ప్రస్తుతం ప్రపంచంలో అందరుదృష్టి సారిస్తున్న విషయం మెడిటేషన్ . ఎంతోమంది CEO‘s , హీరోలు , హీరోయిన్స్ , గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు మెడిటేషన్ చేస్తున్నారు మరియు మెడిటేషన్ చెయ్యడం వల్ల కలిగే లాభాల గురించి మాట్లాడుతున్నారు. రోజూవారీ ఒత్తిడి వల్ల వచ్చే రోగాలకు డాక్టర్స్ కూడా మెడిటేషన్ సిఫార్సు చేస్తున్నారు. రోజూ మెడిటేషన్ చేసేవాళ్ళ మీద చేసిన ఒక రీసెర్చ్ లో మెడిటేషన్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని తేలింది. ఈరోజు మనం మెడిటేషన్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఈ భూమి మీద ఎన్నో రకాల జీవుజాతులు ఉన్నాయి అందులో మానవ జాతి ఒకటి. ఆలోచించగలగడం లక్షణం మనుషుల్ని మిగతా జంతువుల కన్నా ఉన్నతమైన వారిగా చేసింది. ఈ ఆలోచించే సామర్థ్యమే విమానం కనిపెట్టి పక్షిలా ఎగిరే లా చేసింది, చేపలా ఈదడం నేర్పింది, ఎడారులు, అడవుల్లో బతకడం నేర్పింది. మనిషి బతికి ఉండడానికి, ఆనందంగా ఉండడానికి ఆలోచించడం అనేది చాలా ముఖ్యం. ఒక సాధారణ మనిషి గంటకి 2500 నుండి 3300 ఆలోచనల చొప్పున రోజుకు 60000 నుండి 80000 ఆలోచనలు చేస్తాడని అంచనా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందులో చాలా వరకు ఆలోచనలు మళ్లీ మళ్లీ వచ్చేవి ఎలాంటి ప్రాముఖ్యత లేనివే ఉంటాయి. వీటి వల్ల మన జీవితానికి ఎలాంటి ఉపయోగం ఉండదు.
మనం అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండే ఎలాంటి విరామం లేకుండా ఆలోచిస్తూనే ఉంటాం. ఆ ఆలోచనలు ఆఖరుకి నిద్ర లో ఆగకుండా కలల రూపంలో వస్తాయి. ఆలోచించాల్సిన అవసరం లేనపుడు కూడా మనం ఆలోచిస్తూనే ఉంటాం. మనలో చాలా మందికి ఆలోచించడం ఒక వ్యసనంలా మారిపోతుంది. అది మన ఆధీనంలో ఉండదు. మనం ఆలోచించకుండా ఉండాలన్నా ఉండలేని స్థితికి వెళ్ళిపోతాం.
ఏ మెషీన్ అయినా విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటే దాని సామర్థ్యం తగ్గిపోతుంది. అదే విధంగా మనం ఆలోచించే విధానం మరియు మన మైండ్ విషయంలో కూడా. ఎన్నో సంవత్సరాల నుండి విరామం లేకుండా ఆలోచిస్తూనే ఉండడం వల్ల మన ఆలోచన లో పదును మరియు సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి మన మైండ్ కి బ్రేక్ ఇచ్చి మన ఆలోచనలని మరింత పదును పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.
మన మైండ్ కి విరామం ఎలా ఇవ్వాలి ? చాలామంది వాడిన పద్దతి ఏంటంటే “ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నించడం”. కానీ మనం కళ్ళు మూసుకుని ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నిస్తే ఇంకా ఎక్కువ ఆలోచనలు రావడం మొదలవుతాయి. కాబట్టి “ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నించడం” ఉపయోగపడదు. మన మైండ్ ను ట్రైన్ చేసి అసలు ఆలోచనలు లేని స్థితికి వెళ్లాలంటే ఒక క్రమపద్ధతిలో సాధన అవసరం. ఇలా చెయ్యడం వాళ్ళ మనకి అవసరం అయినప్పుడు ఆలోచిస్తూ అవసరం లేనపుడు ఆలోచించకుండా ఉండొచ్చు. మనం కార్ వాడుకుంటామే ఎలా అన్నమాట. ఈ క్రమ పద్దతిలో చేసే సాధన నే మెడిటేషన్ అంటారు.
మెడిటేషన్ చెయ్యడం వల్ల క్రమంగా మన మైండ్ ఒక నిశ్చల స్థితిలోకి చేరుకుంటుంది. ఆ నిశ్చల స్థితిలో ఆలోచనలు ఉండవు, ఎమోషన్స్ ఉండవు, రేపు ఉండదు, నిన్న ఉండదు, మెడిటేషన్ చేసేవారు ఆ నిశ్చల స్థితి యొక్క అనుభవంతో ప్రస్తుత క్షణంలో ఉంటారు. ఈ గాఢమైన నిశ్శబ్దం ప్రతీ ఒక్కరి జీవితంలో చాలా గొప్ప అనుభవం.
ఒకటి రెండు సార్లు మెడిటేషన్ చెయ్యడం వల్ల ఈ స్థితికి వెళ్ళలేరు. మొదటి సారి ఈ నిశబ్ధాన్ని రుచి చూడడానికి కానీసం వారాలనుండి కొన్ని నెలలు పడుతుంది. మనం చదవడానికి రాయడానికి సమయం పట్టినట్టే మన మైండ్ ను ట్రైన్ చెయ్యడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఈ సమయం ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది.
క్రమం తప్పకుండా మెడిటేషన్ చెయ్యడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం.
1. మన ఆలోచనలో స్పష్టత వస్తుంది. జీవితం ఎన్నో ఎంపికలు ఇస్తుంది, ఏది ఎంచుకోవాలో మీకు తెలుస్తుంది.
