సక్సెస్ఫుల్ రెలేషన్షిప్ కోసం మనం దూరంగా ఉంచాల్సిన 4 విషయాలు !!

relationship
Share

చాలా సార్లు  మనం  సోషల్ మీడియాలోనూ, బ్లొగ్స్ లోను రిలేషన్షిప్స్ కి సంబంధించిన రెడ్ ఫ్లాగ్స్ గమనిస్తూ ఉంటాం . అలాంటివి చూడగానే మన రిలేషన్షిప్స్ తో పోల్చుకుంటూ మన పార్టనర్స్ లో ఉన్న తప్పులు వెతకటం మొదలు పెడతాము . మనం కూడా ఏదో ఒక సందర్భం లో అవతలి వారి జీవితం లో  కూడా అంతే టాక్సిక్ పర్సన్ అయి ఉంటారేమో అన్న విషయాన్నీ కూడా మర్చిపోతాము. 

అసూయ: అసూయ, ఏదో ఒక సమయంలో మన అందరికీ కలిగిన అనుభూతే. అసూయ అంటే మనకి కావలసిన దానిని జాగ్రత్తగా ఉంచడం లేదా పర్యవేక్షించడం అని అనచ్చు. మనకి కావలసిన వాళ్ళు లేదా మన భాగస్వామి మన సమాన ప్రత్యర్దితో సన్నిహితంగా మెలుగుతూ ఉండటం లాంటివి జరిగినప్పుడు మనకి తెలియకుండానే అసూయతో అననుకూలమైన విమర్శలను చేస్తుంటాము. ఏది ఏమైనప్పటికీ, అసూయపడటం మరియు తప్పుగా కోరికలతో కూడిన అభ్యాసాలను ప్రదర్శించడం మధ్య వ్యత్యాసం ఉంది. సాధారణ అసూయ అనేది ఒక క్షణంలో కలిగి పోయే బాధ అయినట్లయితే, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఆ పద్ధతి ఆస్వాదించినప్పుడు, మనలో మనకి తెలియకుండానే ఈర్ష్యా భావం కలుగుతుంది . దాని వలన మనం అవతలి వాళ్ళని అనుమానించడం, నిందించడం లాంటివి చేస్తూ ఉంటాము. మనం మనకి కలిగే అసూయ భావాన్ని నియంత్రించకపోతే అది అపనమ్మకం ఇంకా ఆబ్సెషన్  కి దారి తీయటమే కాకుండా మనం ఎంతో జాగ్రత్తగా చూస్కున్న రిలేషన్స్ ను కోల్పోయేలా చేసే ప్రమాదం ఉంది.

పోటీతత్వం: జీవితంలో ఒకే లక్ష్యాలను పంచుకునే ఇద్దరు వ్యక్తులు రెండు వేర్వేరు మార్గాల్లో పోరాడడం అనేది ఆలోచించాల్సిన విషయం.  రిలేషన్‌షిప్‌లో చాలా మంది ధృడంగా వాదించరు , ఉన్నత మైన లక్ష్యాల వైపు  ఒకరినొకరు ప్రోత్సహించటం అనేది ఒక జట్టుగా ఉండి  లక్ష్యాలను సాధించడానికి నిరంతరం చేసే ప్రయత్నం కంటే మంచిదే.

పోటీ  అనేది ఎప్పటికైనా ముఖ్యమే . మనం స్కూల్ లో ఉన్నప్పటి నుండి , వివిధ రకాల ఉద్యోగాలు చేస్తున్నంత వరకు  రకరకాల వర్క్ ఎన్విరాన్మెంట్స్ లో ఎదురయ్యే పోటీతత్వం చూసి ఉంటాము. పోటీతత్వం లేకుంటే మనం ముందుకెళ్ళలేము. ఇది మనల్ని మనం చెక్ చేసుకునే  పద్ధతి. ఏ సందర్భంలోనైనా, సంబంధంలో పోటీ చాలా తక్కువగా ఉండాలి మరియు అది మనల్ని ఎక్కువ ప్రభావితం చేయకూడదు. ఇది సాధారణంగా తక్కువ ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు, వారి సహచరులతో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటు ఉంటారు. వారు చేసే ప్రతిదానిలో పోటీ చూడటం, లిమిట్స్ నిర్మించుకోలేకపోవడం లేదా మన ప్రియమైన వారితో సరిహద్దులను ఏర్పరచుకోలేకపోవడం వల్ల ఇలాంటి కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. పోటీతత్వం ఉన్న రంగంలో పోటీని కలిగి ఉండటం తప్పకపోయినా , ప్రతి విషయంలోనూ మీ భాగస్వామితో పోటీ పడటం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరులను అభివృద్ధి వైపు పుష్ చెయ్యటానికి,  మన అహంతో ఎదుటివారిని  కించపరిచి వారిని క్రిందికి లాగడానికి మధ్య సూక్ష్మమైన రేఖ ఉంటుంది . దీనినే మనం రిలేషన్షిప్స్ లో  అవాయిడ్ చెయ్యాలి .

