ప్రకృతి లో గడపడం వల్ల కలిగే 20 లాభాలు

నేచర్
Share

చల్లని చెట్టు నీడలో మీరు చివరిసారిగా ఎప్పుడు ఉన్నారో గుర్తుందా ? మీరు సన్ రైజ్  చూసి ఎన్ని రోజులు అవుతుంది ? మీరు ప్రశాంతంగా నిండు పౌర్ణమిని ఎప్పుడు ఆస్వాదించారు ? చిన్న పిల్లల్లా వానలో ఎప్పుడు ఎంజాయ్ చేశారు ? మనలో చాలా మందికి వీటికి సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వీటన్నిటినీ చూసే తీరిక లేని ఆధునిక జీవితం మనది. ఉరుకుల పరుగుల జీవితంలో పడిపోయాం. మన లక్ష్యాలు చాలా ఉన్నతమైనవి. మన రోజులు చాలా బిజీగా ఉంటాయి. మన జీవితం ఒత్తిడితో కూడుకున్నది. ఇలాంటి జీవన విధానం వల్ల మనం ప్రకృతిలో గడపలేక పోతున్నాం.

పచ్చని చెట్లు, పక్షులు, జంతువులు, రంగురంగుల పువ్వులు, సూర్యుడి కాంతి, చంద్రుని వెన్నెల, నక్షత్రాలు, సముద్రం, చల్లని గాలి ఇలా ప్రకృతి ఎన్నో రూపాలలో మన చుట్టూ ఉంటుంది. చెట్ల లాగానే, పక్షుల లాగానే మనం కూడా ప్రకృతిలో భాగమే, మన ఉనికికి కారణం ప్రకృతే. మన జీవితం ప్రకృతి మీద ఆధారపడి ఉంది. కానీ మనలో చాలామంది వాళ్ళ జీవితంలో ప్రకృతికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వరు. ఈ ఆధునికత,నాగరికత వల్ల మనం ప్రకృతి నుండి చాలా దూరంగా బతుకుతున్నాం.

ప్రకృతిలో గడపడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి ? ప్రకృతిలో గడపడానికి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి ?

ప్రకృతి లో గడపడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం.

1. ప్రకృతిలో గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈరోజుల్లో ఒత్తిడి చాలా సాధారణం అయిపోయింది. ఇప్పుడు వస్తున్న ఎన్నో రోగాలకి కారణం ఒత్తిడి. మనం తరుచూ ప్రకృతిలో కాస్త సమయం గడిపితే మన ఒత్తిడి చాలా తగ్గుతుంది. ఎన్నో రోగాలనుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

2. మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన ఆరోగ్యంగా ఉండాలంటే రోగ నిరోధక శక్తి చాలా అవసరం.

3. శరీరాన్ని, మైండ్ ని రిలాక్స్ చేస్తుంది. కేవలం ఐదు నిముషాలు ప్రకృతిలో గడిపినా ఈ అనుభూతిని పొందవచ్చని ఎన్నో పరిశోధనలు చెప్తున్నాయి.

4. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, bp అదుపులో ఉంచుతుంది.

5. జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది.

6. వయసు పెరుగుతున్నా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎక్కువగా ప్రకృతిలో గడిపే పెద్దవాళ్ళకి కీళ్ల నొప్పులు, నిద్రలేమి లాంటి సమస్యలు వచ్చే అవకాశం తక్కువ అని పరిశోధనలు చెప్తున్నాయి.

7. మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఆందోళనని, నిరాశని, భయాన్ని తగ్గిస్తుంది.

8. మన మూడ్ ని వెంటనే మారుస్తుంది. మీరు ఎప్పుడైనా కాస్త మూడీగా ఉన్నప్పుడు కాసేపు ప్రకృతిలో గడిపి చూడండి. ఆ మ్యాజిక్ మీరే చూస్తారు.

9. ప్రాణిక్ హీలింగ్ ప్రకారం, మన ఆరోగ్యం అనేది మనలో ఉన్న ప్రాణ మీద ఆధారపడి ఉంటుంది. మనలో కావాల్సినంత ప్రాణ ఉన్నప్పుడు మన ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ప్రాణ సూర్యుడి నుండి, భూమి నుండి, గాలి నుండి వస్తుంది. ప్రకృతిలో గడపడం వల్ల మనలో ప్రాణ పెరుగుతుంది.

10. మన శరీరానికి నయం అయ్యే గుణాన్ని పెంచుతుంది.

11. మనల్ని ఆనందంగా ఉండేలా చేస్తుంది. ఆనందమే మనల్ని నిజంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది .

12. సృజనాత్మకతని పెంచుతుంది. సమస్యలు పరిష్కరించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

13. మనం రోజులో ఎన్నో పనులు చేస్తాం. అలసిపోవడం చాలా సహజం. ప్రకృతిలో గడిపితే మన శరీరం , మైండ్ , మరియు ఆత్మ నూతన ఉత్సాహంతో ఉంటాయి.

14. జీవితం కొన్ని సార్లు చాలా రొటీన్ గా తయారవుతుంది. ప్రకృతిలో గడపడం వల్ల జీవితం ఎప్పుడు కొత్తగా ఉంటుంది.

