సమతుల్యమైన మనసు కోసం 5 మార్గాలు

women doing meditation
Share

ప్రశాంతమైన మనస్సు మనకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మీరు సమతుల్య జీవితాన్ని గడపాలంటే మీ జీవన విధానంలో కూడా సమతుల్యతను కలిగి ఉండేలా చూసుకోవాలి. దానివలన మీకు చక్కటి ఆరోగ్యం మరియు ప్రశాంతత లభిస్తాయి.

సమతుల్య మనస్సును కలిగి ఉండటానికి పాటించవలసిన ఐదు మార్గాలు :

వాస్తవాలను అంగీకరించాలి :

రియాలిటీ ఎప్పుడూ చెడ్డది కాదు, అలా అని మంచిది కాదు, ఉన్నది ఉన్నట్టు ఇంతే అని అంగీకరించటం ఉత్తమం. వాస్తవాన్ని ఒప్పుకోకపోవటం, భ్రమపడడం, అతిగా ఆలోచించడం మరియు చింతించడం, ఇవన్నీ మనలో లేని ఆందోళన మరియు అసమతుల్యతను కలిగిస్తాయి మరియు అందువల్ల వాస్తవాన్ని అంగీకరించడం సమస్యను పరిష్కరించడానికి మనం వేస్తున్న మొదటి అడుగు. గుర్తుంచుకోండి, పరిష్కరించలేని సమస్య అంటూ ఏది లేదు. అదంతా మన మనస్సులో ఉంటుంది , ముందు సమస్యని అంగీకరిస్తే దాని పరిష్కరించాల్సిన దారులు వాటంతట అవే కనిపిస్తాయి. చరిత్రలో మరియు భవిష్యత్తులో అయినా, సత్యాన్ని అంగీకరించడం ఎల్లప్పుడూ మంచిది. వాస్తవాన్ని అంగీకరించడం అంటే వదులుకోవడం లేదా రాజీ పడడం అని కాదు. సమస్యను అంగీకరించడం ద్వారా మీరు రాజీ పడుతున్నారని, ఓడిపోతున్నారని అనుకోవడం చాలా పెద్ద అపోహ. అలంటి ఆలోచనని మనసు నుండి తీసేసి సమస్యను అంగీకరించడం ద్వారా, మీరు సమస్యను పరిష్కరించడానికి మరియు సమస్య నుండి బయటపడటానికి అవకాశం కలుగుతుంది. అందువల్ల, సంతులిత మనస్సును పొందాలంటే వేయాల్సిన మొదటి అడుగు సమస్యను అంగీకరించటం.

శారీరక మరియు మానసిక సామరస్యం

శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం ఏ పరిస్థితిలోనైనా మరియు ఏ సమయంలోనైనా రెండూ ముఖ్యమైనవే . మీకు 20 ఏళ్ళైనా లేదా 60 ఏళ్లు ఉన్నా, మీ మనస్సు మరియు శరీరం సాధారణ కార్యకలాపాలను నిర్వహించడానికి తగినంతగా సిద్ధంగా ఉండాలి. ఇది ర్యాంప్‌పై మోడల్‌గా కనిపించడం కోసం కాదు, ఇది మన మనస్సును మరియు శరీరాన్ని మన అదుపులో ఉంచుకోవటం కోసం మాత్రమే, దానివలన మనం జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించవచ్చు. వ్యాయామం లేదా ఆటలతో శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు , అయితే మానసిక ఆరోగ్యం మన జీవనశైలిని చక్కగా పర్యవేక్షించడం వలన దొరుకుతుంది. మన మనస్సు లేదా శరీరానికి ఇబ్బంది కలిగించే ఏ విషయాన్నీ మనం దగ్గరకి రానివ్వకూడదు, ప్రశాంతంగా ఉండండి. మీ మనస్సులో నిరాశావాద ఆలోచనలు మరియు చింతలు లేకుండా ఉంచండి మరియు ఈ సామరస్యానికి హాని కలిగించే అనవసరమైన జంక్ ఫుడ్ లేదా పానీయాల నుండి మీ శరీరాన్ని దూరంగా ఉంచుకోండి. ఈ సామరస్యం మీ శరీరంలో ఒక అందమైన లయను సృష్టిస్తుంది మరియు మీరు మీ చర్యలతో మీ శరీరానికి లేదా మనస్సుకు హాని కలిగించినప్పుడు, ఈ సామరస్యం చెడిపోతుంది. అందువల్ల ఈ సామరస్యాన్ని కాపాడుకోవడం సమతుల్య మనస్సును కాపాడుకోవడానికి మీ రెండవ మెట్టు.

