జీవితం ప్రతిరోజు ఆనందంగా, గొప్పగా ఉండదు. కొన్ని రోజులు నిరాశగా ఉంటాయి. కొన్ని రోజులు మన అదుపులో లేకుండా ఉంటాయి. కొన్ని రోజులు విపరీతమైన ఒత్తిడితో విసుగ్గా గడుస్తాయి. మంచి రోజులతో పాటు ఇలాంటి రోజులు కూడా జీవితంలో ఒక భాగం. ఇలాంటి రోజులు మనల్ని నిరాశతో నిండిపోయేలా చేస్తాయి. ఇలాంటి రోజుల్లో బాధ పడకుండా మనల్ని మనం ఒక ప్రశ్న అడగాలి. ఇలాంటి రోజులను నేను మార్చుకోవడానికి ఏమైనా చేయగలనా? ఇలాంటి రోజుని కాస్త ఆనందకరంగా మార్చగలనా?
ఆ ప్రశ్నకు సమాధానం “అవును”. ఎలాంటి రోజులు అయినా మనం గొప్పగా మార్చుకోవచ్చు. కనీసం పది శాతం మీ రోజుని గొప్పగా మార్చడానికి ఈ సూచనలు మీకు ఉపయోగ పడతాయి.
మీ రోజుని గొప్పగా మార్చడానికి 15 సూచనలు ఇప్పుడు చూద్దాం.
1. మీ స్నేహితులకు ఫోన్ చేయండి: కొంతమందితో స్నేహం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రతిరోజు వాళ్లతో మాట్లాడకపోయినా వాళ్ళు ఎప్పుడూ మనకు స్నేహితులగా ఉంటారు. వాళ్లు కేవలం మీకు ఒక్క కాల్ దూరం అంతే. అలాంటి స్నేహితులకి ఫోన్ చేసి కాసేపు మాట్లాడండి. దీనివల్ల మీరు చాలా మంచిగా ఫీలవుతారు.
2. మంచి మ్యూజిక్ వినండి: మంచి మ్యూజిక్ మీ మూడ్ ని మారుస్తుంది. గొప్ప మ్యూజిక్ ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని ఆ ప్రదేశం యొక్క వైబ్రేషన్స్ మార్చేస్తుంది. మంచి హ్యాపీ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయండి.
3. డాన్స్: మీ గది తలుపు వేసుకుని మంచి మ్యూజిక్ ప్లే చేసి మిమ్మల్ని ఎవరూ చూడట్లేదు అన్నట్టు డాన్స్ చేయండి. మీరు డాన్స్ ఎలా చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు కేవలం డాన్స్ చేయడం ముఖ్యం. ఇది వెంటనే మీ మూడ్ ని మారుస్తుంది.
4. అరోమా థెరిపీ: అరోమా థెరపీలో మీ మూడ్ ను వెంటనే ఆనందంగా మార్చడానికి సహాయపడే చాలా విషయాలు ఉన్నాయి. మొక్కల నుండి తీసిన Essential Oils కి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. అవి నయం చేయగలవు. Lemon Essential Oil లేదా lavender oil మీ మూడ్ ని వెంటనే మారుస్తాయి. Diffuser సహాయంతో ఇవి మీద గది నిండా ఉండేలా చూసుకోండి.
5. అగరొత్తులు: అగరు వత్తులు వెలిగించడం మన మూడ్ ని ఆనందంగా చేయడానికి సహాయపడుతుంది. చందనం, గులాబీ ఏదైనా మీకు నచ్చింది వెలిగించండి. సహజమైనవి వాడండి. దీనికి బదులు సాంబ్రాణి కూడా వాడవచ్చు.
6. సన్ సెట్ చూడండి: సన్ సెట్ చూడడం మన మైండ్ ని ప్రశాంతంగా మారుస్తుంది. మన కళ్ళకి, మన మైండ్ కి మంచిది. ఇది మనల్ని నూతనోత్సాహంతో ఉండేలా చేస్తుంది. సన్ సెట్ చూసే సమయంలో మీకు నచ్చిన మంత్రాన్ని జపించండి.
