వ్యాయామం మరియు డైట్ గురించి 5 అపోహలు

వ్యాయామం మరియు డైట్
Share

వ్యాయామం మరియు డైట్ చెయ్యకుండా బరువు తగ్గేవిధంగా ఉంటే బావుంటుంది అని మనలో చాలామంది అనుకుంటారు. అందుకే వ్యాయామం  అవసరం లేకుండా బరువు తగ్గవచ్చు అని చెప్పే డైట్ ప్లాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. కేవలం డైట్ లో మార్పు చేసుకుని బరువు తగ్గడం సాధ్యమేనా ? అవును. సాధ్యమే. చాలా దారుణంగా డైట్ పాటిస్తే వ్యాయామం  చెయ్యకుండా బరువు తగ్గడం సాధ్యమే.

కానీ కేవలం బరువు తగ్గడం మాత్రమే మనం లక్ష్యం కాకూడదు. మనం సరైన బరువు ఉన్నా అనారోగ్య కరమైన శరీరం ఉండడం వల్ల ఉపయోగం ఏంటి? ఆరోగ్యం ఏమాత్రం పాడవకుండా బరువు తగ్గడం మనం లక్ష్యం అవ్వాలి. దీనికోసం డైట్ మరియు వ్యాయామం  రెండూ ముఖ్యమే. మీకు ఆరోగ్యకరమైన మరియు ఫిట్ శరీరం కావాలంటే ఖచ్చితంగా వ్యాయామం  ని మారిపోకూడదు.

డైట్ మరియు వ్యాయామం, విషయంలో మనకి ఉన్న కొన్ని అపోహలు ఇప్పుడు చూద్దాం.

1. అపోహ 1- నేను వ్యాయామం చేస్తున్నాను కాబట్టి జంక్ ఫుడ్ తినవచ్చు: అన్ని రకాల ఆహారం తినేస్తూ నేను వ్యాయామం చేస్తున్నాను అని చెప్పేవాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. ఇది సరైన పద్దతి కాదు. మనం తీసుకునే ఆహారం బట్టే మన శరీరం పని చేస్తుంది. ఆహారం మన శరీరానికి ఇంధనం లాంటిది. మనం జంక్ ఫుడ్ మరియు అనారోగ్య కరమైన ఆహారం తీసుకుంటే మన శరీరానికి చెడ్డ ఇంధనం ఇస్తున్నట్టు. ఒక కార్ కి దానికి సరిపడని ఇంధనం వేస్తే ఏమవుతుంది? ఇంజన్ దెబ్బతింటుంది కదా ? మన శరీరం విషయంలో కూడా అంతే. మన శరీరానికి సరైన ఆహారం ఇవ్వాలి. దానివలన మనం వ్యాయామం  చేసినా చేయకపోయినా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనం వ్యాయామం  చేసినా సరైన ఆహారం తీసుకోకపోతే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.

2. అపోహ 2: కడుపు మాడ్చుకుంటే బరువు తగ్గుతారు : మనం తీసుకునే కెలరీలు తగ్గించి, తక్కువ ఆహారం తెసుకోవడం ఒక్కటే బరువు తగ్గడానికి ఏకైక మార్గం అని చాలామంది అనుకుంటారు. బరువు తగ్గాలని చాలామంది కడుపు మాడ్చుకుంటారు. అలా చెయ్యడం వల్ల బరువు తగ్గుతారు కానీ అది ఎక్కువకాలం నిలబడదు. అలా కడుపు మాడ్చుకోవావాదానికి చాలా ధృఢ సంకల్పం కావాలి. కాబట్టి ఎక్కువ కాలం అలా ఆకలితో ఉండలేరు. తినకపోవడం వల్ల కోల్పోయిన బరువు అంతా తినడం మొదలు పెట్టిన తర్వాత మామూలుగా వచ్చేస్తుంది.  తినకుండా ఆకలితో ఉండడం వల్ల మరొక ఏంటంటే అది మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. ఆకలితో ఉండడం వల్ల మనకి కావాల్సిన పోషకాలు అందక మన రోగ నిరోధక శక్తి చాలా బలహీన పడుతుంది. దానివలన మనం శరీరం లోపలి అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. జీర్ణ సమస్యలు, పునరుత్పత్తి సమస్యలు, జుట్టు ఊడిపోవడం, చర్మ వ్యాధులు మొదలైనవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మానసికంగా, శారీరకంగా, భావోద్వేగాల పరంగా కూడా చాలా బలహీన పడిపోతాం.

కాబట్టి బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకోవడం పరిష్కారం కాదు. మన శరీరానికి అవసరమయిన ఆహారం తీసుకోవాలి. ఒక కార్ కి డానికి కావాల్సినంత ఇంధనం ఇవ్వకపోతే ఏమవుతుంది ? ఏదో ఒక చోట అది ఆగిపోతుంది. అదేవిధంగా మన శరీరానికి అవసరమయిన ఆహారం ఇవ్వకపోతే అది సామర్థ్యానికి తగ్గట్టు పనిచేయలేదు. కాబట్టి మన జీవన శైలికి తగినట్టు శరీరానికి అవసరమయిన ఆహారం తీసుకోవాలి.

