అహింస ను పాటించడానికి 7 మార్గాలు

అహింస
Share

ఎన్నో మతాలు బోధించే ప్రధాన ధర్మము అహింస. అన్ని మతాలు ఎవరిని గాయపరచొద్దు అనే నేర్పుతున్నాయి. ఒక మనిషి యొక్క అత్యున్నత ధర్మం అహింస అని చెబుతున్నాయి. అహింస యొక్క గొప్పతనాన్ని మహాత్మా గాంధీ ఇలా చెప్పారు.

“అహింస అత్యున్నత ధర్మం. దీనిని పూర్తిగా పాటించ లేకపోయినా కనీసం దాన్ని అర్థం చేసుకుని వీలైనంతవరకూ హింసకు దూరంగా ఉండడానికి మానవులు ప్రయత్నించాలి”

అహింస యొక్క అర్థం ఏమిటంటే ప్రాణంతో ఉన్న ఏ జీవిని ఏ విధంగానూ గాయపరచకుండా ఉండటం. గాయపరచడం అని అంటే కొట్టడం లేదా చంపడం అని అనుకుంటారు.

గాయపరచడం అనేది ఈ కింది రకాలుగా ఉంటుంది.

1. పనుల ద్వారా గాయపరచుట – ఇది భౌతికంగా మనం చేసే పనుల వల్ల జరిగే నష్టం. కొట్టడం, భౌతికంగా బాధ కలిగేలా చేయడం, చంపడం మొదలగునవి.

2. మాటల ద్వారా గాయపరచుట – ఇది మన మాటల ద్వారా అంటే తిట్టడం, బూతులు తిట్టడం, లేనిపోనివి చెప్పడం మొదలగునవి.

3. ఆలోచనలతో, బావోద్వేగాలతో గాయపరచుట- మన ఆలోచనల ద్వారా, భావోద్వేగాల ద్వారా గాయపరచడం

అసలు ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని ఎందుకు గాయపరుస్తాడు? కారణాలు ఇప్పుడు చూద్దాం.

1. కోపం

2. అత్యాశ

3. అసూయ

4. తన ఆలోచనలు, భావోద్వేగాల మీద అదుపు లేకపోవడం వల్ల

5. తన మాట మీద తనకి అదుపు లేకపోవడం వల్ల

6. అజ్ఞానం

అందరు గురువులు, మరియు మతాలు ఎదుటి వ్యక్తిని గాయపరచకూడదు అని ఎందుకు చెప్తాయి ? ఎందుకంటే ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని గాయపరిచినప్పుడు పరోక్షంగా తనని తాను బాధ పెట్టుకుంటాడు.

వేరే వాళ్ళకి బాధ కలిగేలా చేయడం వల్ల మనం ఈ కింది పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది.

1. ఒక వ్యక్తి ఎదుటివారిని గాయపరచాలని అని ఆలోచించినా లేదా గాయపరిచినా అతనిలో హానికరమైన హార్మోన్స్ విడుదలవుతాయి. దానివల్ల హై బీపీ, పక్షవాతం, Heart Attack మొదలైనవి వచ్చే అవకాశం ఉంటుంది. భౌతికంగానే గాయపరచాల్సిన అవసరం లేదు. అలాంటి ఆలోచన చేసినా ఈ హార్మోన్లు విడుదలవుతాయి.

2. ఎదుటి వాళ్ళని గాయపరచడం ఒక వ్యక్తి యొక్క ప్రశాంతతను దూరం చేస్తుంది.

3. ఇది అనేక నిద్ర సమస్యలను తీసుకొస్తుంది.

4. ఒక వ్యక్తి యొక్క ఆలోచనా విధానం నెగిటివ్ గా మారుతుంది. అందువల్ల అతనికి ఎప్పుడూ వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి.

5. ఎదుటివారిని గాయపరచడం దురదృష్టానికి దారితీస్తుంది.

6. ఎదుటివారిని గాయపరిచే వారికి రిలేషన్ షిప్స్ అంతగా బాగుండవు. వాళ్ళ జీవితంలో ప్రేమ, ఆనందం ఉండవు.

7. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు.

ఎదుటి వాళ్లని గాయపరచడం ఎదుటి వ్యక్తికి మాత్రమే కాకుండా తనకి కూడా హానికరమే. కాబట్టి ఎప్పుడూ ఎదుటి వాళ్ళని గాయపరచకూడదు.

ఎదుటి వాళ్ళని గాయపరచకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం.

1. చిన్నపిల్లలపై హింసను వ్యతిరేకించండి: చిన్న పిల్లల్ని కొట్టడం అనేది ఇళ్లల్లో చాలా సాధారణం అయిపోయింది. కానీ ఇది ఆ పిల్లవాడి ఆత్మవిశ్వాసం మీద చాలా Negetive ప్రభావం చూపిస్తుంది. భౌతికంగానే కాకుండా Emotional గా, మానసికంగా అతని మనసులో ఒక మాయని గాయం ఉండిపోతుంది. కొట్టకుండా కూడా పిల్లలకి క్రమశిక్షణ నేర్పవచ్చు. తనతో కూర్చుని మాట్లాడి క్రమశిక్షణ గురించి చెప్పవచ్చు. కేవలం కొట్టడం వల్ల అది ద్వేషాన్ని కలిగిస్తుంది. కాలక్రమేణా పిల్లల్లో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. హిందూ సాంప్రదాయంలో దేహాన్ని దేవాలయంలో భావిస్తారు. కాబట్టి ఒక వ్యక్తిని కొట్టడం అనేది దేవుణ్ణి గాయపరచడంతో సమానం కాబట్టి ఒక వ్యక్తిని గానీ, జంతువులని గానీ, మరీ ముఖ్యంగా పిల్లల్ని కొట్టొద్దు.

