ఈ భూమి మీద మనం బ్రతకడానికి గాలి తర్వాత అత్యంత అవసరమైనది నీరు. మన శరీరంలో దాదాపు 70% నీరు ఉంటుంది. మరియు సరైన ఆరోగ్యానికి నీరు చాలా ముఖ్యం. మన బ్రెయిన్ 73%, గుండె 73%, రక్తం 73%, ఊపిరితిత్తులు 73% నీటితో ఉంటాయి. మన శరీరంలో అన్ని సక్రమంగా జరగాలంటే మన శరీరంలో ప్రతి కణానికి, ప్రతి అవయవానికి నీరు అవసరం.
మనందరం చిన్నప్పట్నుంచి నీరు తాగుతున్నాం. ఈ ఆర్టికల్ యొక్క పేరు చూసినవారు ఆశ్చర్యపోవచ్చు. నీరు తాగడం లో కూడా సరైన పద్ధతి, తప్పు పద్ధతి ఉంటాయా ? నీరు తగినంత తాగడమే కదా అనుకోవచ్చు. కానీ ఆశ్చర్యకరంగా నీరు తాగడానికి సరైన పద్ధతి అంటూ ఒకటి ఉంది.
సరైన పద్ధతిలో నీరు తాగడానికి తెలుసుకునేముందు అసలు మన శరీరానికి నీరు ఎందుకు అవసరమో తెలుసుకుందాం.
1. మీరు మన శరీరం యొక్క వేడిని క్రమబద్ధీకరిస్తుంది.
2. మన కణజాలాలని, వెన్నుపూసని, కీళ్లని ఒక లూబ్రికెంట్ లాగా పనిచేస్తూ కాపాడుతుంది.
3. మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను, విషపదార్థాలను చెమట, మూత్రం ద్వారా బయటకు పంపుతుంది.
4. ఆహారం జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది
5. ఆహారంలోని పోషకాలు గ్రహించడానికి సహాయపడుతుంది.
6. మన చర్మాన్ని ఆరోగ్యంగా అందంగా ఉంచడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
7. లాలాజలాన్ని సృష్టిస్తుంది.
ఒక వ్యక్తి తన శరీరానికి కావలసిన దానికన్నా తక్కువ నీరు తీసుకుంటే కాలక్రమేణా ఈ కింది సమస్యలు వస్తాయి.
1. మలబద్ధకం
2. అనారోగ్యకరమైన చర్మం
3. చెడు శ్వాస
4. తక్కువ మూత్రం
5. దీర్ఘకాలిక అలసట
6. ఎప్పుడూ అనారోగ్యానికి గురవ్వడం.
కాబట్టి ప్రతిరోజు మన శరీరానికి అవసరమైన నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం. ఎంత నీరు తాగాలి అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఒక వ్యక్తికి ఎంత నీరు అవసరం అనేది అతను చేసే శారీరక శ్రమ, అతని శరీర తత్వం, వయసు మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది. నీరు తాగడానికి ఒకే ఒక నియమం ఏమిటంటే, మీకు ఎప్పుడు దాహమేస్తే అప్పుడు తాగండి. మీ మూత్రం పారదర్శకంగా లేకుండా గాఢ మైన రంగులో ఉంటే మీరు కావలసినంత నీరు తాగటం లేదు అని అర్థం.
సరైన పద్ధతిలో నీరు తాగడానికి కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం.
1. “మీ ఆహారాన్ని తాగండి, నీటిని నమలండి” అని ఒక నియమం ఉంది. దాని అర్థం ఆహారాన్ని ద్రవపదార్థం గా మారే వరకూ నమలాలి. నీటిని కొంచెం కొంచెంగా తాగాలి. నీటిని ఒకేసారి తాగితే అందులో చాలా వరకు మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తుంది. మీ శరీరానికి సరైన హైడ్రేషన్ ఉండాలంటే నీటిని కొంచెం కొంచెం గా మెల్లగా తాగాలి. రోజంతా నీటిని అప్పుడప్పుడు కొంచెం తాగుతూ ఉండాలి.
2. కూర్చుని మాత్రమే నీటిని తాగాలి. నిలబడి నీళ్లు తాగకూడదు. నిలబడి నీళ్ళు తాగడం అనేది దీర్ఘకాలంలో మన కడుపు యొక్క ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది.
3. ఉదయం లేవగానే పరగడుపున మామూలు నీరు తీసుకోండి. ఇది మన శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటికి పంపి మన ప్రేగులను శుభ్రం చేస్తుంది.
4. ఎక్కువ చల్లగా ఉన్నా నీరు తాగకండి. ఇది ఇది జీర్ణం కావడానికి అవసరమైన వేడిని తగ్గించి జీర్ణక్రియను ఆటంక పరుస్తుంది.
5. మామూలు నీరు లేదా గోరువెచ్చని నీరు తాగండి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఈ కింది లాభాలు ఉంటాయి.
1. జీర్ణక్రియను పెంచుతుంది
2. జలుబు, దగ్గు, శ్వాస సమస్యలు, ఆస్తమా వంటి వాటిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
3. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది.
