ఈమధ్య మొత్తం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన విషయం కరోనా వైరస్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ని చాలా ప్రభావితం చేసింది. కొన్ని లక్షల మందిని భయపెట్టింది. ప్రతి నిమిషం బ్రేకింగ్ న్యూస్ లతో ప్రపంచం మొత్తం Hottest Topic అయ్యింది. TV Channels లో, WhatsApp లో ఇంటర్నెట్ అంతా దీనికి సంబంధించిన వార్తలతో నిండిపోయింది. డాక్టర్స్ కాని వారు కూడా రకరకాల సలహాలు ఇస్తున్నారు. ఏం తినాలో, ఏం తినకూడదో చెప్తున్నారు.
కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఏం చేయాలో భారత ప్రభుత్వం కొన్ని సూచనలను ఇచ్చింది. మనందరం అవి ఫాలో అవ్వాలి. అవి ఫాలో అవుతూనే ఒక ముఖ్యమైన విషయం మీద మనందరం దృష్టి సారించాలి. కరోనా వచ్చింది కదా అని కేవలం ఇప్పుడే కాదు, ఎప్పుడూ ప్రతిరోజూ చెయ్యాలి. రేపొద్దున్న ఇంకేం వైరస్ వస్తుందో ఎవరికి తెలుసు ? మనందరం ఆ ఒక్క విషయం మీద మరింత దృష్టి సారిస్తే కరోనా వైరస్ ని, ఇంకా చాలా రోగాలను చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలం. మనం దృష్టి సారించాల్సిన ఆ విషయం ఏంటి? మన రోగ నిరోధక వ్యవస్థని దృఢం చేసుకోవడం.
వైరస్ ల నుండి, బాక్టీరియా నుండి, పార సైట్స్ నుండి మనల్ని కాపాడడానికి మన శరీరంలో సహజంగానే రోగ నిరోధక వ్యవస్థ ఉంది. మనల్ని ఎన్నో రోగాల నుండి కాపాడడానికి ఈ రోగ నిరోధక వ్యవస్థ ప్రతిరోజూ పనిచేస్తూ ఉంటుంది. కానీ చాలామందికి రోగాలు ఎందుకు వస్తున్నాయ్? ఎందుకంటే రకరకాల కారణాల వల్ల వాళ్ళు వాళ్ళ రోగ నిరోధక వ్యవస్థని సరిగా చూసుకోక పోవడం వల్ల. మన రోగ నిరోధక వ్యవస్థ దాని పని అది సరిగా చెయ్యాలంటే దాన్ని మనం దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
మనం అంటే కేవలం శరీరం మాత్రమే కాదు . మనకి భావోద్వేగాలు, ఆలోచనలు ఉన్నాయి. మన ఆరోగ్యం సరిగా ఉండడంలో మన భావోద్వేగాలు, ఆలోచనలు చాలా ముఖ్యం అని సైన్స్ చెప్తుంది. ఎక్కువగా భయపడడం, ఆందోళన పడడం, తరచూ ఒత్తిడికి గురవడం, బాధ, విపరీతమైన కోపం మన రోగ నిరోధక వ్యవస్థ మీద ప్రభావం చూపించి బలహీన పడేలా చేస్తాయి. కాబట్టి శారీరకంగా, ఎమోషనల్ గా , మానసికంగా అన్ని లెవల్స్ లో రోగ నిరోధక వ్యవస్థని దృఢంగా చేసుకోవాలి. అలా చెయ్యడం ఎలా?
మన రోగ నిరోధక వ్యవస్థని దృఢంగా చేసుకోవడానికి ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం.
శరీరం
1. జంక్ ఫుడ్ మరియు ప్యాకేజ్ ఫుడ్ ని పూర్తిగా దూరం పెట్టండి . ఇవి మన రోగ నిరోధక వ్యవస్థని బలహీనం చేస్తాయి. పంచదార, మైదా, నిల్వ ఉంచే పదార్థాలు ఉన్న ఆహారానికి దూరంగా ఉండండి.
2. Frozen foods ని తినకండి
3. ఇంట్లో చేసుకున్న ఆరోగ్యకరమైన మరియు తాజా ఆహారాన్ని తినండి
4. ఆల్కహాల్ మారియు స్మోకింగ్ కి దూరంగా ఉండండి
5. ఎక్కువగా నీరు తాగుతూ రోజంతా మీ శారీరాన్ని hydrated గా ఉంచుకోండి.
6. సీజనల్ గా వచ్చే పళ్ళు మరియు కూరగాయలని తినండి.
7. బాగా నిద్రపోండి. మన రోగ నిరోధక వ్యవస్థ సరిగా ఉండాలంటే మనకి కావలసినంత నిద్ర ఉండాలి.
8. ప్రతీరోజూ కాసేపు సన్ లైట్ లో గడపండి.
9. వాకింగ్, జాగింగ్, జిమ్, గార్డెనింగ్ , లేదా యోగా ఇలా ఏదైనా ఒక physical activity ప్రతిరోజూ చెయ్యండి.
10. ఇంట్లోకి సన్ లైట్ మరియు ఫ్రెష్ గాలి వచ్చేలా తలుపులు, కిటికీలు ప్రతిరోజూ తెరవండి.
