ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మం కోసం 12 చిట్కాలు

కాంతివంతమైన చర్మం
Share

చర్మం మన శరీరంలో అతి పెద్ద అవయవం. మనందరికీ ఆరోగ్యకరమైన, మృదువైన, తాజా, మెరిసే చర్మం కావాలి. చర్మాన్ని అందానికి ప్రతీకగా చూస్తారు. చర్మం విషయంలో అందం అనేది చాలా చిన్న విషయం. మనల్ని అందంగా చూపించడమే కాకుండా మన చర్మానికి చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. మన శరీర జీవక్రియలలో చర్మం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం.

1. చర్మం మన శరీరానికి మొదటి రక్షణ కవచం. అతినీలలోహిత కాంతి కిరణాల నుంచి, రేడియేషన్ నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. మన రోగనిరోధక శక్తి విషయంలో చర్మం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

2. విటమిన్లను, మంచి నీటిని మరియు ఆక్సిజన్ ని శోషణ చేసుకుంటుంది.

3. శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటకు విడుదల చేస్తుంది

4. శరీరం యొక్క ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది.

5. వేడి, చల్లదనం, నొప్పి, ఆనందం ఇలాంటివి మన శరీరానికి తెలిసేలా చేస్తుంది.

మనం సన్ లైట్ లో ఉన్నప్పుడు మన శరీరానికి అవసరమైన విటమిన్ డి ను తయారు చేస్తుంది. మనం శారీరకంగా, మానసికంగా, మరియు ఎమోషనల్ గా ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ డి చాలా అవసరం.

చర్మం చేసే కొన్ని అతి ముఖ్యమైన పనులు ఇవి. కాబట్టి మన చర్మాన్ని అందంగా ఉంచుకోవడం మాత్రమే కాకుండా ఆరోగ్యకరంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం.

మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉపయోగపడే 12 సూచనలు ఇప్పుడు చూద్దాం.

1. సహజమైన కాస్మోటిక్స్ వాడండి: మాయిశ్చరైజర్, టోనర్, లోషన్స్, క్రీమ్స్, సన్ స్క్రీన్ లోషన్ ఇలా చాలా రకాల ప్రొడక్ట్స్ మనం వాడుతూ ఉంటాం. మార్కెట్లో దొరికే చాలా రకాల ప్రొడక్ట్స్ హానికర రసాయనాలు అయిన parabens, SLES మరియు కృత్రిమ సువాసనలతో నిండి ఉంటాయి. ఇవి మన చర్మానికి చాలా హానికరం. ఇలాంటి రసాయనాలతో నిండి ఉన్న ప్రొడక్ట్స్ వాడకండి.  ఇవి చర్మం ద్వారా మన శరీరంలోనికి ప్రవేశించి అనేక రకాల రోగాలను తీసుకువస్తాయి. ఇవి కేవలం మన చర్మానికే కాకుండా మొత్తం శరీరానికి హానికరం. కాబట్టి సహజమైన కాస్మోటిక్స్ వాడండి. మీ చర్మం మిమ్మల్ని ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది.  కాబట్టి చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

2. సహజమైన సబ్బు లేదా సున్నిపిండి వాడండి : మనకి మార్కెట్లో దొరుకుతున్న చాలా రకాల సబ్బులు హానికరమైన రసాయనాలతో నిండి ఉండి మన శరీరంపై చాలా దుష్ప్రభావం చూపిస్తాయి. కాబట్టి సహజమైన సబ్బులనే వాడండి.  ఈ సబ్బుని మీరు ప్రయత్నించవచ్చు.  మీ శరీరానికి సున్నిపిండిని కూడా వాడవచ్చు.  దీనిని ఎన్నో సంవత్సరాల నుండి వాడుతున్నారు.  మన అమ్మమ్మ యొక్క ఆరోగ్యకరమైన చర్మం యొక్క రహస్యం ఇదే.  సున్ని పిండి ఎలా తయారు చేయాలో మీరు ఇక్కడ చూడవచ్చు.

3. నీరు తాగండి : మీ శరీరానికి అవసరమైనంత నీరు తాగుతూ ఉండండి. మన చర్మాన్ని ఆరోగ్యకరంగా, మెరిసిపోతూ ఉండేలా చేయాలంటే ఇది చాలా ముఖ్యమైన పని. మీతో పాటు ఎప్పుడు వాటర్ బాటిల్ ఉంచుకోండి.  తరచూ తాగుతూనే ఉండండి. ఎంత నీరు తాగాలి అని ఏమీ లేదు.  మీ శరీరానికి అవసరమైనంత నీరు తాగండి.

4. బాగా పడుకోండి : చర్మం యొక్క ఆరోగ్యం విషయంలో చాలామంది పట్టించుకోని విషయం ఇది. మీరు బాగా పడుకున్నప్పుడే మీ చర్మం నూతన ఉత్సాహంతో రిపేర్ చేసుకుంటుంది. చర్మం యొక్క ఆరోగ్యం విషయంలో నిద్ర యొక్క ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయకండి. ఆరోగ్యకరమైన చర్మం కోసం చక్కగా పడుకోండి.