6. భారతీయ ఆర్థిక గురువు, ఫిలాసఫర్ అయిన చాణక్య నీటి గురించి చెప్పిన మాటలు. ‘ “ఆహారం తినే ముందు అరగంట ముందు నీరు తాగితే అది అమృతంలా పని చేస్తుంది. ఆహారం తీసుకునేటప్పుడు నీరు తాగితే అది మెడిసిన్ ఎలా పనిచేస్తుంది. ఆహారం తీసుకున్న వెంటనే నీరు తాగితే అది విషం లా పనిచేస్తుంది.”
1. ఆహారం తీసుకోవడానికి అరగంట ముందు నీళ్లు తాగితే అది మన జీర్ణ వ్యవస్థను సిద్ధం చేస్తుంది. సరైన జీర్ణక్రియకు కావాల్సిన ఎంజాయ్ యాక్టివేట్ చేస్తుంది.
2. ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు తాగితే దానివల్ల నష్టం లేదు, లాభమూ లేదు. మీ జీర్ణ వ్యవస్థలో ఉన్న ఆహారాన్ని ద్రవ పదార్థంగా మార్చడంలో సహాయపడుతుంది అంతే.
3. ఆహారం తీసుకున్న వెంటనే నీరు తాగితే జీర్ణం అవ్వడానికి కావాల్సిన ఎంజాయ్ గాఢత కోల్పోతాయి. దీనివల్ల మీ శరీరం ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ సమయం కష్టపడాల్సి వస్తుంది. ఇది శరీరానికి అనవసరమైన శ్రమ.
4. ఆహారం తీసుకున్న తర్వాత కనీసం ఒక గంట తర్వాత మాత్రమే నీరు తాగండి. ఆహారం తీసుకున్న వెంటనే మీకు బాగా దాహంగా ఉంటే ఒక చిన్న మొత్తంలో నీరు తీసుకోండి.
5. మీకు వీలైన ప్రతిసారి మీరు తీసుకునే నీటితో ఒక సగం నిమ్మకాయ పిండి తీసుకోవడమే. ఇది ఆల్కలీన్. ఇది యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేసి మన శరీరానికి, మన చర్మం యొక్క ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది.
6. నీటిని ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉంచకండి. ప్లాస్టిక్ బాటిల్స్ లో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. స్టీలు లేదా గాజు పాత్రలో నీరు ఉంచండి.
నీరుని సరైన పద్ధతిలో తాగడానికి కొన్ని సూచనలు ఇవే. మీరు నిజ జీవితంలో పాటించి తగిన మరి కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం.
1. రాత్రంతా నీటిని రాగి పాత్రలో ఉంచి ఉదయం లేవగానే నీటిని తాగండి. మంచి రాగి పాత్రని మీరు ఇక్కడ కొనవచ్చు.
2. ప్లాస్టిక్ బాటిల్స్ కి బదులు గ్లాస్ బాటిల్స్ వాడండి. ఇవి అందంగా ఉండటమే కాకుండా మీరు ఎక్కువ నీరు తాగే ఎలా చేస్తాయి. గ్లాస్ బాటిల్స్ మీరు ఇక్కడ పొందవచ్చు.
3. ఎప్పుడూ మీతో పాటు బాటిల్ నీరు ఉండేలా చూసుకోండి. మీకు ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు తాగవచ్చు.
4. పాజిటివ్ లేదా నెగటివ్ ఎనర్జీని తనలో ఇముడ్చుకునే సామర్థ్యం నీటికి ఉంది. మీరు నీరు తీసుకునేటప్పుడు మీకు నచ్చిన మంత్రాన్ని చదువుతూ నీరు తీసుకోండి. మీ చేతిలో నీటిని పట్టుకొని ఇలా మంత్రాన్ని చదివితే ఆ నీరు పాసిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. మీరు ఆ నీరు తాగినప్పుడు మీ మొత్తం శరీరం పాసిటివ్ ఎనర్జీతో నిండుతుంది. ఆ మంత్రానికి బదులుగా నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, బలంగా ఉన్నాను అని చెప్పుకుని నీటిని తాగండి. మన భారతీయ సంస్కృతిలో గుళ్ళో తీర్థానికి అత్యంత ప్రాముఖ్యత ఉండడానికి కారణం ఇదే. గుళ్లో ఇచ్చే తీర్థం దైవం యొక్క పాసిటివ్ ఎనర్జీ తో నిండి ఉంటుంది. ఒక వ్యక్తి తాగినప్పుడు ఒక శక్తి అతనిలో నిండుతుంది.
5. మీ నీటి పాత్ర పైన rose quartz crystal ఉంచవచ్చు. rose quartz crystal లవింగ్ ఎనర్జీ విడుదల చేస్తాయి . ఒక వ్యక్తి అలాంటి నీరు తాగినప్పుడు ఈ లవింగ్ ఎనర్జీ ఎమోషనల్గా ఆరోగ్యకరంగా ఉండటానికి సహాయపడుతాయి. rose quartz crystal వాడే ముందు ఉప్పు నీటితో శుభ్రంగా కడగండి. ప్రతి 15 రోజులకు ఒకసారి కడగండి. rose quartz crystal మీరు ఇక్కడ పొందవచ్చు.
నీరు ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. సరైన పద్ధతిలో నీరు తాగండి.