7. శుభ్రం చేసుకోండి: ఇది మీ మూడ్ మార్చుకోవడానికి చాలా సహాయపడుతుంది. మీరు పని చేసుకునే టేబుల్ లేదా మీ బెడ్ రూమ్ మీ సమయాన్ని బట్టి మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. మీరు ఏది ఎంచుకున్నా అక్కడ అవసరం లేనిది ఏదైనా ఉంటే దాన్ని తీసేయండి. మిగిలిన వాటిని జాగ్రత్తగా మీకు నచ్చిన విధంగా సర్దుకోండి. దీనివల్ల మీ సామర్ధ్యం పెరుగుతుంది. గొప్పగా ఫీల్ అవుతారు. దాంతోపాటు మీ చుట్టూ ఉన్న ఆ ప్రదేశం గొప్పగా మారుతుంది.
8. వ్యాయామం: నడవడం, స్కిప్పింగ్, stretches లాంటి వ్యాయామాలు చేయండి. మీ శరీరానికి మైండ్ కి చాలా సంబంధం ఉంటుంది. మన శరీరాన్ని ప్రభావితం చేసేవన్నీ మన మైండ్ ను కూడా ప్రభావితం చేస్తాయి. మీరు వ్యాయామం చేసినప్పుడు మంచి హార్మోన్లు విడుదలవుతాయి.
9. సృజనాత్మకత: పెయింటింగ్, కవితలు రాయడం లేదా youtube లో do it yourself crafts చూసి ఇలా ఏదైనా క్రియేటివ్ గా చేయండి. అది మీకు ఒక సంతృప్తినిస్తుంది. నీకు వంట చేయడం ఇష్టమైతే ఒక కొత్త వంట చేయండి.
10. జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి: గతంలోని ఒక మంచి ఫోటోని చూసి అప్పటి ఆనందమైన రోజులు గుర్తు చేసుకోండి. ఆ ఫొటోస్ లో ఉన్న అద్భుతమైన క్షణాలని ఎంజాయ్ చేయండి. అలాంటిది మీ జీవితంలో ఇచ్చినందుకు ఆ దైవానికి కృతజ్ఞత చెప్పండి. ఆ ఫోటోలో మీతో పాటు ఉన్న వాళ్ళకి థాంక్స్ చెప్పండి.
11. నవ్వు: నవ్వండి. ఇంకేం చేయొద్దు. నవ్వు మూడ్ ని మారుస్తుంది. ఇది మన శరీరానికి అవసరమైన మంచి హార్మోన్లను విడుదల చేస్తుంది. కేవలం కూర్చుని నవ్వితే మన మూడ్ మారుతుంది. నవ్వు రాకుండా నవ్వినా అది మనకు చాలా మంచి చేస్తుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి.
12. గట్టిగా నవ్వండి : మీకు నచ్చిన కామెడీ చూస్తూ గట్టిగా నవ్వండి. ఇది మీ శరీరానికి ఒక థెరపీ లాగా పనిచేస్తుంది. మీ శరీరాన్ని, మైండ్ ని, ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది.
13. కొత్త బట్టలు వేసుకోండి: మీ దగ్గర కొత్త బట్టలు ఉంటే వేసుకోండి. కొత్త బట్టలు వేసుకోవడం అనేది మీ మూడ్ ను వెంటనే మారుస్తుంది.
14. అందంగా రెడీ అవ్వండి: మీకు బయటకు వెళ్లే ఉద్దేశం లేకపోయినా మంచి బట్టలు వేసుకుని అందంగా రెడీ అవ్వండి. మిమ్మల్ని మీరు అభినందించుకోవడం మర్చిపోవద్దు. అందంగా రెడీ అవ్వడం మూడ్ ని మారుస్తుంది.
15. పువ్వుల వాసన చూడండి: మీ ఇంట్లో గానీ, బాల్కనీలో గానీ పువ్వులు ఉంటే వాటి వాసన చూడండి. వాటిని పట్టుకుని ఆ మృదుత్వాన్ని ఆస్వాదించండి.
ఒకరోజు ని గొప్ప రోజు గా మార్చుకోవటానికి ఉపయోగపడే 15 సూచనలు ఇవే. బయట జరిగేవి మన ఆధీనంలో ఉండకపోవచ్చు. కానీ మన లోపల జరిగే వాటిని మనమే అదుపు చేయగలం. రోజులు ఎలా గడపాలో మనమే నిర్ణయించుకోవాలి. జీవితం చాలా చిన్నది. మంచి నిర్ణయం తీసుకోండి.
Keep Smiling!!