కొన్ని దశాబ్దాల క్రితం, కిరాణా సామాగ్రి, బ్యాంకింగ్, గృహ కార్యకలాపాలు మొదలైన వివిధ కార్యకలాపాల కోసం ప్రజలు రోజువారీ పనుల కోసం శారీరకంగా ఎక్కువ కష్టపడుతూ ఉండేవారు. పనిమనిషి, వాషింగ్ మెషీన్లు, వాక్యూమ్ క్లీనర్లు చాలా తక్కువమందికి ఉండేవి. ఇంటర్నెట్ లేదు. కాబట్టి, రోజువారీ పనులకోసం తెలియకుండానే ఎక్కువగా కష్టపడేవారు. మనం తెలిసి చేసినా తెలియకుండా చేసినా శారీరక శ్రమ చాలా ముఖ్యం.
ఆధునిక కాలంలో, మనకు చాలా పనులకోసం కోసం ఇంటర్నెట్ ఉంది. ఒకే క్లిక్‌తో, పనులు పూర్తవుతాయి. పనిమనిషి సాధారణమైంది. చాలా వరకూ పనులు మనం కదలనవసరం లేకుండానే అయిపోతున్నాయ్. ఈ కారణాల వల్ల, ఈరోజులలో మనుషుల శారీరక శ్రమ చాలా తక్కువ అయ్యింది. మనలో చాలామంది రోజుకి కనీసం 30 నిముషాలు కూడా శారీరక శ్రమ లేని జీవన శైలికి అలవాటు పడిపోయారు.
ఇలాంటి జీవనశైలి ప్రపంచవ్యాప్తంగా సాధారణ విషయం అయిపోయింది. పిల్లల నుండి పెద్దల వరకూ ఎలక్ట్రానిక్ వస్తువులకు బానిసలు అయిపోయారు. మనలో చాలా మంది శారీరక శ్రమను చాలా కష్టంగా చూడటం మొదలుపెట్టాము. శారీరక శ్రమ కేవలం బరువు తగ్గాలి అనుకుంటున్న వారికి మాత్రమే అనుకుంటున్నాం. పూర్తి సృహతో మన జీవితంలో శారీరక శ్రమని ఒక భాగం చేయకపోతే చాలా నష్టపోతాం.
కాబట్టి, శారీరక శ్రమ లేని జీవనశైలిని కలిగి ఉండటంలో తప్పేంటి? ఒక వ్యక్తి జీవితంలో శారీరకంగా ఎందుకు చురుకుగా ఉండాలి? ఎవరైనా అడిగే కొన్ని ప్రశ్నలు ఇవి.
శారీరకంగా శ్రమ లేకపోతే వచ్చే నష్టాలు ఇప్పుడు చూద్దాం.
1. అటువంటి జీవనశైలితో బరువు పెరగడం మరియు ఊబకాయం రావడం తప్పనిసరి. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.
2. మన బావోద్వేగాలకు, మానసిక ఆరోగ్యానికి శారీరక శ్రమ అవసరం. తగినంత శారీరక శ్రమ చేయకపోవడం ఆందోళన మరియు నిరాశకు దారితీస్తుంది. ఇది మానసిక వైకల్యానికి దారితీస్తుంది.
3. డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది
4. వివిధ రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది.
5. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
6. జుట్టు రాలడానికి దారితీస్తుంది.
7. మన శరీర కండరాలు పనిచేసే నియమం ఒకటే. వాడండి లేదా కోల్పోoడి. దీని అర్థం, మన శరీరంలోని కండరాలను ఉపయోగించనప్పుడు కండరాల బరువు పెరిగిపోయి క్రుంగిపోతాయి మరియు బలాన్ని కోల్పోతాయి.
8. ఎముకలు బలహీనపడతాయి.
9. పేలవమైన రోగనిరోధక శక్తికి దారితీస్తుంది, దీనివల్ల అంటువ్యాధులకు, కాలానుగుణంగా వచ్చే ప్లూ లను తట్టుకునే శక్తి పోతుంది.
10. రక్త ప్రసరణ సరిగా జరగదు.
11. హార్మోన్ల అసమతుల్యతకు దారితీయవచ్చు.
12. బద్ధకాన్ని పెంచుతుంది.
13. తక్కువ శక్తి స్థాయిలకు దారితీస్తుంది.
14. quality of sleep తగ్గిపోయి క్రమేణా నిద్ర లేమికి దారి తీస్తుంది.
పైన తెలిపిన ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు అది ఒక వ్యక్తి జీవన ప్రమాణాన్ని తగ్గిస్తుంది.
మన శరీరం శ్రమ కోసం రూపొందించబడింది. దానికి సరైన శ్రమ లేకపోతే అనేక వ్యాధులకు గురి అవుతుంది. శారీరక శ్రమ లేకుండా ప్రకృతి నియమాలకు వ్యతిరేకమైన జీవన శైలి కలిగి ఉండడం వల్ల క్రమేణా జీవితంలో ఆనందం లేకుండా పోతుంది. మనం శారీరక శ్రమను మన జీవితంలో భాగంగా చేసుకోవాలి. శారీరకంగా చురుకుగా ఉండే విధంగా మన జీవనశైలి మారాలి ఎందుకంటే మన శరీరం అలానే రూపొందించబడింది.