అహం: ప్రేమలో అహం విషయానికొస్తే , మనకి నచ్చక తీసుకునే నిర్ణయాలవిషయంలో  మనం సాధారణంగా ఇగోకి వెళుతుంటాము. 

ఇగో విషయానికొస్తే , దానికి రిలేషన్షిప్స్ లో  ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనే హద్దులు లేవు. అందుకే ప్రేమని పంచటంలోనూ లేదా ప్రేమని   పొందే విషయంలోనూ మనల్ని మనం కంట్రోల్ చేసుకునే దిశలో ఇగో చూపిస్తూ ఉంటాము.

మనల్ని మనం రక్షించుకోవాలనే అంతిమ లక్ష్యంతో,  మన సెల్ఫ్ ఇమేజ్ వ్యతిరేకత, పోటీ, పోరాటం, అపహాస్యం, నిరుత్సాహం, ఉపసంహరణ, శత్రుత్వం, అసంతృప్తి, నిష్క్రియాత్మక శక్తి, ప్రతీకారం, అవమానకరమైన సంకేతాలు, సంకుచిత మనస్తత్వం, తప్పు, సందేహం , ద్వేషం మరియు స్వీయ ప్రశ్నలాంటి వాటిని ఆశ్రయిస్తుంది. అహం అనేది కేవలం మనల్ని  భయాందోళనలకు గురిచేసే భావన మాత్రమే కాదు, మనం అవతలి వ్యక్తికి చాలా ఎక్కువగా , చాలా ఇష్టంగా  ప్రేమించే సందర్భంలో, మన  సెల్ఫ్  ఇమేజ్ మనం ఎక్కడ మన సొంత ఆలోచనను  విడిచిపెడతామో అని  భయపడుతుంది. అలాంటప్పుడే మనం ఇష్టాలను చంపుకుంటాం.

స్వార్థం : ఒక రిలేషన్షిప్ లో అహంపూరిత లేదా స్వార్థపూరిత పనులు లేని కష్టాలను తెచ్చిపెడుతు ఉంటాయి. అవతలి వ్యక్తిని మొదట్లోనే ఎక్కడ ఉంచాలో కాస్త కష్టమైన పని అయినప్పటికీ తెలియాలి. దాని వల్ల చాలా సమస్యలను అధిగమించొచ్చు లేదంటే మన నారో  మైండెడ్ నెస్ వలన లేని చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉంది . అదే జరిగితే ఉద్దేశపూర్వంగానే అవతలి వ్యక్తిని బాధించేలా వ్యవహరిస్తూ తెలియకుండానే స్వార్థ ప్రవృత్తిని ప్రోత్సహిస్తాము. అలాంటప్పుడే ఉదారతతో నిర్ణయాలు తీసుకుని మన అహాన్ని పక్కన పెడితే స్వార్థం అనే మాటకి కాస్త దూరంగా ఉండొచ్చు . మనం ఎల్లప్పుడూ నిస్వార్ధంగా ఉంటు దానాలు చెయ్యాల్సిన అవసరం లేదు కానీ, మన ప్రవర్తన అవతలి వారిని బాధ పెడుతుందని తెలిసినప్పుడు మన స్వార్ధాన్ని కాసేపు పక్కన పెట్టి వారితో మనసు విప్పి మాట్లాడటం మంచిది. నిస్వార్థంగా ఉండటం కష్టమే కానీ స్వార్థం వలన మనిషిని కోల్పోవటం తేలిక అందుకే సందర్భాన్ని బట్టి ప్రవర్తించటం మంచిది.

మనలో ఉన్న ఏ లక్షణాలు మన రిలేషన్షిప్ కి ఇబ్బందిగా మారుతున్నాయి అన్న విషయాన్ని గుర్తించి వాటిని దూరంగా ఉంచటం మంచిది

Registration

Forgotten Password?

Loading