జీవితంలో మీకు ఏం కావాలో తెలుసుకోవడానికి 8 ప్రశ్నలు

జీవితంలో మీకు ఏం కావాలో
Share

మనందరికీ అల్లాదీన్ జీని కధ తెలుసు. జీని అల్లాదీన్ ని “ మాస్టర్, నీకు ఏం కావాలి” అని అడిగినపుడు అల్లాదీన్ ఏం కోరుకుంటే దాన్ని జీని నెరవేరుస్తుంది. ఒకవేళ అదృష్టం వల్ల జీని మీకు దొరికి మీకు ఏం కావాలి అని అడిగితే మీరు ఏమంటారు? మనలో చాలామంది జీని అనేది ఊహాత్మకం, అది వచ్చినప్పుడు మనకి ఏం కావాలో ఆలోచిద్దాం లే అనుకుంటారు.

మీ కోరికలు తీర్చే జీని మీరే అంటే మీరు ఏమంటారు? మీ కోరికలు తీర్చుకునే శక్తులు మీ దగ్గరే ఉన్నాయంటే ఏమంటారు ? నన్ను నమ్మరు కదా? సరే ఆధారాలు చూడండి. జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారు అందరూ వాళ్ళకి వారే జీని. వాళ్ళలో చాలామంది ఎలాంటి సపోర్ట్ లేకుండా చాలా కింద స్థాయి నుండి పైకి వచ్చినవారే. అద్భుతమైన ప్రణాళికతో కష్టపడి ఆ విజయాన్ని సాధించారు. వాళ్ళు ఆ విజయం సాధించాడానికి ముందు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఆ స్పష్టతే వాళ్ళు అనుకున్నది సాధించడానికి సహాయం చేస్తుంది.

ఏదైనా సాధించాలంటే అసలు మనకి కావాల్సింది ఏంటో ఒక స్పష్టత ఉండాలి. అదే మొదటి అడుగు. ఎప్పుడైనా కాస్త సమయం తీసుకుని మీకు ఏం కావాలో ఆలోచించారా? మీ జీవితాన్ని ఎలా జీవించాలి అనుకుంటున్నారో ఆలోచించారా? మీ శరీరం ఎలా ఉండాలో ఆలోచించారా? మీ కీరీర్ ని ఎలా మలచుకోవాలనుకుంటున్నారో ఆలోచించారా? ఇలా ఎప్పుడైనా ఆలోచించారా ?

జీవితంలో మనకి చాలా ఎంపికలు ఉంటాయి. ఇన్ని ఎంపికల మధ్య మనకి ఏం కావాలో తెలియని స్థితిలో ఉంటాము. మనలో చాలామంది రోజువారీ పనుల్లో బిజీగా ఉంటాం. వేరేవాళ్ళ కోరికలు, మనపై వారి అంచనాలు, చిన్న చిన్న ఆనందాలు, జీవితం మనకి ఇచ్చేవి ఇవే. కనీసం కాస్త సమయం తీసుకుని “ ఈ జీవితం నుండి నాకు ఏం కావాలి ?” అని ఒక్కసారి కూడా మనం ఆలోచించుకోము.

ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన ఎంపికలు ఎలా ఉండాలో, జీవితం నుండి మనం ఏం పొందాలో అన్నీ ఈ ప్రశ్నపై ఆధారపడి ఉంటాయి. అప్పుడే మనం అనుకున్నదాన్ని సాధించగలం, కావాలనుకున్నది పొందగలం. ఇది కేవలం ఊహాత్మకమైన విషయం కాదు. ఇది నిజం. మీరు అనుకున్నది ఏదైనా సాధించడం ఎలా?  మొదటగా అసలు మీకు కావాల్సింది ఏంటో తెలుసుకోవడం.

మనం అనుకున్నది సాధించడం ఇంత తేలిక అయితే చాలామంది తమ కలలని నిజం చేసుకోలేక జీవితంలో ఆనందం లేకుండా ఎలా ఉంటున్నారు అని మీరు నన్ను అడగొచ్చు.

ఈ ప్రశ్నకి కొన్ని సమాధానాలు ఈ కింద ఉన్నాయి.

1. కొంతమంది కనీసం కొంత సమయం తీసుకుని వాళ్ళకి ఏం కావాలో ఆలోచించరు. జీవితం ఎలా ఉందో అలా బతికేస్తూ కేవలం కోరుకుంటూ ఉంటారు. నాకు మంచి body ఉండాలని, పెద్ద ఇల్లు ఉండాలని ఇలా. ఈ కోరికలు కలలు కాదు. ఇవి కేవలం అప్పుడప్పుడు వచ్చి పోయే కోరికలు మాత్రమే. ఈ కోరికలని నిజం చేసుకోవడానికి వాళ్ళు ఏమి చెయ్యరు.

2. కొన్నిసార్లు వాళ్ళకి ఏం కావాలో తెలుసు అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే- వాళ్ళకి ఏం కావాలో నిజంగా వాళ్ళకి తెలుసా?

