నెయ్యి యొక్క 20 ఉపయోగాలు

నెయ్యి
Share

భారతీయ సాంప్రదాయ వంటలలో నెయ్యి ది చాలా ముఖ్యమైన పాత్ర. నెయ్యి వంటలకు ఒక ప్రత్యేకమైన రుచిని తీసుకువస్తుంది. మన నాన్నమ్మలు, అమ్మమ్మలు వంటలకి నెయ్యిని ఎక్కువగా వాడేవారు. భారతీయ వంటలైన పప్పు, పొంగల్, పచ్చళ్లు, స్వీట్స్, రోటీ, పూరీ, ఇడ్లీ మొదలైన వాటిలో నెయ్యి కూడా ఒక భాగం. అన్నం తినేటప్పుడు కూడా అన్నం మీద నెయ్యి వేస్తారు. కూరలతో అన్నం తినే ముందు మొదటి ముద్ద నెయ్యితో తింటారు. పిల్లలకి పెడతారు. గర్భిణీలకు ఇచ్చే ప్రత్యేక ఆహారాల్లో కూడా నెయ్యిని వాడతారు. మన అమ్మమ్మ,నాన్నమ్మల వంటగదుల్లో నెయ్యి పరిమళం వచ్చేది. పురాతన భారత దేశంలో నెయ్యి వాడడం వల్ల కొలెస్టరాల్ లేదా కొవ్వు భయం లేదు. నెయ్యి అనారోగ్యం అని ఎవ్వరూ అనుకునేవారు కాదు.

నెయ్యి కేవలం మన వంటల్లోనే కాకుండా మన ఆచారవ్యవహారాల్లో కూడా ఎక్కువ వాడేవారు. దేవుడిని ఆరాధించడానికి ఉపయోగించే పంచామృతంలో భాగంగా నెయ్యిని వాడతారు. ఆవు నెయ్యిని ఉపయోగించి దీపాన్ని వెలిగిస్తారు. దేవుడికి పవిత్రంగా సమర్పించే హోమాలు, అగ్నిహోత్రయాలలో నెయ్యిని వాడతారు. అన్ని ఆచారాల్లో నెయ్యి ప్రధానంగా ఉంటుంది.

భారతీయ శాస్త్రమైన ఆయుర్వేదంలో నెయ్యిని ఎన్నో రకాల మందుల తయారీకి వాడేవారు. నెయ్యిని సాత్విక ఆహారంగా పరిగణించేవారు. నయంచేసే లక్షణాలు ఎన్నో నెయ్యికి ఉన్నాయి.

పాత రోజుల్లో నెయ్యిని చాలా శుభసూచకంగా విధ్యార్థులు గురువుకి గురు దక్షిణలా ఇచ్చేవారు. నెయ్యి యొక్క గొప్పదనాన్ని తెలియజేయడానికి సంస్కృతంలో ఒక మాట ఉంది. “రుణం కృత్వ ఘృతం పిబెత్” అంటే అర్థం “ అప్పు చేసి అయినా నెయ్యి తాగమని’’. పాతరోజుల్లో నెయ్యికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. అప్పుడు నెయ్యి లేనిదే జీవితం లేదు.

గ్లోబలైజేషన్ తర్వాత ఇండియా మీద పాశ్చాత్య దేశాల ప్రభావం వల్ల నెయ్యి వల్ల  కొలెస్టరాల్  మరియు కొవ్వు పెరుగుతుందని అనుకోవడం మొదలు పెట్టాము. నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు అనే అభిప్రాయం అందరిలో పెరిగిపోవడం వల్ల వాడడం మానేశారు. బరువు పెరుగుతారు అనే భయంతో కొంతమంది మానేశారు. కొలెస్టరాల్ ని, బరువుని పెంచి మన గుండెకి హాని చేసే శత్రువులా నెయ్యిని చూడడం మొదలుపెట్టారు. దూరంగా ఉంచాల్సిన ఆహార పదార్థాలలో నెయ్యిని కూడా చేర్చేశారు. మన పెద్దవాళ్ళ జ్ఞానం మూర్ఖత్వం అనుకోవడం మొదలైంది.

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు నెయ్యిని పూజిస్తున్నాయ్. ఎన్నో పరిశోధనలు నెయ్యిని సూపర్ ఫుడ్ అంటున్నాయి. ఎంతో మంది హాలీవుడ్ సూపర్  స్టార్స్ వాళ్ళ ఫిట్ నెస్ కి నెయ్యి ఎంత ముఖ్యమో మాట్లాడుతున్నారు. మరియు డాక్టర్స్ నెయ్యిని వాడమని చెబుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా నెయ్యి దొరుకుతుంది. 2019 ఆస్కార్ అవార్డ్స్ లో నెయ్యిని హాలీవుడ్ స్టార్స్ కి గౌరవ సూచకంగా ఇచ్చారు. ఆఖరుకి మన పెద్దవాళ్ళ జ్ఞానం హాలీవుడ్ కి, ఆస్కార్ కి వెళ్ళింది.

ఇది మన నెయ్యి కథ. నెయ్యి గురించి నిజాలు అందరికీ తెలిసాయి. భయం లేకుండా నెయ్యిని తీసుకోవడం ప్రారంభించండి. మళ్ళీ మన వంటగదులు, మన ఆహారపదార్థాలు నెయ్యి యొక్క పరిమళాలు వచ్చేలా చేద్దాం.

