ఆరోగ్యకరమైన జుట్టు ఒకరి అందాన్ని మరింత పెంచుతుంది. మన అందరికీ ఆరోగ్యకరమైన జుట్టు కావాలని ఉంటుంది. అందుకే మంచి ప్రొడక్ట్స్ వాడతాం. ఆరోగ్యకరమైన జుట్టుకి కావాల్సిన అన్ని సూచనలు పాటిస్తాం. ఆరోగ్యకరమైన ఒత్తైన జుట్టుకి ఇంటి వద్దనే చేసుకునే చిట్కాలు చాలా ఉన్నాయి. వీటిని మన అమ్మమ్మల కాలం నుండి వాడుతున్నారు. ఇవి ఈ రోజుల్లో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈమధ్య జుట్టు ఊడిపోవడం అనేది చాలా సాధారణ సమస్య అయిపోయింది. ఒత్తిడి, అనారోగ్యకరమైన రసాయనాలు, పౌష్టికాహార లోపం, విటమిన్ల అసమతుల్యత మొదలైనవి జుట్టు రాలిపోవడానికి కారణం అవుతున్నాయి.
మన జుట్టు ఆరోగ్యకరంగా, దృఢంగా, ఒత్తుగా ఉండటానికి మనం ఏమైనా చేయగలమా ? ఖచ్చితంగా చేయగలం.
ఆరోగ్యకరమైన జుట్టు కోసం పాటించవలసిన 11 సూచనలు ఇప్పుడు చూద్దాం.
1. బాగా పడుకోండి : ఇది చాలామంది అస్సలు పట్టించుకోరు. అందమైన జుట్టు కోసం అద్భుతాలు జరగనవసరం లేదు. సరిగా నిద్రపోతే చాలు. సరిగా నిద్ర పోవడం వల్ల మన జుట్టు పెరగడానికి అవసరమైన హార్మోన్లు మరియు ఎంజైమ్లు విడుదల అవుతాయి. కాబట్టి అందమైన మరియు ఆరోగ్యకరమైన జుట్టు కావాలంటే సరిగ్గా పడుకోండి. ఎలక్ట్రానిక్ వస్తువులు, సోషల్ మీడియా ఇవన్నీ తర్వాత అయినా చూసుకోవచ్చు. మీ నిద్ర చాలా ముఖ్యం. కాబట్టి అందమైన జుట్టు కావాలంటే రోజుకి ఎనిమిది గంటలు పడుకోండి.
2. సమతుల్య ఆహారం తీసుకోండి : త్వరగా బరువు తగ్గాలని ఎక్కువగా డైటింగ్ చేయడం వల్ల జుట్టు ఊడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పోషకాహార లోపం ఉన్న డైట్ తీసుకోవడం మానేయండి. ఇవి జుట్టు ఊడిపోవడం మాత్రమే కాకుండా ఇంకా అనేక అనారోగ్య సమస్యలను తెస్తాయి. కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు ఇవన్నీ సమతుల్యంగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. మీ ఆహారంలో కూరగాయలు మరియు బాదం పప్పు, వాల్ నట్స్, జీడిపప్పు మొదలైన ఉండేలా చూసుకోండి.
3. రసాయనాలు లేని ఉత్పత్తులు : మార్కెట్లో దొరికే జుట్టుకు సంబంధించిన ఉత్పత్తులు షాంపూలు, gels, కండిషనర్స్, హెయిర్ డైస్ మొదలైనవి హానికర రసాయనాలు తో నిండి ఉన్నాయి. ఆరోగ్యకరమైన మరియు నేచురల్ అని చెప్పుకునే చాలా ఉత్పత్తులు ఈ హానికర రసాయనాలతో నిండి ఉన్నాయి. అలాంటి వాటిని వాడడం మానేయండి. ఇది కేవలం జుట్టుకు మాత్రమే కాకుండా మొత్తం శరీరానికి హానికరం. జుట్టుకు వాడుతున్నాం కాబట్టి కేవలం జుట్టుకే హానికరం అనుకోవద్దు. ఇలాంటి రసాయనాలు లేని ఉత్పత్తులను మాత్రమే వాడండి. మీరు ఏదైనా కొనే ముందు దానిలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చదవండి.
4. ఒత్తిడి తగ్గించుకోండి : ఒత్తిడి కూడా జుట్టు ఊడిపోవడానికి ఒక ప్రధాన కారణం. ఎక్కువగా ఒత్తిడికి గురికావడం వల్ల జుట్టు ఊడిపోతుంది. కాబట్టి యోగ లేదా మెడిటేషన్ లేదా ప్రకృతిలో సమయం గడపడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోండి.