మరచిపోవడం: పునరుజ్జీవనానికి కీ

మనం తరచుగా గుర్తించలేము కానీ మరచిపోవడం ఒక వరం. అచేతనంగా ఏదైనా మర్చిపోవడం సహజమే కానీ మనల్ని బాధపెట్టే విషయాలను మరచిపోవడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది. ఒకవేళ అది గొప్పది కాదా? దీని కోసం చిన్న అడుగులు వేయండి, మీకు ఇబ్బంది కలిగించే అంశాల గురించి సంభాషణలను కొనసాగించటం మానేయండి, అవి గతంలోని కొన్ని అసౌకర్య పరిస్థితులు లేదా చెడు దశలు లేదా మరేదైనా కావచ్చు. మీపై ప్రతికూల ప్రభావం చూపే వ్యక్తులతో చర్చించడం మానేయండి. చెడు అనుభవాలు జీవితంలో ఒక భాగమే, కానీ దానికి ఊతం ఇవ్వడం మరియు దానిని మన మనస్సులలో మరియు హృదయాలలో నిలుపుకోవడం మనకి లేని బాధను కలిగిస్తుంది అందుకే అవసరమైనపుడు మరచిపోవడం నేర్చుకోండి వీలైనంతవరకు మీ మనస్సుని సమతుల్యంగా ఉంచుకోండి .

మీ బాల్యాన్ని కాపాడుకోండి :

పిల్లలలోని ఉత్సుకత మరియు జిజ్ఞాస పిల్లలకు అన్ని జీవన నైపుణ్యాలను పొందేలా చేస్తుంది, ఇది మీ పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వటమే కాకుండా సంతోషంగా ఉంచుతుంది. మీరు ఏదైనా కొత్త పని చేస్తున్నప్పుడు, విసిగిపోకుండా ఉంటారు మరియు ఎప్పటికప్పుడు నేర్చుకుంటారు. చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయడం వలన మీరు విసిగిపోవటం, జీవితంలో ఎటువంటి ప్రోత్సాహం లేదని లేదా కొత్తగా ఏమీ జరగడం లేదని మీరు భావిస్తారు. కొత్త ఆసక్తులను పెంపొందించుకోవడం వలన విభిన్న వ్యక్తులను కలుసుకోవడానికి మరియు మీ దినచర్యకు మరింత జీవితాన్ని జోడిస్తుంది. అందువల్ల, మీరు కోరుకున్న జిజ్ఞాసను మరియు కొత్త పనులను కొనసాగించాలనే కోరికను కొనసాగించాలి మరియు మీకు గాఢమైన ఆనందాన్ని ఇచ్చే కార్యకలాపాలతో మీ దినచర్యను నింపుకోవాలి. పిల్లవాడిగా మిగిలిపోవడం అనేది సమతుల్య మనస్సును నిర్వహించడానికి మీ నాల్గవ మెట్టు.

కృతజ్ఞత మరియు సంతృప్తి

సంతృప్తి అనేది భవిష్యత్తుకు సంబంధించినది కాదు. కృతజ్ఞత అనేది ఏదైనా అసాధారణమైన సంఘటన జరిగినప్పుడు మాత్రమే కలిగే అనుభూతి కాదు. వివక్ష లేకుండా మీరు కలిగి ఉన్న ప్రతిదానికీ మీరు కృతజ్ఞతతో ఉండాలి. ఈ రోజు తినడానికి మీకు ఆహారం ఉందా? గ్రేట్, దాని గురించి కృతజ్ఞత కలిగి ఉండండి. మీరు వారాంతంలో స్నేహితులతో సరదాగా గడపగలిగారా? పర్ఫెక్ట్, మీరు దీన్ని చేయగలిగినందుకు కృతజ్ఞతతో ఉండండి. మీరు కలిగి ఉన్న విషయాల పట్ల మీరు ఎంత కృతజ్ఞతతో ఉంటారో, అంత ఎక్కువ అనుభవాలను మీరు కృతజ్ఞతగా భావిస్తారు. అందువల్ల, కృతజ్ఞత యొక్క శక్తిని విశ్వసించండి మరియు ఇది జీవితంలోని చెడుని దూరంగా ఉంచుతూ చివరికి సమతుల్య మానసిక స్థితికి దారి తీస్తుంది.

వాస్తవాలను అంగీకరించడం నుండి మీ వద్ద ఉన్న వాటికోసం కృతజ్ఞతగా భావించడం వరకు, సమతుల్య జీవితాన్ని కొనసాగించడానికి ఈ దశలన్నీ పాటిస్తూ మీరు వాటి పట్ల నిరంతరంగా, అంకితభావంతో మరియు ఆశాజనకంగా ఉండాలి. మీ పరిమితులను దాటి చూసేందుకు ధైర్యం అవసరం. మీరు ఈ సద్గుణాలను కలిగి ఉంటే, మీరు ఈ నదిని దాటిన తర్వాత, గొప్ప మరియు అద్భుతమైన విషయాలు మీ కోసం వేచి ఉన్నాయని మీరు తెలుసుకుంటారు !

Registration

Forgotten Password?

Loading