మన జీవితం బావుండాలంటే ఆరు కేటగిరీల గురించి పట్టించుకోవలసి ఉంటుంది. ఈ ఆరు కేటగిరీలు ఒకదానితో ఒకటి లింక్ అయ్యి ఉంటాయి. మనం ఒక కేటగిరీలో మెరుగుపడినపుడు మిగిలిన ఐదు కూడా ఎంతో కొంత మెరుగుపడతాయి. అదేవిధంగా, మనం ఒక కేటగిరిని నిర్లక్ష్యం చేసినపుడు మిగిలిన ఐదు కేటగిరీల మీద ప్రభావం చూపుతుంది. ఈ ఆరు కేటగిరీలలో మొదటిది ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ .
మనందరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలనుకుంటాం. కానీ నిజం చెప్పాలంటే మనలో చాలా మంది ఆరోగ్యం పాడయిపోయిన తర్వాతే దాని విలువ తెలుసుకుంటారు. ఒక్కసారి ఆరోగ్యం పాడయిపోయిందటే మళ్ళీ మాములు అవ్వడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. కొన్ని సందర్బాలలో మళ్ళీ మామూలు అవ్వలేము. మన శరీరం యొక్క గొప్పలక్షణం ఏంటంటే- చాలా క్షమించడం. మన చెడ్డ ఆహారపు అలవాట్లని, వ్యాయామం చెయ్యకపోవడాన్ని ఎన్నో సంవత్సరాలు క్షమిస్తుంది. ఎన్నో సంవత్సరాలు భరించిన తర్వాత ఒకరోజు సమస్య వస్తుంది. ఒక్కసారి సమస్య వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు అవ్వడానికి కొన్ని నెలలనుండి సంవత్సరాలు పడుతుంది. మన ఆరోగ్యం బావున్నప్పుడే మన ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ గురించి పట్టించుకుంటే ఎలాంటి రోగాలు లేకుండా ఆనందంగా జీవించవచ్చు.
మన శరీరానికున్న మరొక మంచి లక్షణం ఏంటంటే- ఎలాంటి వ్యాయామం చేయకుండా చెడ్డ ఆహారం కొన్ని సంవత్సరాలుగా తిన్నా కూడా, మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుని వ్యాయామం చేస్తే మన శరీరం వెంటనే మామూలు అవ్వడం ప్రారంభిస్తుంది. మన శరీరంలో మార్పు చూడడానికి కేవలం కొన్ని వారాల సమయం మాత్రమే పడుతుంది. మన శరీరం అంత అద్భుతమైనది.
మనకి ఉన్న అతి పెద్ద బహుమానం మన శరీరం.
కాబట్టి కింద తెలిపిన నాలుగు సూచనల ద్వారా మన ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ ని ఎలా పెంచుకోవాలో చూద్దాం.
1. మన ఉన్నతికి తోడ్పడే నమ్మకాలు ఏర్పరచుకోవడం: మీ నమ్మకాలే మీ జీవితాన్ని సృస్టిస్తాయి. మీ నమ్మకాలే మీరు ఎంత ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలో నిర్ణయిస్తాయి. కాబట్టి మిమ్మల్ని తీర్చిదిద్దే నమ్మకాలు కలిగి ఉండడం ఈ ప్రయాణంలో మొదటి అడుగు అన్నమాట. మీకు వ్యతిరేక నమ్మకాలు ఉన్నప్పుడు మంచి డైట్ తీసుకున్నా, వ్యాయామం చేసినా కానీ ఫలితం ఉండదు ఎందుకంటే సొంత నమ్మకాలే మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ గురించి మీ వ్యతిరేక నమ్మకాలు ఏంటో ఒకసారి ఆలోచించండి. మీ ఆలోచనలతో, మీతో మీరు మాట్లాడుకునే మాటలతో జాగ్రత్త వహించండి అప్పుడే మీకున్న వ్యతిరేక నమ్మకాలు ఏంటో తెలుస్తాయి. ఒక్కసారి తెలుసుకున్న తర్వాత ఆ నమ్మకాలని తీసేసి వాటి స్థానంలో మీ ఉన్నతికి తోడ్పడే నమ్మకాలని పెట్టుకోండి.
మీ ఉన్నతికి తోడ్పడే కొన్ని నమ్మకాలని ఇప్పుడు చూద్దాం.
1. ఆరోగ్యంగా ఉండడానికే నా శరీరం డిజైన్ చెయ్యబడింది
2. నా శరీరం తనని తాను బాగుచేసుకోగలదు. నేను దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను.
3. నేను తినే ఆహారం నేను చేసే వ్యాయామం నా ఆధీనంలో ఉంటాయి
4. ఆరోగ్యం కోసం నేను చేసుకున్న కొన్ని మార్పులకి నా శరీరం వెంటనే స్పందిస్తుంది.
5. నా శరీరం నా స్నేహితుడు
6. నేను వ్యాయామాన్ని ఎంజాయ్ చేస్తాను
7. ఆరోగ్యంగా, ఫిట్ గాఉండడం నాకు చాలా తేలిక
2. ఒక విజన్ ఏర్పరచుకోండి:
ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ లో మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం చేసుకోండి. మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోండి. అవి సాధించడం కష్టం అనుకోకండి. ఒక్క క్షణం మీరు ఏం అనుకున్నా సాధించగలరు అనుకుని ఈ కింది ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగండి.
