మన మనసుకు నచ్చింది చెయ్యడానికి 13 కారణాలు

మనసు
Share

ప్రేమలో పడడం చాలా ప్రత్యేకమైన అనుభవం. ప్రేమలో పడ్డవాళ్ళు కాలాన్ని, ప్రపంచాన్ని మర్చిపోతారు. వాళ్ళకి ప్రేమించిన వారికోసం నిలబడే ధైర్యం ఉంటుంది.జీవితం చాలా కొత్తగా ఉంటుంది. ప్రేమకోసం అవధులు, సరిహద్దులు దాటడానికి సిద్దంగా ఉంటారు. మనసుకి నచ్చింది చేసేవారు కూడా ఇదే అనుభూతిని పొందుతారు. ప్రతీరోజూ కొత్తగా ఉంటుంది.

నిద్రపోవడం, లేవడం, పని చెయ్యడం, పెళ్లి చేసుకోవడం, చనిపోవడం జీవితం అంటే ఇదేనా లేక అంతకుమించి ఏమన్నా ఉందా? మన మనసుకు నచ్చింది చేస్తే ఇవి మాత్రమే కాక జీవితానికి వేరే అర్థం ఉందని తెలుస్తుంది. ప్రతీ ఒక్కరి జీవితానికి ఒక గమ్యం ఉంది.

మనసుకు నచ్చింది చెయ్యడం అంటే ఏంటి ?

ప్రతీ వ్యక్తికి inner wisdom ఉంటుంది. మనసుకు నచ్చింది చెయ్యడం అంటే ఆ inner wisdom చెప్పినట్టు నడుచుకోవడం. మనలో కొంతమంది తమకి ఏం కావాలో తెలుసుకుని అది చేస్తారు, మరికొంతమంది వాళ్ళ జీవితానికి గమ్యం  ఏంటో తెలియక అయోమయంలో ఉంటారు. ఎందుకు ? ఎందుకంటే తమకి ఏం కావాలో తెలుసుకోవాలంటే వల్ల మనసు ఏం చెప్తుందో వినాలి. అలా విన్న వాళ్ళు మాత్రమే తమ మనసుకు నచ్చింది చెయ్యగలరు.

మన మనసుకి నచ్చింది ఎందుకు చెయ్యాలి? 

ఈ ప్రపంచంలో గొప్పగొప్ప ఆవిష్కరణలు అన్నీ వాళ్ళు తమ మనసుకి నచ్చింది చెయ్యడం వల్ల వచ్చినవే. ఇప్పుడు గొప్ప వ్యక్తులుగా కీర్తించబడుతున్న అందరూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ మనసుకి నచ్చింది చేసిన వాళ్ళే. Edison బల్బు  కనిపెట్టిన తర్వాత ప్రపంచమే మారిపోయింది. కానీ అందరూ ఆయన్ని పిచ్చి వాడు అనుకునేవారు. బల్బు కనిపెట్టడానికి ఆయన దాదాపు వెయ్యి సార్లు ఫెయిల్  అయ్యాడు. ఫెయిల్ అయిన ప్రతీసారీ ఇంకొకసారి ప్రయత్నించడానికి ఏది దైర్యం ఇచ్చింది? బల్బు కనిపెట్టాలనే ఆయన బలమైన కోరిక. ఎన్ని కష్టాలు ఎదురైనా గొప్ప గొప్ప వాళ్ళు ఎందుకు తమ మనసుకి నచ్చిందే చేస్తారు ? మన మనసుకి నచ్చింది చేస్తే ఏమవుతుంది??

1. జీవితానికి ఒక అర్థాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది.

2. జీవించడానికి ఒక ఉత్సాహం ఇస్తూ జీవితాన్ని ఒక సెలబ్రేషన్ లా చేస్తుంది.

3. గతంలో కూరుకు పోకుండా రేపటి పట్ల ఆశతో ముందుకు వెళ్లే ఉత్తేజాన్ని ఇస్తుంది

4. మన మనసుకి నచ్చింది చేస్తున్నప్పుడు బాధగా, విసుగుగా ఉండడం సాధ్యపడదు.

5. జీవితానికి ఒక లక్ష్యం ఉండడం వల్ల ప్రతీరోజూ ఉత్సాహంగా మొదలు పెడతారు.

6. మీరు అనుకున్నదాన్ని సాధించగలరు

7. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లే మార్గం కనుగొంటారు. ఎందుకంటే మన మనసుకి నచ్చింది చేస్తున్నప్పుడు మనం విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల మనం దృఢంగా, తెలివిగా, గొప్ప వ్యక్తిగా ఉంటాం. అందువల్ల ఎలాంటి వాటినైనా ఎదుర్కొనగలం.

8. విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల అవాంతరాలు పాఠాలు గా అనిపిస్తాయి. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం.

9. మీ మనసుకి నచ్చింది చెయ్యాలంటే సంకల్పమే మిమ్మల్ని నడిపిస్తుంది.

10. మన మనసుకి నచ్చింది చేస్తున్నప్పుడు చిన్న చిన్న వాటిల్లో కూడా దైవత్వం కనిపిస్తుంది. ఒక చిన్న పువ్వు, చిన్నపిల్లల నవ్వు, మేఘాలు మన చుట్టూ ప్రతీదానిలో దైవత్వం చూస్తాము. నిజాయితీ, నమ్మకం మన వ్యక్తిత్వం అవుతుంది.