3. కొంతమందికి వాళ్ళ కోరికలు ఎక్కువ కాలం ఉండవు. జీవితంలో చాలా ఎంపికలు ఉండడం వల్ల వాళ్ళ కోరికలు ప్రతిరోజూ మారిపోతూ ఉంటాయి. ఈరోజు ఒకటి కోరుకుంటారు రేపు ఇంకొకటి కావాలనుకుంటారు. ఒక రెండు రోజుల తర్వాత అసలు వాళ్ళ కోరిక ఏంటో వాళ్ళకే గుర్తుండదు.

4. కొంతమందికి వాళ్ళకి ఏం కావాలో తెలుసు. సరైన సాధనాలు మరియు వ్యూహాలు వాడి వాళ్ళ కలలు నిజం చేసుకోవడం వాళ్ళకి తెలీదు. ఉదాహరణకి ఒక వ్యక్తికి బరువు తగ్గాలని ఉంటుంది. తన శరీరానికి సరిపడని డైట్ ని తను తీసుకుంటున్నప్పుడు అతను బరువు తగ్గాలని ఎంత బలంగా కోరుకున్నా ఉపయోగం ఉండదు. మనం కలలను నిజం చేసుకోవాలంటే సరైన సాధనాలు మరియు వ్యూహాలు ఉండడం చాలా ముఖ్యం.

5. కొంతమందికి వాళ్ళకి ఏం కావాలో తెలుసు కానీ వాళ్ళ రోజువారీ భాద్యతల్లో మునిగిపోయి వాళ్ళ కలల గురించి పట్టించుకునే సమయం వాళ్ళకి ఉండదు.

6. కొంతమంది ప్రయత్నించకుండానే తమవల్ల కాదని వదిలేస్తారు.

7. కలలకోసం కష్టపడే సమయంలో ఏదైనా అవాంతరాలు ఎదురైతే కొంతమంది చాలా తేలికగా వదిలేస్తారు.

8. కొంతమంది చాలా కష్టపడతారు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ subconscious mind లో వారు నమ్మేది వేరే ఏదో అయ్యుంటుంది. ఆ నమ్మకాలే అనుకున్నది సాధించకుండా మనల్ని ఆపుతాయి.

కొంతమంది వాళ్ళు అనుకున్నది సాధించలేకపోవడానికి కారణాలు ఇవి. మీరు విజయవంతమైన జీవితం పొందాలనుకుంటే మీకు ఏం కావాలో తెలుసుకోవాలి. కాస్త సమయం తీసుకుని ఈ కింద ప్రశ్నలకి సమాధానం చెప్పుకోండి.

మీకు ఏం కావాలో తెలుసుకోవడానికి ఈ ఎనిమిది  ప్రశ్నలు సహాయపడతాయి.

1. మీ జీవితంలో మీరు అనుకున్నవన్నీ సాధిస్తే మీ జీవితం ఎలా ఉంటుంది? అది నిజంగా జరిగినట్టే చూడండి. మీ జీవితం ఎలా ఉంటుందో అణువణువూ గమనించండి.

2. మీ body ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు?

3. మీ పెళ్లి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు?

4. మీ జీవన విధానం (lifestyle) ఎలా ఉండాలని అనుకుంటున్నారు ?

5. మీరు వ్యక్తిగా ఎలా ఉండాలనుకుంటున్నారు?

6. మీరు ఎలా గుర్తుండిపోవాలనుకుంటున్నారు?

7. మీ ఆర్థిక స్థితి ఎలా ఉండాలి అనుకుంటున్నారు?

8. మీరు ఎలాంటి కెరీర్ ఎంచుకుందాం అనుకుంటున్నారు?

నిజంగా మీకు ఏం కావాలో ఈ ప్రశ్నల వల్ల తెలుస్తుంది. మీరు చాలా వాటి గురించి కలలు కానొచ్చు. వాటన్నిటినీ ఒక లిస్ట్  రాసుకుని మీకు రోజూ కనపడే చోట వాటిని పెట్టుకోండి. ఇది మీకు మీ కలలని గుర్తుచేస్తూ వాటి మీద శ్రద్ద పెట్టేలా చేస్తుంది. మీరు వేటి మీద శ్రద్ద పెడతారో వాటిని నిజం చేసుకోవడం కోసం కచ్చితంగా  కష్టపడతారు.

మీకేం కావాలో ఒకసారి స్పష్టంగా తెలిసిన తర్వాత మీకు ఎన్నో అవకాశాలు ఎదురు వస్తాయి. మీకు ఎలాంటి జీవితం కావాలో మీరే ప్లాన్  చేసుకోవచ్చు. కానీ స్పష్టమైన విజన్ ఉండడం చాలా ముఖ్యం. లేకపోతే మీరు చేసే పనికి ఒక సార్ధకత ఉండదు. గాలికి కొట్టుకుపోయే ఎండుటాకులా జీవితం ఎటు తోస్తే అటు వెళ్లిపోతారు. కాబట్టి మీ జీవితాన్ని ప్లాన్  చేసుకోండి.

మీ లైఫ్ విజన్  ఏంటి ?   జీవితంలో మీకు ఏం కావాలి ?

వీటి గురించి మరింత తెలుసువవడానికి ఈ గొప్ప పుస్తకం చదవండి.

Registration

Forgotten Password?

Loading