సూర్యోదయం – ఈ భూమి మీద జరిగే అందమైన విషయం. సూర్యోదయం యొక్క రంగులు, పక్షుల చేసే శబ్దాలు, చల్లని గాలి ఇవన్నీ మనలో సానుకూల దృక్పధాన్ని సృష్టించి ఆనందంగా మన రోజుని ప్రారంభించేలా చేస్తాయి. సన్ రైజ్ సమయం చాలా ముఖ్యమైనది మరియు పవిత్రమైనది. సన్ రైజ్ చూడడం వల్ల ఒక వ్యక్తి ప్రశాంతమైన ధ్యాన స్థితిలోకి వెళ్లిపోతారు.
ఈరోజుల్లో, మనలో చాలామంది ఒత్తిడితో నిండిన జీవితాన్ని గడుపుతూ రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా లేవడం అలవాటు అయిపోయింది. ఉదయమే లేవడం మనం అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మన రోజుని సరిగా ప్లాన్ చేసుకోవాలి. త్వరగా భోజనం చెయ్యడం, త్వరగా పడుకోవడం లాంటి మార్పులు చేసుకోవాలి. ఇలా మార్చుకోవడం అవసరమేనా ? అసలు సూర్యోదయం చూడడం వల్ల కలిగే లాభాలు ఏంటి ?
సూర్యోదయం చూడడం వల్ల కలిగే 11 ప్రయోజనాలు:
1. సన్ లైట్ మన కంటికి తగలగానే Pineal gland యాక్టివేట్ అవుతుంది. వేద శాస్త్రంలో దీన్నే Third Eye అంటారు. ఇది యాక్టివేట్ అవ్వడం వల్ల మీరు సాధించాలనుకున్న ప్రతీది సాధించగలరు. అందుకే ఉదయమే లేచి సన్ రైజ్ చూడండి. ఇది అలవాటు చేసుకుంటే మీ శక్తి గొప్ప తరంగాలుగా రూపాంతరం అయ్యి గొప్ప వ్యక్తులని, అవకాశాలని ఆశ్చర్యపరిచే విషయాలని మీ జీవితం లోకి తీసుకువస్తాయి. ఇది చాలా శక్తివంతమైన సాధన. నమ్మట్లేదు కదా ??? ఒక వంద రోజులు ఇది ప్రయత్నించండి.
2. ఉదయాన్నే లేవడం వల్ల ఎలాంటి హడావిడి లేకుండా మీ రోజుని ప్రశాంతంగా, ఆనందంగా మొదలు పెట్టవచ్చు. హడావిడిగా ఒక రోజుని మొదలు పెట్టడం అస్సలు మంచిది కాదు. ఆనందంగా, ప్రశాంతంగా ఒకరోజుని మొదలు పెడితే ఆ రోజంతా అలానే ఉంటుంది. ఆరోజు ఎదురయ్యే సవాళ్లను మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఆలస్యంగా లేవడం వల్ల మీ విధులు సమర్థవంతంగా చెయ్యలేరు.
3. ఆ గొప్ప క్షణంలో లేవడం అలవాటు చేసుకుంటే మీ ఆలోచనలని, ఎమోషన్స్ ని, శరీరాన్ని ని నియంత్రించగలరు. మీతో మీరు సమయం గడిపే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క విజయం మూడు విషయాలని ఎలా నియంత్రిస్తున్నాడు అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. మీ శరీరం, ఎమోషన్స్, మరియు ఆలోచనలు. మీ శరీరాన్ని దృఢంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. మీ ఎమోషన్స్ ని అదుపు చెయ్యడం నేర్చుకోండి. మీ ఆలోచనలలో పదును పెంచుకోండి. అప్పుడు ప్రతీరోజూ మీరు విజయం సాధించగలరు. మీరు త్వరగా లేవడం వల్ల మీ గురించి మీరు పట్టించుకోవడానికి ఎలాంటి ఆటంకం లేని సమయం దొరుకుతుంది.
4. ఉదయం చాలా తక్కువ ఆటంకాలు ఉంటాయి. రాబోయే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలని కూడా ప్లాన్ చేసుకోవడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో మీ మైండ్ గొప్ప ఆలోచనలు చెయ్యడానికి సిద్దంగా ఉంటుంది.
5. ప్రపంచం అంతా నిద్ర పోతుండగా మీరు మీ లక్ష్యాల గురించి పని చేసే గొప్ప అదృష్టం మీకు దక్కుతుంది.
