మీరు ఎంత సమాచారం పొందుతారు అనేది మీరు మాట్లాడే విధానం మీద ఆధారపడి ఉంటుంది అని మీరు ఎప్పుడైనా నా ఆలోచించారా ? ఒక గొప్ప నాయకుడు తను మాట్లాడే మాటల ద్వారా ఎదుటి వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాడు. ఇది ఎలా జరుగుతుంది ? మాట్లాడడం వెనక పదాలను మించినది ఏమైనా ఉందా ? అవును. మన సంభాషణ ప్రభావంతంగా ఉండాలంటే దాని వెనుక ఎన్నో ఉంటాయి.
మంచి కమ్యూనికేషన్ కి సూచనలు చూసే ముందు అసలు మన జీవితంలో కమ్యూనికేషన్ కి ఉన్న ప్రాముఖ్యతని అర్థం చేసుకుందాము.
మంచి కమ్యూనికేషన్ వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం.
1. జీవితాన్ని చాలా సులభం చేస్తుంది. మనకు ఎదురయ్యే చాలా సమస్యలు కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్ల వచ్చేవే. కాబట్టి అలాంటి సమస్యలను రాకుండా చేయవచ్చు.
2. చాలా సమయం ఆదా అవుతుంది. మన జీవితంలో చాలా సమయం మనం సరిగా కమ్యూనికేషన్ చేయకపోవడం వల్ల వచ్చిన సమస్యల్ని సరిచేయడానికి సరిపోతుంది.
3. బంధాలను దృఢపరుస్తుంది. మన బంధాలు, మన జీవన ప్రమాణం అద్భుతంగా ఉండాలంటే ప్రభావవంతమైన కమ్యూనికేషన్ కలిగి ఉండాలి.
4. పిల్లల్ని పెంచడం తేలికవుతుంది. చాలామంది తల్లిదండ్రులు, పిల్లలు ఎదుర్కొనే చాలా సాధారణ సమస్య కమ్యూనికేషన్.
5. మన జీవితంలో విజయాలు పెరుగుతాయి. ప్రస్తుత ప్రపంచం కమ్యూనికేషన్ మీద చాలా ఆధారపడి ఉంది. కేవలం టాలెంట్ ఒకటి సరిపోదు. సరైన జాబ్ పొందడానికి, మనం అనుకున్న దానిలో విజయం సాధించడానికి చాలా అవసరం.
6. ఈ ప్రపంచం మీద మీ ప్రభావం చూపడానికి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ప్రపంచంలో గొప్ప విజయాలు సాధించిన నాయకత్వం ఆధ్బుతంగా మాట్లాడటం వల్ల వచ్చినవే. మనం మాట్లాడే మాటలకి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది.
7. మన జీవితంలో బాధని, విషాదాన్ని తగ్గించే శక్తి కమ్యూనికేషన్ ఉంటుంది. మనం కరుణ తో మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తికి అది ఒక ఉపశమనంగా ఉంటుంది.
మంచి కమ్యూనికేషన్ వల్ల కలిగే కొన్ని లాభాలివి. మనం ఆనందంగా, విజయవంతంగా, మన జీవితాన్ని గడపాలంటే కమ్యూనికేషన్ చాలా అవసరం. రకరకాల రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించిన వ్యక్తుల రహస్యం ప్రభావవంతమైన కమ్యూనికేష న్. కాబట్టి మనం మాట్లాడే మాటలు ప్రభావవంతంగా ఉండాలంటే ఏం చేయాలి ?
దాని కోసం పన్నెండు సూచనలు ఇప్పుడు చూద్దాం.
1. బాడీ లాంగ్వేజ్ : మన బాడీ లాంగ్వేజ్ మన మాటల కన్నా ఎక్కువ మాట్లాడుతుంది. మన ఆత్మ విశ్వాసాన్ని, మనపై మనకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు సరైన బాడీ లాంగ్వేజ్ ఉండడం చాలా ముఖ్యం.
2. కళ్ళలోకి చూడడం : మాట్లాడుతున్న వ్యక్తితో నేరుగా చూడడం అనేది మనం మాట్లాడే విషయం మీద ఎదుటి వ్యక్తికి ఆసక్తిని కలిగిస్తుంది. మనం వాళ్ళకి ఎంతో విలువ ఇస్తున్నామో వాళ్ళకి అర్థమవుతుంది. మన ఆత్మ విశ్వాసాన్ని తెలియజేస్తుంది.
3. పదాల ఎంపిక : మనం ఎంచుకునే పదాలు కూడా చాలా ముఖ్యం. మనం చెప్పాలనుకున్న విషయం వేరే పదాలలో కూడా చెప్పొచ్చు. కానీ మనం ఎంచుకునే పదాలు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. కాబట్టి మీ పదాలను జాగ్రత్తగా ఎంచుకోండి. పదాలకి ఊరట నిచ్చే శక్తి మరియు బాధ పెట్టే శక్తి కూడా ఉంది.
4. మన ఆలోచనల్లో స్పష్టత : మన ఆలోచనల యొక్క వ్యక్తీకరణ మన సంభాషణ ద్వారా వస్తుంది. మన ఆలోచనలు స్పష్టంగా లేకుండా ఉంటే మన సంభాషణ కూడా స్పష్టంగా ఉండదు. కాబట్టి ఆలోచనలలో స్పష్టతని సాధించండి. మీరు ఏం చెప్పాలనుకున్నారో స్పష్టంగా మీకు తెలిసి ఉండాలి. ఆలోచనలలో స్పష్టత వల్ల మన సంభాషణ ప్రభావవంతంగా మారుతుంది.
