మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోవడానికి 4 మార్గాలు

మీ జీవితాన్ని ప్లాన్
Share

మన ఇంట్లో పార్టీ లేదా ఏదైనా ఫంక్షన్ చేస్తున్నప్పుడు మనం చాలా ప్లాన్ చేసుకుంటాం. ఎవరిని పిలవాలి, వంటలు ఏం కావాలి, బడ్జెట్ ఎంత, ఎలా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి ఇలా. సాధారణంగా ఫంక్షన్స్ కొన్ని గంటలు లేదా ఒక రోజు ఉంటాయ్. కానీ వాటిని మనం కొన్ని వారాల ముందే ప్లాన్ చేసుకుంటాం. అది విజయవంతం అవ్వడం కోసం చాలా కష్టపడతాం. ఇదంతా కేవలం ఆ ఒక్కరోజు ఫంక్షన్ కోసం. మరి కొన్ని దశాబ్దాలు ఉండే మన జీవితం సంగతి ఏంటి? మనం ప్లాన్ చేసుకున్నది సరిపోతుందా ? మన జీవితం ను ప్లాన్ చేసుకోవడానికి కనీసం కొన్ని గంటలైనా గడిపామా? దీనికి మనలో చాలామంది  సమాధానం “లేదు” అని.

కారణం రోజువారీ జీవితంలో మేం చాలా బిజీగా ఉన్నాం అంటాం. చాలా తక్కువమంది సమయం తీసుకుని జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారు. మనలో చాలామంది జీవితం ఎలా వెళ్తే అలా బతికేస్తారు. మన ఇంట్లో ఫంక్షన్  ను ప్లాన్ చేసినదాన్లో సగం కూడా మన జీవితంను ప్లాన్ చేసుకోo. మనం జీవితం ఎంత గొప్పగా ఉండాలో ప్లాన్ చేసుకోo. చిన్న చిన్న విషయాలు కూడా ప్లాన్ చేసుకోo. జీవితం అలా ముందుకు వెళ్తున్నప్పుడు మనం బాధపడతాం, పిర్యాదులు చెప్తాం, ఆశ్చర్యపోతాం. జీవితం ఇలా ఎందుకు ఉంది అనుకుంటాం? ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఒక ఫంక్షన్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎలా ఉంటుంది ? గందరోళంగా ఉంటుంది అవునా? వచ్చిన వాళ్ళు ఆనందంగా ఉండరు, డబ్బులు వృధాగా ఖర్చవుతాయి. సమయం వృధా,టెన్షన్ . మీరు ఎంత మంచివారైనా సరైన ప్లానింగ్ లేకపోతే మొత్తం వృధాగా పోతుంది. జీవితం కూడా అంతే. మన జీవితం సరిగా లేకపోవడానికి కారణం కొన్ని అంచనాల వల్ల మరియు మనం సరిగా ప్లాన్ చేసుకోకపోవడమే.

మన ఆరోగ్యం విషయం ప్లాన్ చేసుకోo దానికోసం పని చెయ్యం. ఆఖరుకి ఆరోగ్య సమస్యలతో బాధపడతాం. మన రిలేషన్ షిప్స్ మెరుగుపరుచుకోవాలని మనకు ఉండదు. కాబట్టి కాలం గడిచే కొద్దీ మన రిలేషన్ షిప్స్ లో మ్యాజిక్ పోతుంది. మన ఆర్థిక విషయాలు ప్లాన్ చేసుకోము. అందువల్ల మన సేవింగ్స్ సరిగా ఉండవు. మీరు మంచివాడైనా చెడ్డవాళ్ళు అయినా మీ జీవితాన్ని సరిగా ప్లాన్ చేసుకో పోతే అంతా గందరగోళంగా ఉంటుంది. ఆనందంగా ఉండాలంటే మన లైఫ్ ని ప్లాన్ చేసుకోవాలి.

మన జీవితాన్ని ప్లాన్ చేసుకోవడం ఎలా ?

Step 1: మీ లైఫ్ ని ప్లాన్ చేసుకోవడంలో మొదటి స్టెప్ మీరు ఎలాంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారు అనే దానితో మొదలవుతుంది. మీకు ఎలాంటి ఎత్తుపల్లాలు ఎదురైనా మీరు ఎలా ఉండాలో నిర్ణయించేది మీరే. ప్రపంచం మొత్తం కూలిపోయినా మీరు ఎలా ఉందాం అనుకుంటున్నారు? జీవితం మీకు అనుకూలంగా లేకపోయినా మీరు ఎలాంటి వ్యక్తిగా
ఉండాలనుకుంటున్నారు? క్రమశిక్షణతోనా? సమయపాలనతోనా? కరుణ కలవారిగానా? ఆశతోనా? జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానా ? ఎమోషన్స్ కి లొంగిపోతున్నానా ? ఎదుటివారిని గౌరవిస్తున్నానా ?