6. మీ రోజుని ఒక సానుకూల దృక్పథంతో మొదలు పెడతారు. ఆ రోజంతా పాసిటివ్ గా ఉంటుంది. దీనివల్ల మీ జీవితంలోకి మరింత పాసిటివ్ విషయాలు వస్తాయి.
7. మీ లక్ష్యాలను, మీ రిలేషన్ షిప్స్ ను రివ్యూ చేసుకోవడానికి ఇది అద్భుతమైన సమయం .
8. మన శరీరాన్ని ఫిట్ గా ఉంచి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచే D విటమిన్ సన్ లైట్ లో దొరుకుతుంది. మంచి ఆరోగ్యం ఉండడం గొప్ప ఆశీర్వాదం. మీ ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవాడానికి, కాపాడుకోవడానికి సన్ రైజ్ చూడడం గొప్ప మార్గం.
9. సన్ రైజ్ అందంగా ప్రశాంతంగా ఉంటుంది. సన్ రైజ్ చూడడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మీ సృజనాత్మకతని పెంచి మీకు గొప్ప ఆలోచనలు వచ్చేలా చేస్తుంది.
10. మనల్ని ఎన్నో రోగాలనుండి కాపాడే సిర్కాడియన్ రిథమ్ ని సరిగా ఉండేలా చేస్తుంది. దీన్నే బయోలాజికల్ క్లాక్ అంటారు. దీన్ని సరిగా చూసుకోవడం ద్వారా ఎన్నో రకాల రోగాల నుండి తప్పించుకోవచ్చు.
11. మీ వ్యాధి నిరోధక శక్తిని పెంచి కాలానుగుణంగా వచ్చే ఎన్నో రకాల జబ్బులతో పోరాడే శక్తిని మన శరీరానికి ఇస్తుంది.
సన్ రైజ్ చూడడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇవి.
సన్ రైజ్ చూస్తుండగా ఈ కింద తెలిపినవి మీరు సాధన చెయ్యవచ్చు.
1. ఈ భూమి మీద సమస్త జీవరాశి పుట్టుకకు కారణమైన సూర్య భగవానుడికి మీ కృతజ్ఞతలు తెలపవచ్చు. తద్వారా మన జీవితం చాలా గొప్పగా మారుతుంది.
2. మీకు తెలిసిన మంత్రాన్ని జపించవచ్చు. గాయత్రి మంత్రాన్ని జపించడం చాలా మంచి విషయం మరియు దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
3. ఆ సన్ లైట్ మీ శరీరాన్ని, మైడ్ ని, మీ ఆత్మను నయం చేస్తున్నట్టు ఊహించుకోండి.
4. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఏ విషయాన్ని అయినా చెప్పండి. మీ సమస్యలను ఆ సూర్య భగవానుడి పాదాల ముందు పెడితే మీ పరిష్కారం దొరుకుతుంది.
5. మీలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, క్షమించే గుణం లేకపోవడాన్ని ఆయన ముందు ఉంచండి. మీలో పాసిటివ్ విషయాలు నింపమని ఆయనని అడగండి.
6. సూర్య భగవానుడు ఈ ప్రపంచం మొత్తానికి శాంతిని పంపుతున్నట్టు ఊహించుకోండి.
7. ఆ క్షణం లో ఉండి సన్ రైజ్ ని ఎంజాయ్ చెయ్యండి. మనస్పూర్తిగా మీ శ్రద్దని పెట్టండి. ఇదే మెడిటేషన్ అవుతుంది.
సన్ రైజ్ చూస్తుండగా మీరు ఇవి సాధన చెయ్యవచ్చు. అధ్యాత్మికంగాను, సైన్స్ పరంగానూ సన్ రైజ్ చూడడం చాలా మంచిది. కాబట్టి సమయం తీసుకుని సన్ రైజ్ యొక్క అద్భుతాన్ని ఎంజాయ్ చెయ్యండి. ప్రతిరోజూ కుదరకపోతే కనీసం వారాంతాల్లో అయినా చూడండి. ఇది ఉచితంగా దొరికే గొప్ప విషయం, ఏ క్యూ లోనూ నిలబడనవసరం లేదు. ఇది కేవలం కొన్ని ప్రాంతాలకు పరిమిత మైనది కాదు. సన్ లైట్ ప్రతీ చోట ఉంది.
మన ప్రకృతి యొక్క గొప్పదన్నాన్ని ఎంజాయ్ చెయ్యండి. ,మీ వ్యాధి నిరోధక శక్తిని పెంచే టీ తో మీ రోజుని సానుకూలంగా మొదలుపెట్టండి. మీకు మీ కుటుంబానికి మంచి ఆరోగ్యం మరియు ప్రశాంతత వస్తాయి.