5. భావోద్వేగాలపై అదుపు : మనం బాగా ఆనందంగా ఉన్నప్పుడు లేదా భయపడినప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు మనం గొప్పగా మాట్లాడలేము. మన మాటల్లో మన భావోద్వేగం కనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో మనం అనుకున్న దానికంటే వేరేది మాట్లాడుతాము. లేదా మాట్లాడకుండా ఉండిపోదాము. మన భావోద్వేగాలపై అదుపు సాధించడం చాలా ముఖ్యం. మన భావోద్వేగాలు అదుపులో ఉన్నప్పుడు సరైన పదాలు ఎంచుకుంటే సంభాషణలలో స్పష్టత వస్తుంది.
6. ఓపికగా వినడం : కమ్యూనికేషన్ అంటే కేవలం మాట్లాడటమే కాదు. వినడం కూడా. వినడం చాలా ముఖ్యం. ఎదుటి వారు చెప్పేది జాగ్రత్తగా విన్నప్పుడు వాళ్లకి అనుకున్నది చెప్పడానికి అవసరమైన వెసులుబాటు ఇచ్చినట్టు అవుతుంది.
7. ఎలాంటి అభిప్రాయాలు లేకుండా ఉండడం : మనం ముందుగానే అభిప్రాయాలు ఏర్పరుచుకోకుండా ఉండడంవల్ల ఎన్నో రకాల ఉపయోగాలు, ఎన్నో రకాల అవకాశాలు ఉంటాయి. మనం ఎవరి గురించి అయినా అప్పటికే ఒక అభిప్రాయం ఉంటే వాళ్లు చెప్పేది మనం సరిగా పట్టించుకోము. వాళ్ల మాటలకి ఎలాంటి విలువ ఇవ్వము.
8. ఆసక్తికరంగా మాట్లాడండి : మాట్లాడే వ్యక్తి ఆసక్తికరంగా మాట్లాడకపోతే వినే వాళ్ళు సరిగా వినరు కాబట్టి మనం మాట్లాడే మాటలు ఆసక్తికరంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మనం మాట్లాడే మాటల్లో ప్రశ్నలు, కథలు, ఉండేలా చూసుకుంటే ఎదుటివాళ్ళు మనం మాట్లాడేది శ్రద్ధగా వింటారు.
9. దృశ్యాలు వాడడం : ఒక ఫోటో ఎన్నో మాటల కన్నా ఎక్కువ మాట్లాడుతుంది. అందుకే ఒక ఫోటో వెయ్యి పదాలతో సమానమంటారు. మనం మైండ్ పదాల కన్నా ఫోటోని అరవై వేల రెట్లు వేగంగా అర్థం చేసుకుంటుంది. కాబట్టి సరైన ఫోటో వాడటం చాలా ముఖ్యం.
10. సానుకూల భావోద్వేగాలు వాడడం : మనం మాట్లాడే మాటల్లో సానుకూల భావోద్వేగాలైన ప్రేమ, గౌరవం, అర్థం చేసుకోవడం, ఉత్సాహం, కరుణ ఇలాంటివి ఉంటే ఆ సంభాషణ చాలా గొప్పగా ఉంటుంది. ఆసక్తికరంగా ఉంటుంది. చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
11. విలువ పెంచండి : మీ సంభాషణ ద్వారా ఒక వ్యక్తి యొక్క విలువ పెరిగేలా మాట్లాడండి. మీ మాటలు ఎదుటి వ్యక్తిని గొప్పగా ఫీల్ అయ్యే విధంగా లేదా జ్ఞానాన్ని లేదా సమాచారాన్ని గ్రహించే విధంగా లేదా నవ్వు తెప్పించే విధంగా ఉండేలా జాగ్రత్త పడండి.
12. ఆసక్తి చూపండి : మీరు చెప్పేది వింటున్న వ్యక్తి మీద మనస్ఫూర్తిగా ఆసక్తిని చూపండి. ఎదుటి వ్యక్తి కూడా మీలాగే మనిషి కాబట్టి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల మీకు ఎంతో విలువ ఇస్తారు.
మన కమ్యూనికేషన్ ని గొప్ప గా మార్చే 12 సూచనలు ఇవే.
అద్భుతమైన కమ్యూనికేషన్ ఒక కళ. అది రావడానికి కొంత సమయం పడుతుంది. ప్రాక్టీస్ చేయడం ద్వారా మన కమ్యూనికేషన్ పెంచుకోవచ్చు. అది అవసరం కూడా. సరైన కమ్యూనికేషన్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీ కమ్యూనికేషన్ ప్రభావవంతంగా ఉండేలా చూసుకోండి. కమ్యూనికేషన్ వల్ల ఈ ప్రపంచాన్ని జయించే శక్తి మీకు వస్తుంది.
కమ్యూనికేషన్ మీరు నేర్చుకో గల కళ. సైకిల్ తొక్కడం లేదా టైప్ చేయడం లాంటిదే. మీరు నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోగలరు. దీని వల్ల మీ జీవితం ఇది ఎంతో మెరుగుపడుతుంది. –బ్రియాన్
One thought on “ప్రభావంతమైన కమ్యూనికేషన్ కి 12 సూచనలు”
Comments are closed.