ఒక కంపెనీ యొక్క CEO ఎన్నో రకాల ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటారు. ఒకే రోజు కొన్ని మీటింగ్స్ ముగించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇవి సరిగా జరుగుతాయి. కొన్నిసార్లు జరగవు. వీరు రకరకాల డిపార్ట్మెంట్ ని చూసుకోవలసి వస్తోంది. ఇది చాలా పెద్ద బాధ్యత. ఇలాంటి ఒక పెద్ద బాధ్యత నిర్వర్తిస్తూ కూడా CEO లు వ్యాయామం చేయడానికి సమయం కేటాయించగలుగుతారు. 76% బిజినెస్ లీడర్స్ రోజు వ్యాయామం చేస్తారని ఒక పరిశోధనలో తేలింది.
ఒక సంస్థలో మామూలు ఎంప్లాయ్ కి CEO కి ఉన్నన్ని బాధ్యతలు ఉండవు. కానీ కానీ వ్యాయామం చేయడానికి సమయం ఉండదు. ఇలా ఎందుకు జరుగుతుంది ? ఇలా జరగడానికి ప్రధాన కారణం షెడ్యూల్.
CEO రోజు ఒక షెడ్యూల్ప్రకారం జరుగుతుంది. ఏది ఎప్పుడు చేయాలి అనేది ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది వ్యాయామం చేసే సమయం, మీటింగ్ సమయం, లంచ్ చేసే సమయం ఇలా ప్రతిదీ ముందుగానే నిర్ణయించ బడుతుంది. ఈ షెడ్యూల్ వల్ల వ్యాయామం చేసే సమయం, మెడిటేషన్ చేసే సమయం ఎలాంటి బిజీ రోజులలో అయినా ఉంటుంది. కానీ ఒక మామూలు ఎంప్లాయి యొక్క రోజు షెడ్యూల్ప్రకారం జరగదు. అందువల్ల రకరకాల పనులు షెడ్యూల్ లేకుండా జరగడం వల్ల రోజూ వ్యాయామం చేసే సమయం ఉండదు. కాబట్టి షెడ్యూల్ చేసుకోవడం అనేది మనం అనుకున్నది సాధించడానికి చాలా ముఖ్యమైన సాధనం.
ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం చేయడం వలన జరిగే లాభాలు ఇప్పుడు చూద్దాం.
1. లక్ష్యాలు సాధించడం : చాలామందికి లక్ష్యాలు ఉంటాయి. కానీ కొంతమంది మాత్రమే వాటిని సాధించగలుగుతారు. చాలామంది సాధించకపోవడానికి ప్రధాన కారణం ఒక షెడ్యూల్ లేకపోవడం. వారు అనుకున్నది సాధించడం కోసం పనులు చేయాలి అనుకుంటారు. కానీ ఆ పనులు ఎప్పుడు చేయాలి అనే షెడ్యూల్ ఉండదు. కాబట్టి వాటిని వాయిదా వేస్తూ ఉంటారు. లక్ష్యాలు సాధించడానికి చేయవలసిన పనులు కాకుండా, అత్యవసరమైన పనులు, మిగిలిన పనులు చేస్తూ ఉంటారు. బరువు తగ్గడానికి యోగా చేయాలి అనుకుంటే యోగా కోసం ఒక సమయం కేటాయించండి. మీరు షెడ్యూల్ వేసుకుంటేనే మీరు చేయాలనుకున్న దాని గురించి సీరియస్ గా ఉంటారు.
2. క్రమశిక్షణ : చాలామంది క్రమశిక్షణ అనేది దృఢనిశ్చయం వల్ల వస్తుంది అనుకుంటారు. దృఢ నిశ్చయం కంటే షెడ్యూల్ వల్ల క్రమశిక్షణ వస్తుంది. ఒక రోజుకి షెడ్యూల్ వేసుకోండి. మీరు కేవలం పది గంటలు మాత్రమే పనిచేస్తే , ఆ పది గంటల్లో ఏమి చేస్తున్నారో షెడ్యూలు వేసుకోండి. ఈ షెడ్యూల్ వల్ల మీరు చేయాలనుకున్న పని మీద మీరు క్రమశిక్షణతో ఉంటారు.
3. మీ సామర్థ్యాన్ని పెంచుతుంది : మనం చేయాలనుకుంటున్న పనుల విషయంలో షెడ్యూల్ వేసుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ చేయగలుగుతాం. షెడ్యూల్ వల్ల మనం చేసే పని మీద ఒక స్పష్టత వస్తుంది అందువలన మనం తయారుగా ఉంటారు. షెడ్యూల్ మన జీవితంలో గందరగోళాన్ని తీసేస్తుంది.
4. ఒత్తిడిని తగ్గిస్తుంది : మనం చేసే పనులు షెడ్యూల్ ప్రకారం జరగకపోతే ఒత్తిడి వస్తుంది. ఒక రోజులో మీరు ఊహించని పనులు ఎక్కువ చేయాల్సి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాంటి సమయంలోనే ఒత్తిడిలో ఉంటారు. మీ రోజుని, మీ వారాన్ని సరిగా షెడ్యూల్ చేసుకుంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా మీరు పూర్తి చేయాలి అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు.
5. మంచి సమయపాలన : షెడ్యూల్ చేసుకోవడం మీ సమయపాలనని మరింత పెంచుతుంది. ఇచ్చిన సమయంలోనే మీరు ఎక్కువ సాధించగలుగుతారు. ఆరోగ్యం, రిలేషన్ షిప్స్, కెరీర్ ఇలా అన్నిటికీ మీ దగ్గర సమయం ఉన్నట్టు ఉంటుంది. వృధాగా గడిపే సమయం తగ్గుతుంది.