1. నాకు ఇష్టమైన శరీరం ఎలా ఉంటుంది
2. ఆరోగ్యంగా, దృఢంగా ఉండడం ఎలా ఉంటుంది
3. నేను ఫిట్ గా ఉంటే చూడడానికి ఎలా ఉంటాను.
4. నేను ఫిట్ గా ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటాను.
5. నేను ఆరోగ్యంగా, ఫిట్ గా గా ఉంటే నా రిలేషన్ షిప్స్ ఎలా మారతాయి.
కొంత సమయం తీసుకుని వీటికి సమాధానం చెప్పుకోండి. మీ సమాధానాలు తెలిసిన తర్వాత అవి నిజంగా అయినట్టు మీ vision statement రాసుకోండి. ఇలా రాసుకున్న క్లియర్ vision subconscious mind మీద పనిచేసి మనం అనుకున్నది జరిగేలా చేస్తుంది. ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ గురించి vision statement ఎలా రాసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
1. నా శరీరం దృఢంగా. ఆరోగ్యంగా, ఫిట్ గా గా ఉంది.
2. నేను ఫిట్ గా, ఆరోగ్యంగా అందంగా ఉన్నాను
3. ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ ని నేను బలపరచుకున్నాను
4. నా శరీరం విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను
5. నేను సరైన బరువు ఉన్నాను
6. నా ఆరోగ్యం చక్కగా ఉంది
3. మీ విజన్ వెనక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి:
ఈ step లో మీరు ఆరోగ్యంగా, ఫిట్ గా ఎందుకు ఉండాలనుకుంటున్నారో కారణాలు ఒక లిస్ట్ రాసుకోండి. మీరు ఎందుకు అవి సాధించాలనుకుంటున్నారో అర్థం చేసుకోండి. మీరు రాసుకున్న కారణాలు మిమ్మల్ని inspire చెయ్యాలి. మీరు రాసుకునే కారణాలు ఇలా ఉండాలి
1. ఆరోగ్యంగా ఉండడం నాకు ఇష్టం
2. నా పిల్లలకి నేను ఒక role model లా ఉండాలి
3. నేను fit గా కనిపిస్తూ మంచి బట్టలు వేసుకోవాలి
4. నా శరీరం విషయంలో నేను confident గా ఉండాలి
5. నేను నా పిల్లలతో ఆడుకోవాలి, పరుగెట్టాలి
6. నేను healthy గా మరియు ఎక్కువ కాలం జీవించాలి
7. నేను ఎలాంటి రోగాలు లేకుండా ఉండాలి
కొంత సమయం తీసుకుని మీ ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ ఎందుకు మెరుగు పరచుకోవాలి అనుకుంటున్నారో కారణాలు రాసుకోండి. ఎంత బలమైన కారణాలు ఉంటే సాధించాలన్న సంకల్పం అంత దృఢంగా ఉంటుంది.
4. ప్రణాళికని సిద్దం చేసుకోండి:
ఈ step లో మీరు ఆరోగ్యంగా, ఫిట్ గా ఎందుకు ఉండాలనుకుంటున్నారో కారణాలు ఒక లిస్ట్ రాసుకోండి. మీకు అద్బుతమైన ఫలితాలు ఇచ్చే ఒక గొప్ప ప్రణాళికని సిద్దం చేసుకోండి. మీరు వేసుకున్న ప్రణాళిక ఎలా ఉండాలంటే మీరు ఎంత బిజీగా ఉన్నా అది పాటించేలా ఉండాలి. మీరు అనుకున్నది సాధించడానికి మీ ప్రణాళిక అడ్డు కాకూడదు. మీ ప్రణాళిక ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం.
1. నేను తినే సమయంలో నా పూర్తి శ్రద్ద అక్కడే ఉండేలా చూసుకుంటాను
2. వారానికి మూడుసార్లు యోగా చేస్తాను
3. వారానికి రెండు సార్లు strength training చేస్తాను
4. నాకు suit అయ్యే diet plan తయారు చేసుకుంటాను
5. 8 గంటలు నిద్రపోయే విధంగా నా schedule ఉండేలా చూసుకుంటాను.
6. నేను తీసుకునే Sugar 50 % తగ్గిస్తాను
7. నా భోజనం healthy గా tasty గా ఉండేలా చూసుకుంటాను.
మీరు చెయ్యాలనుకుంటున్నవన్నీ లిస్ట్ రాసుకోండి. “మీ లక్ష్యాలు సాధించడానికి 10 మార్గాలు” ఆర్టికల్ చదవండి. మీరు ఎంత busy గా ఉన్నా అనుకున్నవి చేసేలా ప్రణాళిక వేసుకోవడంలో ఈ ఆర్టికల్ సహాయం చేస్తుంది.
ఇలా ఈ నాలుగు steps మీ దగ్గర ఉంటే ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ విషయంలో మీరు అనుకున్నది సాధించడం నల్లేరుపై నడకలా చాలా తేలికగా ఉంటుంది. కాబట్టి సమయం తీసుకుని, మీ జీవితంలో చాలా ముఖ్యమైన ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ గురించి ఈ నాలుగు steps create చేసుకోండి. పాడుకోవడం మీ చేతుల్లో ఉంది. ఆలస్యం చేయకుండా ఇప్పుడే మొదలు పెట్టండి మీరు అన్నుకున్నది సాధిస్తారు.