మీ పనికి మరియు మీ జీవితానికి మధ్య పరిమితులను పెట్టుకునేలా మూడు సూత్రాలు

Share

ఇటీవలి యాంత్రిక జీవితంలో పని మరియు జీవితం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి.
ఈ మధ్య కాలంలో ఇంటి నుండి పని చేసే వీలు ఉండటం వలన పనిని మరియు వ్యక్తిగత జీవితాన్ని విభజించి చూడటం కష్టం అయిపోయింది. ఎటైనా వెళ్ళాలి అన్న అంశం పూర్తిగా పోయి పక్క రూంకి వెళ్లటమే పెద్ద పనిగా అనిపిస్తుండొచ్చు. కొన్నిసార్లు మనతో పాటు రూంలో ఉంటున్న వారితో కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు పనిలో పడి 6 అయిపోతున్న విషయం కూడా పట్టించుకోము ఈ లోపు మనం మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యలేదనే విషయం గుర్తొస్తుంది. ఇన్ని ఆటంకాలు అవరోధాల మధ్య మన రోజు వారి పని కూడా పూర్తవ్వకపోవచ్చు.

ఒకవేళ మీరు మాత్రమే పనిని వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చెయ్యలేకపోతున్నాను అని అనుకుంటున్నట్లు అయితే మీరు పొరబడినట్టే. ఎందుకంటే ఈ భూగోళం మీద అలా భావిస్తున్నవారు కోకొల్లలు అని ఒక పరిశోధనలో తేలింది. ఏం చేస్తే మనం దీనిని అధిగమించొచ్చు , పని మరియు వ్యక్తిగత జీవితాలను ఎలా మెరుగు పరచాలి అనే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇన్ని రకాల ఒత్తిడుల మధ్య మన జీవితాన్ని మరియు పనిని సర్దుబాటు చేసే ప్రయత్నం చెయ్యటం సహజమే. ఆ క్రమంలోనే చాలా మంది నిపుణులు సరదా విషయాలు మరియు పెద్ద పెద్ద విషయాల మద్యలో సమతుల్యతను తీసుకుని రావటానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అప్పుడప్పుడు దానిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.

కారణం ? మనం వీలుపడని విషయం కోసం చూడటం. మన జీవితంలో అన్నిటికీ సరైన రీతిలో హద్దులని ఏర్పరచుకొని పనులు నిర్వహించటం వలన మనకి తెలియకుండానే జీవితంలో మరింత సరళత ఏర్పడుతుంది

మీ మనస్సు మరియు మీ చుట్టూ ఉన్న స్థలాన్ని అస్తవ్యస్త వాతావరణం నుండి వేరుచేయండి:
ఎక్కువ గజిబిజి కాకుండా పనులని నిర్వహించడం వలన మీ జీవితాలలో ఒత్తిడి మరియు అశాంతి తగ్గకపోవచ్చు, కానీ మీరు ఉపయోగకరంగా పని చేయడానికి , ఏకాగ్రతగా ఉండటానికి మరియు డేటాను మన మెదడులో మెరుగుపరచడంలో ఇది సహాయం చేస్తుంది.

ప్రతి వ్యక్తికి వర్క్ మోడ్‌లోకి రావడానికి సహకరించే స్థలం లేదా వర్క్‌స్పేస్ ఉండదు. మీరు పని చేయడానికి మీ లాంజ్ ఏరియా టేబుల్‌లోని వాడాలి అనుకుంటే దానిని మీ పనికి తగ్గట్టుగా ఎలా మలచుకోవాలో ఆలోచించండి. మీకు మీ మూడ్ నీ సెట్ చెయ్యటానికి సహాయపడే మొక్కలు లేదా వస్తువులను గదిలో ఉంచటానికి ప్రయత్నించండి.

అంతే కాకుండా మీరు పని చెయ్యటానికి ముందు మీ మూడ్ నీ దానికి తగ్గట్టుగా సెట్ చేసుకోండి. ఎన్ని గంటలు పని చేయబోతున్నారు అనే విషయాన్ని ముందుగానే పరిగణించి దానికి తగ్గట్టుగానే మీ బ్రెయిన్ నీ ప్రిపేర్ చెయ్యండి. అన్ని సక్రమంగా చేస్తున్నాము అని మిమ్మల్ని మీరే నమ్మించుకునే ప్రయత్నం చేయకండి. మీ ఎఫర్ట్ సరిగా ఉండటం వలన మీరు చేస్తున్న పనిలో మీరు ఊహించిన రీతిలో ఎదగటం ఖచ్చితంగా జరుగుతుంది.