మీకు నచ్చిన లక్షణాలని ఎంచుకుని వాటికి లోబడి మీ జీవితాన్ని జీవించండి. మీకు విజయం మీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోవడంలో మొదటి అడుగు మీ వ్యక్తిత్వాన్ని ప్లాన్ చేసుకోవడం. మీరు ఎలాంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారో ఒక్కసారి నిర్ణయించుకున్నాక మీరు fail అయినా దానికే కట్టుబడి ఉండండి. Fail అవ్వడం మామూలు విషయమే. Fail అయినా గానీ మళ్ళీ కొత్తగా మొదలు పెట్టడం ముఖ్యమైన విషయం.

Step 2: మీరు ఎలాంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారో నిర్ణయించుకున్నాక ఇక తర్వాత step మీ జీవితానికి గొప్ప ప్రణాళిక సిద్ధం చేసుకోవడం. మనసుకు నచ్చింది చెయ్యడం అంటే జీవితంలో ఒక కేటగిరీ ని పట్టించుకుని మిగతా వాటిని నిర్లక్ష్యం చెయ్యడం కాదు. కెరీర్ లో విజయం కోసం ఆరోగ్యాన్ని మన రిలేషన్ షిప్స్ ని పణంగా పెట్టడం మంచిది కాదు. మీ జీవితానికి గొప్ప ప్రణాళికలో అన్ని కేటగిరీలను  ప్లాన్ చేసుకోవాలి. మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోవడం అనేది మీరు
మీ జీవితంలో మెరుగుపరుచుకోవాలి అనుకునే కేటగిరీల నుండి మొదలవుతుంది. మీ జీవితంలో అన్ని కేటగిరీలను మెరుగు పరచుకోవాలి . ఉదాహరణకు మీరు కేవలం మీ కెరీర్ మీద మాత్రమే శ్రద్ద పెట్టి మీ ఆరోగ్యం మరియు మీ కుటుంబాన్ని అశ్రద్ధ చేస్తే,  మీ కెరీర్ బావుడొచ్చు కానీ మిగిలినవి నెగెటివ్ గా మారతాయి. కాబట్టి మీ జీవిత ప్రణాళికలో అన్నికేటగిరీలు ఉండాలి. జీవితం ఇంద్రధనుస్సు లాంటిది అందులో అన్ని రంగులూ ఉండాలి .

మీరు ప్లాన్ చేసుకునే సమయంలో గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన ఆరు కేటగిరీల గురించి  కింద చెప్పుకుందాం .

1. Health and fitness: ఈ catogery Body weight గురించి, బలం, వ్యాధి నిరోధక శక్తి మొదలైన వాటి గురించి

2. వ్యక్తిత్వం: ఈ catogery మీ ఆలోచనలు, emotions, మీ క్రమశిక్షణ, కష్టపడే తత్వం, నిజాయితీ, మీరు ఎలాంటి వ్యక్తి అనే వాటి గురించి

3. ఆధ్యాత్మికత: ఈ Catogery Meditation, ప్రార్థన లాంటి దైవిక విషయాలతో connect అవ్వడం.

ఈ మూడు catogeries మీ Body, mind, soul ను సరైన విధంగా మెరుగు పరిచే పునాదులు. ఈ మూడు పునాదులపై ఈ కింద చెప్పిన catogeries నిలబడతాయి.

4. Relationships: ఈ catogery భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోటి పనివారితో మీ రిలేషన్ షిప్స్  గురించి

5. కెరీర్ మరియు ఆర్థిక స్థితి: ఈ catogery మీ కెరీర్ మరియు మీ జీతం లాంటి ఆర్థిక విషయాల గురించి

6. క్వాలిటీ ఆఫ్ లైఫ్: మీకు నచ్చిన ఇల్లు, మీ ప్రయాణాలు, మీ కార్ లాంటి మీ జీవితంలో ఎదురయ్యే అనుభవాల గురించి

Step 3 : ఈ ఆరు కేటగిరీలు మీ జీవితాన్ని నిర్వచిస్తాయి. వీటికి మీరు ఇచ్చే ప్రాముఖ్యత, వెచ్చించే సమయం మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ను  నిర్ణయిస్తుంది. మీరు మెరుగు పరచుకోవాలనుకునే catogery ను మీరు గుర్తించినప్పుడు వాటిని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచించాలి. ఈ catogeries గురించి నాలుగు ముఖ్యమైన ప్రశ్నలు మనల్ని మనం అడగాలి.

1. ఈ Catogery గురించి మనం నమ్మేది ఏంటి: ఈ Catogery గురించి మీ నమ్మకాలు ఏంటో తెలుసుకోవడానికి ఈ ప్రశ్న . నిజాయితీగా మీ నమ్మకాలు ఏంటో ఒక పేపర్ మీద రాసుకోండి. ఉదాహరణకు career మరియు finance category ను తీసుకుంటే, డబ్బు చెడ్డది అన్నది మీ నమ్మకం అయితే మీరు ఈ category లో విజయం సాధించలేరు. కాబట్టి

మీకు ఉన్న ఆ నమ్మకాన్ని తొలగించి డబ్బు మంచిది అనే నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. మీ నమ్మకాలని తెలుసుకోవడం, అవి మీ మీద చూపించే ప్రభావం, వాటి ఎలా మార్చుకోవాలి లాంటివి తెలుసుకోవడానికి “Limiting beliefs – how they stop you from achieving your goals” అనే ఆర్టికల్ చదవండి.

