మనం పనిచేసే చోట ఎన్నో పనులు చేయవలసి వస్తుంది. ఈ మెయిల్ కి సమాధానం ఇవ్వడం, మీటింగ్స్ ఇలా ఎన్నో చేయవలసి వస్తుంది. వీటన్నిటిని సాధించడానికి మనకి సామర్థ్యం అవసరం . మనం ఎంత సమర్థవంతంగా ఉంటే మనం అంత గొప్పగా పని చేస్తాం. ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సులువుగా అన్ని పనులు చేయగలుగుతాం. మన సమర్ధవంతంగా పని చేస్తే మనం పనిచేసే చోట మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఆ కంపెనీ యొక్క అభివృద్ధికి ఎంతో దోహదం చేసిన వారం అవుతాం.
కాబట్టి మనం పనిచేసే చోట మన సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలి ? తక్కువ సమయంలో ఎక్కువ ఎలా సాధించాలి ?
సామర్థ్యం పెరగడానికి ఇప్పుడు కొన్ని సూచనలు చూద్దాం.
1. మనల్ని డిస్టర్బ్ చేసే వాటిని వదిలేయాలి : పనిచేస్తున్నప్పుడు పని మాత్రమే చేయాలి. సోషల్ మీడియా చూసుకోవడం, ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేయడం ఇలాంటి పనులు చేయకూడదు. వీటివలన మన ఏకాగ్రత దెబ్బతిని, మన ఎనర్జీ అంతా వృధాగా పోతుంది. సోషల్ మీడియా కోసం ప్రత్యేకంగా ఒక సమయం పెట్టుకోండి. పనిచేస్తుండగా నోటిఫికేషన్స్ చూసుకోకండి. మీరు చేస్తున్న పని మీద శ్రద్ధ పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ చేయగలుగుతారు.
2. చేయవలసిన పనుల లిస్టు రాసుకోండి : చేయవలసిన పనులు లిస్టు రాసుకుని దాని ప్రకారం చేయడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రణాళికాబద్ధంగా మీరు ఒక రోజులో పూర్తి చేయవలసిన పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఏ పని మర్చిపోకుండా ముఖ్యమైన పనులు చేసే విధంగా ఈ లిస్ట్ ఉపయోగపడుతుంది.
3. ముఖ్యమైనవి ముందు చేయండి : ఒక రోజులో మనం చేయవలసిన పనులు ఎన్నో ఉంటాయి. అన్ని ముఖ్యమైనవి అయి ఉండక పోవచ్చు. కాబట్టి మీ పనులలో ముఖ్యమైనవి ముందు చేసే విధంగా ప్లాన్ చేసుకోండి.
4. అతి ముఖ్యమైన పనులు ముందు చేయండి : ఒకరోజు మొదలవగానే మీరు ఫ్రెష్ గా ఎంతో శక్తివంతంగా ఉంటారు. అప్పుడు మీరు చాలా సమర్థవంతంగా పని చేస్తారు. ఏకాగ్రత, శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో అతి ముఖ్యమైన పనులు పూర్తి చేయండి. రోజు గడుస్తున్న కొద్దీ తక్కువ ప్రాముఖ్యత ఉన్న పనులు మాత్రమే మిగులుతాయి. అవి మీరు చాలా సులువుగా చేయగలరు.
5. అతి కష్టమైన పనులకు ఒక వ్యవధి పెట్టుకోండి : కొన్ని పనులు చాలా కష్టతరంగా ఉంటాయి. అలాంటి పనులు చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఆ పని మీద గంటలు గంటలు గడిపి పూర్తి చేయలేక నాకు సామర్థ్యం లేదు అనుకునే కంటే ఒక సమయం పెట్టుకుని ఆ సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అప్పటికీ మీ వల్ల కాకపోతే ఎవరికైనా సహాయం అడగండి.
6. అన్ని పనులు మీరే చేయాలి అనుకోకండి : అన్ని పనులు మీరే చేయాలి అనుకోకుండా అవసరమైనప్పుడు, కుదిరినప్పుడు కొన్ని పనులు ఇతరులకు కూడా ఇవ్వండి. దాని వలన మీకు సమయం మిగులుతుంది. అతి ముఖ్యమైన పనులు మీద మీరు దృష్టి పెట్టగలరు.
7. విరామం తీసుకోండి : ఎలాంటి విరామం లేకుండా పనిచేస్తూ ఉండటం వల్ల మనం బ్రెయిన్ తన సామర్థ్యాన్ని కోల్పోతుంది. చురుకుగా పని చేయదు. కాబట్టి అవసరమైనప్పుడు విరామం తీసుకుని ఆ సమయంలో మిమ్మల్ని మీరు రీచార్జ్ చేసుకోండి. అలాంటి మైండ్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.