11. అన్ని విటమిన్ లు అందేలా జాగ్రత్త తీసుకోండి
12. Oil pulling చెయ్యండి
13. జల నేతి మరియు వేడి నీళ్ళతో పుక్కిళించoడి
14. Sauna లేదా స్టీమ్ చేస్తూ ఉండండి
15. మీ ఆహారంలో నెయ్యి, ఉసిరి, పసుపు ఉండేలా చూసుకోండి
మైండ్
1. పాసిటివ్ ఎమోషన్స్ అయిన కరుణ, ఆనందం, ప్రేమ, కృతజ్ఞత లాంటివి మన రోగ నిరోధక వ్యవస్థని చాలా దృఢంగా మారుస్తాయని ఎన్నో పరిశోధనల్లో తేలింది. ఈ పాసిటివ్ ఎమోషన్స్ మన శరీరాన్ని , మైండ్ ని, spirit ని దృఢంగా , అందంగా మారుస్తాయి.
2. మనందరం తప్పులు చేస్తాం. కానీ అదే బాధలో ఎప్పుడూ ఉండడం మన ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. వాటినుండి పాఠాలు నేర్చుకుని ముందుకి వెళ్లిపోవాలి. ఎదుటి వారిని మరియు మనల్ని మనం క్షమించుకోవడం నేర్చుకోవాలి .
3. మీ శరీరం బలహీన పడుతుంది అనే భయంలో మీరుంటే పతంజలి చెప్పినట్టు దానికి వ్యతిరేక ఆలోచనని సృష్టించుకోండి . “My body is happy, healthy, strong” లాంటి పాసిటివ్ ఆలోచన పెట్టుకోండి. మీకు ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు మీ శరీరం మీద శ్రద్ద పెట్టండి.
4. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఆఖరుకి కృత్రిమ మైన నవ్వు కూడా మన శరీరం మీద పాసిటివ్ ప్రభావం చూపిస్తుంది. అలాంటిది నిజమైన నవ్వు ఎంత లాభం చేస్తుంది? కాబట్టి మీకు నచ్చిన విధంగా నవ్వుతూ ఉండండి.
5. డీప్ బ్రీతింగ్ తీసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోండి. మీ శ్వాస మీద దృష్టి పెట్టి డీప్ బ్రీత్ తీసుకోండి. మీ ఆలోచనలు మరియు శ్వాస ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. మీ శ్వాస మీద దృష్టి పెట్టడం ద్వారా ఒత్తిడి సృష్టించే ఆలోచనల నుండి బయటపడొచ్చు. డీప్ బ్రీత్ మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. మీరు ఆందోళనకి లేదా ఒత్తిడికి లోనయినపుడు ఎప్పుడన్నా ఇది ప్రయత్నించవచ్చు.
6. భయం కలిగించే ఎమోషన్స్ లో ఉన్నప్పుడు మీ body sensations మీద దృష్టి పెట్టండి. దీనివల్ల మీ ఆలోచనలు మరియు భావిద్వేగాల మధ్య సమన్వయం వస్తుంది.
7. మీ visualization కి మీ body respond అవుతుంది. మీ శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉన్నట్టు visualize చేసుకోండి.
SPIRIT
1. మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే ప్రేయర్ మీకు చాలా సహాయం చేస్తుంది. ప్రేయర్ చెయ్యడం వల్ల దేవుడు మీకు ఏం కాకుండా చూసుకుంటాడు అనే భావన ఉంటుంది. దేవుడికి లేదా విశ్వం యొక్క శక్తికి , మీరు ఎలా పిలుచుకున్నా ప్రేయర్ చెయ్యడం చాలా మంచిది. కేవలం మీ గురించి, మీ కుటుంబం గురించి మాత్రమే కాదు. మీ చుట్టూ ఉన్న అందరి గురించి ప్రేయర్ చెయ్యండి. మనందరిలో ఎంతో శక్తి ఉంది, ఇలాంటి చిన్న చిన్న ప్రేయర్స్ ఈ ప్రపంచానికి మనకి ఎంతో శక్తిని ఇస్తాయి.
2. మెడిటేషన్ ,యోగా చెయ్యండి. దానివల్ల ఒత్తిడి తగ్గి శారీరకంగా , మానసికంగా,ఎమోషనల్ గా మీరు చాలా దృఢం అవుతారు.
3. అప్పుడప్పుడైనా ప్రకృతిలో సమయం గడపండి . Nature is the best healer.
4. ఆఖరుగా మీ జీవితం ఆనందంగా ఉండేలా చూసుకోండి. రోగ నిరోధక వ్యవస్థని దృఢంగా చేసుకోవడానికి ఆనందంగా ఉండడమే చాలా తేలికైన విషయం. మీ ఆనందం మీకు ముఖ్యం. మిమ్మల్ని ఎవరో ఆనందంగా ఉంచాలి అనుకోకండి. మీ నచ్చిన సంగీతం వినడం ద్వారా, డాన్స్, వంట చెయ్యడం, పాటలు పాడడం, స్విమ్మింగ్ మొదలైన వాటి ద్వారా మీ ఆనందాన్ని మీరే సృష్టించుకోండి .
మీ రోగ నిరోధక వ్యవస్థని దృఢంగా చేసే కొన్ని సూచనలు ఇవి. డాక్టర్స్ చెప్పినట్టుగా మీ చేతులు తరచూ కడుక్కుంటూ ఉండండి, మీ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. వీటితో పాటు మీ రోగ నిరోధక వ్యవస్థని దృఢంగా చేసుకోండి. ఇది మీ రోజువారీ జీవన శైలిలో భాగంగా అయిపోవాలి . ఆరోగ్యకరమైన జీవన శైలి విషయంలో మీ పిల్లలకి, మీ చుట్టూ ఉన్నవాళ్ళకి ఒక ఆదర్శం అవ్వాలి మీరు.