15. మన చర్మం యొక్క ఆరోగ్యాన్ని పెంచి యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

16. సరైన నిద్ర మన ఆరోగ్యానికి చాలా అవసరం. ప్రకృతిలో గడపడం వల్ల మన Quality of Sleep చాలా మెరుగు పడుతుంది.

17. మనం సన్ లైట్ లో గడిపినపుడు మన శరీరంలో విటమిన్ D పెరుగుతుంది. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.

18. ప్రకృతిలో గడపడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

19. మన ఫిట్ నెస్ ని పెంచుతుంది. ఇంట్లో చేసిన వ్యాయామం కన్నా ప్రకృతిలో చెయ్యడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. కాబట్టి ప్రకృతిలో చెయ్యడం ప్రారంభించండి.

20. మన Quality of life పెరిగేలా చేసి ఒక సంతృప్తిని ఇస్తుంది.

ప్రకృతిలో గడపడం వల్ల వచ్చే లాభాలు ఇవి.

ఈ లాభాలు పొందడానికి ఎంతసేపు ప్రకృతిలో గడపాలి ? పరిశోధనలు చెప్తున్న విషయాలు ఇప్పుడు చూద్దాం.

1. ఒక వ్యక్తి ఐదు నిముషాలు ప్రకృతిలో వ్యాయామం చేస్తే, ఆత్మ విశ్వాసం ఎంతో పెరుగుతుంది.

2. వారానికి రెండు గంటలు ప్రకృతిలో గడిపే వ్యక్తుల మానసిక మరియు శారీరక ఆరోగ్యం చాలా పెరగడం గమనిస్తారు.

3. 2013 లో david suzuki ఫౌండేషన్ వాళ్ళు 30*30 ఛాలెంజ్ నిర్వహించారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా రోజుకి 30 నిముషాలు, 30 రోజుల పాటు ప్రకృతిలో గడపాలి. 10000 మంది కెనడా వయసులో ఇందులో పాల్గొన్నారు. వారు ఈ కింది లాభాలు పొందారు

1. energy levels పెరిగాయి

2. పని సామర్థ్యం పెరిగింది

3. ఒత్తిడి తగ్గింది

4. Quality of sleep పెరిగింది

5. ఆనందం పెరిగింది

కాబట్టి మీకు నచ్చినంత సేపు మీ సమయాన్ని బట్టి ప్రకృతిలో గడపండి. ప్రకృతిలో గడపడం అంటే ఎక్కడో దూరంగా ఉన్న హిల్ స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. అది అందరికీ కుదరకపోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న పార్కు దగ్గర చెట్టుకింద గడిపినా ఇవే లాభాలు పొందవచ్చు.

ప్రకృతిలో సమయం ఎలా గడపాలో ఇప్పుడు చూద్దాం.

1. వేగంగా నడవడం

2. జాగింగ్

3. కూర్చుని మెడిటేషన్ చెయ్యడం

4. డీప్ బ్రీతింగ్ చెయ్యడం

5. ఆడుకోవడం

6. వ్యాయామం

7. హైకింగ్

8. యోగా చెయ్యడం

ప్రకృతిలో గడపడం వల్ల మన శరీరానికి నయం శక్తి పెరుగుతుంది అని పరిశోధనలు చెప్తున్నాయి. మీకు ఏం చేయాలనిపించకుండా బోర్ గా ఉంటే వెళ్ళి కాసేపు ప్రకృతిలో కూర్చోండి. ఆ చల్లని గాలిని ఎంజాయ్ చెయ్యండి. బయటకి వెళ్ళడానికి కూడా ఇష్టం లేదా ? అయితే ఇలా చెయ్యండి. మన ప్రకృతిలో ఉన్నట్టు ఊహించుకున్నా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయని పరిశోధనలు చెప్తున్నాయి. అద్బుతం కదా ? కాబట్టి మీరు ఎప్పుడైనా ఒత్తిడి తగ్గించుకోవాలి అనుకుంటారో అప్పుడు ఒక పెద్ద చెట్టుకింద కూర్చున్నట్టు లేదా అడవిలో నడుస్తున్నట్టు ఊహించుకోండి. మీ ఇంట్లో అందమైన ప్రకృతి పెయింటింగ్స్  పెట్టుకోవడం కూడా చాలా ఉపయోగపడుతుంది.

ప్రకృతిలో కలిసి జీవించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కాబట్టి ప్రకృతిని మన జీవితాల్లో ఒక భాగం చేసుకుందాం. ప్రకృతి మన కళ్ళకి అందంగా, హృదయానికి ఆనందకరంగా ఉంటుంది. మరియు సూర్యకాంతి, చల్లని గాలి, ఇంద్రధనుస్సు, నక్షత్రాలతో నిండిన ఆకాశం, పెద్ద చెట్లు ఇలా రకాల బహుమతులు మనకి ఇచ్చింది. ఇవి మనుషులు చేయలేనివి. కాబట్టి కాస్త సమయం తీసుకుని ఈ బాహుమతులని ఎంజాయ్ చెయ్యండి.

ప్రకృతిలోకి పరిశీలించి చూస్తే అన్నీ మరింత బాగా అర్థమవుతాయి. – ఆల్బర్ట్ ఐన్ స్టీన్

Registration

Forgotten Password?

Loading