6. మానసిక మరియు ఎమోషనల్ ఆరోగ్యాన్ని పెంచుతుంది : మీరు ఒక రోజుని షెడ్యూల్ చేసుకుంటే మీ ఎమోషనల్ మరియు మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి సమయం దొరుకుతుంది. మెడిటేషన్ చేయడానికి, నేచర్ లో గడపడానికి కాస్త సమయం దొరుకుతుంది. మీకంటూ కాస్త సమయం దొరికి రిలాక్స్ అవ్వడానికి, మీకు నచ్చిన పని చేయడానికి సమయం ఉంటుంది. ఇలాంటి చిన్నచిన్న పనులు మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
7. విజయ శాతం పెరుగుతుంది : షెడ్యూల్ వల్ల మీరు విజయం సాధించే అవకాశం పెరుగుతుంది. ఎందుకంటే మీకు ఏదైతే ముఖ్యమో దానికి సమయం కేటాయిస్తారు కాబట్టి. మీ లక్ష్యం వైపు మీరు పనిచేయడం మొదలు పెడతారు.
షెడ్యూల్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి. షెడ్యూల్ ఎలా చేసుకోవాలి ? ఇప్పుడు కొన్ని సూచనలు చూద్దాం.
1. ఒక నిర్దేశిత కాలంలో మీరు ఏమి సాధించాలి అనుకుంటున్నారో ఒక స్పష్టతతో ఉండండి. ఉదాహరణకి, మీ ఆరోగ్యం విషయంలో రాబోయే సంవత్సరంలో మీరు ఏం సాధించాలి అనుకుంటున్నారు ? మీ ఆర్థికపరమైన విషయాల్లో లో రాబోయే ఈ సంవత్సర కాలంలో ఏం సాధించాలి అనుకుంటున్నారు ? రాబోయే ఐదు సంవత్సరాల్లో మీరు ఏం సాధించాలి అనుకుంటున్నారో ఒక స్పష్టత తో ఉండండి.
2. ఒక సంవత్సరంలో సాధించాలి అనుకుంటున్న పెద్ద లక్ష్యాలను చిన్నచిన్న లక్ష్యాలుగా విభజించుకుని రాబోయే మూడు నెలల్లో మీరు ఏం సాధించాలని అనుకుంటున్నారో ఒక స్పష్టతతో ఉండండి.
3. మీరు అనుకున్నది సాధించడానికి రాబోయే మూడు నెలల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు రాసుకోండి.
4. ఈవారం మీరు ఏం చేయాలో ఆలోచించండి.
5. మీరు చేసే ఈ పనులని షెడ్యూల్ చేసుకకోండి.
ఉదాహరణకి, ఒక సంవత్సరం మీరు 10 కేజీలు తగ్గాలని లక్ష్యం పెట్టుకుంటే మీ 3 నెలల లక్ష్యం 2.5 కేజీలు అవుతుంది. వారానికి మూడు సార్లు యోగా క్లాస్ కి వెళ్లడం లేదా వారానికి రెండు సార్లు జిమ్ముకెళ్లడం ఇది సాధించడానికి మీరు చేయవలసిన పనులు అవుతాయి. షెడ్యూల్ అంటే మీరు ఈవారం ఎప్పుడు యోగాకి లేదా జిమ్ కి వెళ్తారు. సోమవారం ఉదయం 8:00 కా ? లేదా మంగళవారం సాయంత్రం 6 గంటలకా ? ఇది షెడ్యూల్ అవుతుంది. సమయం విషయంలో నిర్దిష్టంగా ఉండండి. మీరు సాధించాలి అనుకుంటున్న దానికి షెడ్యూల్ ఇలా చేయాలి.
కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీ ప్రాధాన్యత అయితే మీ రోజుని ఆ విధంగా షెడ్యూల్ చేసుకోండి. ప్రతి రోజు సాయంత్రం 8 గంటలకు మీ కుటుంబంతో గడపడానికి సమయం పెట్టండి. మీకు ఏ సమయం వీలైతే ఆ సమయాన్ని ఎంచుకోండి. మీరు ఒక పని చేయడానికి షెడ్యూల్ పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా అది చేసి తీరండి.
జీవితంలో పెద్ద వాటికైనా లేదా చిన్న విషయాలకైనా షెడ్యూల్ చాలా ముఖ్యం. ఉదాహరణకి మీరు మీ ఫ్రెండ్ ని అకస్మాత్తుగా చాలా రోజుల తర్వాత దారిలో కలుస్తారు. ఇద్దరూ 20 నిమిషాలు మాట్లాడుకుంటారు. మనం ఒకసారి ఇంటిదగ్గర కలవాలి అనుకుంటారు. కానీ మీరు అతన్ని మళ్ళీ కలిసే అవకాశం ఎంత ఉంది ? చాలా తక్కువ అవకాశం ఉంది ఉంది. ఇప్పుడు ఏదో ఒక రోజు కలుద్దాం అనుకునే బదులు ఇద్దరూ కలిసి మీరు కలవాలి అనుకుంటున్న రోజుని, సమయాన్ని షెడ్యూల్ చేసుకుంటే మీరు కలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది.
కాబట్టి మీ జీవితాన్ని షెడ్యూల్ చేసుకోండి. లక్ష్యాలను షెడ్యూల్ చేసుకోండి. వాటిని సాధించడానికి మీరు చేయవలసిన పనులను షెడ్యూల్ చేసుకోండి. మీరు అనుకున్నది సాధించడానికి ఒక రోజుని ఒక సమయాన్ని షెడ్యూల్ చేసుకోండి. షెడ్యూల్ ని మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి.