పిల్లల్ని పెంచడం ఆందనకర ప్రయాణం అవ్వడానికి 15 చిట్కాలు

పిల్లల్ని పెంచడం
Share

తల్లిదండ్రులు అవడం అనేది జీవితంలో ఉన్న గొప్ప అనుభూతులలో ఒకటి. మొదటిసారి తమ పిల్లలను చేతుల్లోకి తీసుకుని లక్షణాలను ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుంటారు. అప్పుడే పుట్టిన బిడ్డని చేతుల్లోకి తీసుకోవడం ఒక గొప్ప అనుభూతి. బిడ్డ పుట్టడం అంటే తల్లిదండ్రులు కూడా పుట్టినట్టే. అప్పుడే జీవితంలో కొత్త ప్రయాణం మొదలవుతుంది.

ఇది ఉత్తమమైన పెంపకం అంటూ ఏమీ ఉండదు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులు కూడా ఎదుగుతారు. పిల్లలు పెరగుతున్న కొద్దీ తల్లిదండ్రులు కొత్త విషయాలు అర్థం చేసుకుంటారు. చిన్న పిల్లల్ని పెంచడానికి, యుక్త వయసులో పిల్లల్ని పెంచడానికి చాలా తేడా ఉంది. పిల్లల్ని పెంచాలంటే ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్దంగా ఉండడం, ఓపిక, కరుణ, అర్థం చేసుకోవడం, సమయం చాలా అవసరం.

ఎంత కష్టమైనా పిల్లలకి ఉత్తమమైనది ఇవ్వాలని ప్రతీ తల్లిదండ్రులు అనుకుంటారు. పిల్లల్ని పెంచడం ఆనందకరంగా ఉన్నా కొన్నిసార్లు చాలా సవాలుగా ఉంటుంది.

పిల్లల్ని పెంచడం ఎలానో 15 సూచనలు ఇప్పుడు చూద్దాం.

1. ఒత్తిడిని తగ్గించుకోండి : తల్లిదండ్రులకు సహనం అవసరం. తల్లిదండ్రులు ఒత్తిడికి గురైనప్పుడు, పిల్లలకి ఉత్తమమైనదాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల ఇది వారి శక్తిని తగ్గిస్తుంది. ఒత్తిడితో, పిల్లల మీద శ్రద్ధ పెట్టడం సవాలుగా మారుతుంది. పిల్లల్ని పెంచడం భారంగా అనిపిస్తుంది. కాబట్టి, క్రమం తప్పకుండా యోగా లేదా మెడిటేషన్ ద్వారా ఒత్తిడిని తగ్గించండి.

2. సమయం ఇవ్వండి: పిల్లలకి సమయం ఇవ్వండి. మనతో మాట్లాడాలని వారు అనుకుంటారు. నేర్చుకోవడానికి, నేర్చుకున్నది మీతో పంచుకోవడానికి చాలా ఎదురుచూస్తూ ఉంటారు. పిల్లలకి తల్లిదండ్రులే హీరోలు. మీతో సమయం గడపాలి అనుకుంటారు. ఈ ఆధునిక జీవితంలో బిజీ వల్ల పిల్లలకి సమయం ఇవ్వడం ఒక సవాలుగా మారింది. కాబట్టి తల్లిదండ్రులు ఒక ప్రణాళిక ప్రకారం పిల్లలకి సమయం ఇవ్వాలి.

3. దృఢంగా ఉండండి: తల్లిదండ్రులు శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా లేదా ఆర్థికంగా దృఢంగా లేకపోతే పిల్లల్ని పెంచడం చాలా కష్టం అవుతుంది. తల్లిదండ్రులు ఈ అన్ని విభాగాలు దృఢంగా ఉండేలా చూసుకోవాలి. దృఢమైన తల్లిదండ్రులు సహజంగానే పిల్లల్ని బాగా పెంచుతూ వాళ్ళకి ఒక రోల్ మోడల్ లాగా ఉంటారు. వాళ్ళని చూస్తూ పెరిగిన పిల్లలు వాళ్ళ లాగే దృఢంగా అవుతారు. కాబట్టి ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి.

