సరైన నిద్ర వల్ల కలిగే 15 ప్రయోజనాలు

సరైన నిద్ర
Share

“నిద్ర అనేది జీవితపు నర్సు, స్వర్గం నుండి రోజురోజుకు కొత్తగా మమ్మల్ని సృష్టించడానికి పంపబడింది” – చార్లెస్ రీడ్

నిద్ర- నీరు, ఆహారం లానే నిద్ర కూడా మనకి నిత్యావసరo. సగానికి పైగా మన జీవితం నిద్రలోనే గడుపుతాo. నిద్ర మనల్ని రిలాక్స్ చేసి నూతన ఉత్సాహo తో ఉండేలా చేస్తుంది. బాగా అలసిపోయిన రోజు హాయిగా పడుకుని ఫ్రెష్ గా లేస్తే ఎంత బావుంటుందో కదా? మనం నీరు తాగకుండా 4 రోజులు ఉండగలం. ఆహారం లేకుండా 25 రోజులు ఉండగలం. కానీ నిద్ర  లేకుండా 6-7 రోజులు మాత్రమే ఉండగలం. మనం బతకడానికి ఆహారం కన్నా నిద్ర ఎక్కువ అవసరం.

ఈరోజు సరైన నిద్ర వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం. మనకి ఎంత నిద్ర అవసరం?? మనకి ఎంత నిద్ర అవసరమో మన వయసు వల్ల నిర్ణయించబడుతుంది.

వయసు                                        కావాల్సిన నిద్ర 
నవజాతశిశువు రోజుకి 14నుండి 17 గంటలు
12 నెలలు                                    రాత్రి 10 గంటలు మరియు పగలు 4 గంటలు
2 సంవత్సరాలు                        రాత్రి 11 నుండి 12 గంటలు మరియు పగలు 1 నుండి 2 గంటలు
3 నుండి సంవత్సరాలు                  10 నుండి 13 గంటలు
6 నుండి 13 సంవత్సరాలు          9 నుండి 11 గంటలు
14 నుండి 17 సంవత్సరాలు        8 నుండి10 గంటలు
పెద్దలు                                      7 నుండి 9 గంటలు

సరైన నిద్ర లేకపోవడం వచ్చే సమస్యలు

సరైన నిద్ర లేకపోవడం మన జీవితంలో  ప్రతీ దానిమీద ప్రభావం చూపుతుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల వచ్చే ఈ కింది విధంగా ఉంటాయి.

1. విసుగు

2. బరువు పెరగడం

3. డిప్రెషన్

4. మైండ్ సరిగా లేకపోవడం

5. జ్ఞాపకశక్తి మందగించడం

6. నిర్ణయం తీసుకునే శక్తి తగ్గుతుంది

7. తార్కిక సామర్థ్యం తగ్గుతుంది

8. సమస్యలు solve చెయ్యడం కష్టమవుతుంది

9. అలర్ట్  గా ఉండలేరు

10. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది

11. కాన్సర్, హైపర్ టెన్షన్, డయాబెటిస్ లాంటి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.

12.ప్రమాదాలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది

13. శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా ఆరోగ్యంగా ఉండలేరు

14. ఒత్తిడి

15. త్వరగా వయసయిపోతుంది

16. ఎప్పుడూ సరైన ఆరోగ్యం లేకపోవడం

17. పని చేసే సామర్థ్యం తగ్గుతుంది

18. సృజనాత్మకత తగ్గుతుంది

సరైన నిద్ర లేకపోవడం మనల్నే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ ను కూడా ప్రభావితం చేస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదా?? కానీ నిజం. Us, UK, canada, Germany, and Japan చేసిన “Why Sleep Matters— The Economic Costs of  Insufficient  Sleep” అనే research ఈ కింది విషయాలను వెల్లడిస్తుంది.

1. సరైన నిద్ర లేకపోవడం పని చేసే సామర్థ్యం మందిగిస్తుంది.

2. పని చేసే జనాభా కి సరైన నిద్ర లేకపోవడం వల్ల US 1.2 మిలియన్ పని రోజులని, 411 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోతుంది. ఇది GDP లో 2.28%. విధులకి హాజరు కాకపోవడం వల్ల మొత్తం ప్రొడక్టివిటీ లో లోటు మొదలవుతుంది.

3. ప్రతీ సంవత్సరం జపాన్ 138 బిలియన్ డాలర్లు మరియు 6,00,000 పని దినాలు, జర్మనీ 60 బిలియన్ డాలర్లు మరియు 2,00,000 పని దినాలు, UK 50 బిలియన్ డాలర్లు మరియు 2,00,000 పనిదినాలు, కెనడా 21.4 బిలియన్ డాలర్లు మరియు 80,000 పనిదినాలు కోల్పోతున్నాయి.

4. నిద్ర అలవాట్లని మార్చుకోవడం ద్వారా గొప్ప లాభాలు పొందవచ్చని ఎన్నో research లు చెప్తున్నాయి.
ఉదాహరకు, 6 గంటల kannaa తక్కువ సమయం నిద్రపోయే వాళ్ళు 6 నుండి 7 గంటకు నిద్రపోవడం
మొదలుపెడితే అది US కి 226.4 బిలియన్ డాలర్ల ఆదాయం తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు సరిగా నిద్ర పోవడం వల్ల మీకు మాత్రమే కాదు దేశానికి కూడా ఎంతో మేలు చేసినవారవుతారు. ఇది గొప్ప విషయమే కదా??

