ఒత్తిడి తగ్గించుకోవడానికి 8 మార్గాలు

ఒత్తిడి
Share

ఒత్తిడి- ఈ ఆధునిక జీవితంలో మీ వృత్తి, వయసుతో సంబంధం లేకుండా ఒత్తిడి మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. స్టూడెంట్స్, టీచర్, తల్లిదండ్రులు, పిల్లలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, సినిమావాళ్లు, గృహిణులు ప్రతీ ఒక్కరూ ఒత్తిడి గురవుతున్న వారే. ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న సమస్య. కానీ ఈ ఒత్తిడి ఇలాగే కొన్ని సంవత్సరాలు కొనసాగితే కొన్ని రోగాలు వస్తాయి, రిలేషన్ షిప్స్ దెబ్బతింటాయి, నిద్ర కి దూరమవుతారు. ఈరోజు అసలు ఒత్తిడి అంటే ఏంటి దాన్ని అధిగమించి ఒత్తిడి లేని జీవితాన్ని ఎలా జీవించాలో చూద్దాం.

ఒత్తిడి అంటే ఏంటి?

సాధారణంగా తక్కువ సమయంలో ఎక్కువ బాధ్యతలు చేయాల్సి రావడం వల్ల వచ్చే మానసిక సంఘర్షణను ఒత్తిడి అంటారు. ఒక వ్యక్తి నిర్ణీత సమయంలో చెయ్యగల పనికంటే ఎక్కువ పని చెయ్యవలసి వచ్చినప్పుడు అతను ఒత్తిడికి లోనవుతాడు. ఈ ఆధునిక జీవితంలో చాలా వేగంగా,  ఎక్కువ పనులు తక్కువ సమయంలో చేయాల్సి వచ్చే విధంగా ఉంది. ఇలా ఈ మోడ్రన్ ప్రపంచం యొక్క రేస్ లో గెలవడానికి తక్కువ సమయంలో ఎక్కువ పని చెయ్యడం మనందరిలో ఒత్తిడిని కలిగిస్తుంది.

ఒత్తిడి వల్ల నష్టాలు ఏంటి?

ఒక వ్యక్తి తన ఎమోషన్స్ లో గానీ, ఆలోచనలలో గానీ ఒత్తిడిని అనుభవిస్తాడు. ఇది కేవలం మానసికమైనది కాదు. Fight or fight అనే మెకానిజం వల్ల మన శరీరం మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. మన శరీరం ఒత్తిడిని తట్టుకోవడానికి ఈ మెకానిజం సహాయపడుతుంది.

ఒక వ్యక్తికి అనుకూలమైన పరిస్థితులు లేనపుడు అతను ఒత్తిడికి గురవుతాడు. అప్పడు దానిని ఎదుర్కోవడానికి మనం శరీరంలోని  “sympathetic nervous system” ఈ మెకానిజంను యాక్టివేట్ చేస్తుంది.

ఉదాహరణకి ఒక వ్యక్తి పులిని చూసి ఒత్తిడికి గురయితే  “sympathetic nervous system” ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని ఆ పులితో fight చెయ్యడానికి లేదా అక్కడినుండి పారిపోవడానికి రెడీ చేస్తుంది. దీనినే fight or fight mechanism అంటారు. ఈ మెకానిజం అప్పటి పరిస్థితుల్లో ఎలా తప్పించుకోవాలో మన శరీరానికి దారి చూపిస్తుంది.

మనం ఒత్తిడి కి గురయ్యి ఈ  మెకానిజం పని చేసే సమయంలో మన శరీరంలో ఈ కింది మార్పులు గమనించవచ్చు.

1. హృదయ స్పందన రేటు పెరుగుతుంది.

2. Bp పెరుగుతుంది

3. మనం శ్వాస తీసుకునే వేగం పెరుగుతుంది

4. మన శరీరానికి ఒక్కసారిగా శక్తి వచ్చినట్టు ఉంటుంది

5. మొత్తం శరీరం అలర్ట్ గా టెన్షన్ గా మారుతుంది

6. జీర్ణ వ్యవస్థ మరియు రోగ నిరోధక వ్యవస్థ లాంటివి పనిని ఆపి అయ్యి fight or fight కి ఎక్కువ శక్తి వచ్చేలా చేస్తాయి.

