చిన్న చిన్న పదాలతో నిండి ఉండి కొటేషన్స్ చాలా గొప్పగా ఉంటాయి. మనల్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. జ్ఞానాన్ని చిన్నచిన్న పదాల్లో చెప్పడమే ఈ కొటేషన్స్. మోటివేషన్ కోసం కొటేషన్స్ చదువుతూ ఉంటాము. కొన్నిసార్లు ఒక చిన్న కొటేషన్ జీవితాన్ని మార్చవచ్చు. ఒక చిన్న కొటేషన్ ఒక దారి చూపించవచ్చు. కొటేషన్స్ కి ఉన్న శక్తి అది.
జీవితంలో రకరకాల సందర్భాలలో ఉపయోగపడే 40 కొటేషన్స్ ఇప్పుడు చూద్దాం. వీటిలో జ్ఞానం, సానుకూల దృక్పథం కలగలిపి ఉన్నాయి. ఒక కొటేషన్ చదివి దానిమీద మెడిటేషన్ చేయండి. దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
వీటిలో ప్రతి ఒక్క దానికి మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంది. మీ ఖాళీ సమయంలో ఈ కొటేషన్స్ చదవండి.
1. మీ ఆలోచనలు మార్చుకుంటే మీ ప్రపంచాన్ని మార్చుకోవచ్చు. – normal Vincent Peale
2. మన ఆలోచనలే మన జీవితం. కాబట్టి ఏమి ఆలోచిస్తున్నా రో జాగ్రత్తగా ఉండండి. మాటలు సెకండరీ. ఆలోచనలో జీవం ఉంది. అవి చాలా దూరం ప్రయాణిస్తాయి. – స్వామి వివేకానంద
3. నిజంగా కోరుకుంటున్న దానిమీద చాలా తక్కువమంది దృష్టి పెడతారు. మనం ఎప్పుడూ శక్తి మీద దృష్టి పెట్టము. చాలామంది దేనిమీద దృష్టి పెట్టకుండా తమ జీవితాన్ని వృధా చేసుకుంటారు. – టోనీ రాబిన్స్
4. ఇతరులు వారి కలలని నెరవేర్చుకోవడానికి సహాయపడండి. అప్పుడు మీరు మీ కలలను నెరవేర్చుకోగలరు. – లెస్ బ్రౌన్
5. విజయం అంటే చిన్న చిన్న విషయాలను క్రమశిక్షణతో ప్రతిరోజు పాటించడమే. – జిమ్ రాన్
6. ఏం సాధించాలో స్పష్టతతో ఒక చోట రాసుకునేవారు మిగిలిన వారి కంటే వేగంగా వారు అనుకున్నది సాధించగలరు. – బ్రియాన్ ట్రాన్సి
7. నేను త్వరగా లేస్తాను. ఎక్కువసేపు మెలకువగా ఉంటాను. రోజు తర్వాత రోజు సంవత్సరం తర్వాత సంవత్సరం, ఈ రాత్రికి రాత్రి విజయం చూడడానికి నాకు 17 సంవత్సరాల 114 రోజులు పట్టింది. – మెస్సీ
8. నువ్వేం చెప్పావో జనం మర్చిపోతారు. నువ్వేం చేసావో జనం మర్చిపోతారు. కానీ నీవల్ల వాళ్ళు ఎలా ఫీలయ్యారు అన్నది మాత్రం మర్చిపోరు. – మాయా ఏంజిలో
9. చిత్తశుద్ధి అంటే ఎవరూ చూడనప్పుడు కూడా సరైన పని మాత్రమే చేయడం. – సి. యస్. లూయిస్
10. వారు ఏం చేయగలరని నమ్ముతారో అది ఖచ్చితంగా చేయగలరు. మీరు ఏమి చేయలేను అనుకుంటే మీరు అది చేసే శక్తిని కోల్పోతారు. నేను చేయగలను అనుకుంటే నాకు అది చేయగలిగే శక్తి లేకపోయినా అది చేసే శక్తిని పొందుతాను. – మహాత్మా గాంధీ.
11. నిరాశావాది ప్రతి అవకాశంలో ఒక అవరోధాన్ని చూస్తాడు. ఆశావాది ప్రతి అవరోధంలో ఒక అవకాశాన్ని చూస్తాడు. – విన్ స్టన్ చర్చిల్
12. మీకు ఒక గంట ఆనందం కావాలంటే నిద్రపోండి. మీకు ఒక రోజంతా ఆనందం కావాలంటే, చేపలు పట్టండి. మీకు ఒక సంవత్సరం ఆనందం కావాలంటే, అదృష్టం వారసత్వంగా ఉండాలి. మీకు జీవితాంతం ఆనందం కావాలంటే, ఎవరికైనా సహాయం చేయండి. – చైనీయుల సామెత
13. ప్రతి ఒక్కరూ తెలివైన వారే. కానీ ఒక చేప యొక్క తెలివిని అది చెట్టు ఎక్కే విధానం బట్టి నిర్ణయించకూడదు. – ఆల్బర్ట్ ఐన్ స్టీన్
14. మధ్యలో ఆగిపోకుండా కలగనే వాడే విజేత. – నెల్సన్ మండేలా.
