న అభిప్రాయం పట్టించుకోనవసరం లేనంత చిన్నది అని మీకు అర్థమవుతుంది. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారన్నది ముఖ్యం. దానికన్నా ముఖ్యంగా మిమ్మల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారన్నది ముఖ్యం. మీరు ప్రత్యేకమైన వారు. మీ అందం మీదే, అందంగా ఉండడానికి ట్రెండ్స్ , వేరే వాళ్ళ అభిప్రాయాలు పట్టికొనవసరం లేదు.

Registration

Forgotten Password?

Loading