7. కాళ్ళకి, చేతులకి ఎక్కువ శక్తి వస్తుంది

Fight or fight మెకానిజం గుహల్లోనూ, అడవులలోనూ బ్రతికి బయటపడడానికి  మనుషులకి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. ఆదిమానవులు తమని తాము రక్షించుకోవడానికి ఒత్తిడి చాలా సహాయపడింది. జీవితంలో కాస్త ఒత్తిడి ఉండడం మంచిదే. ప్రతిరోజూ ఉన్నా, అవసరమయిన దానికంటే ఎక్కువ ఉన్నా అది ప్రమాదం.

ఈ మోడ్రన్ రోజుల్లో సాధారణంగా ఎలాంటి పరిస్థితులు ఒత్తిడికి కారణం అవుతాయంటే – ఎక్కువ ట్రాఫిక్, రోజువారీ పనులు, పనిలో ఎదురయ్యే సవాళ్ళు, నిర్ణీత సమయం లేకపోవడం, రకరకాల భాద్యతలు ఒకేసారి చెయ్యవలసి రావడం. రిలేషన్ షిప్స్ లో ఎదురయ్యే సమస్యలు. ఇలా మనం ఎదుర్కోలేనివి, తప్పించుకుని పారిపోలేనివి. ఇవన్నీ ప్రతీరోజూ మనందరికీ ఎదురవుతున్నాయి.

పులిని చూడడం వల్ల వచ్చిన ఒత్తిడికి, ట్రాఫిక్ లో ఉండడం వల్ల వచ్చిన ఒత్తిడికి తేడా మన శరీరానికి తెలీదు. మన శరీరానికి రెండూ ఒకటే. అది fight or fight మెకానిజంతో సిద్దం అవుతుంది.

ఒత్తిడి వల్ల ఈ fight or fight మెకానిజం ఒక రోజులో ఎక్కువసార్లు కొన్ని సంవత్సరాల పాటు జరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

1. డయాబెటిస్

2. High bp

3. జీర్ణశక్తి మందగించడం

4. నిద్రలేమి

5. తరచూ తలనొప్పి

6. రోగ నిరోధక వ్యవస్థ బలహీనం అవ్వడం

7. హార్ట్ ఎటాక్

8. సంతానోత్పత్తి సమస్యలు

9. పీరియడ్ సమస్యలు

10. కండరాల సమస్యలు

ఎక్కువ ఒత్తిడి కేవలం శారీరక సమస్యలే కాకుండా ఈ కింది సమస్యలను కూడా సృష్టిస్తుంది.

1. చేసే పనిలో నైపుణ్యం తగ్గడం

2. సమస్యలని సరిగా పరిష్కరించలేకపోవడం.

3. రిలేషన్ షిప్స్ లో సమస్యలు

4. విసుగు

5. డిప్రెషన్

6. జీవితం ఎప్పుడూ నిర్లిప్తంగా ఉండడం

7. ఆత్మ విశ్వాసం లేకపోవడం

ఒత్తిడి వల్ల వచ్చే కొన్ని నష్టాలు ఇవి. అప్పుడప్పుడు ఒత్తిడికి లోనవడం పర్లేదు కానీ ప్రతిరోజూ సంవత్సరాల తరబడి ఒత్తిడికి లోనవడం వల్ల చాలా పెద్ద సమస్యలు వస్తాయి. కాబట్టి మనకి రోజూ ఎదురయ్యే ఒత్తిడిని ఎలా అధిగమించాలి?

ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం.

1. మెడిటేషన్ : ఎమోషనల్ మరియు మానసిక సామర్థ్యం పెంచుకుంటూ మనకి ఎదురయ్యే సమస్యలని ఒత్తిడి లేకుండా ఎదురక్కోవడానికి  మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మన సామర్థ్యానికి మించిన పని చెయ్యవలసి వచ్చినపుడే ఒత్తిడి ఉంటుంది. రోజూ మెడిటేషన్ చెయ్యడం వల్ల మన ఎమోషనల్ మరియు మానసిక సామర్థ్యం పెరుగుతుంది.  మన సమస్యలని ఎదుర్కోవడానికి అవసరమైన ప్రశాంతతని, ఓర్పుని ఇస్తుంది. మెడిటేషన్ చెయ్యడం చాలా తేలిక కూడా. మెడిటేషన్ గురించి మరింత తెలుసుకోవడానికి “మెడిటేషన్ అంటే ఏంటి మెడిటేషన్ ఎలా చెయ్యాలి ” అనే ఆర్టికల్ చదవండి.