15. మీ అనుమతి లేకుండా ఎవరూ మిమ్మల్ని భయపెట్టలేరు. – రూజ్ వెల్ట్
16. మీరు కలిగియున్న దానిపట్ల సంతృప్తికరం గా ఉండండి దానివలన మీరు మరింత పొందుతారు. మీకు లేని దాని మీద దృష్టి పెడితే మీకు ఎప్పటికీ దొరకదు. – ఓప్రా విన్ ఫ్రే
17. చాలామంది విఫలమయ్యేది వారు విజయానికి ఎంత దగ్గరగా వచ్చారో తెలియక పోవడం వల్ల ఆపేయడం వల్ల మాత్రమే. – థామస్ ఆల్వా ఎడి సన్
18. మన గొప్పతనం పడడం లో లేదు పడిన తరువాత ప్రతిసారి లేవడం లో ఉంది – Confucius
19. సాధించగల ధైర్యం ఉంటే మనం అనుకున్న ప్రతీకలని సాధించగలం. – వాల్ట్ డిస్నీ
20. మీరు మరొకరి కన్నా గొప్పగా ఉండనవసరం లేదు. మీరు ఎప్పుడూ ఉండే దాని కన్నా గొప్పగా ఉంటే చాలు. – wayne Dyer
21. మీ లక్ష్యాల దారిలో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో వెళ్ళండి. మీరు కోరుకున్నట్లు మీ జీవితాన్ని జీవించండి. – Henry David Thoreau
22. మీ లక్ష్యాలను మీ కలలను ఒక పేపర్ మీద రాసుకోవడం ద్వారా వాటి కోసం పని చేసే వ్యక్తిగా మీరు మారతారు. మీ భవిష్యత్తుని మీ చేతుల్లోనే ఉంచుకోవడం మంచి పద్ధతి. – mark victor Hansen
23. మీరు మీలా ఉండండి. ఎందుకంటే మీ కన్నా గొప్పగా మీ పాత్రను మరొకరు పోషించలేరు – ఆస్కార్ వైల్డ్
24. ఆనందం అనేది ఎక్కడో ఉండదు. మీరు చేసే పనుల వల్ల వస్తుంది. – దలైలామా.
25. మనలో ఉన్న దానితో పోలిస్తే మన ముందు ఉన్నది, మన వెనక ఉన్నది చాలా చిన్నది. – Ralph Waldo Emerson.
26. మీరు ఎగరలేకపోతే పరిగెత్తండి. పరిగెత్తలేకపోతే నడవండి. నడవలేకపోతే పాకండి. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ముందుకు వెళ్తూనే ఉండండి. – మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్
27. ఒక్క పాజిటివ్ ఆలోచన మీ మొత్తం రోజునే మారుస్తుంది. – జిగ్ జిగ్లర్
28. ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి. బయట విషయాలకన్నా మీరు తీసుకునే నిర్ణయాలు మీ విజయాన్ని నిర్ణయిస్తాయి. – అబ్రహాం లింకన్
29. జీవితం యొక్క సౌందర్యంతో జీవించండి. నక్షత్రాలను చూడండి. వాటితో పరిగెడుతున్న మిమ్మల్ని చూడండి. – Marcus Aurelius
30. మిమ్మల్ని వేరే వాళ్ళతో ఎప్పుడు పోల్చుకోవద్దు. అలా చేస్తే మిమ్మల్ని మీరు అవమానించినట్టే. – బిల్ గేట్స్
31. మీరు చేసే అత్యంత సృజనాత్మకమైన పని మిమ్మల్ని మీరు సృష్టించుకోవడం – దీపక్ చోప్రా
32. మిమ్మల్ని మీరు నమ్మే వరకు మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరు. – రాబిన్ శర్మ
33. మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తామో దాని విషయంలో క్రమశిక్షణతో ఉంటాం. – ఆండ్రూ హెండ్రిక్సన్
34. ఆనందానికి ఎలాంటి మార్గము లేదు. ఆనందమే ఏకైక మార్గం. – Thich Nhat Hanh
35. ఏమి చేయకుండా గడిపిన జీవితం కన్నా, ఏదో ఒకటి చేసే క్రమంలో తప్పులు చేసిన జీవితమే గొప్పది. – George Bernard Shaw.
36. ఆనందానికి ఒక తలుపు మూసుకున్నప్పుడు మరొక తలుపు తెరుచు కుంటుంది. మూసుకున్న తలుపు దగ్గరే కూర్చుని చూస్తూ ఉంటే మనకోసం తెరుచుకున్న తలుపును చూడలేము. – హెలెన్ కిల్లర్
37. ఒక వ్యక్తి యొక్క మైండ్ దేనిని నమ్ముతుందో దానిని సాధిస్తుంది. – నెపోలియన్ హిల్.
38. విజయం కోసం కన్నా విలువ కోసం ఆరాట పడండి. – ఆల్బర్ట్ ఐన్ స్టీన్ .
39. మైండ్ చాలా ముఖ్యమైనది. మీరు ఏమి ఆలోచిస్తారు మీరు అదే అవుతారు. – గౌతమ్ బుద్ధ
40. మీరు రోజుని నడుపుతారు లేదా రోజు మిమ్మల్ని నడుపుతుంది. – జిమ్ రాన్
Hope you enjoyed these pearls of wisdom. Wish you all the joy and place.