హానికర కాస్మోటిక్స్ ఎందుకు వాడకూడదో 8 బలమైన కారణాలు

హానికర కాస్మోటిక్స్
Share

మనమందరం కాస్మోటిక్స్  ఇష్టపడతాం.  ఆ లిప్‌స్టిక్‌లు, టోనర్‌లు, ఫౌండేషన్, ఫేస్ పౌడర్‌లు ఒక చిన్న పిల్లవాడిని కూడా ఆకర్షించి వాటితో ఆడుకునేలా చేస్తాయి. ఈ కాస్మోటిక్స్ ఒక వ్యక్తి యొక్క అందాన్ని పెంచుతాయి.  ఈ కాస్మోటిక్స్ మన రోజుని ప్రారంభించడానికి ఒక ఉత్సాహాన్ని ఇస్తాయి. మనందరికీ ఇష్టమైన బ్రాండ్ కాస్మోటిక్స్  ఉంటాయి.

కాస్మోటిక్స్  ఆధునిక ఆవిష్కరణ కాదు. అవి మన ప్రాచీన సంప్రదాయం మరియు సంస్కృతిలో భాగం. వాస్తవానికి, సంస్కృతంలో ‘చతుష్ఠాటి కాలా’ అని పిలువబడే 64 లలిత కళలలో కాస్మోటాలజీ మరియు మేకప్ కళ ఒకటి. భారతదేశంలోనే కాదు, ఈజిప్ట్, గ్రీస్, చైనా వంటి ఇతర ప్రాచీన సంస్కృతులలో కూడా మేకప్ కళ మనకి కనిపిస్తుంది.

రసాయనాల రాకకు ముందు, అందాన్ని పెంచడానికి సహజ పదార్థాలు ఉపయోగించేవారు.  పువ్వులు, వేర్లు, ఆకులు, వివిధ మొక్కల కాండం, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పాల ఉత్పత్తులు; తేనె, మైనం, రోజ్‌వాటర్, నూనెలు, శనగపిండి వంటివి ఉపయోగించేవారు. ఈ సౌందర్య సాధనాలు వారి శారీరక సౌందర్యాన్ని పెంచడమే కాకుండా, వారి మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచేవి. ఇవి వాడడం వల్ల శరీరం, మైండ్ రిలాక్స్ అయ్యేవి. కాలంలో మార్పులతో పాటు వీటి వాడకాన్ని కూడా మారుస్తూ ఉండేవారు.

ఇప్పుడు రోజులు మారిపోయాయ్. ఈరోజుల్లో సహజమైన వాటికంటే రసాయనాలు వాడినవే తక్కువ ధరకి దొరుకుతున్నాయి. రసాయనాలతో పెద్ద శ్రమ లేకుండా ఎక్కువ మొత్తంలో తయారు చెయ్యడం సులభం. అందువల్ల కాస్మోటిక్స్  పరిశ్రమలు రసాయనాలను వాడడం క్రమేణా బాగా పెంచేశాయి. ఇప్పుడు చూస్తున్న చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ లో ఎన్నో రకాల హానికరమైన రసాయనాలు ఉన్నాయి. హెర్బల్ , నేచురల్ అని లేబుల్స్ ఉన్న చాలా ప్రొడక్ట్స్ లో హానికర రసాయనాలు ఉన్నాయి. పాతరోజుల్లో వాడిన సహజమైనవి ఇప్పుడు ఉన్న ఏ బ్రాండ్స్ లోనూ కనపడట్లేదు.

ఈరోజుల్లో కాస్మోటిక్స్ లో వాడుతున్న కొన్ని హానికర రసాయనాల గురించి ఇప్పుడు చూద్దాం.

Parabens: వీటిని కాస్మోటిక్స్ ఎక్కువకాలం నిల్వ ఉండడానికి వాడతారు. లోషన్స్, లిప్ స్టిక్స్, స్కిన్ క్రీమ్స్, షాంపూలు ఇలా మనం రోజూ వాడే 80% ప్రొడక్ట్స్ లో ఇది ఉంటుంది

SLS/SLES: Sodium Lauryl Sulfate/Sodium Laureth Sulfate : వీటిని చాలా షాంపూలలో, లోషన్స్, క్రీమ్స్ లో నురగ రావడానికి వాడతారు.

Synthetic fragrance కి కొన్నిసార్లు perfume లేదా fragrance అని లేబుల్ వేస్తారు. Perfumes, wipes, lotions, air fresheners లలో దీన్ని ఎక్కువగా వాడతారు.

Lead – దీన్ని lipsticks లో రంగుకోసం వాడతారు.

