ఆనందకరమైన ప్రెగ్నెన్సీ కోసం 15 సాధారణ చిట్కాలు

ప్రెగ్నెన్సీ
Share

మీలో ఒక ప్రాణం రూపుదిద్దుకోవడం అనేది జీవితంలో అత్యంత గొప్ప బహుమతి.

స్త్రీ జీవితంలో ప్రెగ్నెన్సీ చాలా ముఖ్యమైన దశ. కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తిని ఆహ్వానించడం అద్భుతంగా ఉంటుంది. తనలో ఒక కాంతిని మోస్తున్న ప్రతి గర్భవతి చాలా అందంగా ఉంటుంది. మన భావోద్వేగాలు, మన ఆలోచనలు మన బిడ్డ పెరుగుదలను ప్రభావితం చేస్తాయని మన పురాణాల్లో, సైన్స్ లో కూడా ఇది చెప్తారు. ఇవి బిడ్డ యొక్క గుణగణాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఇది చాలా ముఖ్యమైనది. నెలలు నిండుతున్న కొద్దీ స్త్రీ శరీరం చాలా రకాల మార్పులకు గురవుతూ ఉంటుంది. ఇందులో చాలా మార్పులు అసౌకర్యంగా ఉంటాయి. మార్నింగ్ సిక్ నెస్,  నీరసం, వాంతులు, కడుపు నొప్పి, వెన్నునొప్పి మొదలైనవి చాలా సాధారణం. కాబట్టి ప్రెగ్నెన్సీ ని ప్రశాంతంగా నవ్వుతూ ఆనందించడం ఎలా ?

ప్రెగ్నెన్సీ కోసం 15 సూచనలు ఇప్పుడు చూద్దాం.

1. మంచి సంగీతం వినండి : తల్లి బిడ్డల మీద సంగీతం యొక్క ప్రభావం చాలా ఉంటుంది. పాజిటివ్ సంగీతం వినడం వలన బ్రెయిన్ అభివృద్ధి ఆరోగ్యకరంగా ఉంటుంది.  కాబట్టి ప్రతి రోజు మంచి సంగీతం వినండి. మీరు వినే సంగీతం పాజిటివ్ పదాలతో ఉండేలా జాగ్రత్తపడండి.  పదాలకి శక్తి ఉంటుంది.  నెగిటివ్ పదాలు నెగిటివ్ ఎనర్జీని తీసుకు వస్తాయి. ప్రెగ్నెన్సీలో వినదగిన అద్భుతమైన మ్యూజిక్ సిడిలు మీరు ఇక్కడ పొందవచ్చు.

2. ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారం తీసుకోండి : ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారం తీసుకునే విధంగా జాగ్రత్త వహించండి. ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరం ఆహారం. ప్రెగ్నెన్సీ లో పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది బిడ్డ ఎదుగుదలకు చాలా సహాయపడుతుంది. ఈ పోషకాహారం మరింత రుచికరంగా ఉండి ఆనందాన్నిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని మనస్ఫూర్తిగా తినండి.

3. గొప్ప పుస్తకాలు చదవాలి : ఇలాంటి పుస్తకాలు చదవడం ద్వారా బిడ్డ యొక్క బ్రెయిన్ ఎదుగుదల మరియు బిడ్డ యొక్క వ్యక్తిత్వం గొప్పగా ఏర్పడుతుంది. కాబట్టి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు చదవండి. పురాణాలు గొప్ప గొప్ప కథలు చదవండి. ఇవి మీ బిడ్డను ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేస్తాయి. థ్రిల్లర్స్, నెగటివ్ క్యారెక్టర్ ఉన్న పుస్తకాలు చదవకండి.

4. మీ చుట్టూ వాతావరణం పాజిటివ్‌గా ఉండేలా చూసుకోండి : మీకు నచ్చిన విధంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం అలంకరించుకోండి. అద్భుతమైన పెయింటింగ్స్, నవ్వుతున్న చిన్నపిల్లల ఫొటోస్ ఇలా ఏదైనా పెట్టండి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. అందువల్ల బిడ్డకి పాజిటివ్ ఎనర్జీ అందుతుంది.

5. ఏదైనా మంత్రం జపించండి : మంత్రాలు జపించడం వలన భయం ఆందోళన తగ్గుతుంది. ఎన్నో మంత్రాలు ఉన్నాయి. మీకు నచ్చిన ఏదైనా ఒక మంత్రాన్ని ఎంచుకుని మీరు ఏదైనా పనిచేస్తున్నప్పుడు తలచుకుంటూ ఉండండి. భయం, కోపం, విషాదం వచ్చినప్పుడు ఈ మంత్రం మిమ్మల్ని నెగిటివిటీ నుండి బయటకు తీసుకు వస్తుంది.

6. పాజిటివ్‌గా ఆలోచించండి : డెలివరీ సమయం గురించి ఆందోళన పడటం సాధారణం. మనకు ఎలాంటి భయం లేనప్పుడు మన శరీరం అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఐదు నిమిషాలు డెలివరీ అయ్యే విధానం గురించి పాజిటివ్ గా ఊహించండి. మంచి సమయంలో బిడ్డకు జన్మనిస్తున్నట్టు ఊహించుకోండి. మీరు మరియు బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు ఊహించుకుంటారు. ఇలా పాజిటివ్‌గా ఆలోచించడం వల్ల చాలా మంచి జరుగుతుంది.

7. Prenatal యోగా క్లాస్ కి వెళ్ళండి : మీ శరీరాన్ని మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ఇది ప్రెగ్నెన్సీ స్త్రీల కోసమే డిజైన్ చేయబడినది. దీని వల్ల ఈ కింది ఉపయోగాలు ఉంటాయి.

1. ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుంది

2. శరీరం యొక్క దృఢత్వాన్ని మరియు ఒంగే గుణాన్ని పెంచుతుంది.

3. వెన్నునొప్పిని తగ్గిస్తుంది

4. నిద్ర నాణ్యతను పెంచుతుంది.

5. డెలివరీ అయిన తర్వాత శరీరం త్వరగా మామూలు అవ్వడానికి సహాయపడుతుంది.

8. ప్రసవించే విధానం కోసం సిద్దపడండి: మనం సిద్దంగా లేకపోతే ప్రసవించే సమయంలో ఆందోళన, భయానికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధానం ఎలా ఉంటుందో ఒక అవగాహన పెంచుకోండి. ఏం జరుగుతుందో మీకు తెలిసినప్పుడు మీరు సిద్దంగా ఉంటారు.

9. ఆనందంగా ఉండండి: ప్రెగ్నెన్సి సమయంలో మన శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. అలాంటి సమయంలో ఉత్సాహంగా ఉండడం కాస్త కష్టమే. కానీ వీలైనంత ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు నచ్చిన పనులు చెయ్యండి. పెయింటింగ్, పాటలు పాడడం, చదవడం, మెడిటేషన్ లాంటివి చెయ్యండి. మీకు ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా చెయ్యండి. మీరు ఆనందంగా ఉంటే మీ శరీరంలో మంచి హార్మోన్స్ విడుదల అవుతాయి. అవి బిడ్డ పెరుగుదలకి చాలా సహాయపడతాయి. గర్భిణీ స్త్రీలు సంతోషంగా ఉండాలని మన పెద్దవాళ్ళు సూచించడానికి ఇదే కారణం.

10. దైవంతో కనెక్ట్ అవ్వండి: ప్రతీరోజూ కాసేపు ప్రేయర్ లేదా మెడిటేషన్ ద్వారా ఆ దైవంతో కనెక్ట్ అవ్వండి. ప్రశాంతతని ఆస్వాదించండి. ఇది మీకు ఈ ప్రయాణానికి అవసరమైన అంతర్గత శక్తిని ఇస్తుంది.

11. మీ బిడ్డతో మాట్లాడుతూ ఉండండి : మీ బిడ్డ మీరు చెప్పే మాటలు వింటుంది. పిండ దశలో ఉన్నా కూడా మీరు ఫీల్ అవుతున్న ప్రతీ ఎమోషన్ ని మీ బిడ్డ ఫీల్ అవ్వగలదు. జీవితంలో ఉండే అద్భుతమైన విషయాల గురించి మీ బిడ్డకి చెప్పండి. ప్రతీరోజూ కథలు చెప్పే సమయాన్ని పెట్టుకుని అద్భుతమైన కథలు చెప్పండి. ఈ మాటలు కడుపులో తనకి చాలా ధైర్యాన్ని ఇస్తాయి.

12. ప్రకృతిలో సమయం గడపండి: తన ఆశీర్వాదాల ద్వారా మనల్ని ఆనందంగా ఉంచే తల్లి ప్రకృతి. ఆ ఆశీర్వాదాలు ప్రకృతిలో గడపడం ద్వారా మనకి వస్తాయి. ప్రకృతిలో గడపడం వల్ల ఆనందం, ఆరోగ్యం, మరియు పాసిటీవీటీ వస్తాయి. మీకు దగ్గరలో ఉన్న పార్క్ లో నడుస్తూ అక్కడ ఉన్న పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. లేదా కనీసం వారానికి ఒక్కసారైనా సన్ రైజ్ చూడండి.

13. కలిసి నడవండి: ప్రెగ్నెన్సి అనేది భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నడవవలసిన ప్రయాణం. కాబట్టి ప్రీ నేటల్ క్లాసులలో, బిడ్డతో మాట్లాడే సమయంలో, ఇలా ప్రతీ విషయంలో మీ భర్తను కూడా బాగస్వామిని చెయ్యండి. కలిసి నడుస్తూ అందమైన జ్ఞాపకాలను భద్రం చేసుకోండి.

14. ఉత్సాహంగా ఉండండి: ప్రెగ్నెన్సి జబ్బుగానీ, వైకల్యం కానీ కాదు. ఈ సృష్టిలో ఉన్న అందమైన విషయం. కాబట్టి శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉండండి. నడుస్తూ ఉండండి, నెమ్మదిగా మీ రోజువారీ పనులు చేసుకుంటూ ఉండండి. మీ గురించి మీరు పట్టించుకుంటూ ఉండండి.

15. కృతజ్ఞతను సాధన చెయ్యండి: కృతజ్ఞత, కరుణ, దయ ఇలాంటివాటిని వాటిని మీరు సాధన చేస్తూ ఉంటే మీ బిడ్డకి కూడా ఈ గొప్ప లక్షణాలు వస్తాయి. కాబట్టి ప్రతీరోజూ కృతజ్ఞతని సాధన చెయ్యండి. మీ జీవితంలో ఉన్న గొప్ప విషయాలని ఒక పుస్తకంలో రాసుకోండి.

ప్రెగ్నెన్సి ని ఆనందమయంగా గడపడానికి కొన్ని సూచనలు ఇవి. సృష్టిలో అంత్యంత గొప్పది. ఆ స్త్రీ దైవంతో సమానం. కాబట్టి ఈ అవకాశాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఆనందంగా ఉండండి. జీవితంలో వచ్చే ఆ ఆనందమైన క్షణాలని ఆస్వాదించండి.

Registration

Forgotten Password?

Loading