2. కఠినమైన మాటలు మాట్లాడకండి: ఎవరినైనా ఏదైనా అనేముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి. ఎందుకంటే కఠినమైన మాటలు చేసే గాయం జీవితాంతం వెంటాడుతుంది. ఎవరినైనా విమర్శించాల్సిన వస్తే సరైన భాషతో, అర్థం అయ్యేలాగా చెప్పండి. కఠినమైన పదాలు బూతులు లేకుండా చూసుకోండి.

3. బూతు మాటలు సరైన పద్ధతి కాదు: పాశ్చాత్య సంస్కృతి వల్ల బూతులు మాట్లాడటం చాలా సాధారణమైన విషయం అయిపోయింది. వాళ్లకి అక్కడ అది అలవాటు. ఈ బూతు మాటలు ఒక వ్యక్తి జీవితంలో నెగిటివిటీ కి దారి తీస్తాయి. మన ఆలోచనా విధానాన్ని నెగిటివ్ గా మారుస్తాయి కాబట్టి బూతు మాటలు దూరంగా ఉండండి.

4. ఎదుటి వారి గురించి negative గా ఆలోచించడం మానేయండి: ఒక వ్యక్తి గురించి Negetive గా ఆలోచించడం వల్ల అతనిని గాయపరచ లేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది నిజం కాదు. మనం ఎదుటి వారి గురించి నెగిటివ్ గా ఆలోచించినప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఎదుటి వారి యొక్క Aura లోకి వెళ్లి అతనికి చెడు జరిగేలా చేస్తాయి. దీనివల్ల రిలేషన్షిప్ సమస్యలు వస్తాయి. కాబట్టి ఎదుటి వారి గురించి నెగిటివ్ గా ఆలోచించడం మానేయండి.

5. పుకార్లకు దూరంగా ఉండండి: చాలామందికి పుకార్లు మాట్లాడుకోవడం కాలక్షేపం. ఆఫీసులో తినే సమయంలో , ఫంక్షన్స్ లో లేదా ఒక పదిమంది కలిసిన చోట పుకార్లు మాట్లాడుకుంటారు. మనం ఎదుటి వారి గురించి లేనిపోని పుకార్లు మాట్లాడుకుంటే మన నెగిటివ్ ఆలోచనలు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి మీద అ నెగిటివ్ ప్రభావం చూపిస్తాయి. మనం ఎవరికైనా చెడు పంపిస్తే ప్రకృతి ధర్మం ప్రకారం మన జీవితంలో కూడా అదే ఎదురవుతుంది. మనం ఏమి ఇస్తామో అదే తీసుకుంటాం. మనలో చాలామందికి రిలేషన్ షిప్స్ సరిగా లేక పోవడానికి కారణం ఇదే. చాలామంది సాధారణంగా బాస్ గురించి ఎదుటి వ్యక్తుల గురించి పుకార్లు మాట్లాడతారు దీనివల్ల రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి పుకార్లకు దూరంగా ఉండండి.

6. మెడిటేషన్ చేయండి: మెడిటేషన్ చేయడం వల్ల మన ఆలోచనల మీద ఎమోషన్స్ మీద అదుపు వస్తుంది. కోపాన్ని తగ్గిస్తుంది. అత్యాశ తగ్గిస్తుంది. మన అంతర్గత శక్తిని పెంచి సరైన పని చేసే విధంగా తయారు చేస్తుంది. అహింస పాటించడానికి మెడిటేషన్ సరైన సాధనం. కాబట్టి ప్రతి రోజు క్రమం తప్పకుండా మెడిటేషన్ చేయండి.

7. ప్రార్థన చేయండి: అహింస పాటించడానికి కావలసిన బలాన్ని ఇమ్మని ఆ దేవుని ప్రార్థించండి. మీరు నిజాయితీగా ప్రార్థిస్తే దేవుడు బలాన్ని, ఆశీర్వాదాన్ని మీకు ఇస్తాడు. జీవితంలో సరైన పని చేయడానికి కావాల్సిన సామర్థ్యాన్ని మీకు ఇస్తాడు.

జీవితంలో 100% అహింసని పాటించడం కుదరదు. తెలిసో, తెలియకో కొన్నిసార్లు హింసకు కారణం అవుతాం. ఉదాహరణకి కూరగాయలు కోయడం లేదా బొద్దింకలను చంపడంఇలాంటివి. ఇలాంటి హింస మన జీవితంలో ఒక భాగం. అవసరం లేని హింసని వీలైనంతగా వదిలించుకోవడం ఒక వ్యక్తి గొప్ప గా మారడానికి సహాయపడుతుంది.

నిజం చెప్పాలంటే హింస లేకుండా ఏ పని ఏ ఏ వ్యవస్థ నడవదు. హింస లేకుండా జీవితం ఉండదు. మనం చేయాల్సిందల్లా వీలైనంత అహింసను తగ్గించుకుంటూ వెళ్లడమే” – మహాత్మా గాంధీ.

అహింస గురించి వేదాలు అందంగా ఒక మాట చెప్పాయి . అహింసా పరమో ధర్మ.

Registration

Forgotten Password?

Loading