మనం చాలా చాలా రకాల రిలేషన్షిప్స్ తో ఎదుటి వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉంటాం. తల్లిదండ్రులు, బావలు, భార్య, పిల్లలు, తోబుట్టువులు, బంధువులు, తాతలు, నాన్నమ్మ అమ్మమ్మలు, స్నేహితులు ఇలా ఎంతోమంది. ఈ రిలేషన్షిప్స్ మనకి ఆనందాన్ని ఇస్తాయి. జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తాయి. ఓర్పు, ప్రేమ, నమ్మకం లాంటి లక్షణాలు అలవరచు కోవడానికి సహాయం చేస్తాయి. మనందరికీ ఇలాంటి అర్థవంతమైన రిలేషన్షిప్స్ కావాలనే కోరుకుంటాం.
వేరే వాళ్ళతో బంధాలు పక్కన పెడితే, ఒక రిలేషన్షిప్ మన జీవితాన్ని ఒక దారిలో పెడుతూ మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది. అదే మనతో మనకున్న రిలేషన్షిప్ . ఈ ప్రపంచాన్ని ప్రేమించాలంటే ముందు మనల్ని మనం ప్రేమించు కోవాలి. మనం చేసిన తప్పులకి బాధపడుతూ ఎప్పుడూ మనల్ని మనం నిందించుకుంటూ ఉంటే మనలో ఉన్న మంచి లక్షణాలని, మనకి ఉన్న blessings ను చూడలేం. ఎదుటి వాళ్ళతో మంచి రిలేషన్షిప్ ఉండాలంటే ముందు మనతో మనకి మంచి రిలేషన్షిప్ ఉండాలి. కాబట్టి మనల్ని మనం సిద్దం చేసుకునే ఒక ప్లాన్ తయారు చేసుకుందాం.
మన జీవితంలో అన్ని రిలేషన్షిప్స్ ను బలపరిచడానికి పాటించవలసిన 4 steps గురించి తెలుసుకుందాం.
1. మీ ఉన్నతికి తోడ్పడే నమ్మకాలు ఏర్పరచు కోవడం:
మీ నమ్మకాలు మీ జీవితాన్ని సృష్టిస్తాయి. మీ రిలేషన్షిప్స్ లో ఎంత ఆనందంగా ఉండాలనేది మీ నమ్మకాలే నిర్ణయిస్తాయి. కాబట్టి రిలేషన్షిప్స్ విషయంలో మీ ఉన్నతికి తోడ్పడే నమ్మకాలు ఏర్పరచుకోవడం ఈ ప్రయాణంలో మొదటి అడుగు. రిలేషన్షిప్స్ విషయంలో మీ నెగటివ్ నమ్మకాలు ఏంటో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోoడి. మీ ఆలోచనలని, మీతో మీరు మాట్లాడుకునే మాటలని జాగ్రత్తగా గమనించండి. అప్పుడే మిమ్మల్ని ఆపుతున్న నమ్మకాలు ఏంటో తెలుస్తాయి. ఆ నెగటివ్ నమ్మకాలని తీసేసి వాటి స్థానంలో మీ ఉన్నతికి తోడ్పడే నమ్మకాలు పెట్టుకోండి.
రిలేషన్షిప్స్ విషయంలో మీ ఉన్నతి కి సహాయపడే నమ్మకాలు ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం.
1. నాకు అద్భుతమైన బంధాలు ఉండాలని రాసిపెట్టి ఉంది
2. నా చుట్టూ నమ్మకమైన, ప్రేమగా ఉండే వ్యక్తులు ఉన్నారు
3. నా రిలేషన్షిప్స్ ను నేను enjoy చేస్తాను.
4. ఎక్కువ బంధాలు ఉండడం బావుంటుంది
5. నన్ను నేను త్వరగా క్షమించుకుని నా తప్పులనుండి నేర్చుకుంటాను
6. నా రిలేషన్షిప్స్ కి విలువ ఇస్తాను.
7. నా రిలేషన్షిప్స్ కి సమయం కేటాయిస్తాను
నన్ను నేనుగా అంగీకరిస్తాను. నాతో నేను ఆనందంగా ఉంటాను.
మన లక్ష్యాల మీద మన నమ్మకాలు చూపించే ప్రభావం ఎలా ఉంటుందో ఇంకా తెలుసుకోవడానికి “ Limiting beliefs – How they stop you from achieving your goals” అనే ఆర్టికల్ చదవండి.
2. ఒక vision ఏర్పరచుకోండి:
రిలేషన్షిప్స్ విషయంలో మీరు ఏం సాధించాలి అనుకుంటున్నారో అర్థం చేసుకోండి. రిలేషన్షిప్స్ విషయంలో మీ మనసు చెప్పేది వినండి. నేను అనుకున్నది సాధించగలమా సాధించలేమా అని ఆలోచించకండి. ఒక్క క్షణం మీరు ఏదైనా సాధించగలరు అనుకుని ఈ కింది ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగండి.
1. నా భార్య/భర్తతో నా relation బావుంటే ఎలా ఉంటుంది?
2. గొప్ప తండ్రిగా ఉండడం ఎలా ఉంటుంది?
3. ఒక రిలేషన్షిప్ లో నమ్మదగిన వాడిగా ఉండడం ఎలా ఉంటుంది?
4. నా పిల్లలకి నేను role model లా ఉండడం ఎలా ఉంటుంది?
కొంత సమయం తీసుకుని వీటికి సమాధానం చెప్పుకోండి. మీ సమాధానాలు తెలిసిన తర్వాత అవి నిజంగా అయినట్టు మీ vision statement రాసుకోండి. ఇలా రాసుకున్న క్లియర్ vision subconscious mind మీద పనిచేసి మనం అనుకున్నది జరిగేలా చేస్తుంది. రిలేషన్షిప్స్ గురించి vision statement ఎలా రాసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
1. నా బంధాలు అన్ని అద్బుతంగా ఆనందంగా ఉన్నాయి.
2. ఎదుటివాళ్లని అంగీకరిస్తాను
3. నా భార్య/భర్త తో నా relation చాలా బావుంది.
4. నేను నాలా ఉండడం చాలా enjoy చేస్తాను
5. నేను చాలా మంచి తండ్రిని/తల్లిని
6. నా విషయంలో నా తల్లిదండ్రులు గర్వపడతారు
3. మీ vision వెనక ఉన్న purpose ని అర్థం చేసుకోండి:
ఈ step లో మీ రిలేషన్షిప్స్ గొప్పగా ఎందుకు ఉండాలనుకుంటున్నారో కారణాలు ఒక లిస్ట్ రాసుకోండి. మీరు ఎందుకు అవి సాధించాలనుకుంటున్నారో అర్థం చేసుకోండి. మీరు రాసుకున్న కారణాలు మిమ్మల్ని inspire చెయ్యాలి. మీరు రాసుకునే కారణాలు ఇలా ఉండాలి
1. ఆనందకరమైన బంధాలు నా జీవితాన్ని గొప్పగా మారుస్తాయి.
2. నా చుట్టూ ఉన్నవాళ్లకి best ఇవ్వడాన్ని నేను enjoy చేస్తాను.
3. నన్ను అందరూ నమ్మడాన్ని, గొప్పగా చూడడాన్ని నేను ఇష్టపడతాను
4. ప్రేమించడాన్ని, ప్రేమించబడదాన్ని నేను ఇష్టపడతాను.
5. నా పిల్లలకి నేను role model లా ఉండాలనుకుంటున్నాను
6. నా family ఆనందంగా ఉండాలనుకుంటున్నాను.
కొంత సమయం తీసుకుని మీ రిలేషన్షిప్స్ ఎందుకు మెరుగు పరచుకోవాలి అనుకుంటున్నారో కారణాలు రాసుకోండి. ఎంత బలమైన కారణాలు ఉంటే సాధించాలన్న సంకల్పం అంత దృఢంగా ఉంటుంది.
4. ప్రణాళికని సిద్దం చేసుకోండి
ఒక సరైన ప్రణాళిక ఉంటేనే ఏ లక్ష్యాన్నైనా సాధించగలం. మీకు అద్భుతమైన ఫలితాల్ని ఇచ్చే ఒక ప్రణాళికని సిద్దం చేసుకోండి. మీ ప్రణాళిక ఎలా ఉండాలంటే మీరు బిజీ గా ఉన్నా తప్పకుండా పాటించేలా ఉండాలి. మీరు అనుకున్నది సాధించకుండా మీ షెడ్యూల్ అడ్డు కాకూడదు. ఈ కింది విధంగా ప్రణాళిక సిద్దం చేసుకోండి. రిలేషన్షిప్స్ గురించి మన ప్లాన్ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం.
1. నేను మాట్లాడే మాటల్లో చేసే పనుల్లో మనఃసపూర్తిగా ఉంటాను
2. నా ఫ్యామిలీ కి సమయం ఇవ్వగలిగేలా నా షెడ్యూల్ ని చూసుకుంటాను.
3. నా ఫ్యామిలీ ని అభినందించడానికి సమయం తీసుకుంటాను
4. నా భార్య/భర్త తో అన్ని విషయాలు పంచుకుంటాను
5. నా భార్య/భర్త తో కనెక్ట్ అవ్వడానికి సమయం వెచ్చిస్తాను
6. నా పిల్లలతో time spend చేస్తూ వాళ్ళు మంచి వ్యక్తులుగా ఎదిగేందుకు సహాయపడతాను
7. నా తప్పులనుండి నేర్చుకుంటాను
మీరు చెయ్యాలనుకుంటున్నవన్నీ లిస్ట్ రాసుకోండి. “How to achieve your goals” ఆర్టికల్ చదవండి. మీరు ఎంత బిజీ గా ఉన్నా అనుకున్నవి చేసేలా ప్రణాళిక వేసుకోవడంలో ఈ ఆర్టికల్ సహాయం చేస్తుంది.
ఇలా ఈ నాలుగు steps మీ దగ్గర ఉంటే రిలేషన్షిప్ విషయంలో మీరు అనుకున్నది సాధించడం నల్లేరుపై నడకలా చాలా తేలికగా ఉంటుంది. చాలాసార్లురిలేషన్షిప్స్ పాడయిపోయే వరకూ మనం వాటిని serious గా తీసుకోము. ఇప్పటినుండే ఒక పద్దతి ప్రకారం రిలేషన్షిప్స్ ను పట్టించుకుంటే అద్భుమైన జీవితం మన సొంతం అవుతుంది.
కాబట్టి సమయం తీసుకుని, మీ లైఫ్ లో చాలా ముఖ్యమైన రిలేషన్షిప్స్ గురించి ఈ నాలుగు steps create చేసుకోండి. రిలేషన్షిప్స్ చాలా అమూల్యమైనవి. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది. ఆలస్యం చేయకుండా ఇప్పుడే మొదలు పెట్టండి మీరు అన్నుకున్నది సాధిస్తారు.