Oxybenzone- సన్ స్క్రీన్ లోషన్స్ లో దీన్ని ఎక్కువగా వాడతారు

Phthalateso వీటిని nail polish, hair spray లలో వాడతారు.

Triclosan– దీన్ని ఎక్కువగా సబ్బులు, bodywash, deodorants లో  ఎక్కువ వాడతారు

Formaldehyde- దీన్ని nail polish, deodorants, షాంపూలో వాడతారు

Hydroquinone- చర్మ సౌందర్యాన్ని పెంచే వాటిలో, మాయిశ్చరైజర్స్ లో దీన్ని ఎక్కువగా వాడతారు

BAC- Benzalkonium chloride. దీన్ని ఎక్కువగా eyeliner మరియు మస్కారాలో వాడతారు.

ఇవి కొన్ని  రసాయనాలు. ఇవి కాకుండా, పెట్రోలియం, AHA, BHA, అమ్మోనియా, అల్యూమినియం క్లోరైడ్ హెక్సాహైడ్రేట్, మిథైలిసోథియాజోలినోన్, బొగ్గు తారు, ఇథాక్సైలేటెడ్ సర్ఫ్యాక్టెంట్లు, పాదరసం, మినరల్ ఆయిల్, క్రోమియం, ఆర్సెనిక్ మొదలైన రసాయనాలు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. కాస్మోటిక్స్ ఇండస్ట్రీలో  12,000 కంటే ఎక్కువ రసాయనాలు ఉపయోగించబడుతున్నాయి. కాబట్టి, ఇన్ని రసాయనాలు ఉన్న కాస్మోటిక్స్  వాడడం వల్ల ఉపయోగం ఏంటి?

కాస్మోటిక్స్  లో రసాయనాల వాడకం మీద ప్రభుత్వం యొక్క నిబందనలేవీ లేవు. ఎవరికి నచ్చినట్టు వారు రసాయనాలు వాడుతున్నారు.

ఇవి వాడడం వల్ల దీర్ఘకాలంలో మనకి  వచ్చే నష్టాలు ఇప్పుడు చూద్దాం.

1. ఇవి చర్మానికి మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తాయి. అలర్జీలు వచ్చేలా చేస్తాయి

2. జుట్టు ఊడిపోయేలా చేస్తాయి. చుండ్రులు, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం లాంటి సమస్యలు వస్తాయి.

3. వీటిల్లో వాడే చాలా వరకు రసాయనాలు కాన్సర్ కలిగించేవి

4. పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మనం చర్మం మీద కదా రాసుకుంటున్నాం అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇవి నేరుగా శరీరంలోకి వెళ్లిపోతాయి.

5. త్వరగా వయసు అయిపోయేలా చేస్తాయి. ఇవి వాడేది అందంగా కనిపించడానికి కానీ ఎక్కువకాలం వాడితే అనార్థాలే ఎక్కువ

6. హార్మోన్స్ సమతుల్యత దెబ్బ తిని థైరాయిడ్, మరియు పీరియడ్ సమస్యలు వస్తాయి

7. తలనొప్పి ఎక్కువగా వస్తుంది.

8. కళ్ళకి చాలా హానికరం.

విషపూరిత రసాయనాలతో చేయబడిన ఈ ప్రొడక్ట్స్ చాలావరకు చర్మం మరియు జుట్టుకు మాత్రమే కాకుండా మొత్తం శరీరానికి హానికరం. వీటివలన పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతింటుంది.

కాబట్టి, రసాయనాలు లేని కాస్మోటిక్స్  ఎంచుకోవడం చాలా మంచిది. ఈ రసాయనాలు లేని కాస్మోటిక్స్ మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. వీటివల్ల ఇప్పుడే కాదు దీర్ఘకాలికంగా కూడా చాలా లాభాలు ఉంటాయి.

మొక్కల నుండి సేకరించిన ముఖ్యమైన నూనెల నుండి వీటిని తయారు చేస్తారు. వాటిలో చర్మం, జుట్టు మరియు శరీరంపై ఉపయోగించగల మూలికలు మరియు సురక్షితమైన పదార్థాలు ఉన్నాయి.  ఈ ప్రొడక్ట్స్ మీరు ఉపయోగిస్తున్న  బ్రాండ్ కంటే ఖరీదైనవి కావచ్చు. ఈ సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ప్రొడక్ట్స్ మీద  పెట్టుబడి పెట్టడంలో దాని విలువ ఎందుకంటే మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సు ముఖ్యమైనది. మీరు ఈ ఉత్పత్తులను ఉపయోగించినప్పుడు, మీరు మిమ్మల్ని అందంగా చూసుకోవడమే కాకుండా, పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడతారు.

Registration

Forgotten Password?

Loading