5. ఆయిల్ మసాజ్ : జుట్టుని ఆరోగ్యంగానే దృఢంగా ఉంచడానికి చాలా పురాతనమైన పద్ధతి ఇది. ఆయిల్ మసాజ్ వల్ల మన జుట్టుకి రక్తప్రసరణ పెరుగుతుంది. దానివల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఒత్తిడిని, తలనొప్పిని తగ్గిస్తుంది. కోల్డ్ ప్రెస్డ్ విధానంలో తీసిన కొబ్బరినూనె గానీ, బాదం నూనె గానీ వాడండి. నేచురల్ పద్ధతిలో తయారు చేయబడిన ఈ ఆయిల్ ని మీరు వాడవచ్చు. కొంచెం నూనె వేడి చేసి మెల్లగా తలపై మసాజ్ చేయండి. ఒక 30 నిమిషాలు అలా వదిలేసి తర్వాత షాంపుతో స్నానం చేయండి.
6. విటమిన్లు సరిగా ఉండేలా చూసుకోండి : ఆరోగ్యకరమైన మరియు ధృడమైన జుట్టు కావాలంటే విటమిన్లు సమతుల్యంగా ఉండాలి. కాబట్టి మీకు జుట్టు రాలిపోవడం గమనిస్తే ఒకసారి మీ విటమిన్ల లెవెల్స్ ఎలా ఉన్నాయో టెస్ట్ చేయించుకోండి. అంతేకాకుండా థైరాయిడ్ మరియు హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయించుకోండి.
7. ఎక్కువ నీరు తాగుతూ ఉండండి : ఒక రోజుకి అవసరమైనటువంటి నీరు తాగుతూ ఉండండి. ఆరోగ్యకరమైన జుట్టు విషయంలో నీరు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జుట్టు యొక్క కుదుళ్ళు బలపరిచి జుట్టు పెరిగేలా చేస్తుంది.
8. Dryers మానేయండి : మనం dryers వాడడం వల్ల జుట్టు ఊడిపోవడం పెరుగుతుంది. అంతేకాకుండా మన జుట్టుకి ఎక్కువగా వేడి తగిలేలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి జుట్టుని సహజంగానే ఆర నివ్వoడి.
9. పరిశుభ్రంగా ఉండండి: జుట్టుని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఉపయోగపడే కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం.
1. తరచూ తలస్నానం చేయండి.
2. మరొకరు వాడిన దువ్వెనలు వాడకండి.
3. బాగా గట్టిగా ఉండే దువ్వెనలు వాడకండి.
4. మీ దువ్వెన శుభ్రంగా ఉండేలా చూసుకోండి.
5. శుభ్రంగా ఉన్న టవల్స్ మాత్రమే వాడండి
10. జుట్టు మాస్కులు వాడండి : మీరు ఇంట్లోనే తయారు చేసుకునే జుట్టుకు వాడదగిన మాస్కులు ఎన్నో ఉన్నాయి. వీటి వలన జుట్టు అందంగా ప్రకాశవంతంగా మారి అద్భుతంగా పెరుగుతుంది. జుట్టుకి కావలసిన పోషకాలను అందిస్తాయి. మీరు ప్రయత్నించ దగ్గ హెయిర్ మాస్కులు ఇప్పుడు చూద్దాం.
1. గుడ్డుని జుట్టుకు రాసి 30 నిమిషాల తర్వాత కడిగేయండి.
2. బాగా ముగ్గిన అరటి పండు రెండు తీసుకుని తేనెతో బాగా కలిపి జుట్టుకు రాయండి. పది నిమిషాల తర్వాత కడిగేయండి.
3. కరివేపాకుని కొబ్బరి నూనెలో ఉడికించి నూనె గోరువెచ్చగా ఉండగా జుట్టుకు రాయండి. 30 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇదే పద్ధతిని ఉసిరి ముక్కలతో కూడా ప్రయత్నించవచ్చు.
4. 2 విటమిన్ E క్యాప్సిల్స్ ని, ఒక స్పూను బాదం నూనె, ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి జుట్టుకు రాయండి. 30 నిమిషాల తర్వాత కడిగేయండి.
5. మీకు సమయం కుదరక ఇవి ఇంటివద్ద తయారు చేసుకోలేకపోతే ఎలాంటి రసాయనాలు వాడకుండా నేచురల్ గా తయారు చేయబడిన జుట్టు మాస్క్ లు మీరు ఇక్కడ పొందవచ్చు.
11. యోగా చేయండి : యోగాసనాలు చేయడం వల్ల తలకి రక్త ప్రసరణ సరిగా జరిగి జుట్టు పెరగడం జరుగుతుంది. అంతే కాకుండా ఈ యోగా వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. కాబట్టి జుట్టు పెరగడానికి యోగా కూడా మంచి పద్ధతి.
ఆరోగ్యకరమైనజుట్టు కోసం పాటించవలసిన 11 సూచనలు ఇవి.
ఆరోగ్యకరమైన జుట్టు ఉండటం చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి మీ జుట్టు విషయంలో శ్రద్ధ వహించండి. కేవలం మీ జుట్టుకు మంచిదైన రసాయనాలు లేని ప్రొడక్ట్స్ మాత్రమే వాడండి. ఎందుకంటే ఆరోగ్యమైన జుట్టు అందరికీ కావాలి.