3. అపోహ 3: వ్యాయామం అవసరం లేదు అని చెప్పే డైట్ మంచి డైట్ : వ్యాయామం అవసరం లేదు అని చెప్పే డైట్ ని పాటించకండి. కార్ అస్సలు కదలకూడదు అని చెప్పడం లాంటిది ఇది. అసలు కార్ ఉన్నదే ఒక చోటనుండి ఒక చోటికి వెళ్ళడానికి. అదే దాని పని. అలాగే మన శరీరం కూడా. మన శరీరం కూడా ఎప్పుడూ ఉత్సాహంగా కదలికతో ఉండడానికే ఉంది.

మన తీసుకునే డైట్ మనం కదలడానికి, వ్యాయామం  చెయ్యడానికి అవసరమైన శక్తిని ఇవ్వకపోతే అలాంటి డైట్ చెయ్యకండి. మనం తీసుకునే డైట్ మనల్ని శారీరకంగా ధృఢంగా చెయ్యాలి. వ్యాయామం  చేసే బలం ఇవ్వాలి. బరువు తగ్గే ఏ పద్దతి అయినా డైట్ మరియు వ్యాయామం  మీద దృష్టి పెట్టాలి. డైట్ చేస్తూ వ్యాయామం  లేకపోయినా, వ్యాయామం చేస్తూ సరైన డైట్ లేకపోయినా అది సరైన పద్దతి కాదు.

4. అపోహ 4: వ్యాయామం అనేది కేవలం బరువు తగ్గడానికే : వ్యాయామం అనేది కేవలం బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళకే మనకి అవసరం లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది పెద్ద అపోహ. ప్రతీ ఒక్కరికీ రోజూ వ్యాయామం కావాలి. దీనికి వయసుతోనూ, బరువు తోనూ సంబంధం లేదు. ప్రతీ రోజూ మన శరీరానికి వ్యాయామం అవసరం. వ్యాయామం వల్ల మన ఫిట్ గా ఉండడమే కాకుండా ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం.

1. గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.

2. డయాబెటిస్, bp వచ్చే అవాకాశాలు తగ్గిస్తుంది.

3. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మనం ఆరోగ్యంగా ఉండడానికి ఇది చాలా అవసరం

4. సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది

5. వయసు పెరగడాన్ని నిరోధించి ఎప్పుడు యౌవ్వనంగా ఉండేలా చేస్తుంది.

6. వయసు పెరగడం వల్ల వచ్చే సమస్యలను చాలా వరకూ రాకుండా చేస్తుంది. రోజూ వ్యాయామం చేసేవాళ్ళు వయసు పెరిగినా ఆరోగ్యంగా ఉంటారు.

7. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. చర్మం కాంతివంతంగా ఆకర్షణీయంగా ఉంటుంది

8. శరీరంలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. కాబట్టి ప్రతీరోజూ ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. అది వ్యాయామం వల్ల అవుతుంది

మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. జ్ఞాపకశక్తిని, సృజనాత్మకతని, తెలివిని పెంచుతుంది.

కాబట్టి ప్రతీ ఒక్కరూ రోజూ వ్యాయామం చెయ్యాలి.

5. అపోహ 5: మనం తీసుకునే ఆహారం కన్నా వ్యాయామం చాలా ముఖ్యం: మనం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే వ్యాయామం మరియు ఆహారం చాలా అవసరం. ఒక పక్షికి రెండు రెక్కలు ఎలాగో మనకి వ్యాయామం మరియు ఆహారం అలా అన్నమాట. రెండూ ముఖ్యమే. మంచి ఆహారం తీసుకోండి. శరీరానికి అవసరమయిన వ్యాయామం చెయ్యండి. వ్యాయామం గొప్ప కాదు, అలాగే ఆహారం గొప్ప కాదు. రెండూ సమపాళ్లలో ఉంటే మన ఆరోగ్యం మాత్రం గొప్పగా ఉంటుంది.

వ్యాయామానికి, ఆహారానికి సంబంధించిన కొన్ని అపోహలు ఇవి. మన జీవితంలో వాటికి ఉన్న ప్రాముఖ్యతను అందరూ గుర్తించాలి. మన జీవనశైలిలో వీటిని ఒక భాగం చేసుకోవాలి. వీటికి ప్రాముఖ్యత ఇస్తే మన జీవితం ఆరోగ్యంగా, ఉత్సాహవంతంగా, ఫిట్ గా, ధృఢంగా ఉంటుంది.

వ్యాయామం రాజు. పోషకాహారం రాణి. ఆ రెండిటిని ఒకటి చేస్తే ఆరోగ్యం అనే సామ్రాజ్యం మీదే. – Jack Lalanne

మంచి ఆహారం తీసుకోండి. రోజూ వ్యాయామం చెయ్యండి.

Registration

Forgotten Password?

Loading