ఇల్లు- ప్రతీ మనిషికి కనీస అవసరం. మనం ఎక్కువ సమయం గడిపే చోటు మన ఇల్లే. మన జీవితాన్ని మార్చి వేయగల నిర్ణయాలు తీసుకునే చోటు ఇల్లు. మనల్ని రిలాక్స్ చేసి నూతన ఉత్సాహంతో ఉండేలా చేసే చోటు ఇల్లు. భద్రత గా ఉండి, ప్రేమగా మీరుమీ లా ఉండే చోటు మీ ఇల్లు. ముఖ్యంగా మీ జీవితాన్ని మీరు ప్లాన్ చేసుకునేది ఇది ఇంట్లోనే. శుభ్రంగా లేకుండా గజిబిజిగా ఉండే ఇల్లు మీ జీవితాన్ని కూడా గజిబిజిగా మారుస్తుంది. శుభ్రంగా ప్రశాంతంగా ఉండే ఇల్లు మీ జీవితాన్ని ప్రశాంతంగా మారుస్తుంది. ఇల్లు ఒకరి జీవితాన్ని ఎలా మారుస్తుందో అర్థం చేసుకోవడం వల్ల ఇండియా మరియు చైనా కు ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఒక సైన్స్ ఉంది.
ఇల్లు అంటే ఏంటి? భవనమా? లేదా అందమైన డిజైనా? లేక అందులో ఉండే మనుషులా? వీటితో పాటూ ఇంకా చాలా. శుభ్రత, పాసిటివిటీ, ప్రేమ, బంధాలు, ఆనందం ఇలాంటి ఎన్నో పాసిటివ్ మరియు ఎమోషనల్ విషయాలకి ఒక భౌతిక రూపమే ఇల్లు. స్నానం చెయ్యడం ద్వారా మన శరీరాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మన ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. తుడవడం, కడగడం, దుమ్ము దులపడం ద్వారా శుభ్రత ను పాటించాలి. ఇలా భౌతికంగా శుభ్రం చెయ్యడం సరిపోతుందా??? సరిపోదు. మనలాగే ఇల్లు కూడా కేవలం భౌతిక మైనది కాదు. ఇల్లంటే కేవలం గదులు, గోడలు కాదు అందులో నివసించే వాళ్ళ ఆలోచనలు, ఎమోషన్స్. వస్తువులు ఇంతకుముందు ఉన్న వాళ్ళ ఆలోచనలు. ఉన్న గదులు, గోడలు అక్కన నివసించే వాళ్ళ ఎమోషన్స్ ను దాచుకుంటాయి. మనుషులం కాబట్టి మాకి ఎదురయ్యే పరిస్థితుల వల్ల నెగెటివ్ ఆలోచనలు రావడం సహజం. ఈ ఆలోచనలు ఇంట్లో ప్రసరించి అందులో ఉండే వాళ్ళ మూడ్ ను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇంటిని కేవలం శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాకుండా భౌతిక స్థాయి దాటి ఎమోషన్స్ , ఆలోచనలు, ఎనర్జీలు కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.
భౌతిక స్థాయి దాటి పాసిటివ్ ఎనర్జీ ఉండేలా ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.
1. ధూపం మరియు సాంబ్రాణి వెయ్యడం: చాలా సంసృతుల్లో వాడే పురాతన పద్దతి ఇది. ధూపం లేదా సాంబ్రాణి వెయ్యడం మైండ్ ను రిలాక్స్ చేసి మనకి మంచి మూడ్ ఇస్తుంది. మంచి పరిమళాలు ఒత్తిడిని తగ్గించి మన పనిలో నాణ్యత పెంచుతాయి. మంచి పరిమళం ఉన్న ఇంట్లోకి దేవతలు వస్తారని నమ్ముతారు. సాయంత్రం పూట ధూపం లేదా సాంబ్రాణి వేసి మంచి పరిమళం ఉండేలా చూసుకోండి. కెమికల్స్ లేని వాటిని వాడని లేదంటే మన ఉద్దేశం నెరవేరడం అటుంచి ఎక్కువ కాలుష్యం జరుగుతుంది. సహజ ఉత్పత్తులు వాడండి.