4. చెప్పే ముందు పాటించండి: పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు కానీ వారిని గమనిస్తూ వారు చేసిందే చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లల్ని పెంచడం లో మాటల కన్నా నా పనులే ఎక్కువ మాట్లాడతాయి. పిల్లలు మంచి అలవాట్లు చేసుకోవాలని తల్లిదండ్రులు అనుకుంటే ముందు తల్లిదండ్రులు అవి అలవాటు చేసుకోవాలి. పిల్లలకి ఏం చెప్తున్నా ముందు అది తల్లిదండ్రులు చేయాలి.

5. ఇతరులతో పోల్చకండి : వేరే పిల్లలతో మీ పిల్లల్ని పోల్చకండి. ప్రతీ ఒక్కరూ ప్రత్యేకం. మరియు ఎవరి బలాలు, బలహీనతలు వారికి ఉంటాయి. వేరే వాళ్ళతో వాళ్ళని పోల్చినపుడు వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అది వాళ్ళలో ద్వేషం పుట్టేలా చేస్తోంది.

6. పిల్లల్ని కొట్టకండి : పిల్లలు కొన్ని సార్లు మితిమీరిన అల్లరి చేస్తారు. కానీ కొట్టడం దానికి పరిష్కారం కాదు. దానివల్ల వారి ఆత్మ విశ్వాసం దెబ్బతిని మానసికంగా చాలా బాధ పడతారు. అది వాళ్ళని ఎదిరించే విధంగా మారుస్తుంది. వాళ్ళలో హింస ప్రవృత్తి పెరిగిపోయేలా చేస్తుంది. కాబట్టి పిల్లల్ని కొట్టకండి.

7. క్రమశిక్షణ అలవాటు చెయ్యండి: చిన్న పిల్లలకి క్రమశిక్షణ చాలా అవసరం. వారు దృఢంగా పెరగడానికి క్రమశిక్షణ ఒక పునాదిలా ఉపయోగపడుతుంది. పిల్లలకి మార్గనిర్దేశం చాలా అవసరం. ఇది క్రమశిక్షణ వల్ల సాధ్యమవుతుంది. పిల్లలతో కూర్చుని క్రమశిక్షణ గురించి మాట్లాడండి ఎలా ఉండాలో చెప్పండి. క్రమశిక్షణ గురించి ఒక చర్చ జరపండి. అరవకుండా, కొట్టకుండా క్రమశిక్షణ నేర్పాలి. క్రమశిక్షణ కలిగి ఉండడం వల్ల జరిగే ప్రయోజనాల గురించి చెప్పండి. ఆదేశాలు ఇవ్వకుండా ఒక స్నేహితుడిలా క్రమశిక్షణ గురించి చెప్పాలి.

8. రోజూ ఒక ప్రణాళిక సిద్ధం చెయ్యండి: పిల్లలకి రోజూ ఏం చేయాలో ఒక ప్రణాళిక ప్రకారం సిద్దం చేస్తే అల్లరి తగ్గుతుంది. దీనివల్ల వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరుకుతుంది. రోజూ ఏంచేయాలో ఒక ప్రణాళిక ఇవ్వండి. ఆడుకునే సమయం, కొత్త విషయాలు నేర్చుకునే సమయం, కథలు చెప్పుకునే సమయం ఇలా ఒక ప్రణాళిక సిద్దం చెయ్యండి.

9. రక్షణ వాతావరణం కల్పించండి: పిల్లలు వారి ఆలోచనలు, భయాలు ధైర్యంగా చెప్పే వాతావరణాన్ని కల్పించండి. ఇంట్లో భధ్రత ఉంది అనే ఫీలింగ్ వాళ్ళకి కలిగేలా చెయ్యండి.