2. వ్యాయామం: రోజూ వ్యాయామం చెయ్యడం వల్ల ఒత్తిడి వల్ల మన శరీరంలో ఏర్పడ్డ వ్యర్థాలు శుభ్రం అయ్యి మన మైండ్ మరియు శరీరం రిలాక్స్ అవుతాయి. మనల్ని ఆరోగ్యంగా ఒత్తిడికి దూరంగా ఉంచుతుంది.

3. యోగా : మన మైండ్ ని, శరీరాన్ని కూడా అద్భుతంగా మార్చే సాధనం యోగా. ఇది మీ ఒత్తిడిని  తగ్గించి సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని, శక్తిని ఇస్తుంది.

4. నవ్వు : నవ్వు జీవితంలో చాలా ముఖ్యమైనది. నవ్వు ఆనందాన్ని ఇవ్వడమే కాదు ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. ప్రతీరోజూ మనస్పూర్తిగా నవ్వండి. మీకు ఇష్టమైన కామెడీ షో లు లేదా సినిమాలు చూస్తూ హాయిగా నవ్వండి. నవ్వడానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవద్దు.

5. ప్రకృతిలో సమయం గడపండిప్రకృతి మన శరీరాన్ని, మైండ్ ను బాగుచేస్తుంది. మీకు దగ్గరలో ఉన్న పార్క్ లో కాసేపు గడిపినా మిమ్మల్ని ఫ్రెష్ గా చేస్తుంది. క్రమం తప్పకుండా ప్రకృతిలో గడిపే విధంగా ప్లాన్ చేసుకోండి. ఆ చెట్లని, సన్ రైస్ మరియు సన్ సెట్ , ఆకాశాన్ని, ఆ చల్లని గాలిని ఎంజాయ్ చెయ్యండి.

6. మీకు ఆనందాన్ని ఇచ్చే పనులు చెయ్యండి : ఇప్పుడు జీవితం చాలా వేగంగా గడిచిపోతుంది. మనం రోజూ చెయ్యవలసిన పనుల్లో పది మనకి ఆనందాన్ని ఇచ్చేవాటిని మర్చిపోతున్నాం. కాస్త సమయం తీసుకుని మీకు ఆనందాన్ని ఇచ్చే పనులు చెయ్యండి. మీ ఆనందం చాలా ముఖ్యం. ఆనందంగా ఉండడానికి విహార యాత్రల కోసం చూడకండి. ప్రతీరోజూ ఆనందంగా ఉండండి.

7. కావలసినంత విశ్రాంతి తీసుకోండి.: మీ శరీరానికి మరియు మైండ్ కి అవసరమైన విశ్రాంతి ఇవ్వండి. ప్రతీరోజూ సరిగా పడుకోండి. మీరు సరిగా విశ్రాంతి తీసుకుంటేనే ఒత్తిడి వల్ల విడుదలైన వ్యర్థాలని శరీరం బయటకి విడుదల చేసే అవకాశం ఉంటుంది.

8. సరిగా తినండి : అన్ని  పోషకాలు సరిగా ఉన్న డైట్ మన శరీరం మరియు మైండ్ ని ఆరోగ్యంగా ఉంచి మనకి రోజూ ఎదురయ్యే పనులను సమర్థవంతంగా చేసేలా చేస్తుంది. కాబట్టి మీ డైట్ ని సరిగా ప్లాన్ చేసుకోండి.

ఒత్తిడిని దూరం చేసుకోవడానికి కొన్ని సూచనలు ఇవి. ఇవి మీ మానసిక మరియు ఎమోషనల్ కండరాలను ఒత్తిడిని తట్టుకునేలా తయారుచేస్తాయి. మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి  ఆల్కహాల్ తీసుకోవద్దు. ఆల్కహాల్ తాత్కాలికంగా మీకు ఒత్తిడి నుండి ఉపశమనం ఇవ్వవచ్చు కానీ మీ శరీరానికి చాలా హాని చేస్తుంది. ఒత్తిడిని ఎదుర్కొనే విధానం అది కాదు.పైన చెప్పిన సూచనలు పాటించి ఒత్తిడిని దూరం చేసుకోండి.

Have fun.  

Registration

Forgotten Password?

Loading