2. మంత్రాలు ప్లే చెయ్యండి: మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా మంత్రాలు పనిచేస్తాయి. మంత్రాలు శబ్ద తరంగాలు. ఈ తరంగాలు అవి ప్లే చేస్తున్న ప్రదేశం పై అక్కడ ఉన్న మనుషులపై ప్రభావం చూపుతాయి. మంత్రాలు అంటే పవిత్రమైన శబ్దాలు క్రమంగా రావడం. మంత్రాలు ప్లే చేస్తే ఆ ప్రదేశంలో ఉన్న ఒత్తిడి, నెగెటివ్ ఆలోచనలు మరియు గతం తాలూకు ఎమోషన్స్ తగ్గుతాయి. అవి ప్లే అవుతున్న చోట పాసిటివ్ ఎనర్జీ, ఆనందాన్ని తీసుకొస్తాయి. ఓం లేదా గాయత్రి మంత్రం లేదా మరేదైనా మీకు నచ్చిన మంత్రాన్ని ఎంచుకోండి.
3. అరోమా ఆయిల్స్ వాడటం: మన పూర్వీకుల రోజుల నుండి అరోమా ఆయిల్స్ ను రోగాలు నయం చెయ్యడానికి, ఒక ప్రదేశం లోని ఎనర్జీలను ఎక్కువ చెయ్యడానికి వాడతారు. ఈ ఆయిల్స్ ను చెట్ల నుండి సేకరిస్తారు. ఏ చెట్టు నుండి తీస్తే ఆ పరిమళం కలిగివుంటాయి. వాటి ఉపయోగాలు..
1. ఒత్తిడి నుండి ఉపశమనం
2. ప్రేమ, ప్రశాంతమైన ఎనర్జీలు ఉండేలా చేస్తాయి
3. మూడ్ ను మెరుగు పరుస్తాయి
4. శరీరం మరియు మైండ్ ను రిలాక్స్ చేస్తాయి
5. ఇల్లుని భౌతిక మైన మరియు ఎనర్జీ స్థాయిలో శుభ్రం చేస్తాయి.
చాలా రకాల అరోమా ఆయిల్స్ మార్కెట్ లో దొరుకుతున్నాయి. Pine Oil, లావెండర్ Oil, Sandle wood Oil etc. ఇవి ఒక ప్రదేశం యొక్క ఎనర్జీను మార్చడం లో చాలా బాగా పనిచేస్తాయి. వీటిని ఫ్లోర్ క్లీనింగ్ కి కూడా వాడవచ్చు. లేదా డిఫ్యూజర్ లో వాడవచ్చు.
4. ఉప్పుతో ఫ్లోర్ శుభ్రం చెయ్యడం: పురాతన సంసృతిలో ఉప్పుని నయం చెయ్యడం కోసం, ఒక చోటులో ఉన్న నెగెటివ్ ఎనర్జీను తీసివేయడం కోసం వాడేవారు. నీటిలో ఉప్పు వేసి మీ ఇంట్లో ఫ్లోర్ ను శుభ్రం చేసుకోవచ్చు. ఇది నెగెటివ్ ఎనర్జీలను శుభ్రం చేస్తుంది. వీలుంటే ఉప్పు నీటిలో అరోమా ఆయిల్స్ వేసి శుభ్రం చేసుకుంటే ఇంకా మంచిది.
5. మెడిటేషన్ చెయ్యండి. నెగెటివ్ ఆలోచనలు మరియు నెగెటివ్ ఎనర్జీల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మెడిటేషన్ చేసే సమయంలో మీరు చాలా గాఢమైన నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోతారు. దాని వల్ల కలిగే లాభాలు ఈ కింది విధంగా ఉంటాయి.