2. ఈ కేటగిరీ లో నాకు కావాల్సింది ఏంటి?

ఈ కేటగిరీ లో మీరు సాధించాలి అనుకుంటుంది ఎంతో స్పష్టంగా రాసుకోండి. ఉదాహరణకి health and fitness కేటగిరీని తీసుకుంటే మీ body ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో రాసుకోండి. ఎలాంటి body పొందాలనుకుంటున్నారో రాసుకోండి. ఇలా చెయ్యడం వల్ల మీ కేటగిరీ యొక్క ప్రణాళికని సిద్దం చేసుకోవడం తేలిక అవుతుంది. జీవితం

యొక్క ప్రణాళికని ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకోవడానికి ““What do you want in life?” అనే ఆర్టికల్ ని చదవండి.

3. దాన్ని ఎందుకు కావాలనుకుంటున్నాను?

ప్రతీ కేటగిరీలో మీకు ఏం కావాలి అనుకుంటున్నారో రాసుకున్న తర్వాత అవి ఎందుకు కావాలనుకుంటున్నారో కారణాలు రాసుకోండి. ఇలా రాసుకుంటే అవి ఎందుకు మీకు అవసరమో అర్థమయ్యి వాటిని సాధించాలనే దృఢ నిశ్చయం మీకు పెరుగుతుంది. ఉదాహరణకి relationships కేటగిరి తీసుకుంటే, అందమైన పెళ్లి మీ లక్ష్యం అయితే, ఎందుకు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ లక్ష్యాలని సాధించానికి దృఢ నిశ్చయంతో ఎలా ఉండాలో తెలుసుకోవడానికి “How to be strongly committed to your goals?” అనే ఆర్టికల్ చదవండి.

4. అది పొందడానికి నేను ఏం చెయ్యాలి?

ఇప్పుడు మీరు అనుకున్నది సాధించానికి ఏం చెయ్యాలో ఆలోచించండి. అదే మీ ప్రణాళిక మరియు మీరు చెయ్యాల్సిన పని. మీ లక్ష్యానికి మిమ్మల్ని దగ్గర చేసే ప్రతీదీ మీ ప్రణాళికలో ఉండాలి. ఉదాహరణకి finances కేటగిరిని తీసుకుంటే, promotion సాధించడం మీ లక్ష్యం అయితే, అది సాధించడానికి మీరు చెయ్యవలసినవి అన్నీ లిస్ట్ రాసుకోండి. సరైన action plan ఎలా రెడీ చేసుకోవాలి తెలుసుకోవడానికి “How to achieve your goals?” అనే ఆర్టికల్ చదవండి.

Step 4: ప్రతీ కేటగిరికి ఈ నాలుగు ప్రశ్నలు పూర్తయిన తర్వాత ఒక సంవత్సరానికి లక్ష్యం పెట్టుకోండి. రాబోయే ఒక సంవత్సరంలో ఏం సాధించాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఈ ఒక సంవత్సరం లక్ష్యాన్ని నాలుగు భాగాలుగా చేసి ప్రతీ మూడు నెలలకి ఏం సాధించాలో క్లియర్ గా రాసుకోండి. ఇది పూర్తయిన తర్వాత వారాలని రోజులని కూడా ఇలాగే ప్లాన్ చేసుకోండి. ఉదాహరణకి, రాబోయే ఒక సంవత్సరంలో 20 కేజీలు తగ్గాలన్నది మీ లక్ష్యం అనుకుంటే, 5 కేజీలు తగ్గడం మీ మూడు నెలల లక్ష్యం అవుతుంది. ఇలా మూడు నెలల లక్ష్యం పెట్టుకోవడం వల్ల ప్రతీ వారం, ప్రతీరోజు ఏం చెయ్యాలో మీకు క్లారిటీ ఉంటుంది. లేకపోతే మీరు అనుకున్నది పాటించలేరు.

మీ జీవితాన్ని ప్లాన్ చేసుకునే 4 steps ఇవే. మీ జీవితానికి ప్లాన్ ఉంది మీ లక్ష్యం కోసం ప్రతిరోజూ మీరు కష్టపడుతుంటే చాలా తక్కువ సమయంలోనే జీవితం ఎంత గొప్పదో మీకే అర్థమవుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, రిలేషన్ షిప్స్ బావుంటాయ్, మీ వ్యక్తిత్వం గొప్పగా మారుతుంది. మీ ఆర్థిక స్థితి మారుతుంది, ప్రశాంతత దొరుకుతుంది, మీరు అనుకున్నది సాధిస్తారు. మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతారు. ప్లానింగ్ మీకు ఇచ్చేబహుమానం ఇది. మొదట్లో ఇది చాలా పెద్ద పని అనిపిస్తుంది. కానీ నన్ను నమ్మండి ఇది చాలా ఉపయోగపడుతుంది.మీ జీవితం చాలా విలువైనది. దానికోసం కొన్ని గంటల ప్లానింగ్ అవసరమే కదా?

Registration

Forgotten Password?

Loading