విజయాన్ని చేరుకునే దారిలో మనకి ముఖ్యంగా తెలియవలసినది మనకి కావాల్సింది ఏంటి అని. దాని తర్వాత మనకి కావాలి అనుకుంటున్నది అసలు ఎందుకు కావాలనుకుంటున్నామో తెలియాలి. డిసెంబర్ 31 న మనందరం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ప్రతిరోజూ వ్యాయామం చెయ్యాలని, మెడిటేషన్ చెయ్యాలని, సోషల్ మీడియా మీద ఎక్కువ సమయం వృధా చెయ్యకూడదని…ఇలా. ఇది ఖచ్చితంగా మారాల్సిన సమయం అని ఈ సంవత్సరం నుండి మనలో మార్పు కనపడుతుంది అని అనుకుంటాం. జనవరి 1st న మాత్రం వీటిని తప్పకుండా పాటిస్తాం. రోజులు గడుస్తున్న కొద్దీ మనకి మోటివేషన్ తగ్గుతూ ఉంటుంది. తర్వాత వదిలేస్తారు. చాలా తక్కువ మందికి మార్చ్ 31 కి కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు గుర్తుంటాయి. ప్రతీ సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంటుంది. కేవలం కొత్త సంవత్సరం కోసం తీసుకున్న నిర్ణయాలు మాత్రమే మిగతా వాటిల్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. మనలో అందరికీ ఈ విషయం అనుభవమే. చాలా ఉత్సహంగా కొత్త లక్ష్యాలు పెట్టుకుంటాం త్వరగానే వాటి గురించి మర్చిపోతాం లేదా ఆ లక్ష్యాలు మార్చేసుకుంటాం. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా ?? మనకి దృఢ నిశ్చయం లేకపోవడం వల్లనా ? మనకి క్రమశిక్షణ లేకపోవడం వల్లనా ? లేదా మరేదైనా కారణమా ?
దీనికి ప్రధాన కారణం , ఆ లక్ష్యాలు మనం పెట్టుకునే సమయంలో వాటితో మనకి ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం వల్ల . మన లక్ష్యాలు మనకి కావాల్సినంత ఉత్సాహం ఇవ్వవు. వాటి మీద మనకి ఎలాంటి ఫీలింగ్ ఉండదు. కొత్త సంవత్సరం నిర్ణయాలకు మన లక్ష్యాలతో కాకుండా జనవరి 1st తో ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటాము. ఒక్కసారి జనవరి 1st అయిపోగానే మన మోటివేషన్ కూడా పోతుంది. ఒక్కసారి లక్ష్యం పెట్టుకున్న తర్వాత దాన్ని సాధించే వరకూ దానితో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉండాలి. గొప్ప గొప్పవి సాధించిన వారు రహస్యం ఇదే. ఆ క్రమశిక్షణ, ధృఢ నిశ్చయం ఎమోషనల్ కనెక్షన్ నుండే వస్తుంది. Top athletes, గొప్ప business Leaders, actors, actresses, ఇలా అనుకున్నది సాధించిన వారు ఎవరైనా emotional గా వాళ్ళ లక్ష్యాలతో connect అయ్యుంటారు. కాబట్టి , ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉండడం అంటే ఏంటి?? అంటే మీ లక్ష్యాలు సాధించడం మీకు ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలిసి ఉండడం. అవి సాధించకపోతే మీరు ఏం కోల్పోతారో తెలిసి ఉండడం. అవి సాధించాలని మీలో అలుపెరుగని తపన ఉండడం.
మన లక్ష్యాలతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల కలిగే లాభాలు ఏంటి?
1. మన లక్ష్యాలు కోసం కష్టపడుతున్నప్పుడు అవాంతరాలు రావడం మామూలు విషయమే. ఆ లక్ష్యాలు ఎందుకో, వాటి వెనక ఉన్న ఉద్దేశ్యం మీకు స్పష్టంగా తెలిసినపుడు ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని వదలరు. ఏది మీకు అనుకూలంగా లేకపోయినా మీ లక్ష్యాలు సాధించడానికి ఏదోక దారికోసం వెతుకుతారు. ఆఖరుకి ఎన్నైనా ఎదుర్కొని సాధిస్తారు.
2. మీ లక్ష్యాలు సాధించానికి తెలివిగా కష్టపడడానికి క్రమశిక్షణతో ఉంటారు. ఏదైనా సాధించాలంటే క్రమ శిక్షణ చాలా అవసరం. మీకు మీ లక్ష్యాలు ముఖ్యం అయినప్పుడే ఆ క్రమశిక్షణ వస్తుంది.
3. మీ లక్ష్యాలు సాధించడానికి ధృఢ నిశ్చయంతో ఉంటారు.