శారీరకంగా చురుకైన జీవితాన్ని గడపడం వల్ల కలిగే ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి.
1. రోజంతా బలంగా ఉండేలా చేసిన మన సామర్థ్యం పెరిగేలా చేస్తుంది
2. శారీరక శ్రమ శరీరంలో మంచి హార్మోన్లను విడుదల చేస్తుంది కాబట్టి ఇది మంచి మానసిక స్థితిని సృష్టిస్తుంది.
3. శారీరక శ్రమ ఒత్తిడిని దూరం చేస్తుంది.
4. నిరాశను దూరం చేస్తుంది.
5. శరీరానికి విశ్రాంతినిస్తుంది.
6. మన శరీరామలో ఉన్న విష పదార్థాలను బయటకి పంపుతుంది.
7. Quality of sleep మెరుగుపరుస్తుంది మంచి నిద్ర పట్టేలా చేసి నూతన ఉత్సాహంతో ఉండేలా చేస్తుంది.
8. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
9. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
10. సరైన బరువు ఉండేలా చేస్తుంది తద్వారా మన ఆత్మ విశ్వాసం పెరుగుతుంది
11. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
12. ఇది ఎముకలు, కండరాలు మరియు కీళ్ళను బలపరుస్తుంది. ఒక వ్యక్తి కండరాలను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తారో, అవి అంతా బలమైన మరియు ఆరోగ్యకరమైన కండరాలు అవుతాయి.
13. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాలానుగుణంగా వచ్చే ఫ్లూ మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.
14. రక్తపోటును నియంత్రిస్తుంది.
15. చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
16. మెదడు ఆరోగ్యం మరియు జ్ఞాపకశక్తికి పెంచుతుంది.
17. జీవితాన్ని అద్భుతంగా బతకడానికి సహాయపడుతుంది
శారీరకంగా చురుకైన జీవితాన్ని గడపడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి. ఏదైనా శారీరక శ్రమలో రోజుకు కనీసం 30 నిమిషాలు గడపడం చాలా మంచిది.ఇది కనీస శారీరక శ్రమ. ఒక వ్యక్తి ఎంత శారీరకంగా చురుకుగా ఉంటాడో, అతని జీవితం అంత ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది.
మీరు చేయదగిన శారీరక శ్రమ ఈ కింద ఉన్నాయి.
1. నడవడం: నడవడం ఎవరన్నా చేయదగిన చాలా సులువైన శారీరక శ్రమ. ఎలాంటి మెషీన్స్ అవసరం లేదు. ఎక్కడైనా చెయ్యవచ్చు.
2. సరైన వ్యాయామం: సరైన శిక్షకుడి పర్యవేక్షణలో కనీసం 30 నిముషాలు సరైన వ్యాయామం చేసినా అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది
3. ఈత: పెద్దలకి పిల్లలకి చాలా నచ్చే సులువైన శారీరక శ్రమ
4. తోటపని: మీకు స్థలం ఉంటే మొక్కలు పెంచడం, వాటిని అందంగా ఉండేలా చూడడం లాంటివి చెయ్యండి అది మీ శరీరానికి మరియు మైండ్ కి చాలా మంచిది
5. డ్యాన్స్ – ఎవరూ మిమ్మల్ని చూడట్లేదు అన్న విధంగా డాన్స్ చెయ్యండి. ఇది సరదాగా ఉండే చాలా గొప్ప వ్యాయామం, ఒత్తిడిని దూరం చేస్తుంది.
6. యోగా – ఇది మీ శరీరం, మనస్సు మరియు ఆత్మకు అద్భుతమైన వ్యాయామం.
7. కూర్చున్న ఉన్నప్పుడు ప్రతి 30 నిమిషాల తరువాత, విశ్రాంతి తీసుకొని చుట్టూ నడవండి. ఈ చిన్న పని ఎన్నో ఆరోగ్య సమస్యలనుండి కాపాడుతుందని పరిశోధనలు చెప్తున్నాయి.
8. సైక్లింగ్ – పిల్లలు మరియు పెద్దలకు ఇది గొప్ప వ్యాయామం. మీరు మీ ఆఫీస్ కి లేదా సమీప కిరాణా దుకాణాలకు సైకిల్ మీద వెళ్ళవచ్చు.
9. సాధ్యమైనప్పుడల్లా, దగ్గర ప్రదేశాలకు నడవడం, లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఉపయోగించడం, యంత్రాలు లేకుండా మీ ఇంటి పనులను చెయ్యడం లాంటివి చేయండి
10. గేమ్స ఆడటం – మీరు వారానికి ఒకసారి అయినా గేమ్స్ ఆడవచ్చు. సన్ లైట్ తగిలేలా చేసి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
వివిధ శారీరక శ్రమల్లో మీరు పాల్గొనడానికి ఇవి కొన్ని మార్గాలు. శారీరక శ్రమ అనేది మన జీవితంలో కీలకమైన వాటిలో ఒకటి. రోజుకు కనీసం 30 నిమిషాల శారీరక శ్రమకు సమయం కేటాయించటానికి మనం బద్దకం వల్ల మానేస్తే చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
ఈరోజు నుండే మీ జీవన శైలిని మార్చుకోవడం మొదలు పెట్టండి .
Wishing you health and strength.