8. మీరు చేసే పనితో ప్రేమలో పడింది : మీరు చేసే పని మీకు విసుగుగా అనిపిస్తే అది చేయడం చాలా కష్టం అవుతుంది. ఇక ఆ పని మీకు చెయ్యాలి అనిపించదు. దానివలన అనుకున్న సమయానికి ఆ పని పూర్తి చేయలేక ఒత్తిడికి గురవుతారు. అలా చేయడం వల్ల మీ పని యొక్క నాణ్యత చాలా తగ్గుతుంది. కాబట్టి మీరు చేసే పనిని ప్రేమించండి. మీరు చేసే పనిలో మీరు ఎంత ముఖ్యమైనదో గుర్తుచేసుకోండి. సృజనాత్మకత తో ఆ పనిని చేయడానికి అనేక దారులు వెతకండి.
9. మీరు పనిచేసే టేబుల్ ని శుభ్రంగా ఉంచుకోండి : మీరు పనిచేసే టేబుల్ అనవసరమైన వాటితో నిండిపోయి ఉంటే మీకు ఏకాగ్రత ఉండదు। కాబట్టి మీ టేబుల్ ని శుభ్రంగా అవసరం లేనివి ఉండకుండా చూసుకోండి. కేవలం మీకు పనికొచ్చే వాటిని టేబుల్ పై ఉంచండి.
10. మీ వ్యక్తిగత విషయాలు ఇంటి దగ్గరే ఉంచండి : మీ వ్యక్తిగత సమస్యలను ఆఫీసులో ఆలోచిస్తూ బాధపడకండి. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. మనలో అందరూ ఇలాంటి వ్యక్తిగత సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. వ్యక్తిగత జీవితాన్ని, మీ పనిని వేరువేరుగా చూడడం అలవాటు చేసుకోండి. మీ వ్యక్తిగత సమస్యలను ఇంటి దగ్గరే ఉంచండి. దానివల్ల మీరు పని మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు.
11. ఒకసారి ఒకే పని చేయండి : ఒకేసారి రకరకాల పనులు చేయడం చూడ్డానికి బాగుంటుంది . కానీ అది మంచి పద్ధతి కాదు. ఒకేసారి ఎక్కువ పనులు చేసే వారి సామర్థ్యం 40 శాతం వరకు తగ్గుతుంది అని ఒక రీసెర్చ్ చెప్తుంది. అంతేకాకుండా ఒత్తిడిని కలిగిస్తూ ఏకాగ్రత లేకుండా చేస్తుంది. కాబట్టి ఒక సమయంలో ఒకే పనిని చేసి దానిని వీలైనంత ఉత్తమంగా చేయడానికి ప్రయత్నించండి.
12. రాత్రి మంచిగా నిద్ర పోండి : మీరు రాత్రి సరిగా నిద్ర పోతే ఆఫీసులో వర్క్ మీద ఎక్కువ దృష్టి పెట్టగలరు. దాని వలన మీ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి రాత్రి సరిగా పడుకుని పనిచేసేచోట ఉత్సాహంగా ఉండండి. మీరు రాత్రి సరిగా పడుకోకపోతే ఉత్సాహం లేకుండా రోజంతా నిద్రమత్తులో ఉంటారు. మీ మైండ్ చేస్తున్న పని మీద దృష్టి పెట్టలేదు.
13. మెడిటేషన్ చేయడం ద్వారా నీ మెదడుకి పదును పెట్టండి : మనం రోజు మెడిటేషన్ చేస్తే మన ఏకాగ్రత పెరుగుతుంది. దానివల్ల మనం పని చేసే సామర్థ్యం పెరుగుతుంది. మెడిటేషన్ మనలో సృజనాత్మకత పెంచుతుంది. కాబట్టి రోజూ మెడిటేషన్ చేయండి.
14. నోట్స్ రాసుకోండి : ఏమైనా మీటింగ్ లో ఫోన్ కాల్స్ లో ముఖ్యమైన విషయాలు మాట్లాడినప్పుడు వాటిని రాసుకోండి. ఇవి మీకు తర్వాత చాలా ఉపయోగపడతాయి. తప్పులు జరగకుండా చూస్తాయి. ముఖ్యమైన విషయాలు మర్చిపోకుండా ఉంటారు. తప్పులు చేయడం వల్ల మన సమయం వృధా అయి మనం పని చేసే సామర్థ్యం తగ్గుతుంది.
15. నీరు తాగుతూ ఉండండి: మన బ్రెయిన్ 85% వాటర్ తో నిండి ఉంటుంది. మన బాడీ లో వాటర్ తాగితే మనం పని చేసే సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి రోజంతా కావలసినప్పుడు మంచినీళ్ళు తాగుతూనే ఉండండి. మీతో పాటు ఒక మంచినీళ్ళ బాటిల్ ఉంచుకోండి.
మీరు పనిచేసే చోట మీ సామర్థ్యం పెరగడానికి 15 సూచనలు ఇవే. మీరు సమర్థవంతంగా పని చేసినప్పుడు మీకు సంతృప్తిగా ఉంటుంది. మనం చేసిన పనికి ఒక అర్థం ఉంటుంది. మనం విజయం సాధించే అవకాశం పెరుగుతుంది. నీ సామర్థ్యం పెరిగితే మీరు చేసే పనులకి ఒక విలువ ఏర్పడుతుంది.
బిజీగా ఉండడం మీద కన్నా మీరు చేసే పనిని సమర్ధవంతంగా చేయడానికి ప్రయత్నించండి – tim ferris