సరైన నిద్ర వల్ల కలిగే 15 ప్రయోజనాలు: 

ఒక స్త్రీ ఇంటి బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడంలో నిద్ర ప్రాముఖ్యత చాలా ఉందని ఎన్నో గొప్ప పరిశోధనలు తెలుపుతున్నాయి. సరైన నిద్ర యొక్క 15 ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

1. మనం మేల్కొని చురుకుగా ఉన్నప్పుడు మెదడులో వ్యర్థ పదార్థాలు పెరుగుతాయి. నిద్ర ఈ వ్యర్థాలని తొలగిస్తుంది. కాబట్టి, మీ మెదడు చక్కగా పనిచేయాలని మీరు కోరుకుంటే, సరిగా నిద్రపోండి.

2. మన శరీరం బిలియన్ల కణాలు కలిసి పనిచేసే సంక్లిష్టమైన యంత్రం. నిద్ర ఈ కణాలు, కణజాలాలు మరియు అవయవాలను నయం చేస్తుంది మరియు మరమత్తు చేస్తుంది.

3. నిద్ర మీకు ఒత్తిడి తగ్గించడానికి మరియు మీ రోజును తాజాగా ప్రారంభించడానికి సహాయపడుతుంది

4. మంచి నిద్ర రోజంతా మీరు అలర్ట్ గా ఉండేలా చేస్తుంది.  మరియు మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది.

5. నిద్ర మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మిక స్థాయిలో కూడా నయం చేస్తుంది

6. నిద్ర మీ శరీరం మరియు మనస్సును చైతన్యంతో  నింపుతుంది

7. మిమ్మల్ని యవ్వనంగా మరియు అందంగా ఉంచడంలో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనిని బ్యూటీ స్లీప్ అని పిలుస్తారు.

8. సరైన ఆహారం మరియు వ్యాయామంతో పాటు, బరువు తగ్గడంలో మరియు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంలో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది

9. ఇది మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది

10. మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది

11. మంచి నిద్రతో మీరు ప్రతిదీ బాగా చేస్తారు. మీ కెరీర్, ఆరోగ్యం, రిలేషన్ షిప్స్ అన్నీ  మెరుగుపడతాయి

12. మీరు మీ పనిలో మరింత సామర్థ్యాన్ని సాధిస్తారు.  దానివల్ల మంచి ఆర్థిక మరియు వృత్తిపరమైన అవకాశాలను పొందుతారు

13. నిద్ర దీర్ఘాయువుని పెంచుతుంది మరియు సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన, సమర్థవంతమైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

14. నిద్ర మీ హార్మోన్లను సమతుల్యం చేస్తుంది

15. సృజనాత్మకత పెంచుతుంది

ఇవి మంచి యొక్క ప్రయోజనాలు. కొన్నిసార్లు, కొన్నిసార్లు ప్రయాణం లేదా ఇతర పనుల కారణంగా, మీరు మీ నిద్ర సమయంలో రాజీ పడవలసి ఉంటుంది. అప్పుడప్పుడు రాజీ పడటం గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఆ తర్వాత రోజు హ్యాపీ గా పడుకోండి.

కాబట్టి మీ జీవితంలో తగిన ప్రాముఖ్యత ఇవ్వండి. ఈ ఆధునిక కాలంలో, సోషల్ మీడియా, నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్, తీవ్రమైన పని, తక్కువ సమయంలో ఎక్కువ చేయాలనే  తాపత్రయం వల్ల ఇంకా  అనేక కారణాల వల్ల రోజుకు 8 గంటలు  నిద్ర పోవడం సవాలుగా మారింది. ఈ కారణాలు మీ నిద్రను ప్రభావితం చేయనివ్వవద్దు.

మీ నిద్ర యొక్క పరిమాణం మరియు నాణ్యత చాలా  ముఖ్యమైనది. భోపాల్‌లో గ్యాస్ లీక్ విషాదం, చాలా మంది మృతి చెందిన చెర్నోబిల్ సంఘటన వంటి విపత్తులు నిద్ర లేమి యొక్క ఫలితాలు. 40% హైవే ప్రమాదాలు డ్రైవర్లు సరైన నిద్ర లేకుండా డ్రైవింగ్  చేయడం వల్ల జరుగుతాయి. కాబట్టి ప్రతి వ్యక్తికి వారి భద్రత కోసం మాత్రమే కాకుండా,  ఇతర వ్యక్తుల భద్రత కోసం కూడా తగినంత నిద్రపోవటం చాలా ముఖ్యం అని మనం అర్థం చేసుకోవాలి.

నిద్ర యొక్క లాభాలను పూర్తిగా పొందడానికి కావాల్సినంత నాణ్యమైన నిద్ర ఉండేలా జాగ్రత్త వహించండి. గూగుల్, కుట్టు యంత్రం, డిఎన్‌ఎ, ఐన్‌స్టీన్ యొక్క సాపేక్షత సిద్ధాంతం వంటి కొన్ని గొప్ప ఆవిష్కరణలు  నిద్రలో వచ్చిన కలల ఫలితాలే. . గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ తన కలలో వేలాది కొత్త గణిత ఆలోచనలను పొందారు. ఎవరికి  తెలుసు! మీరు కూడా మీ కలలలో కొత్త ఆలోచనలను పొందవచ్చు మరియు తదుపరి పెద్ద ఆవిష్కరణను సృష్టించవచ్చు. బాగా నిద్రపోండి.  మీ చుట్టూ ఉన్న ఇతరులను కూడా బాగా నిద్ర పోవడానికి స్పూర్తి నింపండి.

Happy sleeping!

Registration

Forgotten Password?

Loading