1. శరీరం మరియు మైండ్ ను నయం చేస్తుంది.
2. ఒత్తిడిని తగ్గిస్తుంది
3. కోపాన్ని నియంత్రిస్తుంది
4. రిలేషన్ షిప్స్ ను మెరుగు పరచుతుంది
5. ఎదుటి వాళ్ళని క్షమించడం తేలిక అవుతుంది
6. ఆలోచనలకు బలం చేకూరుస్తుంది
7. ఆలోచనలో స్పష్టత వస్తుంది
8. ఇంట్లోకి, జీవితంలోకి పాసిటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది
9. ఇంట్లో ఉన్న ఎనర్జీలను మారుస్తుంది.
మెడిటేషన్ చేసిన తర్వాత ప్రేమ నిండిన ఆ ఎనర్జీలను మీ ఇంట్లో ఉండేలా చెయ్యవచ్చు. క్రమం తప్పకుండా చేస్తే ఇవి మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీలను పారద్రోలి ఇంటిని స్వర్గంలా మారుస్తుంది.
6. అగ్నిహోత్రం లేదా హోమం : అగ్నిహోత్రం అంటే పురాతన కాలంలో గాలిని శుభ్రం చెయ్యడానికి ఆవు నెయ్యి, లేదా మూలికలు పవిత్రమైన మంత్రాలతో అగ్నిలో వేసి కాల్చే ఆచారం. అగ్నిహోత్రం వల్ల ఈ కింది లాభాలు ఉంటాయి.
1. గాలిని, వాతావరణాన్ని శుభ్రం చేస్తుంది.
2. వాతావరణంలో పాసిటివిటీ ను సృష్టిస్తుంది
3. గతంలో ఆ ఇంట్లో ఉన్నవాళ్లు ఏర్పరచిన నెగెటివ్ ఆలోచనలు, ఎమోషన్స్ ను తీసివేస్తుంది.
4. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి నయం చేసుకునే శక్తి పెరుగుతుంది.
5. ఒత్తిడిని తగ్గిస్తుంది
6. మీ ఇంట్లో పాసిటివ్ ఎనర్జీను పెంచుకోవడానికి అప్పుడప్పుడు హోమాలు చేస్తూ ఉండాలి.
7. ఇంట్లో పాసిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి మరికొన్ని సూచనలు:
1. ఇండోర్ ప్లాంట్స్ పెట్టండి
2. ఇంటిని అలంకరించడానికి మంచి కాంతివంతమైన రంగులు మరియు పాసిటివ్ ఆలోచనలని కలిగించే పెయింటింగ్స్ ఉంచండి.
3. ప్రతిరోజూ సన్ లైట్ మరియు గాలి రావడానికి తలుపులు, కిటికీలు తెరుస్తూ ఉండండి
4. నిరాశ కలిగించే రంగులు, పెయింటింగ్స్ లేకుండా జాగ్రత్త పడండి.
5. ప్రతీరోజూ దీపం వెలిగించండి. దైవంతో అనుసంధానమై ఉండండి
ఇంట్లో పాసిటివ్ ఎనర్జీలు పెంచుకోవడానికి ఇవి కొన్ని సూచనలు . మీ జీవితాన్ని, మీ లక్ష్యాన్ని తీర్చి దిద్దడం లో మీ ఇంటిది చాలా ముఖ్యమైన పాత్ర. మిమ్మల్ని కాపాడుతూ, జాగ్రత్తగా చూసుకునే చోటు మీ ఇల్లు. మీ ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి. మీ ఇంటిపై మీరు చూపించిన శ్రద్ద మంచి ఆరోగ్యం, ఆనందం, ఎదుగుదల, విజయం రూపంలో తిరిగి మీకోసం వస్తుంది.