కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి 6 టెక్నిక్స్

Share

కోపాన్ని ఉంచుకోవటం అనేది కాలుతున్న నిప్పుని విసరడానికి పట్టుకున్నట్టు. దానివల్ల కాలిపోయింది మీరే. – గౌతమ్ బుద్ధ.

కోపం అనేది మనందరం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించిన చాలా దృఢమైన భావోద్వేగం. మనకు చాలా ఇష్టమైన వాళ్ళు వాళ్ల కోపం వల్ల మనల్ని బాధ పెట్టొచ్చు, లేదా మనమే వేరే ఎవరినైనా బాధ పెట్టొచ్చు. మనలో చాలామంది తమ మాటల ద్వారా, పనుల ద్వారా, తమ కోపాన్ని చూపిస్తారు. కొంతమంది కోపాన్ని లోపలే ఉంచుకుని పైకి నవ్వుతూ ఉంటారు. కానీ కోపం విషయంలో సరైన పద్ధతి ఏది ? బయటికి చూపించడమా? లోపల దాచుకోవడమా ? సమాధానం రెండు కాదు. కోపాన్ని చూపించినా, దాచుకున్నా అది కోపంగా ఉన్న వ్యక్తికే నష్టం. పైన చెప్పిన కొటేషన్ లో బుద్ధుడు చెప్పినట్టు కోపం అనేది అది ఉన్న వ్యక్తికే నష్టం.

తరచూ కోప్పడుతూ ఉండటం వల్ల జీవితంలో ఎదురయ్యే పరిణామాలు ఇప్పుడు చూద్దాం.

1. కోపం ఒక వ్యక్తిని విసుగుగా, విరామం లేకుండా చేస్తుంది

2. రిలేషన్ షిప్ సమస్యలు వస్తాయి. మనకు బాగా ఇష్టమైన వాళ్ళతో మన సంబంధాలలో కోపం వల్ల సమస్యలు ఏర్పడతాయి. తరచూ కోపం ఎక్కువ వాదోపవాదాలకు దారి తీస్తుంది. ఇది మన రిలేషన్ షిప్ ని పాడు చేస్తుంది.

3. మనం పనిచేసే చోట కూడా ఎన్నో సమస్యలను సృష్టిస్తుంది. ఒక వ్యక్తి తన కోపాన్ని అదుపు చేసుకోలేనప్పుడు తన తోటి పనివారితో గొడవలవుతాయి. అది తన పని చేసే సామర్థ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుంది.

4. వ్యాధినిరోధకశక్తి తగ్గేలా చేస్తుంది. దానివల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి.

5. ఇది ఒక వ్యక్తిని తరచూ గొడవలోకి నెడుతుంది. తరచూ కోపం రావడం అనేది గొడవకి సిద్ధపడే విధంగా హార్మోన్స్ విడుదల చేస్తుంది. మన శక్తి ఆలోచన నుండి, జీర్ణశక్తి నుండి, ఇంకా మిగిలిన వాటి నుంచి గొడవ సంబంధించిన వాటికి బదిలీ చేయబడుతుంది. ఇలా తరచూ జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తికి ఈ కింది సమస్యలు రావచ్చు.

1. జీర్ణం అయ్యే శక్తి తగ్గిపోతుంది

2. గుండె సంబంధిత సమస్యలు వస్తాయి

3. హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది

4. పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది.

5. తలపోటు

6. అధిక రక్తపోటు

7. హార్ట్ ఎటాక్

6. తరచు కోపం రావడం అనేది insomnia కి దారి తీస్తుంది. ఆ వ్యక్తి గాఢనిద్ర పొందడానికి ఈ కోపం అడ్డు వస్తుంది.

7. కోపం మన లాజికల్ మైండ్ సరిగా పని చేయకుండా చేస్తుంది దానివల్ల ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన తన అదుపులో ఉండదు.

8. మానసిక ప్రశాంతత లేకుండా చేస్తుంది.

9. ఎప్పుడూ మనల్ని నీరసంగా అనిపించేటట్లు చేస్తుంది.

10. మనలో సృజనాత్మకత, ఆనందం తగ్గిపోతుంది.

కోపం వల్ల ఎదురయ్యే పరిణామాలు ఇవే. రకరకాల పరిస్థితుల్లో కోపం రావడం సహజమే. కానీ మనం శారీరకంగా మానసికంగా భావోద్వేగాల పరంగా ఆరోగ్యంగా ఉండాలంటే కోపాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి. Anger management లో మూడు విషయాలు గురించి చెప్తారు.

  1. ఎప్పుడు తరచూ మనకి కోపం వస్తుంది?
  2. ఎంత ఎక్కువగా కోపం వస్తుంది?
  3. కోపం వచ్చినప్పుడు నీకు ఎంత సేపు ఉంటుంది?

1. మొదటి దాని దాని గురించి మాట్లాడుకుంటే ఒక రోజులో ఎక్కువగా కోపం రావడం అనేది చాలా హానికరం. తరచు కోపం రాకుండా చేసుకోవడానికి మన మానసిక దృఢత్వం పెంచుకోవాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

1. క్రమం తప్పకుండా మెడిటేషన్ చేయడం: మనం ప్రతిరోజు మెడిటేషన్ చేసినప్పుడు మనం మానసికంగా భావోద్వేగాల పరంగా దృఢంగా మారుతాయి. దానివల్ల మన ఓపిక ఓర్పు పెరిగి మనకి కోపం రావడం తగ్గుతుంది.