11. మన జీవితానికి ఒక లక్ష్యం లేనపుడు విసుగు, విచారం , డిప్రెషన్ వస్తాయి. ఇవి డాక్టర్ దగ్గరకి  వెళ్తే, టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గేవి కాదు. చాలా వరకు మానసిక రోగాలు మన మనసుకి నచ్చింది చెయ్యకపోవడం వల్ల వచ్చేవే. మన మనసుకి ఏం కావాలో తెలుసుకుని దైర్యం గా మన మనసుకి నచ్చింది చెయ్యడమే మనం చెయ్యాల్సింది.

12. ఈరోజుల్లో చాలామంది మానసికంగా ఒంటితనం ఫీలవుతున్నారు. మనసుకి నచ్చింది చెయ్యడం ద్వారా దాని నుండి బయట పడొచ్చు

13. చాలామంది తాము చేసే ఉద్యోగం నచ్చక జీవితానికి ఒక గమ్యం లేక మానసిక వైద్యుడి దగ్గరకు వస్తారు. మీ మనసుకి నచ్చిన పని చేస్తే చేసే పనిలో ఆనందం ఉంటుంది.

మనసుకి నచ్చింది చెయ్యడం ఎలా ? 

ఇప్పుడు మనం మనసుకు నచ్చింది ఎందుకు చేయాలో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న మనసుకు నచ్చింది చేయడం ఎలా? ఈ కింద చెప్పిన సూచనలు మీకు సహాయం చేస్తాయి.

Step 1: మీ heart తో కనెక్ట్  అవ్వండి – మొదటిగా మన మనసుకు ఏం కావాలో తెలుసుకోవాలి. మీ heart తో మీరు కనెక్ట్  అయితే మీ Unique Talents, మీ కోరికలు తెలుస్తాయి. అప్పుడే మీ జీవితం యొక్క లక్ష్యం మీకు అర్థమవుతుంది.

Step 2: ధైర్యంగా మీ మనసుకు నచ్చింది చెయ్యండి – మీ మనసుకి నచ్చింది ఏంటో అర్థమైతే ఇక ధైర్యంగా మీకు నచ్చింది చేస్తూ సరైన దారిలో వెళ్లడమే. మీ మనసుకు నచ్చింది చెయ్యడం అనేది ఒక ప్రణాళిక. అదే మీ లైఫ్ యొక్క లక్ష్యం. కానీ కొన్ని సార్లు కష్టంగా ఉంటుంది. కాబట్టి మనసుకు నచ్చింది చెయ్యాలంటే ధైర్యం కావాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైన మీ మనసుకి నచ్చింది చెయ్యడం ఎలా ?? ఈ ప్రయాణంలో మీకు ఎలాంటి వనరులు కావాలి ?

Step 3: మీ వనరులు సమకూర్చుకోoడి – మీరు ధైర్యంగా మీ మనసుకు నచ్చింది చేయాలంటే మీకు ఈ కింది వనరులు కావాలి.

1. ఆరోగ్యవంతమైన శరీరం

2. దృఢమైన mindset

3. ఆనందకరమైన ఎమోషన్స్

4. మంచి ఆర్థిక స్థితి

5. సమయపాలన

6. దైవంతో అనుభందం

ఇవన్నీ మీతో ఉన్నప్పుడు మీ మనసుకు నచ్చింది చెయ్యాలనే ప్రయాణం చాలా తేలిక అవుతుంది. మిమ్మల్ని ఏదీ ఆపలేదు. తర్వాత మనకి ఎదురయ్యే ప్రశ్న – ఈ వనరులు ఎలా సమకూర్చు కోవాలి??

Step 4: సరైన టూల్స్ మరియు ప్రణాళిక వాడండి – ఈ వనరులు సమకూర్చు కోవడానికి సరైన టూల్స్ , ప్రణాళికలు, మన సమయం మరియు ప్రయత్నం కావాలి. కాబట్టి మీ కోసం మీరు సమయం గడిపి గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మించుకోoడి. సరైన ఆహారం తీసుకోవడం, మెడిటేషన్ , ఆర్థిక ప్రణాళిక, వ్యాయామం, క్షమించే గుణం ద్వారా మీ వ్యక్తత్వాన్ని నిర్మించుకోవచ్చు. మన్ ఘాట్ లో మీ ప్రయాణంలో అవసరయ్యే టూల్స్ మరియు ప్రణాళికలు ఉంటాయి.

మీ మనసుకు నచ్చింది చెయ్యడానికి ఉపయోగపడే steps ఇవి. మీ మనసుకు నచ్చింది చెయ్యడానికి మించిన సంతృప్తి లేదు. మనసుకు నచ్చింది చెయ్యడమే అతి ముఖ్యమైన విషయం. మీరు పుట్టింది దానికోసమే . ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ మనసుకు నచ్చింది చేస్తే డిప్రెషన్ , విసుగు, పేదరికం, అన్యాయం, ఆఖరికి నేరాలు కూడా మాయం అయిపోతాయి. మన మనసుకు నచ్చింది చేస్తూ ఈ ప్రపంచం ఆనందమయ, ప్రశాంతమైన ప్రదేశం అవ్వడానికి మన వంతు సాయం చేద్దాం.

There is no reason not to follow your heart – Steve Jobs

Check out this great book on following your heart.

Registration

Forgotten Password?

Loading