5. ఒత్తిడిని తగ్గించుకోండి : ఈ ఆధునిక రోజుల్లో ఒత్తిడి అనేది చాలా మామూలు విషయం అయిపోయింది. ఒత్తిడి వలన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.  ఇది మన చర్మం యొక్క ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది.  కాబట్టి ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం యోగ మెడిటేషన్ లేదా ప్రకృతిలో గడపడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోండి.

6. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి : యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఒమేగా 3, విటమిన్ ఇ ఎక్కువ ఉన్న ఆహారం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహార పదార్థాలను ఈ కింద ఇస్తున్నాం. వీటిని మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం మర్చిపోకండి.

1. వాల్ నట్స్

2. సన్ఫ్లవర్ విత్తనాలు

3. చిలకడ దుంపలు

4. టమోటాలు

5. పుచ్చకాయలు

6. గ్రీన్ టీ

7. క్యారెట్స్

8. నారింజ

9. బాదం పప్పు

10. దానిమ్మ కాయలు

11. బొప్పాయి

12. స్ట్రాబెర్రీస్

13. పాలకూర

14. అవిసె గింజలు

7. పచ్చి కూరగాయలు తినండి : సలాడ్స్ మరియు స్మూతీల రూపంలో పచ్చి కూరగాయలు తినండి. చర్మం యొక్క ఆరోగ్యానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్స్ వీటిలో ఉంటాయి.

8. అనారోగ్యకరమైన ఆహారాలు తగ్గించండి : మీకు ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే ఈ కింద చెప్పబడిన ఆహార పదార్ధాలు పూర్తిగా మానేయాలి లేదా తగ్గించాలి. ఎక్కువగా పంచదార మరియు నిల్వ ఉంచే రసాయనాలు, అనారోగ్యకరమైన కొవ్వు కలిగి ఉండడం వల్ల ఇవి మన చర్మానికి చాలా హానికరం.

1. ఫ్రై చేసిన ఆహారం

2. కేకులు, స్వీట్స్ ఇలాంటి ఎక్కువ పంచదార ఉన్న ఆహార పదార్థాలు

3. ప్రాసెసింగ్ చేసిన ప్యాకేజ్డ్ ఫుడ్

9. వ్యాయామము : ప్రతి రోజు వ్యాయామం చేయండి.వ్యాయామం చేసేటపుడు మన శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివలన మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు చర్మం ద్వారా బయటకి విడుదల చేయబడతాయి.  వ్యాయామం వలన మన చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

10. ప్రతిరోజు చర్మం గురించి పట్టించుకోండి : మనం రోజూ ఎన్నో రకాల పనులు చేయడం వల్ల కాలుష్యానికి, ఒత్తిడికి లోనవుతాం. కాబట్టి ప్రతిరోజు మన చర్మాన్ని పట్టించుకోవడం చాలా ముఖ్యం. మీ చర్మానికి తగ్గ విధానం వేయించుకుని ఈ రోజు మీ చర్మం గురించి పట్టించుకోండి.

11. ఫేస్ మాస్కులు వాడండి : ఫేస్ మాస్కులు చర్మాన్ని శుభ్రం చేయడమే కాకుండా నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. మీరు ఇంటిదగ్గరే ఈ ఫేస్ మాస్క్ లను తయారు చేసుకొని వాడవచ్చు.  మీరు ఇంటి దగ్గర తయారు చేసుకో దగ్గర ఫేస్ మాస్కులు ఇప్పుడు చూద్దాం.

1. పెరుగు + కొన్ని చుక్కల నిమ్మకాయ రసం + పసుపు

2. పాలు+ తేనె

3. టమోటా జ్యూస్+ కొన్ని చుక్కల నిమ్మరసం

4. అలోవెరా జ్యూస్

5. తేనె + బాగా ముగ్గిన అరటి పండు

6. తేనె+ నిమ్మకాయ రసం

7. కీరదోస పల్ పల్ లేదా జ్యూస్ + పెరుగు

8. ఆరెంజ్ పీల్ పౌడర్ + పెరుగు

12. బయటకి వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ వాడండి : మీరు పగటి వేళలో బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ వాడండి. ఇది ఇది ఎండ వలన మీ చర్మం పాడవకుండా నిరోధిస్తుంది.

మన చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కొన్ని మార్గాలు ఇవి. హానికర రసాయనాలు వాడడం వల్ల లేదా ప్రోసెస్ చేయబడిన ఆహారము లేదా ఎలాంటి కదలిక లేని జీవనశైలి వల్ల మనకి ఆరోగ్యకరమైన చర్మం రాదు. ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల ఆరోగ్యకరమైన చర్మం వస్తుంది.   కాబట్టి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకుని కాంతివంతమైన మృదువైన అందమైన చర్మాన్ని పొందండి.

Registration

Forgotten Password?

Loading