2. యోగా: యోగ మన శరీరాన్ని, మైండ్ ని , ఆత్మను చాలా గొప్పగా మారుతుంది. మనకి కోపం వచ్చే పరిస్థితుల్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది.

3. సరైన పోషకాలు: మన శరీరానికి అవసరమైన పోషకాలు అందక పోయినా ఓపిక తగ్గి మనకి తరచు కోపం వస్తుంది. కాబట్టి మీ శరీరానికి అవసరమైన పోషకాలు జాగ్రత్తగా అందేలా చూసుకోండి.

4. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి: మన జీవనశైలి క్రమశిక్షణతో నిండి ఉంటే మన కోపం ఎప్పుడూ అదుపులో ఉంటుంది.

5. ప్రార్థన: దేవునికి ప్రార్థన చేయడం మనకి ఓర్పు ని మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

ఇవి మన కోపాన్ని తగ్గిస్తాయి. ఇవి ప్రతి రోజూ మనం పాటిస్తే చాలావరకు కోపం తగ్గుతుంది. వీటివల్ల anger management లోని మొదటి రెండు విషయాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇక మూడవ దాని విషయానికొస్తే కోపం జీవితంలో తప్పించుకోలేని ఒక భావోద్వేగం. ఈ అవి అలవాటు చేసుకుంటే దీని నుంచి బయటపడడం తేలిక.

కోపం నుండి బయటకి రావడానికి ఏం చేయాలో చూద్దాం.

1. శ్వాసను మెల్లగా తీసుకోవడం: మనం కోపంగా ఉన్నప్పుడు మన శ్వాస తీసుకునే వేగం పెరుగుతుంది. మన శ్వాస కి మన భావోద్వేగాలకి సంబంధం ఉంటుంది. ఒక దాని మీద ఒకటి ప్రభావం చూపిస్తాయి. మనం మెల్లగా శ్వాస తీసుకోవడం సాధన చేసినప్పుడు మన కోపం చాలా త్వరగా తగ్గుతుంది. మెల్లగా శ్వాస తీసుకోవడం ఎలా?

1. ఒక డీప్ బ్రీత్ తీసుకోవాలి. మన పొట్ట బుడగలాగా రావాలి.

2. పూర్తిగా శ్వాసని వదిలేయాలి. మన పొట్ట పూర్తిగా లోపలికి వెళ్లి పోవాలి.

3. ఇలా పన్నెండు సార్లు చేయాలి.

2. 1 నుండి 100 వరకు లేదా 100 నుండి 1 వరకు అంకెలు లెక్క పెట్టండి. ఇది మీ మైండ్ ని కోపం నుండి పక్కకి తీసుకువెళుతుంది. లేకపోతే పాటలు వినడం, మీకు నచ్చిన పని చేయడం, ఏదైనా మంచి పుస్తకం చదవడం వంటివి చేయండి.

3. నడవడం, జిమ్, స్విమ్మింగ్ లేదా డాన్స్ ఇలాంటివి ఏమైనా చేయండి. శారీరక శ్రమ ఉన్నప్పుడు కోపం తగ్గుతుంది. కోపం నుండి బయటకు రావడం తేలికవుతుంది.

4. మనస్ఫూర్తిగా ఉండడాన్ని అలవాటు చేసుకోండి. మీ చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి.

5. మీకు నచ్చిన మంచి కామెడీ చూసి గట్టిగా నవ్వినప్పుడు నెగటివ్ ఎనర్జీ పోయి కోపం తగ్గుతుంది.

6. ఉప్పు నీటితో స్నానం చేయండి. మామూలు స్నానం అయిపోయిన తర్వాత మీ ఒంటికి ఉప్పు పెట్టి కొన్ని నిమిషాలు ఉండి తర్వాత నీటితో కడిగేయండి. ఇది మీ భావోద్వేగాలను ఆలోచనలను నెమ్మది పరుస్తుంది.

కోపాన్ని క్రమబద్దీకరించిన డానికి ఇవి కొన్ని సూచనలు. మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే పనులు జరగాలంటే మనం కోపంగా రావాల్సిన అవసరం లేదు. పనులు జరగడానికి కోపం సాధనం కాదు. మన జీవితంలోంచి పూర్తిగా కోపాన్ని తీసేయడం 100% కుదరదు. మనం మనుషులం. కోపం వస్తుంది. కానీ దాని నుంచి ఎలా బయటకు త్వరగా రావాలో మనం నేర్చుకోవాలి. లేదంటే దాని వల్ల మనకు చాలా నష్టాలు ఉన్నాయి. దానితో పాటు మన మానసిక దృఢత్వాన్ని పెంచుకోవాలి. ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు ఓర్పుతో ప్రశాంతంగా ఉండి వాటిని ఎదుర్కోవాలి.

కోపంగా ఉన్నప్పుడు ఒక్కక్షణం ఆగితే వంద రోజులకు సరిపడా దుఃఖాన్ని తప్పించుకున్నట్టే. – చైనీస్ సామెత

Registration

Forgotten Password?

Loading