ఒక చిన్న దినచర్యలా మీరు చిన్న అలవాటును చేసుకోండి ( రోజులో 5 నిమిషాలు మాత్రమే ఉండేలా!) ఇది మనకు తెలియకుండానే మనం మన ఆలోచనలను కేంద్రీకరించడంలో మరియు మరింత సంపూర్ణతను పెంపొందించడంలో మనకు సహాయం చేస్తుంది. మనం ఎప్పుడు, ఎందుకు ఆందోళన చెందుతున్నామో లేదా ఎందుకు నిస్తేజంగా ఉన్నామో మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకి తెలియకుండానే మనం పెట్టుకున్న లక్ష్యం లేదా చేసుకున్న అలవాటు వైపు మొగ్గచూపుతాము, ఉదాహరణకు, మామూలుగా చిన్న చిన్న స్క్రీన్ బ్రేక్ తీసుకోవడం, నడవడం లేదా, ఏదైనా మీటింగ్ ముందు ఒక 15 నిమిషాల పాటు మీ కళ్లకు విశ్రాంతి ఇవ్వడం మంచిది.

మీ కోసం కూడా మీరు కాస్త సమయాన్ని కేటాయించండి:
మీరు పనిని పూర్తి చేయడానికి మీరు వేసుకున్న ప్రణాళికలో కాస్త సమయంఉన్నట్లయితే, మీరు మీ మీద ఆ సమయాన్ని కాస్త కేటాయించొచ్చు. మీరు మీకున్న విశ్రాంతి సమయాన్ని మీరు చేయదలచిన కార్యకలాపాలు లేదా ఆసక్తులపై వెచ్చించటానికి మీ షెడ్యూల్‌లో అవి ఉండేలా ప్లాన్ చేయండి, తద్వారా అవి మీకు ఏకాగ్రతనీ పెంపొందించి మీకు సహాయపడతాయి(రొట్టె కాల్చడం, లేదా బేకరి లాంటివి). ఇలా ప్లాన్ చేసుకోవడం వలన ఎప్పుడైనా ఏదైనా పని ఒత్తిడిగా ఉన్నా లేదా వేరెవరికైనా సహాయం చెయ్యాలన్న మీరు ప్లాన్ చేసుకున్న ఆ సమయాన్ని దానిమీద వెచ్చించొచ్చు.

ఉదాహరణకు, ఎప్పుడైనా మీరు మీ ఫ్యామిలీతో సమయాన్ని కేటాయించవలసి వస్తే , మీరు మీ రోజువారీ నడక కోసం ఉంచుకున్న సమయాన్ని ఆ రోజుకి కాదనుకుని ఆ సమయాన్ని వారితో సరదాగ గడిపెయ్యొచ్చు. మీవారికి మీరెలా సమయానికి అందుబాటులో ఉంటారో అలానే మీకోసం మీరు కూడా అలానే ఉండాలి.

మీ పని మరియు ఇంటికి మధ్య సరిహద్దులను పెట్టుకోండి:
ఇది బహశా మనం ఊహించిన దానికంటే పెద్ద వ్యూహం కావచ్చు. ఎందుకంటే ఇలా సరిహద్దులని పెట్టుకోవటం అంత తేలిక కాదు. కానీ మీకు మీరుగా కానీ లేదంటే ఇతరుల సహాయం వల్ల కానీ ఖచ్చితంగా పటిష్టమైన సరిహద్దులను పెట్టుకోవాలి.

పరిమితులను నిర్వచించడం అంటే మనం డివైడర్‌ను పెట్టుకుని ఎవరూ మనతో మాట్లాడకూడదు అని ఖచ్చితంగా కాదు. పరిమితులు మంచివే. వీటివలన మనం మన సమయాన్ని మరియు శక్తిని సరైన రీతిలో ఉపయోగించుకునేoదుకు సహాయపడతాయి. ఏది ఏమైనప్పటికీ, మీ సహచరులు, కుటుంబం మరియు సహోద్యోగులతో మీరు మాట్లాడుతుంటే తప్ప మీ పరిమితులు ఏమిటి అనేవి వారికి తెలియవు.

మీరు ఏదైనా రిమోట్ గ్రూప్‌లో ఉన్నట్లయితే, ప్రతిరోజూ అందరికీ కుదిరినప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా మరొకరికి సహకరించేలా అందరూ కలిసి ఒక అవగాహనకు రావాలి. మీరు సంభాషించే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ఎక్కడున్నారు ఎప్పుడు మాట్లాడుతున్నారు అనేది. సందర్భానుచితంగా మాట్లాడటం ఎప్పటికైనా ఉత్తమం.

Registration

Forgotten Password?

Loading