2. మెడిటేషన్ వల్ల మీ మైండ్ కి కావాల్సిన విశ్రాంతి దొరకడం వల్ల ఆలోచనా శక్తి పెరిగి మీ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
3. మీ జీవితంలో మీకు ఏం కావాలో ఏం వద్దో స్పష్టం గా తెలుస్తుంది. ఈ స్పష్టత మీ కలలను నిజం చేసుకోవడానికి, గొప్ప గొప్పవి సాధించడానికి సహాయపడుతుంది.
4. మెడిటేషన్ వల్ల మీ ఆలోచన మీద మీకు పూర్తి అదుపు ఉంటుంది. దానివల్ల మీరు ఒక కొత్త బిజినెస్ లేదా ఏదైనా ఆవిష్కరించడానికి లేదా కొత్త పెయింటింగ్ లేదా ఒక పాట ని సృష్టిస్తారు. ప్రపంచంలో గొప్పవి గొప్పవి సృష్టించిన వారు లేదా సాధించినవారు వారి ఆలోచనల మీద అదుపు సాధించిన వారే.
5. ఒత్తిడిని తగ్గించి శారీరకంగా,మానసికంగా, ఎమోషనల్ గా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చాలావరకు ఆధునిక రోగాలు ఒత్తిడి వల్ల వచ్చేవే. రోజూ మెడిటేషన్ చెయ్యడం వల్ల ఆ రోగాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
6. రోజూ ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా నిర్వహించడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది.
7. మీకు ఎదురయ్యే సమస్యలు అధికమించే సామర్థ్యాన్ని ఇస్తుంది
8. మీ ఎమోషన్స్ మీద అదుపు వచ్చేలా చేస్తుంది. ఎమోషన్స్ మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి అదుపులో లేకపోతే జీవితం మీద నెగెటివ్ ప్రభావం చూపిస్తాయి. ఎమోషన్స్ మీద అదుపు సాధించడం అనేది జీవితంలో మిమ్మల్ని విజయవంతం చేస్తుంది. ఎమోషన్స్ మీద అదుపు సాధించడానికి మెడిటేషన్ సహాయపడుతుంది.
9. రిలేషన్ షిప్స్ మెరుగు పడతాయి ఎందుకంటే మీరు మీ మాటలని, పనులని, ఆలోచనలని, ఎమోషన్స్ ని చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు. రిలేషన్ షిప్స్ ని దెబ్బతీసే వ్యక్తీకరణలు తగ్గిపోతాయి.
10. మైండ్ పదును అవ్వడం వల్ల మీరు చేసే పనిలో నాణ్యత పెరుగుతుంది.
11. కొత్తవి నేర్చుకునే సామర్థ్యం చాలా పెరుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది.
12. మీ లోపల ప్రశాంతతని నింపుతుంది. జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది
13. మిమ్మల్ని దయ, కరుణ కలిగిన గొప్ప వ్యక్తిగా మారుస్తుంది
14. మెడిటేషన్ చేయడం వల్ల డిప్రెషన్ , ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనల నుండి బయట పడొచ్చు.
ప్రతీరోజూ మెడిటేషన్ చెయ్యడం వల్ల ఈ లాభాలు పొందవచ్చు. అయితే, మెడిటేషన్ చెయ్యడం ఎలా ?
ఈ ప్రపంచంలో వందల రకాల మెడిటేషన్ లు ఉన్నాయి. అన్నిటి లక్ష్యం ఒకటే. మైండ్ యొక్క నిశ్చల స్థితి. ఈరోజు అతి తేలికైన మెడిటేషన్ తో మొదలు పెడదాం. అదే Awareness. అంటే గతం గానీ భవిష్యత్తు గానీ ఆలోచించకుండా పూర్తిగా ప్రస్తుత క్షణంలో ఉండడం. మనలో చాలామంది గతంలో జరిగిపోయినదాని గురించో లేదా భవిష్యత్తులో జరగబోయే దాని గురించో ఆలోచిస్తూ ఉంటారు. మనం చాలా అరుదుగా ప్రస్తుత క్షణంలో ఉంటాం.
మీరు భోజనం చేస్తున్నప్పుడు, Awareness అంటే మీరు భోజనం చేస్తున్నారు అనే స్పృహలో ఉండడం. మీరుకేవలం భోజనం చేస్తున్నారు. ఇంకేం ఆలోచించట్లేదు. Tv చూడట్లేదు. ఫోన్ మాట్లాడట్లేదు, text messages పంపడం లేదు. ఇంకా సులువుగా చెప్పాలంటే మనం ఏ పని చేస్తున్నామో దానిమీదే శ్రద్ద పెట్టడం awareness.
Awareness ని సాధన చెయ్యడం మీరు ఈ రోజే మొదలు పెట్టగల సులువైన మెడిటేషన్ . మీరు తీసుకునే శ్వాస మీద లేదా మీరు చేసే ఏ పని మీద అయినా awareness సాధన చేయవచ్చు. Awareness గురించి ఇంకా తెలుసుకుని మీ జీవితంలో పాటించడానికి “Awareness – a simple tool to make life joyful” అనే ఆర్టికల్ చదవండి. మెడిటేషన్ గురించి మరింత తెలుసుకోవడానికి “Top 10 Myths and Truths of మెడిటేషన్ ” చదవండి
మీకు పాటించడానకి అనువైన ఏ మెడిటేషన్ అయినా ఎంచుకోండి. మెడిటేషన్ తో మీ అందమైన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇంక ఆలస్యం చేయకండి. మీరు జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలంటే పదునైన మైండ్ కావాలి. ఈరోజు మెడిటేషన్ మొదలు పెట్టి జీవితాన్ని మార్చేసే ఎన్నో లాభాలు పొందండి.