10. అభినందించండి: మీ పిల్లలు ఏదైనా పని చక్కగా చేసినపుడు మనస్పూర్తిగా అభినందించండి. అభినందన ఆత్మ విశ్వాసాన్ని పెరిగేలా చేసి మీ పిల్లలు మరింత సాధించడానికి సహాయ పడుతుంది. పిల్లల్లో సానుకూల వైకరి పెరుగుతుంది.

11. ఆరుబయట ఆడుకోవడాన్ని ప్రోత్సహించండి: పిల్లల ఆరోగ్యకరమైన పెరుగుదలకి ఆరుబయట ఆడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి బయట ఆడుకోవడానికి పిల్లల్ని ప్రోత్సహించండి. ఈ ఆటలు పిల్లలు శారీరకంగా దృఢంగా, చురుకుగా ఉండేలా చేస్తాయి. బయట ఆడుకోవడం వల్ల ఒత్తిడి, అణచుకున్న ఎమోషన్స్ కూడా తగ్గుతాయి.

12. వారి బలాలు గుర్తించండి: ప్రతీ పిల్లలకి ప్రత్యేకమైన బలాలు ఉంటాయి. వాటిని గుర్తించి అవి ఇంకా అబివృద్ది చెందేలా చెయ్యండి. వారి బలాల మీద దృష్టి సారించడానికి సహాయం చెయ్యండి.

13. ఎలక్ట్రానిక్ వస్తువులు వాడడంలో ఒక అవధి పెట్టండి: ఎక్కువగా ఇవి వాడడం వల్ల అనవసరంగా వారి శక్తి వృధాగా పోతుంది. ఎక్కువసేపు వాడితే రేడియేషన్ కి గురవుతారు. ఎక్కువ ఇవి వాడడం వల్ల ఎమోషనల్ గా దూరం అవుతారు, నిద్ర సరిగా ఉండదు, insomnia వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి వాడకంపై ఒక అవధి పెట్టండి.

14. మీ భార్యాభర్తల బంధం దృఢంగా ఉండేలా చూసుకోండి: పిల్లల్ని పెంచడంలో తల్లిదీ, తండ్రిది సమానమైన పాత్ర. పిల్లలకి వీళ్ళు ఇద్దరే రోల్ మోడల్స్. వాళ్ళలో వాళ్ళే గొడవ పడుతూ ఉండే అది పిల్లల్ని చాలా బాధ పెడుతుంది. గొడవలు జరగడం సహజమే, కానీ ఆ సంఘర్షణని వీలైనంత తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మీ ఇద్దరి మధ్య దృఢమైన బంధం ఉండడం మీరు పిల్లలకి ఇచ్చే అత్యుత్తమ బహుమతి. కాబట్టి మీ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకోండి.

15. రోజూ మాట్లాడుతూ ఉండండి: రోజూ మాట్లాడుతూ ఉండడం పిల్లల్లో చాలా మార్పు తీసుకువస్తుంది. పిల్లలకి ఇది చాలా అవసరం. కాబట్టి వీలైనంత వారితో మాట్లాడుతూ ఉండండి. వారు చెప్పేది శ్రద్దగా విని వారి ప్రపంచాన్ని అర్థం చేసుకోండి. ప్రశ్నలు అడగండి మరియు వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.

పిల్లల్ని పెంచడానికి కొన్ని సూచనలు ఇవి. ఇవి పాటిస్తే పిల్లలకి, మరియు తల్లిదండ్రులకి కూడా ఈ ప్రయాణం చాలా తేలిక అవుతుంది. పిల్లల్ని పెంచడం అనేది ఒక కళ. డానివెనక ఒక సైన్స్ ఉంది. ప్రతిరోజూ నేర్చుకునే ప్రక్రియ. దీనికి చాలా ఓపిక మరియు అర్థం చేసుకునే గుణం అవసరం. జీవితంలో షరతులు ప్రేమ దొరికే ఒకే ఒక్క దశ ఇది. ఇది తల్లిదండ్రులు మాత్రమే పొందగలరు. ఈ అద్భుతమైన బహుమతిని ఆనందించండి.

Registration

Forgotten Password?

Loading