తేనె యొక్క అద్భుతమైన 27 ప్రయోజనాలు

తేనె
Share

తేనె ఒక పురాతన ఆహారం, ఇది గత 5000 సంవత్సరాల్లో మన సంస్కృతి మరియు సంప్రదాయంలో భాగం. ఇది ప్రపంచంలోని ప్రతి పురాతన సంస్కృతిలో భాగం – భారత దేశం నుండి ఈజిప్టు మరియు గ్రీకు సంస్కృతుల వరకు. తేనె ఆరోగ్యకరమైన ఆహారంగా ఎక్కువగా ఉపయోగించబడుతుంది. దీనిని ఆయుర్వేదంలో మరియు సాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఔషధంగా ఉపయోగిస్తారు. హిందూ మతం యొక్క ఆచారాలలో ఉపయోగించే పంచామృతాల్లో ఇది కూడా ఒకటి. తేనెను సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. ఇది ప్రతి ఒక్కరూ ఇష్టపడే తీపి పదార్థం .

తేనె యొక్క కొన్ని ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. తేనె ఎలా తయారు చేస్తారు? తేనెటీగల కష్టం యొక్క ఫలితమే తేనె. తేనెటీగలు పువ్వుల నుండి మకరందాన్ని సేకరించి వాటి తేనెగూడులో విడుదల చేస్తాయి. అదనపు తేమను తొలగించడానికి వాటి రె క్కలను ఫ్యాన్ లా ఆడిస్తాయి. ఆ తరువాత తేనె బంగారు రంగులో ఏర్పడుతుంది. తేనె ఉత్పత్తి పూర్తయిన తర్వాత, తేనెటీగలు తేనెగూడు కణాలను మైనపుతో కప్పి, వాటిని మూసివేస్తాయి. దీని తరువాత, తేనె సేకరించేవారు వాటిని తీసివేసి తేనెను సేకరిస్తారు. ఒక పౌండ్ తేనెను ఉత్పత్తి చేయడానికి, తేనెటీగలు రెండు మిలియన్ల పువ్వుల నుండి తేనెను సేకరించడానికి, 55,000 మైళ్ళకు పైగా ప్రయాణించాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం.

ఒక సాధారణ తేనెటీగల కాలనీలో 30,000 నుండి 60,000 తేనెటీగలు ఉంటాయి. మొత్తంగా, ఒక తేనెటీగ సంవత్సరంలో సుమారు 100 పౌండ్ల తేనెను ఉత్పత్తి చేస్తుంది. ప్రకృతిలో తేనె ఈ విధంగా ఉత్పత్తి అవుతుంది. తేనె వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తేనె యొక్క అనేక బ్రాండ్లు మార్కెట్లో ఉన్నాయి. కానీ తేనె యొక్క పూర్తి ప్రయోజనాలు పొందాలంటే అందులో ఏమీ కలపకుండా ఉన్నది వాడాలి. బయట అమ్ముతున్న తేనె వేడి చేయబడుతుంది అప్పుడే తేనె యొక్క అనేక పోషకాలు పోతాయి. కాబట్టి, తేనె నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి ఎలాంటి ప్రోసెసింగ్ చేయనిది వాడాలి. కాబట్టి తేనె కొనే ముందు ఒకసారి లేబుల్ చెక్ చెయ్యండి.

తేనెను ప్రతీరోజూ మన ఆహారంలో భాగంగా చేసుకుంటే కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం.

1. తేనె రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ వివిధ వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది. నిమ్మకాయలలో విటమిన్ సి అధికంగా ఉన్నందు వల్ల, తేనెను నిమ్మకాయతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుంది. మీరు ఉదయం తేనెను, నిమ్మకాయ కలుపుకుని గోరువెచ్చని నీటిని తీసుకోవచ్చు.

2. తేనె జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రతను పెంచుతుంది.

3. దగ్గు మరియు గొంతు నొప్పికి సహజ నివారణగా WHO తేనెను సిఫార్సు చేస్తుంది.

4. తేనె యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది, అందువల్ల తేనె గాయాలను నయం చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది.

5. నిద్ర లేమితో బాధపడే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. మీరు నిద్రపోయే ముందు 1 లేదా 2 టీస్పూన్ల తేనెతో ఒక గ్లాసు పాలు తాగవచ్చు. లేదా మీ నిద్ర యొక్క నాణ్యతను  మెరుగుపరిచేందుకు నేరుగా ఒక టీస్పూన్ తేనెను తినవచ్చు.

6. తేనె నేచురల్ ఎనర్జీ డ్రింక్ ,శక్తిని త్వరగా పెంచుతుంది.

7. తేనె హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను విడుదల చేస్తుంది, ఇది బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించే యాంటీ మైక్రోబియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. తేనెను నీటితో కలిపి నేచురల్ మౌత్ వాష్ గా  ఉపయోగించవచ్చు.

8. నొప్పిగా చిగుళ్ళపై తేనెను నేరుగా రుద్దడం వల్ల నొప్పి మరియు మంట నుండి ఉపశమనం లభిస్తుంది.

9. పంచదారకి బదులుగా తేనె ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం.

10. చర్మంపై తేనె రాయడం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. తేనెను నేరుగా చర్మంపై వేసి 20 నిముషాల పాటు వదిలేసి, తర్వాత కడిగి నీటితో మసాజ్ చేస్తూ కడగేయండి.

11. చర్మంపై మచ్చలు తగ్గిస్తుంది.

12. చర్మంపై ముడతలు తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

13. యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా, మొటిమల నివారణకు తేనె చాలా బాగా పనిచేస్తుంది.

14. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది .

15. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

16. తేనె తీసుకోవడం వల్ల చక్కెర తినాలనిపించదు. అందువల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది మెటబాలిజంను  వేగవంతం చేస్తుంది. మరియు కొవ్వును కరిగిస్తుంది.

17. తేనె చుండ్రును తగ్గిస్తుంది. నీటితో తేనె కలిపి తలకి రాయండి. మూడు గంటల తర్వాత కడగండి. ఇలా వారానికి ఒకసారి చేయవచ్చు.

18. ఇది జుట్టును మృదువుగా మరియు మెరిసేలా చేయడానికి సహజ కండిషనర్‌గా పనిచేస్తుంది.

19. తేనె రాయడం వల్ల పెదాలు మృదువుగా అవుతాయి.

20. హిమోగ్లోబిన్ సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది మరియు రక్తహీనతతో బాధపడేవారికి ఉపయోగపడుతుంది.

21. చిన్నప్రేవుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన ప్రోబయోటిక్. పెరుగుతో తినడం వల్ల చిన్నప్రేవుల ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది.

22. జీర్ణక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి బలమైన జీర్ణక్రియ చాలా ముఖ్యం

23. ఇది రక్తపోటును సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. తక్కువ రక్తపోటు మరియు అధిక బ్లూక్ ప్రెజర్ రెండింటిలోనూ సహాయపడుతుంది.

24. తేనెలో నియాసిన్, రిబోఫ్లేవిన్, పాంతోతేనిక్ ఆమ్లం, కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం మరియు జింక్ వంటి చిన్న మొత్తాలలో చాలా ఖనిజాలు మరియు విటమిన్లు ఉన్నాయి.

25. తేనె ఒక వ్యక్తి యొక్క పునరుత్పత్తి శక్తిని మెరుగుపరుస్తుంది.

26. ఒక వ్యక్తిలో సాత్విక లక్షణాలను ప్రోత్సహించే సాత్విక ఆహారంగా ఆయుర్వేదంలో పరిగణించబడుతుంది.

27. ఇది శరీరం యొక్క నయమయ్యే శక్తిని పెంచుతుంది.

తేనె వల్ల కలిగే అనేక ప్రయోజనాలు ఇవి. కాబట్టి, ఆహారంలో భాగంగా తేనెను ఎలా తీసుకోవాలి ? రోజువారీ దినచర్యలో తేనెను తీసుకునే కొన్ని మార్గాలను ఇప్పుడు చూద్దాం.

1. తేనె,నిమ్మకాయను గోరువెచ్చని నీటితో తీసుకుని మీ రోజుని ప్రారంభించవచ్చు. దీనివల్ల అనేక ప్రయోజనాలను ఉన్నాయి. పైగా రిఫ్రెషింగ్ గా ఉంటుంది.

2. ఒక టీస్పూన్ తేనెను ఉదయాన్నే తీసుకోవచ్చు.

3. పంచదారకు బదులుగా తేనెను వాడవచ్చు

4. సలాడ్స్ మీద డ్రెస్సింగ్ కోసం తేనెను వాడవచ్చు

5. Smoothies లో తేనెను వాడవచ్చు, దానివల్ల smoothies రుచి పెరుగుతుంది. మన ఆరోగ్యానికి కూడా మంచిది.

6. క్యారెట్ జ్యూస్‌లో తేనె వేసి తీసుకోవచ్చు. ఇది కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

7. ఎక్కువ sugar ఉండే జామ్‌ల స్థానంలో తేనెను బ్రెడ్‌ మీదు వేసుకోవచ్చు.

8. కాలానుగుణంగా వచ్చే పండ్లపై తేనె చుక్కలు వేసుకుని తినవచ్చు.

9. పెరుగు మరియు తేనె కలయిక గొప్ప ఆరోగ్యకరమైన చిరుతిండి.

తేనెను తీసుకోవడానికి ఇవి కొన్ని మార్గాలు. మీరు క్రియేటివిటీ వాడి మీ స్వంత వంటకాలను ప్రయత్నించవచ్చు. మీరు మీ జుట్టు మరియు చర్మం కోసం తేనెను ఉపయోగించవచ్చు, దానివల్ల మీ చర్మం మరియు జుట్టు యొక్క అందం పెరుగుతుంది.

తేనె తినేటప్పుడు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం.

1. తేనెకు చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ, తక్కువగా తీసుకోవాలి – రోజుకు 6 టీస్పూన్లు లేదా 2 టేబుల్ స్పూన్ల తేనె మించకూడదు.

2. ఒక వ్యక్తి డయాబెటిక్ అయితే, తేనె కూడా పంచదారలాగే ప్రమాదకరం. దయచేసి జాగ్రత్తగా ఉండండి.

3. 1 సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వకూడదు.

4. వేడిగా ఉన్న ఏ ఆహారం లేదా పానీయంలో తేనె జోడించవద్దని ఆయుర్వేదం సిఫారసు చేస్తుంది.

5. తేనె వేడి చేయకూడదు.

కాబట్టి, ఈ మార్గాల్లో తేనెను మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ప్రారంభించండి. తేనె చాలా ప్రయోజనాలను కలిగి ఉంది. మరియు ఖచ్చితంగా మీ వంటగదిలో ఉండవలసిన సూపర్ ఫుడ్. ఈజిప్టు రాణి క్లియోపాత్రా తన అందాన్ని కాపాడుకోవడానికి చాలా ఎక్కువగా తేనెను వాడేది.

Registration

Forgotten Password?

Loading