గేదె లేదా ఆవు పాలనుండి నెయ్యిని తయారు చేస్తారు. ఆవు నెయ్యిని అన్నిటికంటే శ్రేష్టమైన నెయ్యిగా పరిగణిస్తారు. నెయ్యిని తీసుకునే ముందు మంచి క్వాలిటీ ఆవు నెయ్యిని తీసుకోండి. అప్పుడే నెయ్యి మనకి అందించే రుచిని, లాభాలను పూర్తిగా పొందగలం. మంచి నాణ్యత గల స్వచ్ఛమైన ఆవు నెయ్యి కోసం ఈ లింకు ని క్లిక్ చెయ్యండి.

నెయ్యి యొక్క లాభాలు ఇప్పుడు చూద్దాం.

1. ఆహారం జీర్ణం అవ్వడానికి తోడ్పడే ఫ్యాటీ యాసిడ్స్ అయిన బ్యూటిరెట్ నెయ్యిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నెయ్యి మన జీర్ణశక్తి ని పెంచుతుంది.

2. ఆరోగ్యంగా బరువు తగ్గేలా చేస్తుంది.

3. రుచిగా, సంతృప్తిగా ఆహరం తినేలా చేస్తుంది. కాబట్టి అవసరం లేని జంక్ ఫుడ్ తినకుండా ఉంటాం.

4. మనం ఆరోగ్యంగా ఉండడానికి మన కీళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. నెయ్యి ల్యుబ్రికెంట్ లా పనిచేసి మన కీళ్లని ఆరోగ్యంగా ఉంచుతుంది.

5. మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

6. మన శరీరంలో ఉన్న చెడు కొవ్వుని తొలగిస్తుంది.

7. చాలా వరకూ మన జీవన శైలి వల్ల వచ్చే రోగాలకు కారణం ఒత్తిడి. రోజూ నెయ్యి తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి, నిద్ర బాగా పడుతుంది.

8. కొవ్వులో మాత్రమే కరిగే A,D,E,K విటమిన్ లు మన శరీరానికి అందేలా చేస్తుంది.

9. మన తెలివితేటలను, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఎందుకంటే మన మెదడు 60% కొవ్వుతో తయారు చేయబడింది. నెయ్యిలో మంచి కొవ్వు ఎక్కువగా ఉంటుంది.

10. నెయ్యి మన మెదడుని, నాడీ వ్యవస్థని బలంగా చేస్తుంది.

11. మనం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మన వెన్నెముక దృఢంగా ఉండాలి. నెయ్యి మన వెన్నెముకకి ధృడత్వాన్ని, బలాన్ని ఇస్తుంది.

12. కొలెస్టరాల్ ని తగ్గిస్తుంది.

13. మన శరీరంలో ఇన్సులిన్ నిరోధం డయాబెటిస్,PCOD మరియు ఊబకాయం లాంటి రోగాలు వచ్చేలా చేస్తుంది. ఇన్సులిన్ నిరోధాన్ని సరిగా ఉండేలా నెయ్యి చేస్తుంది.

14. శక్తి గురించి మాట్లాడుకుంటే నెయ్యికి golden energy ఉంటుంది. మన శరీరం నూతనంగా, అందంగా ఉండాలంటే ఈ golden energy చాలా ముఖ్యం. ఈ golden energy శారీరకంగా,మానసికంగా,ఎమోషనల్ గా, అధ్యాత్మికంగా మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది

15. మన ఆలోచనలో స్పష్టత పెంచుతుంది

16. మనం ఆరోగ్యంగా ఉండడానికి వ్యాధి నిరోధక శక్తి చాలా అవసరం. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా మనం ఆరోగ్యంగా ఉండేలా మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుం ది.

17. మన కళ్ళని ఆరోగ్యంగా ఉంచుతుంది.

18. మన శరీరం యొక్క వంగే గుణాన్ని పెంచుతుంది.

19. ఆయుర్వేదం ప్రకారం, నెయ్యి మనలో సానుకూల దృక్పధాన్ని, ప్రశాంతతని పెంచే సాత్విక ఆహారం,

20. నెయ్యితో దీపం పెట్టడం వల్ల మన ఇంట్లో పాసిటివ్ ఎనర్జీ ఉంటుంది.

సుశ్రుత మహర్షి రాసిన “సుశ్రుత సంహిత” అనే గ్రంధాన్ని ఆయుర్వేదానికి మూల గ్రంధంగా పరిగణిస్తారు. సంస్కృతంలో నెయ్యిని గృత మరియు సుశ్రుత అని పిలుస్తారు.

గృత తియ్యగా, మృదువుగా దృఢమైనదిగా (వీర్య),  కణజాలాల్లో తేమను పెంచకుండా, lubricate గా elementary tract లో upword movement relieve చేసేదిగా, వేడిని తగ్గించేదిగా ఉంటుంది. వాతా పిత్తాశయాలను సక్రమంగా ఉంచుతుంది, అగ్నిని తగ్గిస్తుంది, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. తెలవిని, రంగును, మాటను, అందాన్ని, శరీరం యొక్క మృదు తత్వాన్ని, తేజస్సును, బలాన్ని, జీవన ప్రమాణాన్ని పెంచుతుంది. విషాన్ని, చెడుని చంపుతుంది.

నెయ్యి వల్ల ఉన్న బోలెడు ఉపయోగాలు ఇవి. మన వంటలకి మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఎన్నో రకాల లాభాలను ఇస్తుంది. కాబట్టి పప్పుతో, ఇడ్లీలతో, పరోటా లతో  భయం లేకుండా నెయ్యిని తీసుకోండి.

మీ రోజువారీ జీవితంలో నెయ్యిని ఒక భాగం చేసి ఆనందంగా, ఆరోగ్యంగా ఉండండి.

Registration

Forgotten Password?

Loading