4. మీ లక్ష్యాలు సాధించడానికి చేసే ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. విజయం ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఆ ప్రయాణం కూడా అంతే ఆనందాన్ని ఇస్తుంది.
5. మీ అత్యుత్తమ సామర్థ్యం బయటకు వస్తుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. అవి సాదించానికి కావాల్సిన ఉత్సాహం ఉంటుంది.
6. అవి మీకు ఎందుకు ముఖ్యమో మీకు స్పష్టంగా తెలిసినపుడు “ నేను చెయ్యాలి అనుకుంటున్నాను కానీ నాకు సమయం లేదు” అనే సమాధానం మీనుండి రాదు. ఆ సమయం తీసుకుని కష్టపడతారు.
7. పనిని వాయిదా వెయ్యరు. “ఈ పని రేపు చేద్దాం ఈరోజుకి రిలాక్స్ అవుదాం” అనుకోరు. రిలాక్స్ అవ్వకుండా మీ లక్ష్యం మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది.
మన లక్ష్యాలతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఇవి. మీ లక్ష్యాలతో ఎమోషనల్ కనెక్షన్ఏర్పరచుకోవడం ఎలా ? ఉదాహరణకు, మీకు నచ్చిన కాలేజ్ లో సీట్ తెచ్చుకోవడం మీ లక్ష్యం అనుకుందాం.
దానితో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పరచుకోవడానికి పాటించాల్సిన steps ఇలా ఉంటాయి.
1. మీరు ఆ లక్ష్యాన్ని ఎందుకు సాధించాలనుకుంటున్నారో కారణాలు రాసుకోండి. మీ కారణాలు ఇలా ఉండవచ్చు.
● అది ప్రపంచంలోనే best కాలేజ్
● ప్రపంచస్థాయి ప్రొఫెసర్స్ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు
● ఆ కాలేజ్ కి ఆధునిక సదుపాయాలు చాలా ఉన్నాయి
● అక్కడ చదివినవారికి ఉద్యోగాలు చాలామందికి వచ్చిన record ఉంది
● Friends and relatives మీ గురించి చాలా గొప్పగా అనుకుంటారు.
● కాలేజ్ పూర్తి చేసిన తర్వాత చాలా డబ్బు సంపాదించవచ్చు
● మీ తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు
● మీకన్నా చిన్నవాళ్లకి ఆదర్శంగా ఉంటారు
తప్పు కారణాలు, సరైన కారణాలు అని ఉండవు. మీకు అనిపించిన ప్రతీ కారణాన్ని రాసుకోండి. మీరు అలా రాసుకున్న కారణాలే మీరు సాధించడానికి ఉత్సాహాన్ని ఇచ్చేవి అవుతాయి. కాబట్టి నచ్చి మిమ్మల్ని ఉత్సాహ పరిచే పదాలు వాడండి.
2. మీరు ఆ లక్ష్యాన్ని సాధించిన తర్వాత మీ life ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ ఆనందాన్ని, విజయాన్ని feel అవ్వండి. అది నిజంగా జరిగినట్టే అనుకోండి. ఆ కాలేజ్ లో మీ మొదటి రోజుని ఊహించుకోండి. ప్రతీ దాన్ని ఊహించుకోండి. కాలేజ్ క్యాంపస్, కాలేజ్ లోని అన్ని departments, మొదటి రోజు మీరు కాలేజ్ కి వేసుకెళ్ళిన dress, మీ మొదటి క్లాస్ ఇలా అన్నీ ఊహించుకోండి.
3. మీ లక్ష్యాన్ని సాధించకపోతే ఏం కోల్పోతారో అర్థం చేసుకోండి. మీ లక్ష్యాన్ని సాధించకపోతే మీ జీవితం ఎలా ఉంటుంది? విలువైంది కోల్పోయినట్లు feel అవుతారా? గొప్పది కోల్పోయినట్లు feel అవుతారా? అలా feel అవ్వకపోతే మీ లక్ష్యం మీకు అంత ముఖ్యం కాదని అర్థం. అప్పుడు మీ లక్ష్యాన్ని మార్చుకోండి. మీ లక్ష్యాన్ని సాధించకపోవడం మిమ్మల్ని emotional గా feel అయ్యేలా చేసినప్పుడే అది సాధించడానికి అడుగు ముందుకు వెయ్యగలరు.
మీ లక్ష్యాలతో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పరచుకోవడానికి పాటించాల్సిన steps ఇవి. మీరు పూర్తి సృహతో ఇలా బలమైన ఎమోషనల్ కనెక్షన్ ఏర్పరచుకుంటే అది సాధించకుండా మిమ్మల్ని ఏదీ ఆపలేదు. ఎంత ఎక్కువ ఎమోషనల్ కనెక్షన్ ఉంటే అది సాధించే అవకాశం అంత ఎక్కువ ఉంటుంది.